బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన 10వ వార్డు యువకులు

పరకాల నేటిధాత్రి


పరకాల మున్సిపాలిటీ చైర్ పర్సన్ అనిత రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున పదవ వార్డు కు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి పదవ వార్డ్ సోషల్ మీడియా అధ్యక్షులు చెరుకు నాగరాజు,తెలంగాణ జాగృతి అధ్యక్షులు చెరుకు సురేష్,తెలంగాణ రాష్ట్ర యూత్ నాయకులు ఏడ్ల అరవింద్ కుమార్,పెండెల భరత్ కుమార్,జీడిమెట్ల అనిల్ కుమార్,చెరుకు లక్ష్మణ్ తదితరులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పదవ వార్డు కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్,18వ వార్డు కౌన్సిలర్ ఏకు రాజు తదితరులు పాల్గొన్నారు.

భువనగిరిలో బీజేపీ జోరు!

– ప్రచారంలో దూసుకుపోతున్న బూర నర్సయ్య గౌడ్​


– 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కలియ తిరిగిన డాక్టర్​ సాబ్​

– బీసీలకు బలమైన సెగ్మెంట్​ కావడంతో పెరుగుతున్న గ్రాఫ్​

– మోడీ చరిష్మాతో పాటు ‘బూర’ కు వ్యక్తిగతంగా మంచిపేరు

– సుపరిచితుడు, సౌమ్యుడు నర్సయ్యకే ఓటంటున్న జనం

– భారీ మెజారిటీ ఖాయమంటున్న రాజకీయ విశ్లేషకులు

– కాంగ్రెస్​లో కోమటిరెడ్డి బ్రదర్స్​కు సహకరించని బీసీ క్యాడర్​?

– అభ్యర్థి కొత్త ముఖం కావడం కూడా హస్తం పార్టీకి అస్తవ్యస్తమే..

– సీఎం అనుచరుడు, అధికారం పేరుతో ‘చామల’ హల్​చల్​

– రసవత్తరంగా భువనగిరి పార్లమెంట్​ఎన్నికల పోరు

నేటి ధాత్రి, స్టేట్​ బ్యూరో:

భువనగిరి పార్లమెంట్​ నియోజకవర్గ పోరు హోరాహోరీగా ఉంది. బీజేపీ తరఫున బీసీ నేత, వివాదారహితుడు, సౌమ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్​బూర నర్సయ్య గౌడ్, అధికార కాంగ్రెస్​పార్టీ తరఫున సీఎం సన్నిహితుడు, యువకుడు చామల కిరణ్​కుమార్​రెడ్డి, బీఆర్ఎస్​నుంచి మరో బీసీ వర్గానికి చెందిన సీనియర్​ నేత క్యామ మల్లేశ్​ఉండడంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. ఆర్థిక, అంగ బలం ఉన్న నేతలు పోటీ పడుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తెలంగాణ సాయుధ పోరాటం నాటి చారిత్రక ప్రాంతాలు కలగలిసిన ప్రాంతంగా భువనగిరికి పేరుంది. ఈ లోక్​సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో విస్తరించి ఉన్న ఇబ్రహీంపట్నం, మునుగోడు, నకిరేకల్​, ఆలేరు, భువనగిరి, జనగామ, తుంగతుర్తి ఏడు సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ అన్ని నియోజకవర్గాల్లో కలిపి సుమారు 18 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. భువనగిరి నియోజకవర్గానికి ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరగగా.. రెండు సార్లు కాంగ్రెస్​, ఒక సారి బీఆర్ఎస్​పార్టీలు గెలుపొందాయి. ఈ సారి జరగబోయే ఎన్నికల్లో ఏదేమైనా భువనగిరి కోటపై కాషాయం జెండా ఎగరేయాలని బీజేపీ కంకణం కట్టుకుని ఉండగా.. పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్​, బీఆర్ఎస్​సీరియస్​గా ప్రయత్నిస్తున్నాయి. తమ బలమెంతో నిరూపించుకుంటామని సీపీఎం కూడా భువనగిరిలో బరిలో నిలిచింది.

తెలంగాణ ఉద్యమ నాయకుడిగా పేరు..
బూర నర్సయ్య డాక్టర్ ​గానే కాకుండా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యమకారుడిగా చెప్పొచ్చు. ఉద్యమంలో భాగంగా ఆయన ‘డాట్స్’ అనే పేరిట తెలంగాణ రాష్ట్ర వైద్యులు సంఘాన్ని స్థాపించారు. రాస్తారోకో, మిలియన్ మార్చ్, సాగర హారం, రైల్ రోకో, అసెంబ్లీ ముట్టడి లాంటి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో ఆయన రెండుసార్లు అరెస్టు అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో గాయపడిన లేదా చికిత్స అవసరమైన అనేక మందికి వృత్తిపరమైన సహాయం అందించారు. ఉద్యమ సమయంలోనే ఆయన తెలంగాణ హెల్త్ బ్లూ ప్రింట్ రూపొందించారు.

బోణీ కొట్టాలని బీజేపీ ప్రయత్నం..
బీజేపీ మూలాలు బలంగా ఉన్న భువనగిరిలో ఈసారి ఏదేమైనా గెలిచి తీరాలని బీజేపీ ఉంది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా విజయం సాధించిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా 2021లో బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. నర్సయ్యగౌడ్ కు మాజీ ఎంపీగా, వివాదరహితుడిగా, నియోజకవర్గంలో సుపరిచితుడిగా పేరుంది. అదే విధంగా ఆయన గతంలో ఈ నియోజకవర్గానికి చేసిన సేవలు కూడా ఆయనకు కలిసొచ్చే అవకాశం ఉంది. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎయిమ్స్​ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఫండ్స్​తేవడంలో కూడా సక్సెస్​అయ్యారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసమే కమిట్మెంట్ ​ఉన్న నేత..
గతంలో నర్సయ్యగౌడ్​ ఎంపీగా ఉన్న సమయంలో భువనగిరి పార్లమెంట్​ అభివృద్ధి కోసం ఒకానొక సందర్భంలో నాటి సీఎం కేసీఆర్​నే విభేదించిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భంగానే కేసీఆర్​ నర్సయ్యగౌడ్​కు ప్రియారిటీ తగ్గించారనే వార్తలు కూడా వచ్చాయి. తన ప్రాంత అభివృద్ధిపై ఆయన ఎక్కడా రాజీ పడకుండా అవసరమైతే పార్టీ మారారు తప్పా.. కేసీఆర్ కు మోకరిల్లలేదు.

పార్టీతో పాటు వ్యక్తిగతంగా మంచిపేరు..
క్షేత్రస్థాయిలో ఓటర్లతో ఉన్న సంబంధాలు ఆయనకు అదనపు బలంగా చెప్పవచ్చు. ప్రధాని మోడీ చరిష్మా, నర్సయ్య గౌడ్ కు గతంలో ఎంపీగా ఉన్న పరిచయాలు, లోక్​సభ నియోజకవర్గంలో 2లక్షలకు పైగా ఉన్న ఆయన సామాజిక వర్గం గౌడ్స్ ఓట్లు గంపగుత్తగా పడే అవకాశం ఉంది. దీంతో నర్సయ్య గౌడ్​ భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది.

కాంగ్రెస్​లో లుకలుకలు బూరకు మేలే..
ఎంపీ ఎన్నికల షెడ్యూల్​కు ముందు సిట్టింగ్​ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి బీసీ సామాజిక వర్గానికి చెందిన స్థానిక నేతను భువనగిరి ఎంపీ అభ్యర్థిగా నియమించి గెలిపిస్తానని శపథం చేశారు. దీంతో సదరు బీసీ నాయకుడు తన అనుచరులతో అంతా ఎన్నికలకు సిద్ధం చేసుకున్నారు. కానీ సీఎం రేవంత్​రెడ్డి అనుయాయుడు అయిన చామల కిరణ్​కుమార్​రెడ్డిని క్యాండిడేట్​గా ప్రకటించారు. అభ్యర్థిని ప్రకటించిన తొలిదశలో కోమటిరెడ్డి బ్రదర్స్ అసహనానికి గురయ్యారన్న వార్తలు వచ్చాయి. తమ ఇలాఖాలో రేవంత్​రాజకీయం ఏందని పార్టీ అంతర్గతంగా చర్చ జరిగినట్లు కూడా తెలిసింది.

హోంమంత్రి పదవి ఎరతో దారికి..!
రాష్ట్రంలో కాంగ్రెస్​ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సీఎం రేవంత్​రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సఖ్యతతోనే ఉన్నా.. రాజగోపాల్​రెడ్డి మాత్రం గ్యాప్​మెయింటైన్​చేస్తూనే వచ్చారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి విషయంలో ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్​రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ఇంటికి వెళ్లడంతో ఆయన పూర్తిగా మారిపోయారు. హోంమంత్రి పదవి ఇవ్వాలని పట్టుబట్టిన రాజగోపాల్​కు ఏదో ఒక మంత్రి పదవి ఇస్తానని సీఎం హామీ ఇవ్వడంతో.. పరిస్థితులు మారిపోయాయని కోమటిరెడ్డి అనుచరులే చెప్పడం గమనార్హం. దీంతో ఆయన భువనగిరిలో కిరణ్​కుమార్​రెడ్డి గెలుపు బాధ్యతలు తీసుకున్నాడని తెలుస్తోంది. శాసన సభ ఎన్నికలకు, లోక్ సభ ఎన్నికలకు తేడా ఉంటుంది. కేంద్రంలో బీజేపీ మరో సారి అధికారంలోకి వస్తుందన్న వాదనను బీజేపీ బలంగా వినిపిస్తోంది. ఏదేమైనా బీజేపీ అభ్యర్థి గెలుపు ఖాయమన్న టాక్​రోజు రోజుకు పెరుగుతోంది.

That is the power of KCR!

 

· Entry of KCR create ague in those two parties

· Those two parties suffering with ague even in mid summer

· They are in the fear of KCR

· Not in a position to go against KCR

· The present trend of KCR creating fear of identity among parties

· The two parties united against KCR in one issue

· They made Election Commission to issue notices to KCR

· Andhra media entry in the bustle of elections

· Andhra media malice against Telangana

· Yellow media creating confusions in the state

· It want political instability in Telangana

· Election Commission banned KCR campaign for 48 hours

· What about the comments made by Revanth Reddy?

· Yellow media baseless allegations

· Playing tricks in the name of pre-pole survey

· Those who have no face now giving their entry

· They don’t want BRS to strengthen

· If BRS gain, they can’t play their games

· Telangana people enlightenment is like stormy wind

· Those who deceived will get suitable reply

The breath and roar of a lion is frightful. Nobody can withstand the roar of KCR. The entry of KCR in election campaign has creating flutter among other parties. Even in hot summer Congress and BJP are suffering with ague with KCR strategy. KCR words are such powerful that directly touch the hearts of Telangana people. All the people used to look forward for KCR. What BRS workers say is the re-entry of KCR is making total plans of other parties to become topsy-turvy and they are not in a position to withstand the forceful election strategy of BRS boss. The dialect of Telangana used by KCR attracts the masses not only in the state but also people in foreign countries. His speaking has such attractiveness that makes everybody to stand and listen carefully what he is saying. This creates flutter among opponent parties because of fear of losing votes. Now this same fear made BJP and Congress to make complaint to Election Commission against KCR comments those had said to have made during election campaign on 5th, April in Sirisilla. Accepting this complaint Election Commission issued orders against KCR campaign for 48 hours. If you observe, in one angle it became helpful for KCR because he got sufficient time to understand the political situation in entire state. Based on the understanding, he can change or continue his strategy in these elections. At the same time he could asses where his presence is needed. For Telangana people KCR is not only strength but also a weakness. Telangana masses never stay away without looking KCR. They always attract towards his speeches. This is the main reason for large folk of masses presence in the campaign meetings of KCR. Now KCR has been conducting his campaign through his bus tour. When heard about the KCR bus arrival, people of that particular region are gathering in large number and waiting for him hours together not at all caring the scorching sun. If he conducts his meeting at cross roads, people used to climb nearby trees and buildings to look at their beloved leader. They are giving slogans in favour of Telangana and BRS. This shows the real intention of people for KCR to regain power. This has been giving great strength for KCR which create fear among Congress party fold. They fell in utter confusion on what to do? How to resist KCR? Finally even though Congress and BJP are rivals to each other, they get united on this point and made a complaint against BRS boss. Their intention might have to get some fetching by stopping KCR for some period. This is the best example for how KCR impact is being worked on people?
Congress and BJP never expected that KCR will take Parliament elections in such seriousness. Just by attracting the BRS leaders is enough to damage the confidence of KCR, they felt. At the same time they wanted to fell KCR in defence and further strengthen their position in the state. Unfortunate for them is that, when KCR launched his campaign, they realised the fact that charisma of KCR left intact. This made them to fell in utter dilemma and not in a position to resist KCR who is moving forward in strategic way. Till sometime back BJP and Congress continued to ridicule KCR for not attending Assembly and not appearing before the people. ‘Netidhatri’ already told that the silence of KCR is more dangerous for other parties. Now that became true. Without understanding this, both parties incited KCR and now facing the result for their previous attitude. Their strong opinion was that, KCR never come before the people because of his strong feeling of self-respect. At the same time defeat in the elections makes him to retrospect himself that not allow him to come outside. All these expectations proved to be false with the entry of KCR into election campaign. They forget one point that KCR remain an icon of Telangana people’s self-respect. When people are facing problems KCR never sit ideal. The prevailing water and current problems never allow him to sit in alone and make him to come back to fight against such adversities. Without proper understanding on the psychology of KCR, Congress and BJP incited him and wanted to ridicule him showing his defeat in previous Assembly elections. For their unfortunate they fell in their own trap. This was never expected by them. The whirlpools created by KCR will definitely dismantle their bases in the state.
Everybody knows well that when KCR steps out, how the situation takes the twists and turns. Keeping this in mind some TV channels now began to spill venom on KCR. They are propagating that KCR road shows are utter failure. One media business personality who was in hide since ten years came back to continue his propaganda against KCR. Now elections will be held in both Telugu states. Unfortunately that media boss totally concentrated on Telangana by neglecting Andhra politics. Suddenly he began to show his interest on Telangana in the form of pre-poll survey. With this act he has been showing his favouritism towards BJP and Congress. He doesn’t bother about the plights of Telangana farmers and never care about prevailing water problem in the state. Now groundwater tables gradually have been depleting. Crops are in drying up condition. Farmers are in great dilemma about their future. He is not coming forward to telecast stories on such problems. Andhra media showing its delirium on power cuts and have been showing it as accepted by Telangana people. This media is saying that the results will be in favour of National parties in the state. Like that this media wants to turn the opinion of people into topsy-turvy. On the other side, KCR bus tour is being continuing in irresistible manner. In rural areas there is tremendous response for BRS boss. People in villages already in discussion about their problems those never faced in ten years of KCR rule. They also continue their rebuke against Congress that caused them to fell in plights of fifty years back!
Congress came to power with false assurances those can’t be fulfilled. They are getting realised that Congress has deceived them. They also turned against BJP. All this change of state among people is not being acceptable to Andhra media. So it has been trying its level best to belittle BRS by spilling venom on Telangana showing its hypocrisy. Being enlightened Telangana people never heed to such negative propaganda. They never rejected KCR but wanted to give a chance to Congress relaying on its assurances. They are not against KCR rule. BRS boss only can save the Telangana. He is only the reliable leader who can save the interests of the state and people and always wishes its growth. He has the capacity to make the state stand in top position. This is the reason behind the positive response coming from the people for KCR road shows. He remains the strength of the state and also becomes the brand of Telangana.

భద్రత చర్యల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదు

భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్ల, మే – 2(నేటి ధాత్రి):
రాష్ట్ర ముఖ్యమంత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా గురువారం రోజున సాయంత్రం పోలీస్ అధికారులతో కలసి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి, భద్రతా చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బందోబస్తు పరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.భద్రత చర్యల్లో ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని సూచించారు. అనంతరం బహిరంగ సభాస్థలి, ముఖ్యమంత్రి ప్రయాణించే రూట్ మ్యాప్, హెలిప్యాడ్, వి ఐ పి పార్కింగ్, ట్రాఫిక్ రూట్లు సభాస్థలికి వచ్చి వెళ్లే దారులు , జనరల్ పార్కింగ్ ప్రదేశాలను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఎస్పీ వెంట ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు చంద్రశేఖర్ రెడ్డి, మురళి కృష్ణ, సి.ఐ లు రఘుపతి, అనిల్ కుమార్, శ్రీనివాస్, శ్రీనివాస్, ఎస్.ఐ లు సిబ్బంది ఉన్నారు.

మీ సేవకుడిగా ఉంటా..వెంకటరామిరెడ్డి

మెదక్ ఎంపి అభ్యర్థి వెంకట్ రామా రెడ్డికి మద్దతుగా నర్సాపూర్ నియోజకవర్గం, డౌల్తాబాద్ లో నిర్వహించిన రోడ్ షోలో మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్…

తెలంగాణ భవిష్యత్తుకు జరుగుతున్న ఎన్నికలు ఇవి.

కేవలం పదవుల కోసం, పార్టీల కోసం జరుగుతున్న ఎన్నిక కాదు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది. ఎన్ని హామీలు అమలు చేసింది.

2 లక్షల రుణమాఫీ చెయ్యలేదు.
రైతు బంధు 10 వేలు చెయ్యలేదు


కల్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు.
4000 పింఛన్లు ఇవ్వలేదు.


పంటకు 500 బోనస్ అన్నారు

మదన్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ లో చేరారు.
రైతులను రేవంత్ రెడ్డి మోసం చేసినందుకు కాంగ్రెస్ లో కలిశావా..

పంట కొనుగోలు ఎందుకు చెయ్యడం లేదు.
రైతుల జీవితాలతో ప్రభుత్వం ఎందుకు ఆడుకుంటున్నది.

కాంగ్రెస్ ను నిలదీయాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో కారును గెలిపించాలని కోరుతున్నా.

గుంపు మేస్త్రి గూబ పగిలేలా తీర్పు ఇవ్వాలి.

కాంగ్రెస్ హామీలు మాట తప్పింది.
బాండ్ పేపర్ బౌన్స్ అయ్యింది. వారికి శిక్ష పడాల్సిందే.

రేవంత్ రెడ్డి బిజెపి తో చేతులు కలిపాడు.

బిజెపి ధరలు పెంచింది. జీఎస్టీ పెంచింది.
గ్యాస్ ధరలు పెంచింది కెసిఅర్.

రేవంత్ రెడ్డికి అహంకారం వచ్చింది.

కేసీఆర్ గారూ ప్రజల తరుపున హామీల గురించి నిలదీస్తే.

కేసీఆర్ నీ చెడ్డి ఊడగొడుతా అంటున్నాడు.

ముఖ్యమంత్రి హోదాలో ఉండి అలా అంటారా

చెప్పుతో రైతులను కొడుతా అన్నందుకు మదన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిండా

కష్టకాలంలో కేసీఆర్ ను వదిలిపెట్టడం న్యాయమా.

ఇద్దరం దోస్తులం అని చెబుతున్నాడు.
రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే కేసీఆర్ ను వదిలి వెళ్ళిండు.

బిజెపి అభ్యర్థి మాటలను ప్రజలు నమ్మరు.

వెంకట్రామ రెడ్డి మంచి వ్యక్తి.

ఆస్తులు పెంచుకునేందుకు ఆయన రాజకీయాల్లోకి రాలేదు.

కుటుంబ ఆస్తులు పంచుకునేందుకు వచ్చాడు.

వెంకట్రామ రెడ్డి కామెంట్స్……

నేను మీ కలెక్టర్ వెంకట్రామ రెడ్డిని. 11 సంవత్సరాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో పీడీగా, జాయింట్ కలెక్టర్ గా, కలెక్టర్ గా వివిధ హోదాల్లో మీకు సేవ చేసే భాగ్యం కలిగింది.

మీ ఆదరణను, ఆప్యాయతను ఎప్పటికీ మరిచిపోలేను. మీ సేవకుడిగా, మీలో ఒకడిగా ఉండాలని మీ ఆశీర్వాదం కోరుతూ మెదక్ ఎంపీగా మీ ముందుకు వస్తున్నాను.

ఉమ్మడి మెదక్ ప్రజల రుణం తీర్చుకోవాలనే సదుద్దేశ్యంతో, నా తల్లి, అన్నదమ్ముల ఉమ్మడి కుటుంబ ఆస్తి నుంచి రూ. 100 కోట్లతో వెంకటరామ రెడ్డి ట్రస్టు ద్వారా సేవలందిస్తానని హామీ ఇస్తున్నాను.

పేద పిల్లలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల శిక్షణ, యువతకు స్కిల్ డెవలప్మెంట్, మహిళా సాధికారత కోసం కార్యక్రమాలు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను.

10 లక్షల ప్రమాద బీమా అందరికీ చేయిస్తాను.

నిబద్ధత కలిగిన అధికారిగా, పేదలకు సేవ చేసిన వ్యక్తిగా ఉమ్మడి మెదక్ ప్రజలకు నా జీవితం తెరిచిన పుస్తకం. మరోసారి మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని, మీ ఎంపీగా నన్ను దీవించాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను.

దటీజ్‌ ‘‘కేసిఆర్‌’’ పవర్‌.

https://epaper.netidhatri.com/view/252/netidhathri-e-paper-3rd-may-2024%09/2

‘‘కేసిఆర్‌’’ రాక…ఆ రెండు పార్టీలకు కాక!

`ఎండా కాలంలో ఆ రెండు పార్టీలకు చలి జ్వరం!

`కేసీఆర్‌ రాకతో పట్టుకున్న భయం!

`కేసీఆర్‌ ఉక్కపోతను భరించలేని ధైన్యం!

`తమ ఉనికి ప్రశ్నార్థకమని రెండు పార్టీల ఆగమాగం!

`ఈసీతో నోటీసులకు ఒక్కటైన రాజకీయ విజాతి ద్వయం.

`సందిట్లో సీమాంధ్ర మీడియా సడే మియా!

`తెలంగాణ మీద సీమాంధ్ర మీడియా అక్కసు!

`తెలంగాణపై మళ్ళీ పచ్చ మీడియా చిచ్చు?

`తెలంగాణ రాజకీయాలలో అస్థిరతే ఉచ్చు?

`ఎన్నికల సంఘం అత్యుత్సాహం?

`కేసీఆర్‌ ప్రచారంపై నిషేదం!

`ఓ కులాన్ని కించపర్చిన వ్యక్తి అసభ్యతపై కేసిఆర్‌ ప్రశ్నస్తే తప్పా?

`సీఎం. రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సబబా?

`మళ్లీ పచ్చ మీడియా పిచ్చి వేషాలు?

`కేసీఆర్‌ భాష మీద అవాకులు చెవాకులు?

`తెలంగాణలో ప్రీ పోల్‌ సర్వేల పేరుతో మభ్యపెట్టడాలు?

`ఇంత కాలం ముఖం లేని వాళ్లు కూడా వస్తున్నారు?

`తమ రాజకీయ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు?

`బీఆర్‌ఎస్‌ బలపడడం వారికి ఇష్టం లేదు?

-బీఆర్‌ఎస్‌ పుంజుకుంటే వారి పప్పులుడకవు?

-ఇంత కాలం కలుగులో దాక్కున్న ఎలుకలు కూడా తోకలెత్తుతున్నాయి?

-తెలంగాణ ప్రజల చైతన్యం ఒక ప్రభంజనం.. దానికి కేసీఆర్‌ రాజకీయం తోడైతే విశ్వరూపం.

-నమ్మించి మోసం చేసిన వారికి ఈ ఎన్నికలలో తప్పదు గుణపాఠం!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

సింహం శ్వాస, గర్జన భయంకరమైనవి. కేసిఆర్‌ సింహ గర్జన ఎవరూ తట్టుకోలేనిది. కేసిఆర్‌ రాకతో జాతీయ పార్టీల శిబిరాలు కకావికలమౌతున్నాయి. ఊపిరాడకుండా పోతున్నాయి. ఎండా కాలంలో కూడా కేసిఆర్‌ను చూస్తే కాంగ్రెస్‌, బిజేపిలకు చలి జ్వరం వస్తోంది. ఇది బిఆర్‌ఎస్‌ శ్రేణులు అంటున్న మాట. ఒక్కసారి కేసిఆర్‌ రంగంలోకి దిగిన తర్వాత ఇతర పార్టీలకు తావుండదు. తెలంగాణ రాజకీయాల్లో చోటుండదు. నిజం చెప్పాలంటే కేసిఆర్‌ మాటలకు ఎప్పుడూ పదునెక్కువ. కేసిఆర్‌ చెప్పే మాటలుకు తెలంగాణ ప్రజల్లో క్రేజ్‌ ఎక్కువ. ఒక్కసారి కేసిఆర్‌ కనిపిస్తే చాలు… ఆయన మాట వినిపిస్తే చాలు అనుకునేవారు చాలా మంది వున్నారు. అది తెలంగాణలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ తెలుగువాళ్లునా, అక్కడ కేసిఆర్‌ మాట్లాడుతుంటే వింటుంటారు. ఆయన మాటలను ఎంతో ఇష్టపడతారు. ఆయన చెప్పే మాటలు సావదానంగా వింటారు. ఆయన వాడే పంచాంగమంతా గ్రాంధికంలోనే వుంటుంది. కాని అవి ఊర మాస్‌కు కూడా మంచి కిక్కిస్తాయి. అందుకే ఆ మాటలను తట్టుకోలేక రాజకీయ పార్టీలు విలవిలలాడుతుంటాయి. నాయకులు కలవరపడుతుంటారు. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. ఎప్పుడో ఎప్రిప్‌ 5న కేసిఆర్‌ సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌, బిజేపిలు ఎన్నికల కమీషన్‌కు పిర్యాధు చేశాయి. ముందూ వెనుక ఆలోచించుకోకుండా ఎన్నికల కమీషన్‌ 48 గంటల పాటు కేసిఆర్‌ ప్రచారం చేయొద్దని నోటీసులిచ్చింది. ఇది ఒక రకంగా కేసిఆర్‌కు ఎంతో మేలు చేసే అంశమే. అసలు తెలంగాణలో రాజకీయ ముఖచిత్రమేమిటో పూర్తిగా తెలుసుకునే అవకాశం ఏర్పడిరది. ఎక్కడెక్కడ పార్టీకి కేసిఆర్‌ అవసరం ఎక్కువ వుంటుందో కూడా తెలుస్తుంది. తెలంగాణ ప్రజలకు కేసిఆర్‌ ఒక బలమే కాదు, బలహీనత కూడా…ఎందుకంటే కేసిఆర్‌ మాటలు వినికుండా తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం వుండలేదు. కేసిఆర్‌ను చూడకుండా ఎక్కువ కాలం ఓపిక పట్టలేరు. అందుకే కేసిఆర్‌ ప్రజల్లోకి వస్తున్నాడంటే ప్రజలు తండోపతండాలు వస్తున్నారు. చీమల దండులాగా రోడ్ల నిండా నిండుతున్నారు. కేసిఆర్‌ బస్సుయాత్ర సాగుతున్న ప్రాంతాలను చుట్టు ముడుతున్నారు. ఎక్కడికక్కడ స్వచ్చందంగా జనం కేసిఆర్‌ ను చూడాలని వస్తున్నారు. ఆయన మాటలు వినాలని మండుటెండలను సైతం లెక్క చేయడంలేదు. ఆయన కోసం గంటలు గంటలు ఎదురు చూస్తున్నారు. కేసిఆర్‌ రోడ్‌ షోల వెంట పరుగులు తీస్తున్నారు. నాలుగు కూడళ్లలోసభలు పెడితే, చెట్లెక్కి కూర్చుంటున్నారు. ఇండ్లపైకెక్కి చూస్తున్నారు. కేసిఆర్‌ను చూసి పరవశంతో ఊగిపోతున్నారు. కేసిఆర్‌ మళ్లీ రావాలని ఆగకుండా నినాదాలు చేస్తున్నారు. కేసిఆర్‌కు కొండంత బలాన్నిస్తున్నారు. ఇది చూసిన కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి. బిజేపికి కాళ్లూ చేతులు వణుకుతున్నాయి. ఏం చేయాలో పాలుపోకుండా కేసిఆర్‌ మీద పిర్యాధు చేశాయి. ఒక్కగంటైనా సరే కేసిఆర్‌ మాట వినపడకుండా చేస్తే ప్రజలు మా గురించి ఆలోచిస్తారేమో? అన్న ఆశతో కాంగ్రెస్‌,బిజేపిలున్నాయి. అంతగా ప్రజలను ప్రభావితం చేస్తున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌.
పార్లమెంటు ఎన్నికలను కేసిఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాడని కాంగ్రెస్‌, బిజేపిలు ఊహించలేదు.
బిఆర్‌ఎస్‌ నాయకులను లాక్కుంటే కేసిఆర్‌ డైలమాలో పడతాడనుకున్నారు. కేసిఆర్‌ను డిఫెన్స్‌లో పడేసి, తేరుకునే లోపు దెబ్బ కొట్టాలని కాంగ్రెస్‌, బిజేపిలు చూశాయి. కాని కేసిఆర్‌ ఛరిష్మా ముందు ఎలాంటి కుప్పిగంతులు పనిచేయవని కాంగ్రెస్‌, బిజేపిలు తెలుసుకోలేకపోయాయి. ఇప్పుడేం చేయాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నాయి. గత కొంత కాలం క్రితం వరకు అటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇటు బిజేపి నేతలు కేసిఆర్‌ను రా..రమ్మంటూ పిలిచాయి. కేసిఆర్‌ అసెంబ్లీకి రావడంలేదు. ప్రజలకు కనిపించడం లేదు. టివిల్లో కూర్చుంటున్నాడు? అంటూ ఏద్దేవా చేశాయి. కేసిఆర్‌ మౌనం కూడా ఒక ప్రళయం లాంటిదని నేటిధాత్రి గతంలోనే చెప్పింది. కేసిఆర్‌ మౌనంగా వున్నారంటే రాజకీయ సునామీ సృష్టించినట్లే అన్నది నేటి ధాత్రి స్పష్టంగా చెప్పింది. అయినా కాంగ్రెస్‌, బిజేపిలు రెచ్చగొట్టాయి. ఇప్పుడు ఆయన బైటకొస్తే తట్టుకోలేకపోతున్నాయి. కేసిఆర్‌ చాణక్యం తెలిసినా, ఆయనను తక్కువ అంచనా వేశారు. ఓడిపోయిన తర్వాత కేసిఆర్‌ అంతర్మధనంలో వుంటారు. జనంలోకి రావాలంటే ఇబ్బందిపడతారు. ఆయనకు ఆత్మాభిమానం ఎక్కువ. అందుకే బైటకు రాకపోవచ్చు..అంటూ ఏదేదో ఊహించుకున్నారు. నిజానికి తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకే కేసిఆర్‌. అలాంటప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ వుంటాడా? సమస్యలు ఎదుర్కొంటుంటే నాకెందుకులే అనుకుంటాడా? మంచినీటికి సైతం విలవిలలాడుతుంటే కేసిఆర్‌ మౌనంగా వుండగలరా? బైటకు వచ్చి గర్జించకుండా వుంటారా? ఆ మాత్రం అవగాహన లేకుండా కాంగ్రెస్‌, బిజేపిలు అనవసరంగా కేసిఆర్‌ను ఉచ్చులోకి లాగుతున్నామనుకున్నాయి. కాని పద్మవ్యూహంలో ఆ పార్టీలే చిక్కుకుంటాయని ఊహించలేపోయాయి. కేసిఆర్‌ రేపే సుడిగుండాలు, కాంగ్రెస్‌, బిజేపిల రాజకీయ పునాదుల పెలికిస్తాయని అనుకోలేదు.
ఇదిలా వుంటే కేసిఆర్‌ బైటకు వస్తే ఎలాంటి రాజకీయ సునామీ వస్తుందో..అందరికీ తెలుసు.
ఎక్కడ మత మనుగడ ప్రశ్నార్ధకమౌతుందో అని ఆందోళనలో పచ్చ ఛానళ్లు కేసిఆర్‌ మీద విషాన్ని చిమ్ముతున్నాయి. అసలు కేసిఆర్‌ రోడ్‌ షోలకు జనమే రావడం లేదంటూ సొల్లు పురాణాలు వల్లిస్తున్నాయి. దానికి తోడు పదేళ్లగా మీడియా ముందుకు రావడానికి జంకిన ఓ మీడియా వ్యాపార వేత్త బాస్‌ఈస్‌ బ్యాక్‌ అని తెరమీద వచ్చాడు. తెలంగాణ బాస్‌ కేసిఆర్‌ మీద విషం చిమ్మే ఎత్తుగడ వేశాడు. ఓ వైపు ఆంధ్ర ప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు కలిసి జరుగుతుంటే అక్కడి ఎన్నికల మీద పట్టింపు లేదు. కాని ఆ వ్యక్తికి తెలంగాణ మీద పుటుక్కున ఆసక్తి పుట్టుకొచ్చింది. తెలంగాణలో సర్వే పేరుతో జాతీయ పార్టీలకు భజన చేసేందుకు వచ్చాడు. తన వెనుకటి బుద్ది చూపించుకున్నాడు. తెలంగాణలో రైతు సమస్యలు పట్టలేదు. రైతులకు ఈ సారి సరిగ్గా నీళ్లందలేదు. తెలంగాణ భూగర్భ జాలాలు ఎండిపోయాయి. పదేళ్లపాటు రెప్పపాటు కరంటును అనుభవించాడు. ఇప్పుడు మళ్లీ కరంటు కోతలు చూస్తున్నాడు. కాని దానిపై వార్తలు ప్రసారం చేయడానికి వెనుకాడుతున్నాడు. ప్రజలు ఉక్కపోతలను భరించేందుకు సిద్దంగా వుందనుకున్నాడో ఏమో! కరంటు కోతలను ప్రజలు స్వీకరిస్తున్నట్లుగా సీమాంద్ర మీడియా పైత్యం కనిపిస్తోంది. అందుకే తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ పార్టీలకు అనుకూలమంటూ వాళ్లు వేసుకున్న లెక్కలు చెబతున్నారు. జనం వేసుకుంటున్న లెక్కలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు కేసిఆర్‌ బస్సు యాత్ర ప్రభంజనంలా సాగుతోంది. జనమంతా కేసిఆర్‌ను కీర్తిస్తున్నారు. పదేళ్ల కాలాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఐదునెలల్లోనే యాభై ఏళ్లు గోస కాంగ్రెస్‌ చూపిస్తుందని పల్లెల్లో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇవి మాత్రం సీమాంద్ర మీడియాకు కనిపించడం లేదు.
కాంగ్రెస్‌ పార్టీ నోటికొచ్చినట్లు చెప్పిన అబద్దాలను చెప్పింది.
వాటిని నమ్మినందుకు ఇంత మోసపోతామని అనుకోలేదని పల్లె జనం గొంతెత్తుతున్నారు. కాంగ్రెస్‌ను తిడుతున్నారు. బిజేపిని తూర్పారపడుతున్నారు. కేసిఆర్‌కు జై కొడుతున్నారు. కేసిఆర్‌కు జేజేలు పలుకుతున్నారు. ఇది సీమాంధ్ర మీడియా సహించలేకపోతోంది. జీర్ణించుకోలేకపోతోంది. ఎలాగైనా బిఆర్‌ఎస్‌ తక్కువ చేసేందుకు పడరాని పాట్లు పడుతోంది. తిన్నింటి వాసాలు లెక్కపెడుతోంది. తెలంగాణ మీద మళ్లీ విషం కక్కుతోంది. తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యవంతులో తెలుసు. అయినా సీమాంద్ర మీడియా మళ్లీ మేకవన్నె పులి వేషం వేస్తోంది. కాంగ్రెస్‌ చెప్పిన అబద్దాలు నిండిన కొన్ని హమీలు ప్రజలను ఆకర్షించాయి. దాంతో ప్రజలు కాంగ్రెస్‌ వైపు మొగ్గారు. అంతే తప్ప కేసిఆర్‌ను కాదనుకోలేదు. కేసిఆర్‌ పాలన వద్దనుకోలేదు. కాని కేసిఆర్‌ మాత్రమే తెలంగాణను బాగు చేయగలడు. కేసిఆర్‌ మాత్రమే తెలంగణను కాపాడగలడు. కేసిఆర్‌ మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసం పాకులాడగలడు. కేసిఆర్‌ మాత్రమే తెలంగాణ ప్రగతిని కాంక్షిస్తాడు. తెలంగాణను అభివృద్ది పధంలో నడుపుతాడు. దేశంలోనే తెలంగాణను అగ్రస్ధానంలో నిలుపుతాడు. ఇది మళ్లీ ప్రజలు తెలుసుకున్నారు. కేసిఆర్‌ రోడ్‌షోలకు బ్రహ్మరధం పడుతున్నారు. చిన్నా,చితక, ముసలీ, ముతక అందరూ కేసిఆర్‌ను చూసేందుకు ఎగబడుతున్నారు. జై కేసిఆర్‌,జైజై కేసిఆర్‌ అని దిక్కులు పిక్కటిల్లేలా జేజేలు పలుకుతున్నారు. దటీజ్‌ పవర్‌ ఆఫ్‌ కేసిఆర్‌. దటీజ్‌ వాల్‌ ఆఫ్‌ తెలంగాణ కేసిఆర్‌. కేసిఆర్‌ బ్రాండ్‌ ఆప్‌ తెలంగాణ…

రిజర్వేషన్ లను కల్పించిన పార్టీ బిజెపి పార్టీ

– పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బిజెపి
– సిరిసిల్ల జిల్లా ఉంటుందా పోతుందా తెలపాలి
– బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి
రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, మే – 2(నేటి ధాత్రి):
గత అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ బిజెపి ఒక్కటని ప్రచారం చేసి అధికారం లోకి వచ్చాం అని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా అధికారం లోకి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ లను తొలగిస్తుందని ఒక అంశం తెర మీధకు తెస్తున్నారని ఆయన వాక్యాలను ఖండిస్తున్నామని బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధానకార్యర్శి రెడ్డబోయిన గోపి అన్నారు. ఈ మేరకు సిరిసిల్లలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ బీసీ,ఎస్సి,ఎస్టి,మైనారిటీ రిజర్వేషన్ లతో పాటు ఓబీసీ లో వెనుకబడిన తరగతుల వారికి కూడా రిజర్వేషన్ లను కల్పించిన పార్టీ బిజెపి పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుంచుకోవాలని అన్నారు. అధికారంలో ప్రజాప్రతినిధిగా ఏది పడితే అది మాట్లాడి చులకన కావద్దని సూచిస్తున్నామని అన్నారు. జిల్లాల తగ్గింపు చేస్తారని ప్రచారం జరుగుతోందని సిరిసిల్లలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా ఉంటుందా ఉండదా అని క్లారిటీ ఇప్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, ధూమాల శ్రీకాంత్, వడ్నాల శేఖర్, పల్లికొండ నరసయ్య, దేవులపల్లి శ్రీనివాస్, పిల్లి రాజు, చోక్కి శ్రీనివాస్, వెలిచాల అభి, లింగంపల్లి రాము, వేముల ప్రవీణ్, బూర సందీప్, చక్కని మహేష్, వేముల నితిన్, గాజుల అనిల్, సామల సాయి, బిట్ల జాఫర్, బూట్ల సాగర్, నాగం కిషన్ తదితరులు పాల్గొన్నారు.

పారదర్శకంగా లోక్ సభ ఎన్నికల నిర్వహణకు చర్యలు:సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్

*పోలింగ్ సమయాల్లో వచ్చిన మార్పు పై విస్తృతంగా ప్రచారం కల్పించాలి

*అదనపు బ్యాలెట్ యూనిట్ల ఎఫ్.ఎల్.సి, ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి

*100 శాతం ప్రతి ఓటరుకు ఓటర్ సమాచార స్లిప్పు పంపిణీ చేయాలి

*పోలింగ్ సిబ్బందికి అవసరమైన మౌలిక వసతుల కల్పించాలి

*డబ్బు,మధ్యం పంపిణీ జర్గకుండా పక్కా నిఘా ఏర్పాటు

*సి విజల్ యాప్ ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకుని వెళ్ళాలి

*లోక్ సభ ఎన్నికల పోలింగ్ పై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, మే -02(నేటి ధాత్రి):

లోక్ సభ ఎన్నికల విధులను ప్రతి ఒక్కరూ పారదర్శకంగా నిర్వహించాలని, పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థిని ఒకే తరహాలో చూడాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ అన్నారు.గురువారం న్యూ ఢిల్లీ నుంచి సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ,సన్నద్ధతపై నిర్వహించిన వీడియో సమావేశంలో హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారు లతో కలిసి పాల్గొనగా, సమీకృత జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.

సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల నిర్వహిస్తున్న సమయంలో మనం పారదర్శకంగా విధులు నిర్వహించాలని, అందరినీ సమానంగా చూడాలని ఎవరి పట్ల పక్షపాతంతో వ్యవహరించడం చేయవద్దని తెలిపారు. ఎన్నికల విధులు భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పక్కాగా జరగాలని, ఎక్కడ ఏ చిన్న పొరపాటు రాకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

పోటీలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాలకు అదనపు బ్యాలెట్ యూనిట్లు చేరుకున్నాయని, ఈవిఎం బ్యాలెట్ యూనిట్ల ఎఫ్.ఎల్.సి, ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని, హోమ్ ఓటింగ్ ప్రక్రియను నిబంధనల ప్రకారం మే 8 నాటికి పూర్తి చేయాలని, హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలను పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలను పోటీలో ఉన్న అభ్యర్థులకు తెలియజేయాలని ఆయన సూచించారు.

లోక్ సభ ఎన్నికల పోలింగ్ కంటే ముందుగానే 100% ఓటర్ సమాచార స్లిప్పులు ప్రతి ఒక్క ఓటర్ కు అందేలా చర్యలు తీసుకోవాలని, పోలింగ్ కేంద్రం లొకేషన్ ఓటర్లకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ కేంద్రం వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పోలింగ్ సిబ్బందికి అవసరమైన ఆహారం, బాత్ రూం , ఇతర వసతులు కల్పించాలని అన్నారు. సకాలంలో పోలింగ్ ప్రారంభం కావాలని, పోలింగ్ కంటే ముందు మాకు పోల్ నిర్వహించాలని, పోలింగ్ సిబ్బందికి పూర్తిస్థాయిలో అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు.

సెక్టార్ అధికారులు విజయవంతంగా పోలింగ్ నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తారని, ఈవీఎం యంత్రాలు పనిచేయని పక్షంలో నూతన ఈవిఎం యంత్రం ఏర్పాటు చేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలపై సెక్టర్ అధికారులకు పూర్తిస్థాయిలో శిక్షణ అందజేయాలని తెలిపారు. పోలింగ్ రోజున జిల్లా కేంద్రాలలో నిపుణులైన అధికారుల చే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు.

పోలింగ్ దగ్గరవుతున్న సమయంలో డబ్బు మద్యం వంటి ప్రలోభాలు చూపించు ఓటరులను లోభర్చుకునే ప్రమాదం ఉందని, డబ్బు మద్యం పంపిణీ జరగకుండా పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, సి విజిల్ యాప్ వినియోగం పై ప్రజలు విశిష్ట ప్రచారం కల్పించాలని అన్నారు.

పోలింగ్ సమయాలలో కేంద్ర ఎన్నికల కమిషన్ మార్పులు చేసిందని ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఈ అంశం పై విస్తృత ప్రచారం కల్పించాలని, పోలింగ్ శాతం పెరిగే ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.

పోలింగ్ కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచార ప్రక్రియ ఆగిపోతుందని , సైలెన్స్ పీరియడ్ లో ఎటువంటి డబ్బు మద్యం పంపిణీ జరగకుండా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వేలన్స్ బృందాలు, వీడియో సర్వేలెన్స్ బృందాలు, అకౌంటింగ్ బృందాలు , పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ డబ్బు మద్యం పంపిణీ కాకుండా చూడాలని అన్నారు.

లోక్ సభ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని, పోలింగ్ నిర్వహణ పట్ల సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాలు జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించాలని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 3 లక్షల 20 వేల 341 మంది ఓటర్లకు (67.76%) ఓటర్ సమాచార స్లిప్పులు పంపిణీ చేశామని, పోలింగ్ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, జిల్లావ్యాప్తంగా మొత్తం 277 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, 197 పోలింగ్ కేంద్రాల బయట సిసి కేమేరాలు ఏర్పాటు చేశామని అన్నారు.

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే 2457 సిబ్బంది కోసం వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ లో నూతన గ్రంథాలయ భవనం(తాసిల్దార్ కార్యాలయం ప్రాంగణంలో ) సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్ లో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ,గీతానగర్ లో ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలను, పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేశామని అన్నారు. 744 మంది హోం ఓటింగ్ లో పాల్గోంటున్నారని, మే 3 నుంచి మే 5 వరకు హోం ఓటింగ్ పూర్తి చేసేందుకు 19 బృందాలను ఏర్పాటు చేశామని, హోం ఓటింగ్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ఎన్నికలలో డబ్బు మద్యం ప్రభావం రాకుండా అప్రమత్తంగా ఎన్నికలలో డబ్బు మద్యం ప్రభావం రాకుండా అప్రమత్తంగా తనిఖీలు నిర్వహిస్తూ నివారణ చర్యలు చేపట్టామని అన్నారు.
సి విజల్, 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, జిల్లాలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.

ఈ వీడియో సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్, అదనపు కలెక్టర్లు పి.గౌతమి, కీమ్యా నాయక్ , వేములవాడ అర్.డి. ఓ. రాజేశ్వర్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం

ఎల్బీనగర్​ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి

నేటి ధాత్రి, హైదరాబాద్​:
రాబోయే మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్​ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఎల్బీనగర్ ​ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి అన్నారు. గురువారం ఎల్బీనగర్​ నియోజకవర్గంలోని ఆయా కాలనీల్లో బీఆర్ఎస్​ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్​రెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలు చేసి గద్దెనెక్కిన తరువాత ప్రజా సమస్యలు గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

బిషప్ కార్డినల్ పూల అంటోనిని మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ అభ్యర్ధి పద్మారావు గౌడ్

నేటిధాత్రి, స్టేట్ బ్యూరో:

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ హైదరాబాద్ అర్చి బిషప్ కార్డినల్ పూల అంటోనిని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్, సికింద్రాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి మేడే రాజీవ్ సాగర్ తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. సికింద్రాబాద్ బిషప్ హౌస్ కు చేరుకున్న పద్మారావు బిషప్ ను సత్కరించి పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ గత పదేళ్లల్లో క్రిస్టియన్ల అభివృద్ధికి బీఆర్ఎస్ ఎంత కృషి చేసిందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకే 50 లేదా 100 మందితో క్రిస్మస్ ట్రీట్ ఇస్తే కేసీఆర్ అధికారికంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించి వేలాది మందికి క్రిస్మస్ కానుకలు అందజేసినట్లు వివరించారు. బడ్జెట్ లో కూడా క్రిస్టియన్లకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. క్రిస్టియన్ల సంక్షేమానికి బిఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు

అనంతరం బీఆర్ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ కు ఆశీస్సులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ క్యాథలిక్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ లియో లెవిస్, సీనియర్ క్యాథలిక్ నాయకులు జుడే రవి, మల్కాజ్ గిరి అల్ పాస్టర్స్ ఫెలో షిప్ చీఫ్ అడ్వైజర్ లియోనార్డ్ మైగర్, క్యాథలిక్ యూత్ నాయకులు జితేష్, కార్తీక్, డేవిడ్ పాల్గొన్నారు.

Venkatram Reddy will create history in Medak

 

• He got the blessings of KCR and Harish

• From the beginning Medak is strong fort for BRS

• Medak suffered with water problem during Congress regime

• Since ten years it transformed into rice bowl

• Congress came to power and again Medak went back to water problem

• Till yesterday Manjeera water available in sufficient

• Now it is drying up gradually

• During BRS regime Medak remain fertile with high production

https://netidhatri.com/netidhathri-exclusive-on-mp-elections-medak-mega-victory-for-venkatramreddy-brs-great-response-for-camping/

• Now turning back to draught conditions

• Even Indira Gandhi didn’t do any thing

• Congress unable to utilise the recourses

• If BRS wins there will be unprecedented development

• Only BRS can do good to Medak

• Medak region suffered with failure of crops during Congress regime.

• With the advent of KCR Medak transformed into green carpet

As poling date is nearing, the wind is gradually turning in favour of BRS in Medak constituency. United Medak is the home district of KCR and till now it being remained as strong hold for BRS. In2014 elections KCR elected from this constituency with a majority of more than four lakh and created record. Later Prabhakar Reddy won from here for two times. Now ex. Collector and MLC Venkatram Reddy is being contested from this Parliament constituency as candidate of BRS. Venkatram Reddy has good relation with Medak district. He worked as Group-I officer here and later he served as collector for Siddipet and Sirisilla districts. During his tenure as collector the construction of Mallannasagar and Ranganayakasagar reservoirs were under progress. Venkatram Reddy had the history of exertion for successful completion of these two reservoirs. He received good reputation among people of Medak as efficient officer. He also has good name for implementing the government schemes and programmes in successful manner. Where ever worked he received rewards and awards for this excellent performance. He is well interested on social service. He always tried to help poor for their uplift. As an employee in higher position, he always thinks about the welfare of the poor. In previous being collector he rendered his services to Siddipet district in utmost efficient manner. Now this ex. Collector contesting the Medak Parliament seat as a candidate of BRS party. His relentless services came to the notice of KCR who asked Venkatram Reddy to resign his post and made him MLC. Being gain the recognition as efficient leader and worker Venkatram Reddy might have become minister if BRS came to power in previous Assembly elections. KCR definitely utilises the services of such efficient officer who has got good experience on public works. There was extensive discussion on Venkatram Reddy during previous Assembly elections. Now KCR selected him as candidate of the party to contest from Medak.
Really speaking Medak is nothing but a strong fort for BRS. After the formation TRS this Parliament seat won by this party for more times than any other party. After the formation of Telangana State, BRS won this seat for three times. KCR who lead the Telangana movement, launched his agitation from Medak district only. Later he transformed this district as strong fort for BRS. In previous Assembly elections BRS won in majority seats from this district. In this situation no other party has chance to win this seat where victory is very easy for BRS. Understanding their disadvantage position in the district, opposition parties played mental game against BRS by politicizing the meeting with employees by Venkatram Reddy. They made a complaint against this meeting to the Election Commission. Responding to this complaint Election Commission suspended some of such employees who met Venkatram Reddy. Then ‘Netidhatri’ stood in favour of those employees and wrote stories on this issue pointing the fault in the decision of the Election Commission. After seeing the stories published in Netidhatri, employees immediately went to Court against this decision. After hearing the arguments Court issued orders in favour of employees. With this employees turned against BJP and Congress and moved in favour of BRS.
KCR and ex minister Harish Rao have good hold on Medak district. Before Telangana movement, KCR strived hard to develop Medak district in all sectors. After the formation of Telangana, KCR and Harish both concentrated on the development of Medak that caused total transformation of district. Nobody expected such development that turned the district into rice bowl. Before that, dry climatic conditions along with persistent water problem continued for years together made the district into draught porn region. Such district now stands in forefront in overall development. Really this contribution goes to KCR and Harish Rao. At the same time being collector Venkatram Reddy has done everything for the development of the district. This also made the people to receive him with respectful manner. Now majority MLAs from the district are belong to BRS party. Siddipet, Gajwel and Sangareddy Assembly Constituencies lay under Medal Parliament Constituency. These three constituencies are strong hold for BRS. So in these elections it is said that Venkatram Redddy going to win with bumper majority. In previous Assembly Elections People gave chance to Congress which made them to suffer within three months of coming into power. People are voluntarily revealing these facts to media. During the tenure of KCR there were no power cuts. Quality electricity supply provided to people without any interruption. Congress came to power and current shortage began. Sometimes people alleging that due to power cuts, their crops dried up lack of sufficient water.
Irrespective of adverse conditions those prevailed, Medak district sent number of prominent leaders to the Parliament. Ex. Prime Minister Indira Gandhi who faced defeat in North India, got elected from Medak constituency and entered the Parliament. When Indira Gandhi defeated in Amethi constituency, Medak protected her prestige by giving her victory in elections. Then MP Bagareddy withdraw himself and gave chance to Indira Gandhi to contest which made her to emerge victorious in the elections. Still she never bothered about Medak. KCR only the leader who became successful in making no place for Congress in the state for having been deceived Telangana. Like that Medak became strong hold for BRS. Now Harish Rao took the total responsibility of the district and working hard to win the seat. Harish has campaigning in favour of Venkatrami Reddy who received by the people with love and affection. They are giving assurance to make win Venkatram Reddy in these elections. Congress is facing anti wave because of its failure in providing water and current after coming to power. In overall BJP and Congress lost their hopes on Medak seat.

కాంగ్రెస్ పార్టీ స్కీముల పార్టీ

– 16 కోట్ల రూపాయలు బ్యాంకుకు ఎగనామం
– జర్నలిస్టుల దగ్గర డబ్బులు వసూలు చేసిన ఘనత
– ఎన్ని కోట్ల రూపాయలు తీసుకోని సిరిసిల్లలో పోటీ చేశావు
– రాణి రుద్రమదేవి పై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు
సిరిసిల్ల, మే – 2(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాముని వనిత, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు వెలుముల స్వరూప మాట్లాడుతూ నిన్నటి రోజున పొన్నం ప్రభాకర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన రాణి రుద్రమదేవి పైన తీవ్రంగా ధ్వజమెత్తారు. ఐదు కోట్ల రూపాయలు గంగుల కమలాకర్ దగ్గర తీసుకొని హుస్నాబాద్ లో పోటీ చేశారని నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. ఆధారాలు లేకుండా ఎది పడితే అది మాట్లాడం సరికాదని అన్నారు. 16 కోట్ల రూపాయలు బ్యాంకుకు ఎగనామం పెట్టిన ఘనత రాణి రుద్రమదేవికి ఉందని తెలిపారు. జర్నలిస్టుల దగ్గర డబ్బులు వసూలు చేసిన ఘనత నీకే ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ స్కామ్ ల పార్టీ కాదు స్కీముల పార్టీ గుర్తుపెట్టుకోనని అన్నారు. అంతేకాకుండా ఎక్కడినుండో వచ్చి సిరిసిల్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశావు మీరెన్ని కోట్ల రూపాయలు తీసుకొని పోటీ చేశారని అన్నారు. తెలంగాణ పార్టీ పెట్టి ఆస్తులు రాయించుకున్న ఘనత మీదేనని అన్నారు. పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీగా గెలిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడైనా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి అన్నారు. ఖబర్దార్ రాణి రుద్రమదేవి ఇంకోసారి నోటికి వచ్చినట్టు మాట్లాడితే తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఇట్టి కార్యక్రమంలో కాముని వనిత మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు, వెలుముల స్వరూప పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు, అరుణ ప్రధాన కార్యదర్శి, రోజా ఉపాధ్యక్షురాలు, జయలక్ష్మి వార్డు అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ ఖమ్మం మీటింగులో

Date 02/05/2024
————————————–

నేటిధాత్రి స్టేట్ బ్యూరో:

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి టూటౌన్ పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు

ఖమ్మం తెలంగాణ భవన్ లో గురువారం జరిగిన ఈ సమావేశంలో పార్టీ నగర శాఖ అధ్యక్షులు పగడాల నాగరాజు, నాయకులు శీలంశెట్టి వీరభద్రం,పొన్నం వెంకటేశ్వర్లు,దోరేపల్లి శ్వేత, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి,మన పార్టీ అధినేత కేసీఆర్ గారు ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో మూడు రోజుల పాటు జరిపిన బస్సు యాత్ర, రోడ్ షోలు విజయవంతమయ్యాయి
ఇది చూసి ఓర్వలేక కాంగ్రెస్ -బీజేపీలు కుట్ర చేసి నోటీసులు ఇప్పించాయి
మన పార్టీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు పక్కా లోకల్,టూటౌన్ పరిధిలోని నెహ్రూ నగర్ నివాసి
అలాగే,తనతో పాటు మన అభ్యర్థి నామ, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షులు మధు తదితర ప్రముఖులు టూటౌన్ పరిధిలోనే నివసిస్తున్నాం
నామ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని, కాంగ్రెస్ అభ్యర్థి ఢిల్లీలో ఉంటారో, బెంగళూరులో నివసిస్తారో,ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి అని ఇంటింటికి వెళ్లి వివరించాలి
మన అభ్యర్థి ప్రజల కోసం, తెలంగాణ హక్కుల కోసం పార్లమెంటులో బాగా కొట్లాడుతారని,కొట్లాడి సాధించారని వివరిద్దాం
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చాలా హామీలను నెరవేర్చుకోవలసి ఉంది
ఇందుకు నాగేశ్వరరావు సరైన నాయకుడు అని ప్రజలకు చెబుదాం
నామ గెలుపు చాలా అవసరం, పొరపాటున ఓడిపోయినట్టయితే మన జిల్లా,రాష్ట్రం తీవ్రంగా నష్టపోతాయి
నామ గెలుపునకు మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం

కేసీఆర్ ప్రచార నిషేధం , ఓటుకి నోటు కేసు పై మీడియా తో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

నేటిధాత్రి స్టేట్ బ్యూరో:

కేసీఆర్ ప్రచార నిషేధం
మోడీ , రేవంత్ కుట్రలో భాగమే

మోడీ , రేవంత్ విద్వేష ప్రసంగాలు , ఫేక్ వీడియోలు ఈసీ కి కనిపించడంలేదా

నేత కార్మికులని అవమానకరంగా మాట్లాడిన సందర్భంలోని మాటలు వక్రీకరించారు

కేసీఆర్ బస్సు యాత్రతో రేవంత్ మోడీకి వణుకుడు మొదలైంది

ఆరు యాత్రలతోనే ఇద్దరి కాళ్ళ కింద భూమి కంపిస్తుంది

ఇద్దరు కుట్ర చేసి కేసీఆర్ ప్రచారం ఆపాలని చూస్తున్నారు

కేసీఆర్ వెంట ప్రజా ప్రభంజనం చూసి భయపడుతూ చిల్లర ప్రయత్నం

కేసీఆర్ ని అడ్డుకోవడంతో ప్రచారానికి మించి రేట్టింపు ప్రజా మద్దతు వస్తుంది

మోడీ విద్వేషాలు ప్రచారం ఈసీకి కనిపించడంలేదా

ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే రేవంత్ కి నోటీసులు కేసీఆర్ కి మాత్రం ప్రచార నిషేధమా

కేసీఆర్ ని అడ్డుకోకపోతే నష్టం జరుగుతుందనే కుట్ర

వీధి రౌడిగా మాట్లాడిన రేవంత్ స్వేచ్ఛగా తిరిగితుంటే కేసీఆర్ ని మాత్రం ఇంట్లో పరిమితం చేస్తున్నారు

రేవంత్ ఢిల్లీ మూటల పై సమాచారం ఉంటే మోడీ ఎందుకు కేసులు పెట్టడంలేదు

రేవంత్ అవినీతి తెలిసినా మోడీ విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయి

కేసీఆర్ లెవనెత్తుతున్న ప్రజా సమస్యలను చర్చకు రానీయకుండా పక్కదారిపట్టించడం కోసమే
డ్రామాలు

నిషేధాలు ఏవీ కేసీఆర్ ని ఆపలేవు

కేసీఆర్ ప్రచారంలో ఎందుకు కనిపించడంలేదని ప్రజల్లో చర్చ మొదలైంది

ఎన్ని నిషేధాలు పెట్టినా 16 సీట్లు మావే

కేసీఆర్ ని ప్రచారం చేయకుండా ఆపడం మా ఓట్ల శాతాన్ని పెంచుతుంది

ఓటుకి నోటు కేసు ఇక్కడ ఉంటే ప్రభావితం చేస్తారని అనుమానం ఉంది

అందుకే ఇతర రాష్ట్రంలోకి మార్చాలని కోరాం

కోర్టు నుండి సరైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం

సూర్యాపేట

బారాసా అధ్యక్షులు కేసీఆర్ పై ప్రచార నిషేధం
మోడీ , రేవంత్ కుట్రలో భాగమే అని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట లో మీడియా మాట్లాడిన జగదీష్ రెడ్డి,మోడీ , రేవంత్ విద్వేష ప్రసంగాలు , ఫేక్ వీడియోలు ఈసీ కి కనిపించడంలేదా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు నేత కార్మికులని అవమానకరంగా మాట్లాడిన సందర్భంలో స్పందించిన కేసీఆర్ మాటలను వక్రీకరించారని అన్నారు.
కేసీఆర్ బస్సు యాత్రతో రేవంత్ మోడీకి వణుకుడు మొదలైంది అన్నారు.
ఆరు యాత్రలతోనే ఇద్దరి కాళ్ళ కింద భూమి కంపిస్తుందని పేర్కొన్నారు. చోటే బాయ్..బడే భాయ్ ఇద్దరు కుట్ర చేసి కేసీఆర్ ప్రచారం ఆపాలని చూస్తున్నారని మండి పడ్డారు.
కేసీఆర్ వెంట ప్రజా ప్రభంజనం చూసి భయపడుతూ చిల్లర ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ని అడ్డుకోవడంతో ప్రచారానికి మించి రేట్టింపు ప్రజా మద్దతు వస్తుంది అన్నారు.మోడీ విద్వేషాలు ప్రచారం ఈసీకి కనిపించడంలేదా అంటూ ఫైర్ అయ్యారు.ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే రేవంత్ కి నోటీసులు, మా సోషల్ మీడియా ఇంఛార్జి క్రిషాంక్ అరెస్టు, మా అధినేత కేసీఆర్ కి మాత్రం ప్రచార నిషేధమా అంటూ ప్రశ్నించారు.
కేసీఆర్ ని అడ్డుకోకపోతే నష్టం జరుగుతుందనే కుట్ర కు తెర లేపారని అన్నారు.వీధి రౌడిగా మాట్లాడిన రేవంత్ స్వేచ్ఛగా తిరిగితుంటే కేసీఆర్ ని మాత్రం ఇంట్లో పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ ఢిల్లీ మూటల పై సమాచారం ఉంటే మోడీ ఎందుకు కేసులు పెట్టడంలేదనీ ప్రశ్నించారు.రేవంత్ అవినీతి తెలిసినా మోడీ విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయని అన్నారు.కేసీఆర్ లెవనెత్తుతున్న ప్రజా సమస్యలను చర్చకు రానీయకుండా పక్కదారిపట్టించడం కోసమే
డ్రామాలు ఆడుతున్నారని,
నిషేధాలు ఏవీ కేసీఆర్ ని ఆపలేవు అన్నారు.కేసీఆర్ ప్రచారంలో ఎందుకు కనిపించడంలేదని ప్రజల్లో చర్చ మొదలైంది అన్నారు.ఎన్ని నిషేధాలు పెట్టినా 16 సీట్లు మావే అన్నారు. కేసీఆర్ కు మద్దతుగ నేతన్నలు కదిలివస్తున్నారని అన్నారు.కేసీఆర్ ని ప్రచారం చేయకుండా ఆపడం మా ఓట్ల శాతాన్ని పెంచుతుంది అన్నారు. రేపు వివరణ కు రానున్న ఓటు కు నోటు కేసుపై మాట్లాడిన జగదీష్ రెడ్డి ,ఓటుకి నోటు కేసు ఇక్కడ ఉంటే ప్రభావితం చేస్తారని అనుమానం ఉందన్నారు.
అందుకే ఇతర రాష్ట్రంలోకి మార్చాలని కోరాం అన్నారు.
కోర్టు నుండి సరైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్

హైదరాబాద్, నేటిధాత్రి:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) నోటిఫికేషన్‌ జారీచేయనుంది. శాసన మండలిలో వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక కోసం గురువారం నుంచి ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
13వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఈ నెల 27న పోలింగ్‌ నిర్వహిస్తారు. జూన్‌ 5న ఓట్లు లెక్కిస్కారు. దీనికి సంబంధించి ఈసీ ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్‌ రెడ్డి గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈనేపథ్యంలో ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమయింది. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన చింతపండు నవీన్‌ (తీన్మార్‌ మల్లన్న) ఈసారి కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలో దిగుతున్నారు.

చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా ఎగరేస్తా

పార్లమెంట్​లో బీసీల గొంతును వినిపిస్తా

68 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలే నా బలం

బీసీల అభ్యున్నతి కోసం 45 ఏండ్లుగా పోరాడుతున్నా..

జిత్తుల మారి బీజేపీ, కాంగ్రెస్‌ లకు గుణపాఠం తప్పదు

వారు ధనికులు కావొచ్చు.. జ్ఞానేశ్వర్​ప్రేమ పంచుతడు

డబ్బు సంచులతో వస్తున్న వారికి చేవెళ్ల ప్రజలే తరిమికొట్టాలి

​లోక్​సభ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతా

నాలుగు నెలల్లోనే కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో అసంతృప్తి

‘నేటి ధాత్రి’తో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌

‘‘పనిచేసే వ్యక్తులకు ఓటెయ్యండి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి చేసిన సేవలను జ్ఞప్తికి తెచ్చుకోండి. నేను జడ్పీ చైర్మన్​గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఐదేండ్లు చేసిన సేవలను గుర్తించండి. మళ్లీ ఒకసారి నా ప్రాంత ప్రజలకు ఎంపీగా సేవ చేసే భాగ్యం కల్పించండి. నాతో పోటీ పడుతున్న కాంగ్రెస్​, బీజేపీ అభ్యర్థులు ధనికులైతే, కానీ తనకు ఈ ప్రాంత బిడ్డగా ప్రజలపై ప్రేమ ఉంది.” అని బీఆర్ఎస్​చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్​అంటున్నారు. చేవెళ్ల పార్లమెంట్​అభ్యర్థిగా పోటీ చేస్తున్న జ్ఞానేశ్వర్​ను ‘నేటి ధాత్రి’ పలకరించగా ఆయన పలు విషయాలు పంచుకున్నారు.

నేటి ధాత్రి, స్టేట్​బ్యూరో:
కాంగ్రెస్​, బీజేపీ అభ్యర్థులు ధనికులైతే తనకు ప్రజా బలం ఉందని చేవెళ్ల బీఆర్ఎస్​ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. తాను గతంలో ఐదేండ్ల పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్​గా పనిచేశానని, గతంలో చేసిన పనులే అలవోకగా విజయాన్ని అందిస్తాయని దీమా వ్యక్తం చేశారు. చేవెళ్లలో 68శాతం ఉన్న బీసీలు, ఎస్సీ, ఎస్టీలే నా గెలుపు వారధులని ప్రకటించారు. కాంగ్రెస్​, బీజేపీ అభ్యర్థులు గడ్డం రంజిత్​రెడ్డి, కొండా విశ్వేశ్వర్​రెడ్డిలను సునాయసంగా ఓడిస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను ప్రజలు తిరిగి కోరుకుంటున్నారన్నారు. కరెంటు, నీళ్లు, రైతు బీమా, రైతు బంధు హామీలను కాంగ్రెస్ మరిచిందని మండిపడ్డారు. ఈ కారణాల వల్ల ప్రజలకు బీఆర్ఎస్​పై సానుకూల దృక్పథం ఉందని నేటి ధాత్రి’తో ఆయన చెప్పుకొచ్చారు.

‘లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ మంది బీసీలకు టికెట్‌ ఇచ్చింది ఒక్క బీఆర్‌ఎస్‌ మాత్రమే. ప్రజలు మమ్మల్ని గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే బీసీల సమస్యలపై పోరాడేందుకు అవకాశం దక్కుతుంది. బీసీ బిడ్డగా 45 ఏండ్లు వివిధ వేదికల ద్వారా పోరాటం చేశాను. 96 కులాలను ఏకం చేసి బీసీల అభ్యున్నతికి బాటలు వేశాను. 4 నెలల్లోనే కాంగ్రెస్‌ పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఎన్నికల ప్రచారంలో ఆయా నియోజకవర్గాల్లో ప్రజల స్పందన చూస్తుంటే చేవెళ్ల గడ్డపై గులాబీ పార్టీ జెండా ఎగరడం ఖాయం. ’ అని కాసాని జ్ఞానేశ్వర్​దీమా వ్యక్తం చేశారు. ‘నేటి ధాత్రి’ అడిగిన ప్రశ్నలకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు.

చేవెళ్లలో ఇద్దరు రెడ్డీలతో పోరాడుతున్నరు.. ఫలితం ఎలా ఉండబోతోంది?
చేవెళ్ల బరిలో నన్ను అభ్యర్థిగా ప్రకటించగానే ఇక్కడి ప్రజల్లో చర్చ మొదలైంది. ఇద్దరు ఉన్నత వర్గాల అభ్యర్థుల మధ్య బహుజనుల నాయకుడు పోరాడుతుండు అని. వారిద్దరితో పాటు నా పనితనంపై ఇక్కడి ప్రజలకు అవగాహన ఉంది. బీసీలకు ఎక్కువగా టికెట్లు ఇచ్చింది ఒక్క బీఆర్‌ఎస్సే. కాంగ్రెస్‌, బీజేపీ బీసీలకు అసలు ప్రాధాన్యమే ఇవ్వలేదు. ప్రస్తుతం మా బాస్​కేసీఆర్​ ఆరుగురు బీసీలను బరిలో దింపారు. బీసీల కోసం దశాబ్ధాలుగా అహర్నిశలు పోరాడి, బీసీల అభ్యన్నతికి బాటలు వేసిన కాసానిని ఓడగొట్టుకుంటమా? అని నన్ను గెలిపించేందుకు బీసీలంతా ఏకమైతుండ్రు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. అందరి సహకారంతో చేవెళ్ల గడ్డపై గులాబీ జెండాను ఎగరేసి బీఆర్ఎస్​చీఫ్​కేసీఆర్​కు గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నం.

మీరు బీసీల్లో తెచ్చిన చైతన్యం.. గెలుపు బాటలు వేస్తుందా?
బహుజన కులాల సమస్యలను వెలుగులోకి తెచ్చి పోరాడిన. అందులో ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు దశాబ్ధాల కిందనే బస్సు యాత్ర చేసి 96 కులాల అధ్యక్షుడిగా బీసీలను ఏకం చేసిన. జ్ఞానేశ్వర్​బీసీల సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తాలనే ఉద్యమ నేపథ్యం కలిగిని, ప్రజాబలాన్ని నమ్మే కేసీఆర్‌ ఆలోచించి ఆరుగురికి టిక్కెట్లు ఇచ్చారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తా. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి, రూరల్​టు అర్బన్​ ప్రాంతాలకు మెరుగైన రవాణా, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పార్లమెంట్‌లో కొట్లాడుతా.

పంద్రాగస్టులోగా కాంగ్రెస్​రుణమాఫీ చేస్తామంటోంది.. మీరు నమ్ముతున్నారా?
డిసెంబర్‌ 9 రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పిండ్రు. ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల కోసం ఆగస్టు 15 అని కొత్త పాట మొదలుపెట్టిండ్రు. కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మలేమని రైతులే చెబుతున్నరు. నాలుగు నెలల పాలనలోనే దెబ్బ మీద దెబ్బ పడిందని రైతులు లబోదిబోమంటున్నరు.

చేవెళ్ల పల్లెలు ఏమంటున్నయ్​..?
అమలుకు సాధ్యం కాని హామీలతో ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్​పాలకులపై ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. 4 నెలల పాలనలోనే పాలనా అస్తవ్యస్తం చూసి బాధపడుతున్నారు. బీఆర్‌ఎస్‌ పాలనే మళ్లీ కావాలని కోరుకుంటున్నరు. సాగునీరందించడంలో ప్రభుత్వం విఫలం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినయ్‌. కరెంట్‌ కోతలతో ప్రజలు అల్లాడుతున్నరు. కేసీఆర్‌ హయాంలో ప్రభుత్వంపై ఎంత బర్డెన్​ఉన్నా.. రెప్పపాటు కూడా కరెంట్‌ పోలేదు. గత ఎన్నికల్లో చేసిన పొరపాటును మళ్లీ చేయబోమని కార్మిక, కర్షకులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. నీటి ఎద్దడి రాకుండా కేసీఆర్‌ సూపర్​విజన్​తో మిషన్‌ భగీరథ అమలును ప్రజలు గుర్తుచేసుకుంటున్నరు. ఇంటి పెద్దకొడుకులా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, రంజాన్‌ తోఫాను కేసీఆర్‌ ఇచ్చారని, కాంగ్రెస్‌ పాలనలో అవేమీ లేవని ప్రజలే అంటున్నరు. దళితబందు, బీసీ బంధు, రైతుబంధు రావడం లేదని ఆవేదన చెందుతున్నరు. కాంగ్రెస్‌ పాలనపై విరక్తిచెంది కేసీఆర్‌ సభలు, బస్సు యాత్రలు, మా ప్రచారానికి తండోపతండాలుగా తరలివస్తున్నరు. ప్రజా స్పందన చూస్తుంటే కచ్చితంగా బీఆర్‌ఎస్‌కు మళ్లీ పట్టం కట్టడం ఖాయంగా కనిపిస్తున్నది.

ఇద్దరు అభ్యర్థులు మీ గూటి పక్షులే కదా?
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు రంజిత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అవకాశవాద రాజకీయాలు నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా తెలుసు. ఐదేండ్ల పాటు కేసీఆర్‌, కేటీఆర్‌లతో సన్నిహితంగా ఉండి సొంత ప్రయోజనాలు చూసుకున్నారే తప్ప నియోజకవర్గ ప్రజలకు వారు చేసిందేమీ లేదు. రంజిత్‌రెడ్డిని పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాతే ఆయన జంప్​అయ్యాడు. అధికారం ఉన్నంత కాలం ఎంజాయ్‌ చేశాడు. లీడర్‌ అనే వాడు గెలుపులో ఎంత సంతోషంగా ఉండాలో? ఓటమిలోనూ అంతే ఉండాలి. డబ్బు సంచులతో గెలువాలనుకుంటున్న ఆ ఇద్దరికి ప్రజలే గుణపాఠం చెప్తరు.

మీ సెగ్మెంట్ పరిధిలో ఐటీ ఎంప్లాయీస్​ ఓటేస్తలేరు కదా?
గతంలో ఎట్లున్నా.. ఈ సారి ఐటీ ఉద్యోగులు పోలింగ్‌ కేంద్రాలకు తప్పకుండా తరలివస్తారు. కేసీఆర్‌ పాలనలో ఐటీ రంగం గణనీయంగా వృద్ధి సాధించింది. నాలుగు నెలల్లో ఈ రంగంలో వచ్చిన మార్పును ఐటీ ఉద్యోగులు గమనించారు. ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్‌ఎస్‌ను గెలిపించుకుంటామని చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లాతో నాకు ప్రత్యేక అనుబంధముంది. హైటెక్‌సిటీ అభివృద్ధికి ఏం చేయాలో నాకు స్పష్టత ఉంది. అంతిమంగా పదేండ్ల పాటు మేం చేసిన పనులు చూడండి. వచ్చే రోజుల్లో ఏం చేస్తామో కూడా చెబుతున్నాం. ఈ ఎన్నికల్లో సబ్బండవర్గాలు గులాబీ పార్టీ పక్షాన నిలబడుతాయన్న నమ్మకం నాకుంది.

విద్యార్థులను సన్మానించిన మాజీ ఎంపీపీ అత్తె చంద్ర మౌళి

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలం లక్కారం గ్రామం జడ్పీ ఎచ్ ఎస్ స్కూల్ పదవ తరగతి లో మంచి మార్కులు సాధించిన కాసు సుకన్య డోరి అంజలి విద్యార్థులను మాజీ ఎంపీపీ అత్తె చంద్ర మౌళి విద్యార్థులను శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్బంగా మాజీ ఎంపీపీ మాట్లాడుతూ ఇంకా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మీ తల్లి తండ్రుల ఆశలు నెరవేర్చాలని విద్యార్థులను కోరారు ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడు మాదాసి రమేష్ ఎస్ ఎమ్ సి మాజీ చైర్మన్ కనావేనా రవి రామగిరి రాజబాబు బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

ముఖ్యమంత్రి సభ స్థలి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు!!

గడ్డం వంశీ నీ భారీ మెజారిటీతో గెలిపించాలి మంత్రి శ్రీధర్ బాబు!!
ఎండపల్లి నేటి ధాత్రి
ఎండపల్లి మండలం రాజారాం పల్లిలో మే మూడవ తేదీన జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభాస్థలిని తెలంగాణ రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ పరిశ్రమలు మరియు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించి, అనంతరం మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని భారీ మెజార్టీతో గెలిపించాలని, గెలిపిస్తారని మాకు నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు , వీరి వెంట ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ మరియు పిసిసి కార్యవర్గ సభ్యులు ఉమ్మడి వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి మరియు రాష్ట్ర నాయకులు మరియు గెల్లు శ్రీనివాస్ గాజుల విజయ్ మేకల సంతోష్ తదితరులు పాల్గొన్నారు

ఘనంగా కార్మిక దినోత్సవం వేడుకలు

ముత్తారం :- నేటి ధాత్రి

మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో మే డే ను పురస్కరించుకొని కార్మిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు బుధవారం రోజున అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకుడు దుబాసి శ్రీనివాస్ తోటి కార్మికులతో కలిసి జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా మేడే దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు కార్మికులు ఐక్యతగా ఉండి తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు హమాలో సంఘం కార్మికులు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలి

డిసిసి వైస్ ప్రెసిడెంట్ సదానందం
మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ

ముత్తారం :- నేటి ధాత్రి

శుక్రవారం రోజున మండల కేంద్రంలోని శ్రీ వెంకటలక్ష్మి గార్డెన్ లో నిర్వహించే మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీను బాబు హాజరై రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు భారీ మెజార్టీ యే లక్ష్యంగా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని విభాగాల నాయకులు మహిళా యూత్ ఎస్సీ సెల్ బీసీ సెల్ కిషన్ సెల్ మైనార్టీ సెల్ తో పాటు మండలంలోని ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు

error: Content is protected !!
Exit mobile version