మంచిర్యాల,నేటి ధాత్రి :
మంచిర్యాల జిల్లా తాండూర్ ఐబి మండల కేంద్రంలో 138వ మేడే ఉత్సవాలను భగత్ సింగ్ భవన్ ముందు ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా సిపిఐ బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్ కార్మిక సోదరుల త్యాగానికి గుర్తుగా ఎగరేసే ఎర్రజెండాని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి కోండు బానేష్,
మాట్లాడుతూ అనాడు చికాగో నగరంలో ఎగసిన పోరు జెండా ప్రపంచ కార్మికులారా ఏకంకండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని ఉద్యమ నేత కార్ల్ మార్క్స్ ఇచ్చిన నినాదం ప్రపంచ కార్మికులను ఉత్తేజపరిచి పోరాటంలోకి మరింత ఉత్సాహంగా ముందుకు నడిపించిందని,1886 కు ముందు ప్రపంచ వ్యాప్తంగా 18 గంటలు,16 గంటలు పనిచేసే విధానాలు అమల్లో ఉండేవని, యజమానులు కార్మికుల శ్రమలను దోచుకునేవారని అన్నారు.ఈ దోపిడీ విధానం పోవాలంటూ ప్రపంచ కార్మికులు అన్ని దేశాల్లో పోరాటాలు మొదలుపెట్టారని, అమెరికా దేశంలో షికాగో నగరంలోని గనులలో ,కార్ఖానాల్లో పనిచేసే కార్మికులు తమకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలంటూ ధర్నాలు, సమ్మెలు మొదలుపెట్టారని, ఈ నేపథ్యంలో అక్కడి యజమానులు భూస్వాములు కలసి కార్మికులను పనికి తగిన వేతనం ఇవ్వకుండా వారిని పొట్టన పెట్టుకున్నారని, వందలాదిమంది కార్మికులను అక్కడి భూస్వాములు చంపివేశారని, ఆ రక్తపు మడుగులోంచి కార్మికులలో ఒకరు రక్తంతో తడిసిన తన చేతి రుమాలును తీసి కార్మిక జెండాగా పైకి ఎగరవేశారని, ఆనాటి నుండి మే 1ని ప్రపంచ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలిపారు. అనేక మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి శ్రమకు దోపిడికి మధ్య జరిగిన పోరులో విజయం సాధించారని, 1886 మే1 నుంచి ఎనిమిది గంటల పని విధానం అమల్లోకి వచ్చిందని మేడే రోజు అంటేనే కార్మికుల పండుగని, అన్ని వర్గాల కార్మికులు ఎంతో ఆనందంగా సంతోషంగా మేడే ఉత్సవాలను జరుపుకుంటారని, కార్మిక ఉద్యమంలో కార్మికుల హక్కులను నెరవేర్చేకునే క్రమంలో ప్రాణాలను కోల్పోయిన మన కార్మిక వీరులను తలుచుకొని వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, వారు చూపిన ఉద్యమ బాటలో ముందుకు సాగాలని, మన హక్కుల కోసం ఎంత కష్టమైనా పోరాడాలని, అందరం కలిసి ఐక్యమత్యంతో కూడి ఉండాలని తెలియజేశారు. అనంతరం కార్మికులందరూ పరస్పరం ఒకరికి ఒకరు మేడే శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.ఈ కార్యక్రమంలో గోలేటి బ్రాంచి ఏఐటియుసి ఉపాధ్యక్షుడు బయ్యా మొగిలి,మాదారం టౌన్ సిపిఐ కార్యదర్శి పట్టి శంకర్,మాదారం త్రీ ఇంక్లైన్ గ్రామ సిపిఐ కార్యదర్శి వాసాల నాగరాజు,తాండూర్ సిపిఐ గ్రామ కార్యదర్శి ఇందారపు రాజేష్,అచ్చులాపూర్ సిపిఐ గ్రామ కార్యదర్శి కొడిపాక భాస్కర్,మాదారం టౌన్ సహాయ కార్యదర్శి మలిశెట్టి సత్యనారాయణ,
పెటేటి కృష్ణమోహన్, సముద్రాల ఆనంద్, కరవేనా కల, పుప్పాల అంజయ్య, షరీఫ్, కార్మిక సోదరులు, తదితరులు పాల్గొన్నారు.