వచ్చే పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరగాలి.

# పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల జనరల్ అబ్జర్వర్.

నర్సంపేట,నేటిధాత్రి :

త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల మండలంలో సజావుగా జరగాలని ఎన్నికల జనరల్ అబ్జర్వర్,ఐఏఎస్ రచిత్ రాజ్ తెలిపారు.దేశ వ్యాప్తంగా జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా బుదవారం ఎన్నికల జనరల్ అబ్జర్వర్,ఐఏఎస్ రచిత్ రాజ్,ఎన్నికల వ్యయ పరిశీలకులు, ఐఆర్ఎస్
ఉమాకాంత్ ద్రుపతి, దుగ్గొండి మండలంలోని కీలకమైన నాచినపల్లి,రేకంపల్లి పోలింగ్ స్టేషన్ లైన లను సందర్శించారు.సంబందించిన ఎన్నికల అధికారులకు పలు సలహాలు సూచనలు తెలిపారు.ఈ కార్యక్రమాలలో ఆర్డీవో కృష్ణవేణి, ఏసిపి కిరణ్ కుమార్,ఎమ్మార్వో రవిచంద్రరెడ్డి, దుగ్గొండి సీఐ రాజ గోపాల్ గౌడ్,ఎస్సై పరమేష్,ఎంఆర్ఐ రాంబాబు పలువురు అధికారులు పాల్గొన్నారు.

అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి. జహంగీర్ ను గెలిపించాలి:సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి. జహంగీర్ ను గెలిపించాలని,
మే డే స్ఫూర్తితో కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు.
బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా చండూరు మండల పరిధిలోని, చండూరు మున్సిపాలిటీ,నేర్మటలో సిపిఎం జెండాను, చండూరు మున్సిపాలిటీ లో మున్సిపల్ వర్కర్స్ యూనియన్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్, హమాలీ వర్కర్స్ యూనియన్ పని ప్రదేశాలలో సిఐటియు జెండా ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమెరికా చికాగో నగరంలో 8 గంటల పని విధానం కోసం జరుగుతున్న పోరాటం పై యాజమాన్యాల దాడికి బలైన అమరుల రక్తంలో నుండి పుట్టిన ఎర్రజెండా అనేక ఉద్యమాలు నిర్వహించి కార్మిక హక్కులు సాధించినది అని అన్నారు. కార్మికుల శ్రమశక్తి ద్వారా సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటు శక్తులకు తాకట్టు పెడుతున్న బిజెపి మోడీ ప్రభుత్వాన్ని గద్దే దింపడానికి కార్మిక వర్గం సన్నద్ధం కావాల్సిందని అన్నారు కార్మిక చట్టాల మార్పులు 8 గంటల పని విధానాన్ని తీసివేసి పన్నెండు గంటలు పని విధానాన్ని ప్రవేశపెట్టాలని చూడడం అన్యాయమని అన్నారు. అంబానీ ఆదానీలకు ఆస్తులు కట్టబెడుతూ పేదలను కార్మికులను అణిచి వేస్తున్నారని అన్నారు విద్యుత్ సంస్కరణలు రైతు వ్యతిరేక విధానాలను తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వంపై రైతాంగం సంవత్సరం పాటు పోరాడిన సందర్భంలో చట్టాలను రద్దు పరుస్తున్నామని హామీ ఇచ్చి దొంగ చాటుగా అమలు చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మే డే స్ఫూర్తితో కార్మిక కర్షక ఐక్యతతో ప్రజా వ్యతిరేక విధానాల అవలంబిస్తున్న బిజెపిని వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.
*ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మోగుదాల వెంకటేశం, సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనుంజయ గౌడ్, సిపిఎం సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పాశం లింగయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అన్నే పర్తి చిన్నవెంకన్న, ఉపాధ్యక్షులు నల్లగంటి లింగస్వామి, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు నాంపల్లి శంకర్, ఉపాధ్యక్షులు నాగిల్ల లక్ష్మయ్య, బేర బిక్షమయ్య, దాసరి కృష్ణయ్య, భాస్కర్, రమేష్ దితరులు పాల్గొన్నారు.

బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

– వ్యక్తిపై కేసు నమోదు, రిమాండ్ కు తరలింపు
– మోసపోయిన బాధితులు సబంధిత పోలీస్ స్టేషన్లలో పిర్యాదు చేయాలి
– జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్ల, మే – 1(నేటి ధాత్రి):
మోసపూరిత మాటలతో కబ్జాలో లేని భూమి అమ్మి రిజిస్ట్రేషన్ చేయకుండా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు రిమాండ్ కు తరలింపు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామానికి చెందిన కొంపల్లి విజయ కొనరావుపేట్ పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని కోనరావుపేట పోలీసులు విచారణ చేపట్టగా, ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామానికి చెందిన మంత్రి రఘు అను వ్యక్తి 2022 వ సంవత్సరంలో కోనరావుపేట మండల కేంద్రంలో తన కబ్జాలో లేని భూమిని తనదిగా నమ్మించి, మోసపూరితంగా కొంపల్లి విజయ అను మహిళా నుండి 20 లక్షల రూపాయలు తీసుకోని, ఎక్కడ కూడా కబ్జాలో లేని 24 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసి, తదుపరి భూమి హద్దుల విషయమై అడుగగా తప్పిoచుకొని తిరుగుతున్నాడు, ఇటీవల కలిసి సదరు కొంపల్లి విజయ తన ఆర్థిక ఇబ్బందుల గురించి రఘుకు తెలియజేసి తనను మోసం చేయవద్దని, తనకు భూమి లేదా తన డబ్బులు తనకు తిరిగి ఇచ్చివేయాలని బ్రతిమీలాడగా, మరొక లక్ష రూపాయలు ఇస్తేనే కబ్జా విషయంలో సహకరిస్తానని తెలిపి , ఇటీవల అదనంగా మరొక లక్ష రూపాయలు బలవంతంగా వసూలు చేసి, భూమి హద్దుల విషయమై మరలా అడుగగా తాను మాజీ నక్సలైట్ అని, మరొకసారి డబ్బుల విషయమై ఇబ్బందులకు గురిచేస్తే చంపివేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్న మంత్రి రఘు అనే వ్యక్తిని కోనరావుపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినారు,ఇందుకు సహకరించిన ఇతర వ్యక్తులపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నదాని, మంత్రి రఘు తన కబ్జాలో లేని భూములను అమాయక ప్రజలకు అమ్మి రిజిస్ట్రేషన్ చేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్న మంత్రి రఘు చేతిలో మోసపోయిన బాధితులు సంబంధించిన పోలీస్ స్టేషన్లలో పిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు.

లోక్ సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత

శాంతియుత ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు బాధ్యతతో పని చేయాలి

 జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్


సిరిసిల్ల, మే – 1(నేటి ధాత్రి):
లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని శాంతియుత ఎన్నికల నిర్వహణకు గత ఎన్నికల్లో జరిగిన లోతుపాటులు పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన భద్రత ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ.

ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ..
లోక్ సభ ఎన్నికలను పకద్భడ్బందీగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు. ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణతో పని చేయాలన్నారు. ఎన్నికలలో ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలన్నారు.

జిల్లాలో పరిధిలో ఏర్పాటు చేసిన చోట్ల చెక్ పోస్టులతో పాటుగా విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇస్తూ డైనమిక్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా తరలిస్తున్న డబ్బు, మద్యం అడ్డుకట్ట వేయాలన్నారు.

ఎన్నికల విధులకు సంబంధించిన నిర్దిష్టమైన సూచనలను తమ కింది స్థాయి సిబ్బందికి అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సిబ్బందికి కూడా ఎన్నికల నిబంధనల మీద అవగాహనను కల్పించడానికి సిబ్బందితో సమావేశాలు ఏర్పాటు సంపూర్ణ పరిజ్ఞానం కల్పించాలన్నారు.

అధికారులు, సిబ్బంది గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ భద్రత చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది తరచు పోలింగ్ కేంద్రాలకు సందర్శిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని,ఎన్నికల విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించే వ్యక్తుల మీద నిఘా వేసి ఉంచాలని సూచించారు.

 

ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఓటర్లను ప్రలోభపరిచేలా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తూ,ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తూ అక్రమ నగదు,మద్యం,ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అన్నారు.ప్రతి పోలీస్ స్టేషన్ లో వాహనాల తనిఖీ, డైనమిక్ చెక్ పోస్ట్ లు పెట్టి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు.

లోక్ సభ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా పై దృష్టి సారించాలని, విద్వేషాలు రెచ్చగొట్టేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వచ్చే ప్రకటనలు,ఫొటోలు షేర్ చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు చంద్రశేఖర్ రెడ్డి, నాగేంద్రాచారి, మురళి కృష్ణ, సర్వర్ , సి.ఐ లు రఘుపతి, సదన్ కుమార్, శ్రీనివాస్, వీరప్రతాప్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, అనిల్ కుమార్, శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, మాధుకర్, ఆర్.ఐ లు యాదగిరి, మధుకర్,రమేష్, ఎస్.ఐ లు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

కేసీఆర్ రోడ్ షో ను విజయవంతం చేయండి

హుజురాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి….

నేటి ధాత్రి కమలాపూర్(హన్మకొండ)హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం లోని జమ్మికుంట పట్టణంలో గాంధీ చౌక్ వద్ద గురువారం సాయంత్రం జరిగే మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధ్యక్షులు కెసిఆర్ రోడ్ షో ను విజయవంతం చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో.. రైతాంగానికి బడుగు బలహీన వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోందని అన్నారు. రైతులకు సాగునీరు అందడం లేదని, పంటలు ఎండిపోతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కేంద్రంలోని బిజెపి మత రాజకీయాలు చేస్తోందని, తెలంగాణకు తెచ్చింది ఏమీ లేదని విమర్శించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గెలుపు కోసం కృషి చేయాలని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంటకు వస్తున్న కెసిఆర్ కు ఘన స్వాగతం పలకాలని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వాన్ని కోల్పోయామని బాధ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని, ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారని అన్నారు. కెసిఆర్ రోడ్ షో కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని, కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరై పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరారు.

బీజేపీ, బీఆర్ఎస్ లకు ఓటు వేసి వృదా చేసుకోవద్దు

– నేతన్నలను ఆర్థికంగా ఎదిగేలా ఆదుకుంటాం
– పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం


– స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తాం
– కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాలకి ఓటు వేయండి
– మంత్రి పొన్నం ప్రభాకర్
సిరిసిల్ల, మే – 1(నేటి ధాత్రి):
కార్మిక దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో కొత్త బస్టాండ్ నుండి జెండా రోడ్డు, సుందరయ్య నగర్ నుండి పాత బస్టాండ్ వరకు రోడ్ షోలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆదేశాలు ఆదిశ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సుందరయ్య నగర్ లో కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం ఐ.ఎన్.టి.యు. సి జెండా ఎగురవేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. పాత బస్టాండ్ లోని నేతన్న విగ్రహం దగ్గర కార్యకర్తలతో ప్రజలతో కార్నర్ మీటింగ్లో పొన్నం ప్రసంగం చేయడం జరిగింది. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత వారం రోజులుగా ప్రధాన మంత్రి ప్రకటనలు చూస్తే ప్రధాని పదవికే కళంకితం తెచ్చే విధంగా దిగజారి మాట్లాడుతున్నారని, మొదటి, రెండవ దశ పోలింగ్ ఎన్నికల తరువాత ప్రధాన మంత్రి మోడీ వైఖరి లో పూర్తిగా అసహనం వచ్చిందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఉత్తర, దక్షిణ భారత దేశంలో జరిగిన పోలింగ్ లో బీజేపీ గ్రాఫ్ పడిపోవడానికి నరేంద్ర మోడీ ప్రకటనలే కారణమన్నారు. 30 సంవత్సరాల తరువాత బీజేపీ కి స్పష్టమైన మెజారిటీ వచ్చిందని, అంత మెజారిటీ వచ్చినా అబ్ కి బార్ చార్ సౌ అంటున్నారని, దేశంలో ఉన్న మేదావులు , ప్రజాస్వామిక వాదులు ఆలోచించాలన్నారు.
దేశంలోని సంపద అంతా అదానీ, అంబానీ లకు అప్పగిస్తున్నారని, మోడీ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని, ప్రధాన మంత్రి 400 సీట్లు గెలుచుకుంటే బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి ఎస్సి, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తొలగించవచ్చని చూస్తున్నారన్నారు. మూడవ వంతు అంటే 543 ఎంపీల్లో 400 మెజారిటీ ఉంటే రాజ్యాంగాన్ని మార్చవచ్చుని చూస్తున్నారని, భవిష్యత్ లో నియంతలాగ ఉండాలని చూస్తున్నారన్నారు. దేశ సంపద అంతా అదానీ, అంబానీలకు గుజరాత్ కుటుంబాలకు లకు అప్పగించాలని చూస్తున్నారని, దేశంలో దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు ఉండకుండా చూడాలనీ చేస్తున్నారన్నారు. అందుకే ఆ ఆలోచనతో అబ్ కి బార్ చార్ సౌ అంటున్నారని పేర్కొన్నారు. నిజానికి క్షేత్ర స్థాయిలో బీజేపీకి ఎవరు ఓటు వేయడం లేదని, గతంలో 4 లక్షల మెజారిటీతో గెలిచిన సీట్లు కూడా ఇప్పుడు 50 వేలు, లక్ష తో ఓడిపోతున్నాయని ఇంటెలిజెన్స్ సర్వేలు చెబుతున్నాయని వెల్లడించారు.దేశంలో కాంగ్రెస్ వస్తె ఆస్తులు ముస్లింలకు ఇస్తారని అంటున్నాడని, మంగళ సూత్రాలు గుంజుకుంటారని అంటున్నాడని, ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి అర్బన్ నక్సలిజం వస్తుందని, హనుమాన్ చాలీసా చదవనివ్వమని అంటున్నాడని దుయ్యబట్టారు. దేశంలో బడుగు బలహీన వర్గాలు ఎవరు బీజేపీ వైపు లేరని, నిన్న రాష్ట్రానికి వచ్చిన మోడీ జహీరాబాద్ లో ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని అంటున్నారని, ప్రధాన మంత్రి స్థాయికి ఎంత దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశంలోని 11లక్షల కోట్ల సంపద ఎల్ఐసి, ఎయిర్పోర్ట్, పోర్టులు, బిఎస్ఎన్ఎల్ తో సహా అదానీ, అంబానీ లకి అప్పగించింది వాస్తవం కాదా ప్రశ్నించారు. బీజేపీ ఒక్క సీటు గెలిచిన భవిష్యత్ కాలంలో ఎస్సి, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు ఉండవని స్పష్టం చేశారు. ఆనాడు మండల కమిషన్ తెస్తే అద్వానీ కమండల్ పేరుతో యాత్ర చేసి దేశం మొత్తం అల్లకల్లోలం చేసింది వాస్తవం కాదా అని ధ్వజమెత్తారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈదేశంలో రిజర్వేషన్ రహిత భారతదేశం తెస్తామన్నది వాస్తవం కాదా అన్నారు. రాహుల్ గాంధీ దేశంలో ఉత్త్నా అబాది ఇత్నా ఇచాదరి అంటే కుల గణన చేస్తామంటే దానికి వ్యతిరేకంగా కేంద్ర బీజేపీ నాయకత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బండి సంజయ్ కూడా దళితుల రిజర్వేషన్లు అవమానకరంగా మాట్లాడింది వాస్తవం కాదా అన్నారు. బీజేపీ ఫ్యూడలిస్ట్ ల పార్టీ, వ్యాపారస్తుల పార్టీ అని, దేశం మొత్తం మీద 30-40 లక్షల ఖాళీలున్న ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, రిజర్వేషన్ల ద్వారా వస్తారని యూపీపీఎస్సీ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ లకు సంబంధించి రిజర్వేషన్లు ఇవ్వడం లేదని పార్లమెంట్ సాక్షిగా జవాబు చెప్పారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మన హక్కులు కాపాడుకోవడానికి రిజర్వేషన్లు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని కోరుతూ రిజర్వేషన్ల తొలగింపుకు కుట్ర జరుగుతోందన్నారు.
ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం..
2023 డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 లకే గ్యాస్ అందిస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని,10 లక్షల ఆరోగ్య శ్రీ ఇచ్చామని, రేషన్ కార్డులు ఇస్తామని, 4000 పెన్షన్ ఇస్తాం.. పెన్షన్ లేని వారికి కొత్తగా వచ్చే వారికి కూడా పెన్షన్ లు ఇస్తామని మంత్రి వెల్లడించారు. కేంద్రం నుండి నిధులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గెలిస్తేనే ఇవన్నీ పథకాలు అమలు చేయడానికి ఉంటుందనీ, కార్యక్రమాలు కొనసాగాలన్న.. మరింత అభివృద్ధి జరగాలన్న కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండనీ అభ్యర్థించారు. బీజేపీ , బీఆర్ఎస్ లకు ఓటు వేసి వృదా చేసుకోవద్దని, దేశంలో నియంత్రుత్వనికి వ్యతిరేకంగా, త్యాగాల ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించిన కుటుంబం నుండి మానవతావాది రాహుల్ గాంధీ నాయక్వత్వాన్ని బలపరుద్దామన్నారు. దేశాన్ని ముందుకు తీసుకుపోదామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామన్నారు.
ఎన్నికల కోడ్ ముగియగానే నేతన్నలకు…
చేనేత కార్మికుల కు గత 10 సంవత్సరాలుగా ఇచ్చిన ప్రణాళిక కన్న మంచిగా ప్రణాళిక అమలు చేస్తామని, ప్రతి కార్మికుడు ఆర్థికంగా ఎదిగేలా చేస్తామని, మహిళా సంఘాలకు బలోపేతం చేస్తూ వారికి వడ్డీలేని రుణాలు ఇస్తూ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చేతి వృత్తులకు ప్రోత్సహిస్తున్నామనీ హామీ ఇచ్చారు. పరిశ్రమ కాపాడుకోవడమే కాదు మంచి.. భవిష్యత్ లో సిరిసిల్ల రికగ్నైజ్ బ్రాండ్ క్రియేట్ చేస్తామని మంత్రి తెలిపారు. 3వ తేది ముఖ్యమంత్రి వస్తున్నారు. ఈ ప్రాంత సమస్యల పై వారికి అవగాహన ఉంది. సిరిసిల్ల సభను విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి చేనేత పై జీఎస్టీ విధించిందని, సిరిసిల్ల క్లస్టర్ ను వరంగల్ కి తరలించారనీ, సిరిసిల్ల చేనేత కి బండి సంజయ్ ఏం చేశారో నూతన చౌరస్తాలో చర్చకు రావాలనీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ఆనాడు టెస్కో ద్వారా మహిళలకు స్వయం సమృద్ధి అవకాశాలు కల్పించామాన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని.. సిరిసిల్ల లో మరింత మెజారిటీ రావాలన్నారు. సిరిసిల్ల పట్టణంలో మంచి స్పందన వచ్చిందన్నారు. వారంతా కాంగ్రెస్ అండగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ లో మరింత ఉత్సాహంగా పనులు కొనసాగిస్తామని వెల్లడించారు. పార్లమెంట్ సిట్టింగ్ సభ్యులు నియోజకవర్గానికి ఏం పని చేశారో చెప్పాలన్నారు.

మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జైనయ్యారు.

కూకట్పల్లి మే 1 నేటి ధాత్రి ఇంచార్జ్

కాంగ్రెస్ పార్టీలో చేరిన చందనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్,శేరిలింగంపల్లి నియోజకవర్గ గౌడ్ సంఘం అధ్యక్షులు లక్ష్మీనారా యణ గౌడ్,నియోజకవర్గ సీనియర్ నాయకులు కరుణాకర్ గౌడ్,కుమార్ యాదవ్,రామచందర్,లక్ష్మ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు లు ఏ.రేవంత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి,శేరిలిం గంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యం లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేట ర్ ని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి
పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్ర మంలో సీనియర్ నాయకులు ఉరిటీ వెంకట్ రావు,రవీందర్ రెడ్డి,సుధా కర్ తదితరులు పాల్గొన్నారు.

కార్మిక హక్కులకై శ్రామిక ప్రజలు మరింత పోరాటం చేయాలి

మే డే వేడుకల్లో హన్మకొండ జెఏసి చైర్మన్ తాడిశెట్టి క్రాంతి కుమార్

హసన్ పర్తి / నేటి ధాత్రి

మేడే సందర్భంగా హన్మకొండ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో తాడిశెట్టి క్రాంతి కుమార్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎర్రజెండా ఆవిష్కరణ చేసి కార్మికుల గురించి, మేడే విశిష్టత గురించి వివరించడం జరిగింది. ఈ దేశంలో కార్మికుల పక్షాన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లేబర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని ఎనిమిది గంటల పని విధానం పనికి తగ్గ ఫలితంగా జీతభత్యాలు ,పిఎఫ్ లు మరియు ఆరోగ్య బీమా ఇలా అన్ని హక్కులు ఇవ్వాలని కార్మికులకు వారి పిల్లలకు చదువుకునేందుకు ఉచిత విద్యను అందించాలని ఇవన్నీ డిమాండ్లను బిల్లులో చేర్చి అంబేద్కర్ ఆనాడే కార్మికుల పక్షాన నిలబడడం జరిగింది
అలాంటి భారతదేశంలో ఇప్పటివరకు కూడా కార్మికులకు కర్షకులకు న్యాయం జరగలేదని పనికి తగ్గ వేతనాలు ఇప్పటికీ అమలులోకి లేవని ఎనిమిది గంటల పని విధానం ఎప్పుడో పోయి కార్పొరేట్ సెక్టార్లన్నీ కూడా సామాన్యులతో 12 గంటలు 15 గంటలు కొన్ని సందర్భాల్లో 18 గంటలు కూడా పని చేయించుకుంటూ పనికి తగ్గ వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, మన హక్కులను కాలరాస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ప్రపంచ దేశాల్లో లేనివారి మధ్య ఉన్న వారి మధ్య దోపిడి విధానం గురించి ప్రపంచ దేశాల్లో జరుగుతున్న దోపిడి గురించి పేద ప్రజల రక్తాన్ని పీడిస్తూ పన్నుల రూపంలో మనల్ని ఇంకా పేదరికంలో నెట్టివేయబడేలా చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల గురించి వివరిస్తూ ఇప్పటికైనా కార్మికులందరూ ఐక్యంగా మరోసారి ఉద్యమించి భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో కార్మికుల హక్కులను మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలని కొత్త విధానాలను తీసుకురావాలని కొత్త చట్టాలని తెచ్చుకోవాలని సూచించారు.

పాలమూరు పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి గెలుపు ఖాయం..

మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి..

మహబూబ్ నగర్ జిల్లా
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా…
దేవరకద్ర నియోజకవర్గం భుత్పూర్ మండలం తాటిపర్తి గ్రామంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి కి మద్దతుగా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అధితిగా బి ఆర్ ఎస్ పార్టీ ఎం పి, అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లడుతు, పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గం లో ఏక్కడి కి వెళ్లిన ప్రజలు బి ఆర్ ఎస్ వైపే మొగుచుపుతున్నారని, ప్రజల ఆదరణ చూడలేక.. సీఎం రేవంత్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కారని, మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నారని మన్నె శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ తమ ఓటుతో సీఎం రేవంత్ రెడ్డికి తగు గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు.
కార్యక్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డికి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు..
కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు,రైతులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మన్నే శ్రీనివాస్ రెడ్డి కి మద్దతు పలికారు..
నారాయణపేట నియోజకవర్గం దామరగిద్ద మండల కేంద్రంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు….
కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి ,మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ ,మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థికి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు..
కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు,రైతులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మన్నే శ్రీనివాస్ రెడ్డి కి మద్దతు పలికారు.

రంజిత్ రెడ్డిని గెలిపించి మన నియో జకవర్గ పరిధిలోని మిగిలి ఉన్న అభివృద్ధి సత్వరంగా చేసుకోండి:

మాజీ కార్పొరేటర్ జానకి రామరాజు

కూకట్పల్లి మే 1 నేటి ధాత్రి ఇన్చార్జి

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని తులసీనగర్ ప్రాంతంలో బుధవారం రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో గడప గడపకు ప్రచారంలో భాగంగా మాజీ కార్పొరేటర్ జానకిరామరాజు ఆధ్వర్యం లో ప్రముఖ న్యాయవాది కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రమీల ఆయా ఓటర్ల వద్దకు వెళ్లి వచ్చేనెల 13న జరగబో యే ఎంపీ ఎన్నికలలో తమ అభ్యర్థి చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డిని అత్యధిక ఓట్లు వేసి గెలిపిం చాలని తెలిపారు.ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ జానకి రామరాజు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ప్రమీల మాట్లాడుతూ…. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతంగా చేయాలన్న ఎంపీ రంజిత్ రెడ్డిని గెలిపించినట్లయి తే,ఇప్పటివరకు అందుతున్న సంక్షే మ పథకాలలో 6 గ్యారెంటీలలో ఇప్పటివరకు అమలు అయినవి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యు త్,గ్యాస్ సబ్సిడీ,ఉచిత బస్సు సౌక ర్యం వంటివి నిరుపేద ప్రజలకు అం దుతున్నాయని తెలిపారు.మిగిలి ఉన్న సంక్షేమ పథకాలు మరింత సత్వరంగా అమలు కావాలన్నా
మనం మన ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గత పది సంవత్సరాలు కేంద్రం నుంచి నిధులనుతీసుకువచ్చి మంచి అభివృద్ధి జరిగేలా చూసిన మంచి వ్యక్తిగా కొనసా గుతున్న ఇత నికి బంపర్ మెజారిటీ ఇచ్చినట్ల యి తే మన ప్రాంతాలు మరింత అభివృ ద్ధి జరుగుతుందని చెప్పడంలో ఎటు వంటి సందేహం లేదని వారు పేర్కొ న్నారు.ఈ కార్యక్రమంలో పలువురు మహిళా నాయకులు కార్యకర్తలు పలు సంక్షేమ సంఘాల నాయకులు తదిత రులు పాల్గొన్నారు.

జైపూర్ ఎస్టిపిపి వద్ద హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో గల సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు ఎస్టిపిపి వద్ద బుధవారం రోజున హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్టిపిపి కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకుడు విక్రమ్ కార్మికుల త్యాగానికి చిహ్నమైన ఎర్రజెండాను ఆవిష్కరించారు.ముఖ్య అతిథులుగా హెచ్ఎంఎస్ శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ తిమ్మాపురం సారయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ వెట్టి చాకిరి, బానిసత్వం,శ్రమదోపిడిలకు వ్యతిరేకంగా మరియు 18 గంటలు పనిచేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ 1886 మే 1వ తేదీన లక్షలాదిమంది కార్మిక సోదరులు చరిత్రలో నిలిచిపోయే విధంగా పోరాడి రక్త దర్పణం చేయడం వల్ల వారి రక్తంలో నుండే ఎర్రజెండా ఆవిర్భవించిందని, చికాగో అమరవీరుల నెత్తుటి త్యాగాల వల్ల ప్రపంచ దేశాలన్నీ ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయుటకు చట్టం జరిగిందని తెలిపారు.కానీ నేటి పాలకులు ప్రైవేటికరణ, కాంట్రాక్టు విధానాన్ని వేగవంతం చేసి ఆనాటి లాగే వెట్టిచాకిరి, శ్రమదోపిడి,బానిసత్వం లోనికి కార్మికులందరినీ నెట్టివేసి కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు సేవకులుగా పనిచేస్తూ 1886 విధానాన్ని అమలు చేయుటకు కుట్రలు చేస్తున్నారని అన్నారు.సింగరేణి యాజమాన్యం మరియు పవర్మేక్ లాంటి ప్రైవేటు సంస్థలు కలిసి కార్మికులతో వెట్టి చాకిరి చేపిస్తూ వారి శ్రమను దోపిడి చేసి బానిసత్వం లోకి వెళ్లే విధానాలని అమలు చేస్తున్నాయని,ఎస్టిపిపి కోసం జైపూర్ మండలంలోని గంగిపల్లి, ఎల్కంటి అనేక గ్రామాల రైతులు తమ జీవనాధారమైన వ్యవసాయ భూములను త్యాగం చేస్తే నిర్వాసితులకు పవర్ ప్లాంట్ లో శాశ్వత ఉద్యోగాలు, మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాల్సి ఉండగా నేటికీ వాటిని పాలకులు అమలు చేయలేదని, ఎస్టిపిపీ లో పెద్ద స్థాయి అధికారులు ఎంతటి కుంభకోణాలకు పాల్పడ్డ వారిపై ఎలాంటి చర్యలు ఉండవు కానీ కార్మికులు మాత్రం తమకు జరిగిన అన్యాయాలను హక్కులపై ప్రశ్నిస్తే మాత్రం వారిని పనిలో నుండి తీసివేయడం మహిళలు అని కూడా చూడకుండా మహిళలపై పోస్టర్ వేసి వారిని అవమానించడం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం జరుగుతుందని వీటన్నిటిపై హెచ్ ఎం ఎస్ ఆధ్వర్యంలో తీవ్ర పోరాటాలు తప్పవని హెచ్చరిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టిపిపి కాంట్రాక్ట్ కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ విక్రమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రదీప్ రెడ్డి, ఆర్గనైజర్ సాయి కృష్ణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఎలుక రమేష్, ట్రెజర్ సత్యనారాయణ చారి, సెక్రటరీ రామగిరి మల్లేష్, మామిడాల రమేష్, రెక్కుల రాజేందర్ రెడ్డి, కోటయ్య మరియు హెచ్ఎంఎస్ శ్రీరాంపూర్ ఏరియా నాయకులు అనిల్ రెడ్డి, దుర్గం లక్ష్మణ్, రేగుంట సందీప్, తుల అనిల్, మహిళ నాయకులు సోడారి మల్లిక మరియు కార్మికులు పాల్గొన్నారు.

ఘనంగా మే డే దినోత్సవ వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి పట్టణంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయం ఆవరణలో ( టి ఎస్ యు ఎస్ ) నాయకులు నామాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీనియర్ కార్మికుడు వెంకటేష్ 138 వ మేడే : జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడుతూ
138వ ప్రపంచ కార్మికుల పర్వదినం మేడే చికాగో అమర్లు చిందించిన రక్తంతో ఎరుపెక్కిన ఎర్రజెండాను మరిస్తూ వారి త్యాగాలను గుర్తు చేస్తూ గ్లోబలైజేషన్ యాంత్రికరణకు ప్రైవేటీకరణ పెట్టుబడిదారీ వర్గం కార్మిక వర్గానికి అసంఘటిత కార్మిక వర్గం శ్రమకు తగ్గ ఫలితాలు ఇవ్వడం లేదని దానికి కార్మిక కర్షకులు ఉద్యమాలు చేయుటకు ముందుండాలని పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు ఈ కార్యక్రమంలో
టి ఎస్ యు ఎస్ నాయకులు .
కాసర్ల ప్రసాద్ రెడ్డి దాసరి జనార్ధన్
యుగేందర్‌ ఈ శ్రీధర్
కలకోటి లింగయ్య
పాష సతీష్ పాల్గొన్నారు

ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు

రామడుగు, నేటిధాత్రి:

పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ కి మద్దతుగా బిఆర్ఎస్ నాయకులు ఉపాధి హామీ కూలీలను కలిసి కారు గుర్తుపై ఓటు వేసి వినోద్ కుమార్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగినది. అనంతరం ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున ఉపాధి హామీ కూలీలకు చల్ల ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగినది. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు దాసరి రాజేందర్ రెడ్డి, పూడూరి మల్లేశం, వేల్పుల హరికృష్ణ, సుద్దాల మల్లేశం, రేణికుంట అశోక్, పురాణం రమేష్, సిరిపురం సురేష్, కత్తెరపాక మధు, లింగంపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.

జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పేరు తెచ్చిన నందిని

పదవ తరగతి పరీక్షల్లో 10- GPA మార్కులు సాధించిన నందిని ….

కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :-

కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో పేద కుటుంబానికి చెందిన దుర్గయ్య,వసంత దంపతులకు జన్మించిన ఎరుకల.నందిని స్థానిక రంగంపేట పాఠశాలలో పదవతరగతి చదివి నేటి పదవతరగతి ఫలితాల్లో 10 – GPA సాధించింది.ఎంతో కష్టపడి చదివి మంచి ఫలితాన్ని సాధించిన నందినిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.ఉపేందర్ రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలుపారు. అలాగే ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ విజయం పట్ల నందిని తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు.

ఐబి తాండూర్ లో ఘనంగా మేడే ఉత్సవాలు

మంచిర్యాల,నేటి ధాత్రి :

మంచిర్యాల జిల్లా తాండూర్ ఐబి మండల కేంద్రంలో 138వ మేడే ఉత్సవాలను భగత్ సింగ్ భవన్ ముందు ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా సిపిఐ బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్ కార్మిక సోదరుల త్యాగానికి గుర్తుగా ఎగరేసే ఎర్రజెండాని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి కోండు బానేష్,
మాట్లాడుతూ అనాడు చికాగో నగరంలో ఎగసిన పోరు జెండా ప్రపంచ కార్మికులారా ఏకంకండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని ఉద్యమ నేత కార్ల్ మార్క్స్ ఇచ్చిన నినాదం ప్రపంచ కార్మికులను ఉత్తేజపరిచి పోరాటంలోకి మరింత ఉత్సాహంగా ముందుకు నడిపించిందని,1886 కు ముందు ప్రపంచ వ్యాప్తంగా 18 గంటలు,16 గంటలు పనిచేసే విధానాలు అమల్లో ఉండేవని, యజమానులు కార్మికుల శ్రమలను దోచుకునేవారని అన్నారు.ఈ దోపిడీ విధానం పోవాలంటూ ప్రపంచ కార్మికులు అన్ని దేశాల్లో పోరాటాలు మొదలుపెట్టారని, అమెరికా దేశంలో షికాగో నగరంలోని గనులలో ,కార్ఖానాల్లో పనిచేసే కార్మికులు తమకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలంటూ ధర్నాలు, సమ్మెలు మొదలుపెట్టారని, ఈ నేపథ్యంలో అక్కడి యజమానులు భూస్వాములు కలసి కార్మికులను పనికి తగిన వేతనం ఇవ్వకుండా వారిని పొట్టన పెట్టుకున్నారని, వందలాదిమంది కార్మికులను అక్కడి భూస్వాములు చంపివేశారని, ఆ రక్తపు మడుగులోంచి కార్మికులలో ఒకరు రక్తంతో తడిసిన తన చేతి రుమాలును తీసి కార్మిక జెండాగా పైకి ఎగరవేశారని, ఆనాటి నుండి మే 1ని ప్రపంచ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలిపారు. అనేక మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి శ్రమకు దోపిడికి మధ్య జరిగిన పోరులో విజయం సాధించారని, 1886 మే1 నుంచి ఎనిమిది గంటల పని విధానం అమల్లోకి వచ్చిందని మేడే రోజు అంటేనే కార్మికుల పండుగని, అన్ని వర్గాల కార్మికులు ఎంతో ఆనందంగా సంతోషంగా మేడే ఉత్సవాలను జరుపుకుంటారని, కార్మిక ఉద్యమంలో కార్మికుల హక్కులను నెరవేర్చేకునే క్రమంలో ప్రాణాలను కోల్పోయిన మన కార్మిక వీరులను తలుచుకొని వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, వారు చూపిన ఉద్యమ బాటలో ముందుకు సాగాలని, మన హక్కుల కోసం ఎంత కష్టమైనా పోరాడాలని, అందరం కలిసి ఐక్యమత్యంతో కూడి ఉండాలని తెలియజేశారు. అనంతరం కార్మికులందరూ పరస్పరం ఒకరికి ఒకరు మేడే శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.ఈ కార్యక్రమంలో గోలేటి బ్రాంచి ఏఐటియుసి ఉపాధ్యక్షుడు బయ్యా మొగిలి,మాదారం టౌన్ సిపిఐ కార్యదర్శి పట్టి శంకర్,మాదారం త్రీ ఇంక్లైన్ గ్రామ సిపిఐ కార్యదర్శి వాసాల నాగరాజు,తాండూర్ సిపిఐ గ్రామ కార్యదర్శి ఇందారపు రాజేష్,అచ్చులాపూర్ సిపిఐ గ్రామ కార్యదర్శి కొడిపాక భాస్కర్,మాదారం టౌన్ సహాయ కార్యదర్శి మలిశెట్టి సత్యనారాయణ,
పెటేటి కృష్ణమోహన్, సముద్రాల ఆనంద్, కరవేనా కల, పుప్పాల అంజయ్య, షరీఫ్, కార్మిక సోదరులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి

మే డే వర్ధిల్లాలి….

– మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్….

కొల్చారం, (మెదక్) నేటి ధాత్రి:-

ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే ని పురస్కరించుకొని ఈ సందర్బంగా తాపీ కార్మికులకు మరియు ఇండస్ట్రీ & పారిశుద్ధ కార్మికులకు ప్రతి కూలి పని చేసే కార్మికునికి అందరికీ సోదరులకు సోదరీమణులకు మే డే శుభాకాంక్షలు తెలిపిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుడ్డ భాగ్యరాజ్. కష్టాన్ని నమ్మి శ్రమించే ప్రతి కార్మికుడు అందరితో ఐక్యమత్యం తో కలిసికట్టుగా ముందుకు సాగాలని, ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల కార్మిక సోదరులు డీ హైడ్రెషన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్మిక సోదరులు మే డే శుభాకాంక్షలు.

ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు

ఎండపల్లి నేటిధాత్రి
ఎండపల్లి మండల కేంద్రంలో మండల భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు మంతెన నరసయ్య జెండా ఆవిష్కరణ చేసి అనంతరం వారు మాట్లాడుతూ, ప్రభుత్వాలు కార్మికుల హక్కులు కాపాడాలని, కార్మికులు చేసిన సేవలను యాజమాన్యాలు గుర్తించి, కార్మికులకు తగిన గౌరవం ఇవ్వాలని, శ్రమ చెద్దాం , శ్రమను గుర్తిద్దాం,శ్రమను గౌరవిద్దాం అని తెలిపారు, ఈ కార్యక్రమంలో దీకొండ రాజేశం దొనకొండ శంకర్ మంతెన స్వామి కనుకుట్ల లచ్చయ్య కనుకుట్ల రాజేశం బీ కొండ మల్లేష్ మంతెన తిరుపతి కనుకుంట్ల నరసయ్య మంతెన రాజు శివ రాజయ్య కనుకుంట్ల చిన్న లచ్చయ్య మంతెన మహేందర్ తదితరులు పాల్గొన్నారు

మెదక్‌ మొనగాడు వెంకట్రామ్‌ రెడ్డే!

https://epaper.netidhatri.com/view/251/netidhathri-e-paper-2nd-may-2024%09/3

అటు కేసిఆర్‌, ఇటు హరీష్‌ ఇద్దరి ఆశీస్సులు.

ఆది నుంచి మెదక్‌ బిఆర్‌ఎస్‌కు కంచుకోట.

కాంగ్రెస్‌ హయాంలో మెతుకుకు దిక్కులేని సీమ.

పదేళ్ల బిఆర్‌ఎస్‌ కాలంలో మెదక్‌ అన్నపూర్ణ.

కాంగ్రెస్‌ వచ్చింది…కరువొచ్చింది.

మెదక్‌ మెతుకుకోసం మళ్ళీ తల్లడిల్లుతోంది.

నిన్నటి దాక మంజీర పరవళ్లు తొక్కింది.

కాంగ్రెస్‌ రాగానే ఎండిపోతోంది.

బిఆర్‌ఎస్‌ హయాంలో మెదక్‌ అంతా సస్యశ్యామలం.

కాంగ్రెస్‌ రాగానే ఎడారి మయం.

ఆనాడు ఇందిరా గాంధీ గెలిచినా చేసిందేమీ లేదు.

ఇప్పుడు కాంగ్రెస్‌ ఒరగబెట్టేదేమీ లేదు.

వనరులను వినియోగించడం కాంగ్రెస్‌కు చేతకాదు.

బిఆర్‌ఎస్‌ గెలిస్తే అభివృద్ధికి తిరుగుండదు.

మెదక్‌ మేలు కోరేది బిఆర్‌ఎస్సే.

మెదక్‌ గడ్డ ఎప్పుడైనా బిఆర్‌ఎస్‌దే

కాంగ్రెస్‌ కాలంలో మెతుకు కోసం ఎడ్చిన సీమ!

కేసిఆర్‌ చలువతో మెదక్‌ పచ్చని పొలాల కోనసీమ!!

హైదరాబాద్‌,నేటిధాత్రి:
ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది బిఆర్‌ఎస్‌ జోరు మరింత పెరుగుతోంది. ముఖ్యంగా మెదక్‌ జిల్లాలో ఆది నుంచి కారు జోరే వుంది. పార్లమెంటు ఎన్నికల్లో ఈసారి కూడా కారుదే హవా కనిపిస్తోంది. ఓ వైపు ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఉమ్మడి సొంత జిల్లా. 2014లో ఆయన కూడా మెదక్‌ నుంచి పోటీ చేసి నాలుగు లక్షల పై చిలుకు రికార్డు మెజార్టీని సాధించారు. ఆ తర్వాత ప్రభాకర్‌రెడ్డి రెండు సార్లు గెలిచారు. ఈసారి బరిలో మాజీ కలెక్టర్‌, ఎమ్మెల్సీ వెంకట్రామ్‌ రెడ్డి బిఆర్‌ఎస్‌ తరుపున బరిలో వున్నారు. వెంకట్రామ్‌రెడ్డికి మెదక్‌ జిల్లాతో ఎంతో అనుబంధం వుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన గ్రూప్‌ ఆఫీసర్‌ గా మెదక్‌ జిల్లాకు వివిధ హోదాలలో సేవలందించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన సిద్దిపేట,సిరిసిల్ల జిల్లాలకు కలెక్టర్‌గా సేవలందించారు. ఆయన కలెక్టర్‌గా వున్న సమయంలో సిద్దిపేట జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన మల్లన్న సాగర్‌, రంగనాయక సాగర్‌ల నిర్మాణంలో జరిగింది. వాటి పూర్తికి వెంకట్రామిరెడ్డి కృషి ఎంతో వుందని చెప్పాలి. అధికారిగా ఎంతో మంచి పేరు ఆయనకు వుంది. ప్రభుత్వాలు చేపట్టే పనులు ఎంత సమర్ధవంతంగా పూర్తి చేసే చురుకైన అధికారులల్లో ఒకరుగా గుర్తింపు వుంది. ఆయన ఎక్కడ పనిచేసినా అక్కడ అనేక అవార్డులు, రివార్డులు అందుకుంటుండేవారు. సామాజిక సేవ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అందుకే ఆయన ఉన్నతోద్యోగిగా ఎప్పుడూ పేదల గురించి ఎక్కువగా ఆలోచించేవారు. వారికి మేలు చేసేందుకు కృషి చేసేవారు. అంతటి మంచి పేరున్న వెంకట్రామిరెడ్డి ఇప్పుడు బిఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా మెదక్‌ నుంచిపోటీ చేస్తున్నారు. ఒక సమర్ధవంతమైన అధికారిగా వున్న వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా సిద్దిపేట జిల్లాకు ఎనలేని సేవలు చేశాడు. ఆ గుర్తింపుతోనే కేసిఆర్‌ వెంకట్రామి రెడ్డి చేత రాజీనామ చేయించి, ఎమ్మెల్సీని చేశాడు. గత శాసన సభ ఎన్నికల్లో మళ్లీ బిఆర్‌ఎస్‌ గెలిచి వుంటే, వెంకట్రామ్‌ రెడ్డి మంత్రి అయ్యేవారు. ఎందుకంటే అధికారిగా ఆయనకు వున్న అనుభవం, విసృతమైన సేవల మూలంగా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు కేసిఆర్‌ తప్పకుండా వెంకట్రామ్‌రెడ్డిని మంత్రిని చేసేవారు. ఇది గత శాసన సభ ఎన్నికల ముందు పెద్ద ఎత్తున జరిగినచర్చ. అంతటి విశిష్ట వ్యక్తిత్వం వున్న వెంకట్రామ్‌ రెడ్డిని ఇప్పుడు కేసిఆర్‌ పార్లమెంటు ఎన్నికల బరిలో మెదక్‌ నుంచి నిలిపారు.
మెదక్‌ జిల్లాలో ఆది నుంచి బిఆర్‌ఎస్‌కు వున్నంత పట్టు ఏ పార్టీకి లేదు.
బిఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత మెదక్‌ ఎంపిసీటును ఎక్కువ సార్లు గెల్చుకున్న పార్టీ బిఆర్‌ఎస్‌. తెలంగాణవచ్చిన తర్వాత మూడుసార్లు కూడా బిఆర్‌ఎస్సే గెల్చుకున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్‌ బంపర్‌ మెజార్టీతో గెలిచారు. తర్వాత కూడా బిఆర్‌ఎస్‌ గెలుస్తూనే వచ్చింది. మెదక్‌ పార్లమెంటులో బిఆర్‌ఎస్‌కు తప్ప మరో పార్టీకి చోటు లేదు. ఎదుకంటే తెలంగాణ ఉద్యమ కారుడు, తెలంగాణ సాధకుడు, తెలంగాణ ప్రగతి ప్రధాత కేసిఆర్‌. ఆయన తెలంగాణ ఉద్యమం ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచే మొదలు పెట్టారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాను బిఆర్‌ఎస్‌కు కంచుకోటను చేశారు. గత శాసన సభ ఎన్నికల్లో కూడా మెజార్టీ సీట్లు బిఆర్‌ఎస్సే గెల్చుకున్నది. అందువల్ల మెదక్‌లో బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి వెంకట్రామ్‌రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు. అయితే మెదక్‌లో బిఆర్‌ఎస్‌ను ఎదుర్కొవడం ఏ పార్టీ వల్ల కాదు. అందువల్ల బిఆర్‌ఎస్‌ను మానసికంగా దెబ్బతీసే ఎత్తుగడంలో, వెంకట్రామ్‌రెడ్డి కొంత మంది ఉద్యోగులను కలవడం రాజకీయం చేశారు. ఆ కలయికపై ఎన్నికల సంఘానికి పిర్యాదు చేయడం వంటి, కుట్రలు చేశారు. ఎలాంటి విచారణ లేకుండానే, నిబంధనలు సరి చూసుకోకుండానే ఎన్నికల సంఘం కొంత మంది ఉద్యోగులను అప్పటికప్పుడు సస్పెండ్‌ చేయడం వంటి చర్యలు చకచకా జరిగిపోయాయి. ఆ సమయంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం తప్పని, చెప్పిన ఏకైక పత్రిక నేటిధాత్రి. ఉద్యోగులు ఓటర్లు కాదా…వారు సమావేశమయ్యే హక్కు లేదా? అంటూ నేటిధాత్రి కధనాలు రాసింది. నేటిధాత్రి వార్తను చూసిన ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. న్యాయం వారి పక్షాన వుంది. ఉద్యోగులకు శభవార్త అందింది. వారికి న్యాయం జరిగింది. దాంతో ఉద్యోగ వర్గాలు బిజేపికి, కాంగ్రెస్‌కు వ్యతిరేకమయ్యారు. ఆ వార్గలు బిఆర్‌ఎస్‌కు మరింత దగ్గరయ్యారు.
ఇక అటు మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌, ఇటు మాజీ మంత్రి హరీష్‌రావులకు మెదక్‌ జిల్లా మీద పూర్తి పట్టువుంది.
తెలంగాణ ఉద్యమానికి ముందు కేసిఆర్‌ మంత్రిగా వున్నప్పుడు మెదక్‌ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ది చేసేందుకు విశేష కృషి చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత అటు ముఖ్యమంత్రి కేసిఆర్‌, ఇటు జిల్లా మంత్రిగా హరీష్‌రావులు ప్రత్యేక దృష్టి పెట్టడంతో మెదక్‌ జిల్లా రూపు రేఖలే మారిపోయాయి. ఒకప్పుడు మెతకు కోసం అల్లాడిన మెదక్‌ జిల్లా అన్నపూర్ణగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. కనీసం కల కూడా కనలేదు. కాని మెదక్‌ జిల్లాను అన్ని రంగాలలో ముందు వరసలో నిలబెట్టిన ఘనత కేసిఆర్‌కు, హరీష్‌రావులకే దక్కుతుంది. అయితే కలెక్టర్‌గా ఉమ్మడి మెదక్‌ జిల్లా అభివృద్దిలో వెంకట్రామ్‌ రెడ్డి పాత్ర కూడా వుండడం విశేషం. దాంతో వెంకట్రామ్‌ రెడ్డి ఎక్కడికెళ్లినా ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మెదక్‌ జిల్లా నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే వుండడం గమనార్హం. అందులో సిద్దిపేట, గజ్వెల్‌, సంగారెడ్డి నియోజవర్గాలు మెదక్‌ పార్లమెంటు పరిధిలోనే వున్నాయి. ఈ మూడు నియోజకవర్గాలు బిఆర్‌ఎస్‌కు కంచుకోటలు. అందువల్ల వెంకట్రామ్‌రెడ్డి ఈ పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే కాదు..బంపర్‌ మెజార్టీ సొంతం చేసుకోబోతున్నారన్నవార్తలు వినిపిస్తున్నాయి. గత శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నమ్మినందుకు ప్రజలకు మూడు నెలల్లోనే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రజలే స్వయంగా ఆ విషయాలు మీడియాకు వివరిస్తున్నారు. బిఆర్‌ఎస్‌ అధికారుంలో వున్న కాలంలో, ముఖ్యమంత్రి కేసిఆర్‌ రెప్పపాటు కూడా కరంటు పోకుండా నిరంతరం విద్యుత్‌ ప్రసారం చేయడంలో విజయం సాదించారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా తెలంగాణలో ప్రసరించేంత నాణ్యమైన,నిరంతర కరంటు ఎక్కడా సరఫరా వుండదని అంతర్జాతీయ పత్రికలు కూడా శ్లాఘించాయి. కాని కాంగ్రెస్‌ ఫ్రభుత్వం తెలంగాణలో అదికారంలోకి వచ్చిన మరునాటి నుంచే కరంటు కోతలు మొదలయ్యాయి. సక్రమంగా కరంటు సరఫరా లేకపోవడం మూలంగా పంటలు కూడా ఎండిపోయినట్లు రైతులు ఆరోపించిన సందర్బాలున్నాయి.
ఒకనాడు మెతకు కూడా లేక అల్లాడిన మెదక్‌ జిల్లా నుంచి ఎంతో మంది పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
దేశ ప్రధానిగా పనిచేసిన ఇందిరాగాంధీ అమెధీలో ఓడిపోవడం వల్ల పోయిన పరువును కాపాడిని జిల్లా మెదక్‌. అప్పటి ఎంపి. బాగారెడ్డి తన సీటును త్యాగం చేసి, ఇందిరాగాంధీతో మెదక్‌ నుంచి పోటీ చేయించి గెలిపించారు. అయినా ఆమె మెదక్‌ను బాగు చేయలేదు. అలా కాంగ్రెస్‌ పార్టీ ఏనాడు మెదక్‌ జిల్లా ప్రగతిని కాంక్షించలేదు. తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిన కాంగ్రెస్‌కు తెలంగాణలో చోటు లేకుండా చేసి, తెలంగాణ రాష్ట్రం సాధించి, అభివృద్ది చేసిన నాయకుడు కేసిఆర్‌. దాంతో మెదక్‌ బిఆర్‌ఎస్‌కు పెట్టని గోడలా తయారైంది. హరీష్‌రావుకు పూర్తి బాధ్యతలు చేపట్టి, మెదక్‌నుంచి మరోసారి కారును గెలిపించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. వెంకట్రామ్‌రెడ్డికి తోడుగా విసృత ప్రచారం చేస్తున్నాడు. ప్రజలు కూడా వెంకట్రామ్‌రెడ్డిని అంతే విధంగా సాదర స్వాగతం పలుకుతున్నారు. ఆయనకు అభయమిస్తున్నారు. ఖచ్చితంగా గెలిపిస్తామని మాటిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే సాగు నీరివ్వక పదేళ్లు ఇబ్బంది లేని సాగును చిద్రం చేసింది కాంగ్రెస్‌. రైతును గోస పుచ్చుకున్నది కాంగ్రెస్‌. అందుకే మెదక్‌ ప్రజలు మరోసారి కారును పార్లమెంటుకు పంపించేందుకు సిద్దపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మిగతా రెండు పార్టీలు చేతులెత్తేశాయనే అంటున్నారు.

బిఆర్ఎస్ పార్టీ నుండి బిజెపిలో చేరిక

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రం నుండి బి ఆర్ ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా నులుగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి జాతీయ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితునై ఈరోజు బి ఆర్ఎస్ పార్టీ నుండి బిజెపి పార్టీలో చేయడం జరిగిందని మాతోపాటు జిందం సంతోష్ బిజెపి పార్టీలో చేరడం జరిగిందని బిజెపి పార్లమెంట్ అభ్యర్థి కరీంనగర్ ఎంపీ కండువా కప్పి బిజెపి పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ బండి సంజయ్ గెలుపు కోసం మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన సిసిసి నస్పూర్ కు చెందిన విద్యార్థులు

నస్పూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:

విద్యార్థి దశలో అతి ముఖ్యమైన ఘట్టమైనటువంటి ఎస్ఎస్ సి బోర్డ్ పరీక్షలు రాసిన విద్యార్థులందరూ ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రోజున వెలువడిన పదవ తరగతి ఫలితాలలో సిసిసి నస్పూర్ లోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.పట్టణ పరిధిలోని రేడియంట్ హై స్కూల్ విద్యార్థులు జక్కుల అక్షయ గౌడ్, గుమ్మడి మాధురి, ముత్యాల అక్షిత రెడ్డి, 10/10 జిపిఏ సాధించి మొదటి స్థానంలో నిలిచారు వారిని పాఠశాల కరస్పాండెంట్ చెన్నూరి అఖిల, ప్రిన్సిపాల్ రజని,రెయిన్ బో ప్లే స్కూల్ కరస్పాండెంట్ అమన్
ప్రసాద్ లు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాము,అమీన్, రవీందర్,సరస్వతి,జగన్, పిటి టీచర్ శ్యామ్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు,తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version