మేడే స్ఫూర్తితో మోడీకి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి

ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అందె అశోక్

చేర్యాలలో ఘనంగా మేడే ఉత్సవాలు

చేర్యాల నేటిధాత్రి…

మేడే స్ఫూర్తితో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఉద్యమిద్దామని, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అందె అశోక్ పిలుపునిచ్చారు. 138వ మేడే ను పురస్కరించుకొని బుధవారం చేర్యాల మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాలలో ఏఐటీయూసీ, సీపీఐ ఆధ్వర్యంలో ఎర్ర జెండాను ఆవిష్కరించి ఘనంగా వేడుకలను నిర్వహించుకున్నారు. చేర్యాల మండల కేంద్రంలోని అంగడి బజారు వద్ద ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించిన అనంతరం అందే అశోక్ మాట్లాడుతూ.. 8 గంటల పని విధానం కోసం, కార్మిక హక్కుల కోసం ఆనాడు ప్రాణాలర్పించిన చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక చట్టాల పరిరక్షణకు ఉద్యమాలు నిర్వహించాలని, నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక వర్గం త్రిప్పికొట్టాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికులు పోరాడి ప్రాణాల అర్పించి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు చట్టాలుగా చేసి కార్మికులను బానిసలు చేసే కుట్ర చేస్తుందని ఈ కుట్రను తిప్పికొట్టేందుకు మేడే స్ఫూర్తితో పోరాటాలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశ సంపదను అప్పనంగా తన అణువాయులకు దోచిపెడుతున్న మోడీకి కార్మికవర్గ పోరాటాలతో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పాలన కొనసాగిస్తున్న బిజెపికి కాలం దగ్గర పడిందని కార్మికులను ప్రజలను మరింత చైతన్య పరచాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని అన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, వలబోజు నరసింహాచారి, జంగిలి యాదగిరి, రామగల్ల నరేష్, పొన్నబోయిన మమత, కత్తుల భాస్కర్ రెడ్డి, బంగారు ప్రేమ్ కుమార్, కర్రె ఆంజనేయులు, కుడిక్యాల బాల్ మోహన్, గూడెపు సుదర్శన్, బండారి సిద్దయ్య, నంగి కనకయ్య, గజ్జల సురేందర్, తుప్పతి రాజు, చింతల నరేష్, ముచ్చాల రామకృష్ణ, సుంకరి తిరుపతి, వెలుగల యాదగిరి, వెలగల మురళి, బోయిని రాజు, ఎర్ర అశోక్, దండ బోయిన వెంకటేష్, చిగుళ్ల నరేష్, గడ్డి పరమేష్, బింగి దుర్గయ్య, భాగ్య, రజిత, మల్లవ్వ, కల్యాణి, తదితరులు పాల్గొన్నారు.

కార్మిక చట్టాల పరిరక్షణ కై చికాగో అమరుల పోరాట స్ఫూర్తి ని కొనసాగిద్దాం

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్

రామడుగు, నేటిధాత్రి:

ఇరవై తోమ్మిది కార్మిక చట్టాల పునరుద్ధరణకై కార్మిక చట్టాల పరిరక్షణకై చికాగో అమరుల పోరాట స్ఫూర్తితో బిజెపిని ఓడించి , దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజలను రక్షించుకుందాం అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్ అన్నారు. మే డే కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి, లక్ష్మీపూర్, రామడుగు, గోపాలరావుపేట తదితర గ్రామాలలో ఎర్ర జెండాలు ఎగురవేశారు. ఈసందర్భంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ బిజెెపి ప్రభుత్వ పాలనలో దేశాభివృధ్ది వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందని, కుల, మత విద్వేశాలు పెచ్చూరిల్లాయని, మైనారిటీలు, దళితులపై అమానుష దాడులు పెరిగాయని, దేశంలో దారిద్యం తాండవిస్తోందనీ, సోదరభావం
దెబ్బ తింటోందని, ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు జైల్లో పెట్టి వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరియు దేశ సార్వభౌమాధికారాన్ని సామ్రాజ్యవాద దేశాలకు మోడీ తాకట్టు పెడుతున్నాడని, దేశ సమగ్రత, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాలను అపహాస్యం
చేస్తున్నాడని, బిజెపి వ్యతిరేకులను దేశ ద్రోహులుగా చిత్రిస్తూ వారిపై దేశ ద్రోహ కేసులు బనాయించి వేధిస్తున్నారని, విదేశాలలో ఉన్న నల్లదనం తీసుకువచ్చి ప్రతి భారతీయుడికి పదిహేను లక్షలు పంచుతానన్న మోడీ మాటలు నీటి మాటలుగా మిగిలిపోయాయని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో బడా పెట్టుబడిదారులకు కారు చౌకగా మోడీ అమ్మి వేస్తునాడని, రుణమాఫీ పేరుతో ప్రజా ధనాన్ని దోపిడీదారులైన పెట్టుబడిదారులకు దారా దత్తం చేసి దేశ ప్రజలను పేదవారిగా మార్చివేస్తున్నాడని,
కేంద్రంలోని బిజెపి-మోడీ ప్రభుత్వం దేశాభివృధ్ధిని, దేశ సమగ్రతను నాశనం చేస్తోందన్నారు. ఆరోజు కార్మిక లోకం అమెరికా నగరం ”’హే”’ మార్కెట్లో 1886మే1న సమ్మె చేయాలని నిర్ణయించిన ప్రపంచ కార్మిక సంఘాలు మార్కెట్లో జరిపిన నిరసన ప్రదర్శనల సందర్భంగా ఎనిమిది గంటల పని దినాల కోసం కదం తొక్కిన కార్మికులపై పెట్టుబడి దారులు, వారి గుండాలు, ఆర్మి పోలీసులు జరిపిన దాడిలో తుపాకి తూటాకు చనిపోయిన వారి రక్తంతో తడిపి ఎగిరేసిన జెండాతో మే అమెరికా ప్రభుత్వం దిగివచ్చి ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేసిన రోజే మే డే గా చికాగో అమరవీరుల మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, భారతదేశంలో పెట్టుబడిదారుల పాలనను అంతం చేసి, ఎర్రకోటపై ఎర్రజెండను ఎగరవేయటమే కార్మిక వర్గం యొక్క ప్రధాన కర్తవ్యంగా, ప్రస్తుత పరిస్థితుల్లో కార్మిక శ్రేయస్సు కోసం హక్కుల సాధన కోసం, చట్టాలను పరిరక్షణ కోసం, పెట్టుబడి దారి విధానాలకు వ్యతిరేకంగా, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటలు కొనసాగించాలని సృజన్ కుమార్ పిలుపు నిచ్చారు. ఈకార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి గోడిశేల తిరుపతి గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేష్, నాయకులు ఉమ్మెంతుల రవీందర్ రెడ్డి, నాంపెల్లి, శంకరయ్య, మ్యాక స్వామి, నర్సయ్య, మల్లయ్య, శ్రీనివాస్, రాజయ్య, కనుకయ్య గంగవ్వ, రాజవ్వ, దుర్గవ్వ తదితరులు పాల్గొన్నారు.

మేడే జెండా ఎగురవేసిన చేసిన చంద్రగిరి శంకర్

భూపాలపల్లి నేటిధాత్రి

ఎర్రజెండా సాక్షిగా కార్మిక హక్కులకై కొట్లాడుదాం
ప్రపంచ కార్మికులారా ఏకంకండి అంటూ ఈ 138వ మే డే జెండాలను భూపాలపల్లి లోని వివిధ డిపార్ట్మెంట్ లతో పాటు సెంటర్లో జెండాలు ఎగరవేయగా ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యాలయం ముందు చంద్రగిరి శంకర్ జండా ఆవిష్కరణ చేశారు
ఈ సందర్భంగా తెలంగాణ గోదావరి కార్మిక సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రగిరి శంకర్ మాట్లాడుతూ సామ్రాజ్యవాదం పెట్టుబడి దారిదేశమైన అమెరికా లోనే ఈ ఎర్రజెండా పుట్టిందని ఆనాడే కార్మికుల హక్కుల కోసం పని దినాల కోసం హీరోచితమైన పోరాటాలు నిర్వహించి కార్మిక హక్కులను సాధించిందని వారన్నారు. నాడు అమరవీరుల సాక్షిగా సాధించుకున్న కార్మిక హక్కులను నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం హిందూ పాసింజం పేరుతో నాలుగు లేబరు చట్టాలను తీసుకువచ్చి కార్మిక హక్కులని కాలరాస్తూ బానిస సమాజంలోకి నెట్టి వేస్తుందని కార్మికుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు జేబు సంస్థలు గా మారాయని వారన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికే మళ్ళీ అధికారంలోకొస్తే రాజ్యాంగాన్ని రద్దుచేసి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తామని కార్మిక హక్కులు ఉండవని నూతన చట్టాలు అమలులోకి వస్తాయని బహిరంగంగా ప్రకటిస్తూ ఎన్నికలు అంటే ఇక ఒకే ఎలక్షన్స్ ఉంటాయని ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ పాలన కొనసాగిస్తున్నారని వారు అన్నారు కాపాడుకునే విధంగా ఉండాలని ఆస్ఫూర్తితో మనందరం పనిచేయాల్సిన బాధ్యత ఉందని వారి సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు

భద్రాద్రి కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో మార్నింగ్ వాకింగ్ నామ నాగేశ్వరరావు.

కార్మిక శాఖ వర్గానికి నామా నాగేశ్వరరావు మే డే శుభాకాంక్షలు తెలిపారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

సమస్యలపై పార్లమెంట్ ను స్తంభింప జేశా
ఈ గడ్డ వాసనలో పెరిగిన వాడిని ఇక్కడే చదువుకున్న

భద్రాచలం – కొవ్వూరు రైల్వే లైన్ కోసం 120 లేఖలు రాశా పార్లమెంట్ ను స్తంభింప జేశా

కొత్తగూడెం టౌన్ .బిఆర్ఎస్
ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి
నామ నాగేశ్వరావు
బుధవారం ఉదయం
కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్, ప్రగతి మైదానం, సెంట్రల్ పార్క్ లో మేడే సందర్భంగా కార్మిక, శ్రామిక వర్గానికి మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, వాకర్స్ ను కలిసి
ఎన్నికల ప్రచారం నిర్వహించి, ఓట్లు అభ్యర్దించారు.
ఈ సందర్భంగా గ్రౌండ్ లో వాకింగ్ కోసం వచ్చిన
ప్రతి ఒక్కరిని వ్యక్తి గతంగా కలిసి తన కారు గుర్తు పై ఓటు వేసిఅత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
తాను రాజకీయాల్లోకి రాకముందు పాల్వంచ కేటీపీఎస్ లో పనిచేసిన రోజులను, ఆనాడు కార్మికుల తో , తోటి ఉద్యోగులతో కలిసి మెలిసి ఉన్న పరిస్థితులను
అవగతం చేసుకుని, గతస్మృతులను వారితో పంచుకున్నారు .ఖమ్మం జిల్లా ప్రజలు రెండుసార్లు తనను ఆశీర్వదించి మంచి మెజార్టీ తో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంట్ సాక్షిగా
ఖమ్మం జిల్లా గొంతుకను
వినిపించానని ,తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, జిల్లా జిల్లా సమస్యలపై పార్లమెంట్లో ప్రస్తావించి సాధించానని చెప్పారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, పెండింగ్ విభజన సమస్యలపై
గళమెత్తా నని చెప్పారు .
పార్లమెంటులో రాష్ట్రం నుంచి ఉన్న బిజెపి , కాంగ్రెస్ సభ్యులు ఏనాడు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడలేదని చెప్పారు .కనీసం తాను సాగిస్తున్న పోరాటానికి కూడా సహకరించ లేదని
తెలిపారు .ఎంపీలందరూ లో
తాను అత్యధిక రోజులు పార్లమెంటు హాజరై
అందరికంటే ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు అడిగి ఉత్తమ పార్లమెంటేరియన్ గా
పుట్టిన జిల్లా ఖ్యాతిని దేశం నలుమూలల వ్యాపింప జేశానని తెలిపారు .
తాను పార్లమెంట్ లో ఉన్న ఎప్పుడు ఖమ్మం జిల్లా ప్రజల గురించే ఆలోచిస్తానని
చెప్పారు .ఈ జిల్లా
వాడినైన తనకు పాల్వంచ, కొత్తగూడెం తో ఎంతో అవినాభావ సంబంధం ఉందని, ఈ ప్రాంతంలోనే తాను చదువుకున్నానని చెప్పారు. పాల్వంచలో టెన్త్ వరకు, కొత్తగూడెంలో ఇంటర్ చదివానని , ఇక్కడి ప్రజలతో తనకు అనుబంధం ఉందని చెప్పారు .తెలంగాణ ప్రయోజనాలు కాపాడగలిగే సత్తా ఒక్క బి ఆర్ ఎస్ ఎంపీలకు మాత్రమే ఉందని చెప్పారు .తెలంగాణ ప్రయోజనాలు నెరవేరాలి అన్న ఈ ప్రాంత సమస్యలు పరిష్కరిస్కారం కావాలన్నా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించి కెసిఆర్ కు సంపూర్ణ మద్దతుగా నిలవాలని నామా నాగేశ్వరరావు కోరారు
భద్రాచలం – కొవ్వూరు రైల్వే లైన్ కోసం పార్లమెంట్ సాక్షిగా ఎంతో పోరాటం చేశానని ,
కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయమై 120 లేఖలు రాసి కేంద్ర మంత్రులను కలిశానని, ధర్నాలు చేసి పార్లమెంట్ సాక్షిగా కేంద్రాన్ని నిలదీశానని గుర్తు చేశారు .అలాగే
ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో తన ముద్ర ఉందని చెప్పారు .జాతీయ రహదారి నిర్మాణం లోనూ ,నూతన కలెక్టరేట్ నిర్మాణం లోనూ ,సింగరేణి సమస్యల పరిష్కారంలో పెద్ద ఎత్తున
పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీయడం జరిగిందని చెప్పారు. సింగరేణి సంస్థను కేంద్ర కబంధహస్తాల నుంచి కాపాడటం కోసం పార్ల మెంటును స్తంభింపజేసి
పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా లు కూడా చేయడం జరిగిందని తెలిపారు. సింగరేణి సంస్థ ను ప్రైవేటు పరం కాకుండా కాపాడుకొని కార్మిక వర్గానికి న్యాయం చేయడం జరిగిందని తెలిపారు .
కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ
విషయంలోనూ తన ముద్ర ఉందని నామా గుర్తు చేశారు .కొత్త జిల్లా అయిన కొత్తగూడెంలో నవోదయ విద్యాలయం కోసం అలుపెరగని పోరాటం చేశానని నామ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కాపు సీతామహా లక్ష్మీ, వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, పార్టీ రాష్ట్ర నాయకులు మోరే భాస్కర్, పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు కొట్టు వెంకటేశ్వరరావు,విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సంకు బాపన ప్రేమ్ దీప్, పాల్వంచ పట్టణ నాయకులు రమణమూర్తి నాయుడు, రేగడి మధు, జవహర్, సింధు తపస్వీ తదితరులు పాల్గొన్నారు.

బిక్షపతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గెలుపుకు సన్నాహక సమావేశం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

చుంచుపల్లి మండలం. రుద్రంపూర్ గౌతమ్ పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుమ్మడి శ్రీనివాస్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపునుకు సన్నాహక సమావేశమును ఏర్పాటు చేశారు . ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పేగడ బిక్షపతి పాల్గొని ఆయన మాట్లాడుతూ వామ పక్షాలు బలపరుస్తున్న ఖమ్మం ఎంపీ రామా సహాయం రఘురాం రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ కార్యకర్తలు , ఐఎన్టీయూసీ నాయకులు సైనికుల్లా పనిచేసి అత్యధిక మెజారిటీ కృషి చేయాలని ఆయన కోరారు .ఈ కార్యక్రమంలో ఆధార్ కొమురయ్య ,జిదుల రాజేశ్వరరావు , వినయ్ , చిన్ని , ఏలియా. గోవర్ధన్ రాజు , నరేందర్ , యాకూబ్ , మొగిలి , నిరంజన్ , చింటూ , కొమురయ్య తదితరులు పాల్గొన్నారు .

మరో సారి ప్రధానిగా మోడిని గెలిపించాలి

21 వ వార్డు కౌన్సిలర్ బీజేపీ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్ పి జయంత్ లాల్

పరకాలనేటిధాత్రి
దేశ ప్రధానిగా ముచ్చటగా మూడవ సారి గెలిపించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, పరకాల మున్సిపల్ 21 వ వార్డు కౌన్సిలర్ అర్ పి జయంత్ లాల్ కోరారు. బుధవారం పరకాల పట్టణంలోని 21వ వార్డులో బీజేపి నాయకులలో కలసి ఆయన ఇంటింటి ప్రచారం చేశారు.కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు,అభివృద్ధి పనులకు సంబందించిన కర పత్రాలను ప్రజలకు అందించి బీజేపీ కి ఓటు వేసి ఎంపీగా అరూరి రమేష్ ను గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా జయంత్ లాల్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, బీఆర్ఎస్ పనైపోయిందన్నారు. ప్రధాని మోదీ పాలనలో అయోధ్య నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు.మహిళలకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంచారన్నారు.మోదీ సర్కార్‌ 140 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చిందని,ప్రపంచ దేశాలు మోదీ వైపు చూస్తున్నాయని వివరించారు.దేశంలో అభివృద్ధి,సంక్షేమంతో పాటు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను మోదీ పరిష్కరిస్తూ జాతి గౌరవాన్ని పెంచుతున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళ మోర్చా పట్టణ అధ్యక్షురాలు వెనిశెట్టి శారద, పోలింగ్ బూత్ అధ్యక్షులు మరాఠీ నర్సింగ రావు,శికరి జితేందర్,సూదమల్ల సాయి కుమార్,వాసు,పాండు తదితరులు పాల్గొన్నారు.

మేడే సందర్భంగా కార్మికులకు మద్దతుగా నిలిచిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

మహబూబ్ నగర్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి చల్లా వంశీధర్ రెడ్డి..

మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోని షాద్నగర్ నందిగామ మండలంలోని నాట్కో ఫార్మసీ ఆవరణలో కార్మికులకు మద్దతుగా షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్, మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి తో కలిసి జెండా ఆవిష్కరించరు.
ఈ కార్యక్రమంలో నాయకులు మాది జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ బాబర్ ఖాన్, ఐఎన్టియుసి రాష్ట్ర కార్యదర్శి రఘు నాయక్, చెంది తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు జంగ నరసింహ, జడ్పీటీసీ తాండ్ర విశాల ,మరియు ఎంపీటీసీలు సర్పంచులు కౌన్సిలర్లు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

విద్యార్థులకు మానాసికొల్లాసం కోసం క్రీడలు ముఖ్యమే

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల ,వేములవాడ, ఎల్లారెడ్డిపేట్, కొనరావుపేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం

– నెల రోజుల పాటుగా కొనసాగనున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు
సిరిసిల్ల, మే – 1(నేటి ధాత్రి):
సిరిసిల్ల పట్టణం స్థానిక కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరానికి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
ఈ వేసవి శిక్షణ శిబిరాలలో కబడ్డీ, వాలీబాల్, అర్చరీ, యోగ, క్రికెట్, కరేటే, మార్షల్ ఆర్ట్స్ మొదలగు క్రీడలతో పాటుగా పోలీస్ శాఖకు సంబంధించిన శిక్షణ పై,పోలీస్ శాఖలో అమలుపరుస్తున్న మొదలగు అంశాలపై అవగాహన కల్పించనున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….
విద్యార్థిని విద్యార్థులకు చదువుతో పాటుగా క్రీడలు ముఖ్యమే అని క్రీడల వలన పిల్లలలో మానాసికొల్లాసం కలుగుతుందని, యువతను క్రీడల వైపు ప్రోత్సాహించేందుకు,చేడు మార్గాల వైపు దారిమల్లకుండా ఉంచేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట్, కొనరావుపేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నెల రోజుల పాటుగా ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్రీడల వలన శారీరక దృఢత్వంతో పాటుగా ఒత్తిడి దూరం చేయడానికి దోహదపడుతుందన్నారు.నిజ జీవితంలో సమిష్టి కృషి తోనే విజయాలను సులువుగా చేరుకోగలమనే దానికి ఉదాహరణ క్రీడలని, క్రీడలు ఎవరి జీవితంలో వారికి తీపి గుర్తుగా మిగిలిపోతాయని,క్రీడాకారులు ప్రతి ఒక్కరు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని,అదే స్ఫూర్తిని నిజ జీవితంలో అలవర్చుకోవాలని ఎస్పీ అన్నారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పటు చేసిన ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు రఘుపతి,
సదన్ కుమార్, ట్రాఫిక్ ఎస్.ఐ రమేష్ ,వివిధ క్రీడల కోచ్ లు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉండి దిగజారుడు మాటలు మానుకో

బండి సంజయ్
సిరిసిల్ల, ఏప్రిల్ – 30(నేటి ధాత్రి)
మంగళవారం జిల్లా కేంద్రంలోని లహరి గార్డెన్ లో జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో స్థానిక బిజెపి నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మంగళవారం జమ్మికుంటలో జరిగిన ముఖ్యమంత్రి బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయిందని, దానిని భారీ బహిరంగ సభగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు బాధ అనిపించిందని, ముఖ్యమంత్రి హోదాలో ఉండి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మేధావి వర్గంలో చర్చ కొనసాగుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గురించి గోరంగా మాట్లాడితే ప్రజలు సహించరని, మోడీని తిడితే జనంలో కాంగ్రెస్ పార్టీ మరింత దిగజారిపోతుందన్నారు. సభలో సీఎం కరీంనగర్ కు మోడీ చేసింది ఏమీ లేదని ప్రస్తావించారని, 100 రోజుల్లో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డు సున్నా అయ్యిందన్నారు. తాను రేవంత్ రెడ్డి లాగా తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్ కు వచ్చి ఉద్యమకారులను తుపాకితో కాల్చి చంపుతానని అనలేదన్నారు. కరీంనగర్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు తెలియదని కార్యకర్తలు కూడా ఓడిపోతామనే క్లారిటీ ఉన్నారన్నారు. తాను ఎప్పుడూ రాముని గురించి మాట్లాడుతానని విమర్శించి, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా దేవుడిపై ఒట్టు వేస్తున్నాడని మండిపడ్డారు. తాము పక్కా రాముని వారసులమని, బరాబర్ రాముని గురించి మాట్లాడతామని స్పష్టం చేశారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు తాను రాముని గురించి మాట్లాడితే భయపడుతున్నారని, సైతానులు రాక్షసులు మాత్రమే దేవుళ్లకు భయపడతారన్నారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పక్కా నాన్ లోకల్ అని, ఆయన కరీంనగర్ ను ఎంతో అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడని, అంత అభివృద్ధి చేస్తే గత ఎంపీ ఎన్నికల్లో ప్రజలు తనకు 89 వేల ఓట్ల మెజారిటీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండు పార్టీలు ఇచ్చిపుచ్చుకునే పనిలో ఉన్నాయని, రెండు పార్టీలు కలిసి రెండవ స్థానం కోసం ప్రయత్నం చేస్తున్నాయన్నారు. అత్యధికంగా మెజార్టీ స్థానాల్లో బిజెపి గెలవబోతుందని, రాష్ట్ర ప్రజలు మరోసారి మోడీని దేశ ప్రధాని చేయాలనే సంకల్పంతో ఉన్నారని, ప్రజల బలం, కార్యకర్తల కష్టంతో కరీంనగర్ ఎంపీగా తాను మరోసారి భారీ మెజారిటీతో గెలవబోతునని ధీమా వ్యక్తం చేశారు. అలాగే పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడలో మే 8న మోడీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటలకే సభను నిర్వహిస్తున్నామని, ఎండాకాలం నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మోడీ భారీ బహిరంగ సభను ప్రజలు కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి
విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రాణీ రుద్రమదేవి, రెడ్డబోయిన గోపి, ఆడేపు రవీందర్, భర్కం లక్ష్మి, నాగుల శ్రీనివాస్ పాల్గొన్నారు.

చామల కిరణ్ కుమార్ రెడ్డిని లక్ష మెజారిటీ తో గెలిపించండి

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :

భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే చామల కిరణ్ కుమార్ రెడ్డిని మునుగోడు నియోజకవర్గం నుండి లక్ష మెజార్టీ ఇవ్వాలని భువనగిరి ఇంచార్జి,మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజాగోపాల్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నాపై నమ్మకంతో కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం చండూరులో ఏర్పాటు చేసిన రోడ్డు షో లో ఆయన మాట్లాడారు. ఏది ఏమైనా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతామని భరోసా ఇచ్చారు.ఇప్పటికే ఆరు గ్యారంటీలల్లో చాలా వాటిని అమలుచేసామన్నారు. అధికారంలోకి వచ్చి వంద రోజులే అవుతున్న హామీలు అమలు చేయడం లేదని కేసీఆర్ అసత్య ప్రచారం చేయటం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే బడుగు బలహీన వర్గాల ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. సిరిసిల్లకు ధీటుగా మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. చండూరులో ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని అన్నారు.
ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దమని తెలిపారు. కులం పేరుతో, మతం పేరుతో ఓట్లు అడిగే వారిపట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని బీఆర్ఎస్కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు దోచుకుని అప్పులపాలు చేసి కేసీఆర్ కాలి చిప్ప అప్పజెప్పారని ఎద్దేవా చేశారు. అవినీతి ఆరోపణలతో బిడ్డ జైలుకు వెళ్లినా ఏ మొఖం పెట్టుకుని ప్రజల మధ్య తిరుగుతున్నావ్ కేసీఆర్ అని నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్ ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలను కోరారు.
అంతకు ముందు పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
భువనగిరి పార్లమెంట్ అభివృద్ధే తన లక్ష్యమని, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌లోని బొమ్మలరామారం మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తనకు ఒక్క అవకాశం కల్పించాలని, ఎమ్మెల్యేలకు తోడుగా ఉండి కేంద్రం నుంచి రావలసిన నిధులు తీసుకొచ్చి నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తానని పిలుపునిచ్చారు. ఒక్కసారి ఆశీర్వదించి తనను గెలిపించాలని, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగు, తాగునీరు అందిస్తానని చెప్పారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిని, మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన సామాన్య వ్యక్తినన్నారు. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి తనకు పార్లమెంట్ నుండి పోటీ చేసే అవకాశం అధిష్టానం కల్పించిందని సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం తెలంగాణకు చేసింది ఏమీ లేదని, రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న కేసీఆర్‌ను ఏమీ చేయలేకపోయారని విమర్శించారు.‌ బీజేపీ కులం, మతం పేరుతో ఓట్లు అడుగుతున్నారని, మళ్ళీ వాళ్లకు ఓట్లు వేస్తే రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తారని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ
ప్రధాన కార్యదర్శి పున్న కైలాష్ నేత, సీపీఐ జిల్లా
కార్యదర్శి నేలికంటి సత్యం, దోటి వెంకటేష్ యాదవ్, కోడి శ్రీనివాసులు, , అనంత చంద్ర శేఖర్, గిరి బాబు వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దేశంలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే

ఎమ్మెల్యే దొంతి

#నెక్కొండ, నేటి ధాత్రి:వచ్చే నెలలో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో నర్సంపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీ ఇవ్వనున్నట్టు నెక్కొండలో మండల పార్టీ అధ్యక్షుడు అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభాముఖంగా కార్యకర్తల పక్షాన నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి బలరాం నాయక్ కు మాటిస్తున్నానని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నెక్కొండ లో జరిగిన ప్రచార కార్యక్రమంలో 39 గ్రామాల నుండి భారీగా హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలలో 18 వేల మెజార్టీ ప్రజలు నాకు ఇచ్చారని, కానీ వచ్చేనెల లో జరిగే పార్లమెంటు ఎన్నికలలో నర్సంపేట నియోజకవర్గం నుండి 44 వేల పై మెజార్టీ ఇవ్వనున్నట్టు కార్యకర్తల ఉత్సాహం చూస్తే అర్థమవుతుందని ఆయన అన్నారు. ఆనాడు ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యానికి తెలంగాణ గురైందని పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మాయమాటలతో ప్రజలను మోసగించి దుష్ట పరిపాలన చేసిన గత ప్రభుత్వ విధానాలను సహించక ప్రజలు బుద్ధి చెప్పినారని ఆయన గుర్తు చేశారు. మానుకోట కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ దేశంలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యం అని ఇది ప్రజలు గమనిస్తున్నారని చరిత్ర చెబుతున్నదని 100 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎంతో చేసిందని అది దేశ ప్రజలకు తెలుసాని, సోషల్ మీడియాలలో, పత్రికలలో, తప్పుడు రాతలు రాయించుకున్నంత మాత్రాన ప్రజలు పొందిన సౌకర్యాలను ఎవ్వరూ ఎప్పుడు మర్చిపోరని ఆయన గుర్తు చేశారు. నెక్కొండలో నేటి నుండి నెల రోజులపాటు ఎక్స్ప్రెస్ రైలు హాల్టింగ్ రద్దు చేస్తే ఉలుకు పలుకు లేని కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ నేతలు గాని, మానుకోట పార్లమెంట్ సభ్యురాలిగా కొనసాగుతున్న భారత రాష్ట్ర సమితి నేతలకు గాని సోయలేఖ పాయె అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సభాముఖంగా రైల్వే అధికారులను కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కి సవాలు ఇస్తున్నానని మీకు ప్రజలపై ప్రేమ ఉంటే నెక్కొండలో ఈ నెల రోజులపాటు ప్రత్యామ్నాయ ట్రైన్ లను ఆపాలని లేనిచో మిమ్మల్ని ప్రజలు క్షమించరని ఓటుతో మీకు బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బి అశోక్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తక్కలపల్లి రవీందర్రావు, పెండెం ఆనంద్ , పాలాయి శ్రీనివాస్ ,శ్రీ రామలింగేశ్వర ఆలయ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి రావుల హరీష్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి శివకుమార్, ఓబీసీ జిల్లా నాయకుడు రాచకొండ రఘు, జిల్లా కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు పార్వతమ్మ, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు జలంధర్ రావు భారత్ మోహన్ నాయక్, కుసుమ చెన్నకేశవులు, ఈదునూరి ప్రభాకర్, గంధం సుధాకర్, పలు గ్రామాల పార్టీ అధ్యక్షులు, బూత్ కమిటీ కన్వీనర్లు, తదితరులు పాల్గొన్నారు.

పదో తరగతి ఫలితాల్లో గౌతమి విద్యానికేతన్ ప్రతిభ

@ 9.8 ,9.7 జిపిఏ లతో సత్తా చాతిన విద్యార్థులు

#నెక్కొండ, నేటి ధాత్రి: నెక్కొండ మండల కేంద్రంలోని గౌతమి విద్యార్థి హై స్కూల్ విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో మరోసారి తమ సత్తా చాటారు. నెక్కొండకు చెందిన విద్యార్థి బూరుగుపల్లి సహజల్ యోధన్ శాస్త్రి 9.8 జీపీఏ తో పాఠశాల టాపర్ గా నిలవగా బాదావత్ నూతన్ వర్మ తోకల హర్షిత్ లు 9.7 జిపిఎ సాధించి ద్వితీయ తృతీయ ర్యాంకులు కైవసం చేసుకున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ అనంతుల మురళీధర్ ప్రిన్సిపల్ అనంతుల కల్పనలు తెలిపారు అప్పలరావుపేటకు చెందిన గోనె కృతిక 9.5, నెక్కొండకు చెందిన మహమ్మద్ వహీదా , బోడ రామ్ చరణ్ ,కల్వచర్ల షాఋగ్న లు 9.3 జిపిఏ సాధించినట్లు పాఠశాల యాజమాన్యం ప్రకటించింది. పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు , ఫలితాల సాధనలో కృషి చేసిన ఉపాధ్యాయులను వారు అభినందించారు. ఫలితాల అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విద్యార్థులకు మెమొంటోలు అందజేసి శాలువాలతో సత్కరించి అభినందించారు.

ఎస్. ఎస్. సి ఫలితాలలో రెయిన్బో ఇంగ్లీష్ మీడియం ప్రభంజనం

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ – 30(నేటి ధాత్రి):
మంగళవారం ప్రకటించిన ఎస్. ఎస్. సి – 2024 ఫలితాలలో రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ స్టూడెంట్స్ ప్రభంజనాన్ని సృష్టించారు. హాజరైన 16 మంది విద్యార్థులలో నలుగురు విద్యార్థులు 10 జీపీఏ,
ఇద్దరు 9.8, ఇద్దరు 9.7, 6 మంది విద్యార్థులు 9.0 జిపిఏ ఆపైన సాధించారని మరియు 100 శాతం ఉత్తీర్ణత సాధించామని తెలుపుతూ సంతోషిస్తున్నామని అన్నారు. ఈ విజయానికి సహకరించిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. 10 జీపీఏ సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, విద్యాశాఖ అధికారి రమేష్ అభినందించారు.

బిజెపిలో చేరిన బిఆర్ఎస్ నాయకులు

కండవు కప్పి ఆహ్వానించిన ఎంపీ సంజయ్
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బొప్ప వెంకన్న ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన బిఆర్ఎస్ శ్రేణులు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో బిజెపిలో చేరారు. వీరికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ గెలుపు కొరకు కృషి చేస్తానని తెలిపారు

పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విజయకేతనం

చందుర్తి,నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో చందుర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినివిద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. మండలంలోని వివిధ పాఠశాలల్లో పదవతరగతి పరీక్షకు 249 మంది హాజరు కాగా 236 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 127 బాలురులకు గాను 119 పాసయ్యారు. 122 బాలికలకు 117 ఉత్తీర్ణలయ్యారు. బండపల్లి, మల్యాల, మరిగడ్డ,
నర్సింగాపూర్ తో పాటు మండల కేంద్రంలోని కస్తూర్బా హైస్కూల్ పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. మూడపల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన వట్టిమల్ల మణిచరణ్ 9.8, మల్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన శ్రీధర్ల శ్రీజ 9.5 గ్రేడింగ్ పాయింట్స్ సాధించారు. గడ్డం శివప్రియ ఎన్గల్ హైస్కూల్, ఇల్లంతకుంట మణిచంద్ర మూడపల్లి హైస్కూల్ యం సాత్విక , నర్సింగాపూర్ హైస్కూల్ విద్యార్థులు 9.3 సాధించారు.
వీరికి మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు అభినందించారు.

రక్త దాతలే ప్రాణ దాతలు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

# ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు ఎన్నికల్లో ఓటు ను వినియోగించుకోవాలి

# స్వీప్ కార్యక్రమములో భాగంగా జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

# స్వచ్ఛందంగా ఉస్సహంగా పాల్గొన్న అధికారులు ఉద్యోగులు యువకులు

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు స్వీప్ జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేడు రక్త దానం చేసిన రక్తదాతలే ప్రాణ దాతలని రక్తం దానం చేయడం ద్వారా ఒక కుటుంబాన్ని ఆదుకున్నవారు ఔతారని ఆపద సమయంలో కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు. స్వీప్ కార్యక్రమములో భాగంగా జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పార్లమెంట్ లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ శాతం పెంపొందించడానికి వినూత్నంగా జిల్లా కేంద్రములో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని, సేకరించిన రక్తాన్ని రెడ్ క్రాస్ ద్వారా వివిధ ప్రాంతాలలో తలసేమియావ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అందించడం జరుగుతుందని తెలిపారు పార్లమెంట్ లోక్ సభ ఎన్నికలలో ఇదే స్ఫూర్తితో అధికారులు, ఉద్యోగులు యువకులు, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరిని తమ ఓటును ఉపయోగించుకునే విధంగా వారికి అవగాహన కల్పించి ఓటింగ్ శాతం పెంచే విధంగా ప్రయత్నం చేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని ఓటింగ్ ద్వారానే మంచి ప్రభుత్వాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మే 13వ తేదీన జరిగే పోలింగ్ లో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ఎక్కువ పోలింగ్ శాతం నమోదు అయిన జిల్లాగా రికార్డ్ సృష్టించేందుకు ప్రయత్నిస్తూ ఇతర జిల్లాలోని ఓటర్లకు స్ఫూర్తిగా నిలవాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటు వేయడమే కాకుండా తమ చుట్టుపక్కల ఉన్న ఓటర్లు ఓటు వేసేలా కృషి చేయాలన్నారు పోలింగ్ కేంద్రాల్లో వేసవి దృష్ట్యా తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు మిగతా సౌకర్యాలను కల్పిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి రెండు కిలోమీటర్ల దూరంలోపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు యువత ప్రజాస్వామ్యానికి అంబాసిడర్లు రాయబారులు గా పనిచేసి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు తమ వంతు కృషి చేయాలన్నారు.తల్లిదండ్రులే కాకుండా తమ చుట్టుపక్కల ఉన్న ఓటర్లు ఎన్నికల్లో ఓటు వేసేవిధంగా యువత చైతన్యవంతం చేయాలన్నారు. ప్రజాస్వామ్యానికి మూలాధారమైన ఓటును ఎన్నికల్లో ఓటర్లు వినియోగించుకోవాలని కోరారు ఈ సందర్భంగా జిల్లా స్వీప్ నోడల్ అధికారి డి ఆర్ డి ఎ శ్రీనివాస్ కుమార్ 55 సారి రక్తాన్ని దానం చేసిన నందుకు కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు ఈ శిబిరం లో పాల్గొనడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాల్గొన్న అధికారులకు ఉద్యోగులకు, యువకులకు మహిళలకు కలెక్టర్ అభినందించారు ఈ రక్తదాన శిబిరం లో మొత్తం 174 మంది రక్తాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్ జి ఎస్ సి కార్పొరేషన్ ఈ డి తుల రవి , పంచాయతి రాజ్ ఈ ఈ అజయ్ కుమార్, డి పి ఆర్ ఓ ఏం డి రఫిక్, జిల్లా మైనారిటీ అధికారిని ప్రేమలత, జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లెనిన జిల్లా వ్యవసాయ అధికారి విజయ చంద్ర, డి పి యమ్ సతీష్ ఏ పి డి ఈ జి ఎస్ వెంకటనారాయణ ఇతర అధికారులు, ఉద్యోగులు యువకులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట పట్టణంలోని 2వ వార్డుకు చెందిన ముత్తినేని శ్రీనివాస్,18 వ వార్డుకు చెందిన కొండ్ర సదానందంలు మంగళవారం మరణించగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం
కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్, జిల్లా అధికార ప్రతినిధి తక్కళ్లపెల్లి రవీందర్ రావు, మాజీ మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నర్సంపేట పట్టణ అధ్యక్షులు బత్తిని రాజేందర్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎలకంటి విజయకుమార్, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి మాదాసి రవి, నర్సంపేట అధికార ప్రతినిధి గుంటి వీర ప్రకాష్, మాజీ వార్డు మెంబర్ గాజుల రమేష్, మెరుగు సాంబయ్య, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు లాక్కార్స్ రమేష్, బాణాల శ్రీనివాస్, శ్రీరామోజు మురళి, మహమ్మద్ బాబా, బైరీ మురళి గిరగాని రమేష్, రామగొని శ్రీనివాస్, కొల్లూరి రాజు, గడ్డమీది తిరుమల్, గండి యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల‌కు సీఎం రేవంత్ రెడ్డి

– సిరిసిల్లలో భారీ బహిరంగ సభకు ఏర్పాటు
– పాత ఎల్లమ్మ గుడి సమీపంలోని మైదానంలో


– సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 30 (నేటి ధాత్రి) : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మే 3న పీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటించ‌నున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా శుక్రవారం జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. స్థానిక పాత ఎల్లమ్మ గుడి సమీపంలోని మైదానంలో మే 3న మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి కేకే మహేందర్ రెడ్డి వెల్లడించారు.
ఈ మేరకు మంగళవారం బహిరంగ సభ స్థలి ప్రాంగణాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కు మద్దతుగా ఎన్నికల ప్రచార సభను నిర్వహిస్తున్నారు. ఇందు కోసం భారీ బహిరంగ సభ నిర్వహణకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సభా స్థలి పరిశీలన అనంతరం కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ భారీ ఎత్తున సిరిసిల్ల నియోజకవర్గం నుండి జనాన్ని, పార్టీ శ్రేణులను, శ్రేయోభిలాషులను తరలించి సభను విజయవంతం చేయడం కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎంత మందిని ప్రజల్ని తరలించాలో, పార్టీ శ్రేణులకు ఉత్సాహం కలిగించడానికి సమాలోచనలు చేస్తున్నట్టు తెలిపారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలుపు కోసం ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని సభను విజయవంతం చెయ్యాలని ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సభ ప్రాంగణం పరిశీలనలో కాంగ్రెస్ నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్, గడ్డం నరసయ్య, చొప్పదండి ప్రకాష్, వైద్య శివప్రసాద్,కాముని నళినికాంత్, మ్యాన ప్రసాద్, అకునూరి బాలరాజు, వెలుముల తిరుపతిరెడ్డి, యేల్లే లక్ష్మినారాయణ, నేరెళ్ల శ్రీకాంత్,వేముల రవి, గుండ్లపెల్లి గౌతమ్, కుడిక్యాల రవి, రెడ్డి నాయక్, వెంగళ లక్ష్మీ నరసయ్య, బైరి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి మండలంలో కారు జోరు..

ఎంపీ అభ్యర్థికి మద్దతుగా కొడంగల్ గ్రామ ప్రజలు..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా…
కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలంలోని నాచారం, తోగపూర్, సర్జఖన్ పేట గ్రామంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి కి మద్దతుగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.ఆ గ్రామం లోని మహిళలు హారతులతో ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి స్వాగతం పలికారు.
కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి పాల్గొని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు…
కార్యక్రమానికి రాష్ట్ర మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వేంకటేశ్వర రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు,రైతులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మన్నే శ్రీనివాస్ రెడ్డి కి మద్దతు పలికారు..

కాంగ్రెస్ పార్టీ నాయీబ్రాహ్మణ కుటుంబాలకు అన్నివిధాల అండగా ఉంటుంది: శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్

కూకట్పల్లి ఏప్రిల్ 30 నేటి ధాత్రి ఇన్చార్జి

శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయి బ్రాహ్మణ సోదరుల ఆత్మీయ సమా వేశానికి శేరిలింగంపల్లి నియోజ కవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి జగదీశ్వ ర్ గౌడ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి నా యి బ్రాహ్మణుల కుటుంబాలకు
ప్రభుత్వం ఎల్లపుడు అండగా ఉంటుందని వారి సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చా రు.ఈ సందర్భంగా నాయిబ్రా హ్మ ణులు రానున్న పార్లమెంట్ ఎన్నిక లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్ట ర్.జి.రంజిత్ రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు.ఈ కార్యక్ర మంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్,నాయకులు గొట్టిముక్కల వెంక టేశ్వరరావు,నల్ల సంజీవరెడ్డి,కృష్ణ ముదిరాజ్,మరేళ్ల శ్రీనివాస్,ఏకాంత్ గౌడ్,బాష్పక యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version