మండుటెండలో.. ఉపాధి కూలీలతో.. దుద్దిళ్ళ శ్రీను బాబు

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో దుద్దిళ్ళ శ్రీను బాబు

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీలకు రోజుకు ₹400 రూపాయలకు పెంపు

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలములోని పోతారం గ్రామములో ఎన్నికల ప్రచారం లో భాగంగా దుద్దిళ్ళ శ్రీను బాబు ఉపాధి హామీ కూలీలకు, ప్రజలకు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను గెలిపించాలని కోరారు
ఎన్నికలు కోడ్ తరువాత 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేయడం జరుగుతుందనీ సోనియా గాంధీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 5 న్యాయ గ్యారంటీలను ప్రవేశపెట్టడం జరిగింది
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి పంటకు కనీస మద్దతు ధర,ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూపాయలు 400 పెంపు, ప్రతి పేద కుటుంబ మహిళకు ఏటా 1 లక్ష రూపాయలు, ఆరోగ్య బీమా 25 లక్షలు, యువతకు 30 లక్షల ఉద్యోగలు కలిపించడం జరుగుతుందనీ శ్రీను బాబు అన్నారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ మాజీ జడ్పీటీసీ లు నాగినేని జగన్ మోహన్ రావు చొప్పరి సధానందం మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

వాయిదాపడ్డ మండల సర్వసభ సమావేశం

శాయంపేట నేటి ధాత్రి;

శాయంపేట మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించబడే సర్వసభ సమావేశం కోరం లేక వాయిదా పడింది. మండల సర్వసభ సమావేశంలో మాత్రమే శాయంపేట ఎంపీటీసీ, కొప్పుల ఎంపిటిసి మాత్రమే హాజరు కాగా మిగతా ఎంపీటీసీలు సభ్యులు హాజరు కాకపోక్రవడంతో సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది.

త్రాగునీటి సమస్య ఉండొద్దని అధికారులకు ఆదేశాలు

శాయంపేట మండలంలో తాగునీటి కొరత లేకుండా ఉండాలని అధికారులతో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖాముఖి అధికారుల సమావేశం నిర్వహించి మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో ఎలాంటి తాగునీటి సమస్య ఉండొ ద్దని అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని గ్రామాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు అధిక మొత్తంలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ కు ఓటేస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయి

@ నెక్కొండ ఇంటింటి ప్రచారంలో సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి

@మహబూబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ తెలుపు కాయం: రంజిత్ రెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి: కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసిన గుర్తుగా సోనియాగాంధీకి 17 ఎంపీ సీట్లు తెలంగాణలో గెలిచి తెలంగాణ కానుకను అందచేయాలని గత కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో మహబూబాబాద్ నుండి ఎంపిగా గెలిచిన బలరాం నాయక్ నెక్కొండ మండల కేంద్రానికి పద్మావతి ఎక్స్ప్రెస్ లాంటి రైళ్లను నిలుపుదల తోపాటు ఎంపీ విధుల కింద నెక్కొండను బంగారు కొండగా తీర్చిదిద్దారని ఆపద వస్తే అన్నా అంటే బలరాం నాయక్ అన్న నెక్కొండ ప్రజలతో నిత్యం మమేకంగా ఉంటారని ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలరాం నాయక్ బలపరచడం జరిగిందని రాహుల్ గాంధీని ప్రధాని చేయాలంటే మహబూబాబాద్ ఎంపి గా బలరాం నాయక్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని నెక్కొండ మండల కేంద్రంలో జరిగిన ఇంటింటి ప్రచారంలో నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి అన్నారు. అంతకు ముందుగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి మరియు గ్రామ దేవత బొడ్రాయి వద్ద నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి ప్రత్యేక పూజలు కొనసాగించి ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రావుల హరీష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండి శివకుమార్, రామాలయం కమిటీ చైర్మన్ కుమార్ రెడ్డి సుధాకర్ రెడ్డి, ఆంజనేయస్వామి దేవాలయ చైర్మన్ బెజ్జంకి వెంకటేశ్వర్లు, నెక్కొండ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగం ప్రశాంత్, మండల కాంగ్రెస్ నాయకులు కుసుమ చెన్నకేశవులు, గొల్లి సుబ్బారెడ్డి, ఈదునూరి సాయి కృష్ణ, చల్ల పాపిరెడ్డి, ఎండి అన్వర్, రావుల మైపాల్ రెడ్డి, ఎండి అమిద్, వనం ఏకాంతం, మహమ్మద్ అమిర్, షేక్ రఫీ, వడ్డే రాజశేఖర్, పొట్లపల్లి వీరస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మంగపేట మండలంలో ఘనంగా ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారి జన్మదిన వేడుకలు

మంగపేట నేటిధాత్రి

మంగపేట మండలంలో కస్తూరిబాయ్ వృద్దాశ్రమ లో బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిచారు , కేక్ కట్ చేసి, స్వీట్స్ పండ్లు పంపిణీ చేసి 25 కేజీల బియ్యం అందజేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మాజీ మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ , చికాలామర్రి రాజేందర్, ST సెల్ మండల అధ్యక్షులు, తోలెం నర్సింహరావు, మండల ఉపాధ్యక్షులు చిట్టీమల్ల సమ్మయ్య, పి ఎ సి ఎస్ డైరెక్టర్ నర్రా శ్రీధర్ ,మండల ఆర్గనైజేషన్ సెక్రటరీ చల్లగురుగుల తిరుపతి, మండల నాయకులు, చీకీర్తి సుధాకర్, గుడిసెవా నాగేశ్వరావు, యాదడ్ల రాజయ్య, పగడాల వెంకట్ రెడ్డి, చందర్ రావు, గంగేర్ల వెంకన్న, పంజ్జల సత్యం, సోషల్ మీడియావర్యులు, బీసా సాంబయ్య, ముప్పారపు సందీప్, మూగల రాము, దయాకర్, గుడివాడ శ్రీహరి,తదితరులు పాలుగోన్నారు,

ప్రతి ఓటరు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించు కోవాలి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

భూపాలపల్లి నేటిధాత్రి

శుక్రవారం స్వీప్ నోడల్ అధికారి జడ్పి సిఈఓ విజయలక్ష్మీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ క్రీడా మైదానం నుండి జయశంకర్ విగ్రహం వరకు ఓట్ ఫర్ షూర్ నినాదంతో నిర్వహించిన 5కే రన్ ను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరేలు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ
ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు పార్లమెంటు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కొరకు నిర్వహిస్తున్న
స్వీప్ కార్యక్రమములో భాగంగా ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన కల్పించి జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో పోలింగ్ శాతం పెంపొందించడానికి
5కే నిర్వహించడం జరిగిందన్నారు.

మే 13వ తేదీన జరిగే
పోలింగ్ ప్రక్రియలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ
బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ శాతం అధికంగా నమోదయ్యే విధంగా సహకరించాలని అన్నారు. వేసవి దృష్ట్యా ఉదయమే ఓటు హక్కు వినియోగానికి పోలింగ్ కేంద్రాలకు రావాలని సూచించారు. వృద్ధులు, దివ్యాన్గుల కోసం పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో నీడ కొరకు షామియానాలు, కుర్చీలు, మంచినీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ఓటు హక్కు వినియోగం ద్వారానే మంచి పరిపాలకులను ఎంచుకునే వజ్రాయుధం ఓటు హక్కు అని తెలిపారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తప్పని సరిగా ఎన్నికల్లో ఓటు వేయడమే కాకుండా తమ చుట్టుపక్కల వారికి, బంధు మిత్రులను కూడా ఓటు హక్కు వినియగించుకునేలా చైతన్య పరచాలని సూచించారు. ప్రజాస్వామ్యానికి మూలాధారమైన ఓటును ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిష్పక్షపాతంగా, స్వేచ్చగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ కోరారు.
ఎస్పి కిరణ్ ఖరే మాట్లాడుతూ ఎన్నికలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, స్వీప్ నోడల్ అధికారి విజయలక్ష్మీ, సిపిఓ శామ్యూల్, ఉద్యాన అధికారి సంజీవరావు, బిసి, ఎస్సి సంక్షేమ అదికారులు శైలజ, సునీత, జిల్లా ఆర్డీవో మంగీలాల్, పట్టణ ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు.

ప్రియాంక గాంధీ సభ స్థలానికి సమావేశం స్థలం ఏర్పాట్ల పరిశీ లనకు హాజరైన ఏఐసీసీ ప్రతినిధి

రోహిత్ చౌదరి,బండి రమేష్

కూకట్పల్లి,మే 3 నేటి ధాత్రి ఇన్చార్జి

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ హైదరాబాదు రానున్న నేపథ్యంలో సమావేశం స్థలం ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన ఏఐ సీసీ ప్రతినిధి రోహిత్ చౌదరి కూక ట్పల్లి ఇంచార్జ్ బండి రమేష్ కోఆర్డి నేటర్ వినయ్ టిపిసిసి ప్రతినిధులు సూరజ్ తివారి సత్యం శ్రీరంగం నా యకులు సతీష్ రెడ్డి లక్ష్మయ్య తది తరులు.ఈ సందర్భంగా సతీష్
రెడ్డి మాట్లాడుతూ…. కాంగ్రెస్ నాయ కురాలు ప్రియాంక గాంధీ మన హైద రాబాద్ కు ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేసేం దుకు ఇక్కడ స్థల ఏర్పాట్ల పరిశీల నకు వచ్చిన అతిథులు మరి వేలా దిమంది కాంగ్రెస్ అభిమానులు శ్రే యోభిలాషులు వాటి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి తల్లి వచ్చేందు కు భారీ ఏర్పాట్లు అన్ని సౌకర్యాల తో కూడినవి జరుగుతున్నట్లు చేరి సతీష్ రెడ్డి మీడియా ప్రతినిధులతో తెలియజేశారు.

సౌమ్యుడు, స్థానికుడైనా వెలిచాల రాజేందర్ రావుకి ఓటు వేసి గెలిపిద్దా – ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా చోప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలోని వెదిర, వెలిచాల, కొక్కెరకుంట, వన్నారం, రుద్రారం, రంగసాయి పల్లె గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే సత్యం. ఈసందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ప్రకటించిందని, ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని, ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితం ప్రయాణం, 500రూ.లకే సిలిండర్, 200యూనిట్ల వరకు ఉచిత అందజేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని, వచ్చే ఆగస్టు15 లోపు మిగిలిన గ్యారంటీలను అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన ప్రజలు ఓట్లు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కులం మతాల పేరుతో ప్రజలను యువతను రెచ్చగొట్టడం తప్ప, పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి చేసినది ఏమీ లేదని, స్థానికుడు, సౌమ్యుడైన రాజేందర్రావును గెలిపించుకుంటే ఈప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో చొప్పదండి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని, ప్రజల మధ్యనే ఉంటూ, చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్, ఎంపీపీ జవ్వాజి హరీష్, సింగల్ విండో చైర్మన్ ఒంటెల మురళి కృష్ణారెడ్డి, వెన్నం రాజమల్లయ్య, పులి ఆంజనేయులు గౌడ్, బండపెల్లి యాదగిరి, నేరెళ్ల ఆంజనేయులు గౌడ్, కాడే శంకర్, తాజా మాజీ సర్పంచ్ లు, ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

బండి సంజయ్ ని అధిక మెజార్టీతో గెలిపించాలని గడపగడపకు ప్రచారం

వీణవంక, ( కరీంనగర్ జిల్లా).

నేటి దాత్రి:వీణవంక మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రచారంలో భాగంగా నిన్న మొన్న కాంగ్రెస్ బి ఆర్ ఎస్, నాయకులు బండి సంజయ్ కుమార్ అవాకృచావాకులు పేల్చినారు. గత ప్రభుత్వం పైన ఆ ప్రభుత్వ అవినీతి పైన పోరాటం చేసిన వ్యక్తి బండి సంజయ్ కుమార్ అధికారం పోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు. తెలువని కొందరు నాయకులు కార్పొరేట్ స్థాయి పదవులు అనుభవించి మీరు ఈ ప్రాంతానికి ఏం చేశారని మేము నిలదీయడం జరుగుతుంది.ముక్తు కాంగ్రెస్ అనే నిదానంతో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లకు పోతుంది. బొంద పెట్టుడు మమ్మల్ని కాదు మిమ్మల్ని ప్రజలు బొంద పెడతారు. కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకుంటే మంచిది. బిజెపి నాయకులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో బత్తిని నరేష్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు బూత్ అధ్యక్షులు మోటం శ్రీనివాస్, కంకల సంతోష్,కూచనపెళ్లి రాకేష్, దాసారపు అశోక్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

బస్ షెల్టర్ ప్రారంభం

గ్రామ మాజీసర్పంచ్ భూక్యా రమేష్

, శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండ గ్రామంలో కీర్తిశేషులు గుగులోతు నరహన్ జ్ఞాపకార్థం నిర్మించిన బస్ షెల్టర్ ను సూర్య నాయక్ తండ మాజీ సర్పంచ్ భూక్యా రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ గుగులోత్ శంకర్ తండ్రి అయిన నరహాన్ జ్ఞాపకార్థం కోసం సూర్య నాయక్ తండలో బస్ షెల్టర్ నిర్మించడం జరిగిందని అన్నారు.ఉన్న ఊరికి ఏదో ఒకటి చేయాలని గొప్ప ఆలోచనలతో మరియు తండ్రి మీద ప్రేమతో బస్సు షెల్టర్ నిర్మాణం చేసి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.బస్ షెల్టర్ నిర్మాణం కోసం 92,000 రూపాయలు నిర్మాణం చేపట్టడం జరిగింది..ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కృష్ణ మూర్తి,లింగునాయక్,రాజు,అజ్మీరా దూదా, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు లావుడు రవీందర్ పాల్గొన్నారు.

శ్మశాన వాటిక భూమి మాయం – చోద్యం చూస్తున్న అధికారులు

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ పంచాయతీ గత పాలకవర్గం దాతల విరాళాలతో మొత్తం ఇరవై ఎనిమిది గుంటల భూమిని కోనుగోలు చేసినట్లు సూచిక బోర్డులో చూపించి నేడు అట్టి సూచిక బోర్డును తొలగించడం ఇప్పుడు గ్రామంలో చర్చనీయాంశమైంది.

సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న వివరాలను పరిశీలించగా శ్మశాన వాటిక కోసం 10జూన్2019రోజున పోన్నం వీరేశం తండ్రి:అంజయ్య అనే వ్యక్తి నుండి సర్వే నంబర్ 472/ఎ/జి లో పన్నెండు గుంటల భూమిని డాక్యుమెంట్ నంబర్ 3724/2019 ద్వారా కోనుగోలు చేసి శ్మశాన వాటిక నిర్మాణం చేసి ఫినిషింగ్ చేయడం జరిగినది. ఆతర్వాత 09సెప్టెంబర్2019న సర్వే నంబర్ 472/ఎ లో పదమూడు గుంటల భూమిని రెండు లక్షల రూపాయలకు సర్పంచ్ లెటర్ హెడ్ పై కోనుగోలు చేసినట్లు తెలిపారు. మొత్తం ఇరవై ఐదు గుంటల భూమిని శ్మశాన వాటిక కోసం కోనుగోలు చేశారు. కాని ప్రస్తుతం పన్నెండు గుంటల భూమి మాత్రమే గ్రామ పంచాయతీ ఆదీనంలో ఉన్నది. గత సర్పంచ్ లేటర్ హెడ్ ద్వారా చూస్తే పదమూడు గుంటల భూమి, సూచిక బోర్డులో ఉన్న విధంగా చూస్తే పదహారు గుంటల భూమి ఎటువెళ్ళినదో తెలియని అయోమయా పరిస్థితిలో గ్రామ ప్రజలు ఉన్నారు. శ్మశాన వాటిక కోసం మొత్తం ఎన్ని గుంటలు కోనుగోలు చేశారు, వచ్చిన విరాళాలు ఎన్ని అనేది అధికారులు నిగ్గుతెల్చాల్సిన అవసరం ఉందనేది గ్రామ ప్రజల వాదన. కనీసం ఇప్పటికయినా సంబందిత అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి విరాళాలతో కోనుగోలు చేసిన భూమిని స్వాధీనం చేసుకోవాలని, అసలు గ్రామ పంచాయతీ శ్మశాన వాటిక కోసం ఎన్ని గుంటలు కోనుగోలు చేసినరో స్పష్టంగా తెలియజేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. శ్మశాన వాటిక కోసం రిజిస్ట్రేషన్ ద్వారా కోనుగోలు చేసిన పన్నెండు గుంటల భూమికి రైతు బంధు అమ్మిన వ్యక్తి పేరున జమకావడం కొసమెరుపు.

రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలలో జయశంకర్ జిల్లాకు బంగారు పతకాలు

భూపాలపల్లి నేటిధాత్రి

మే 1, 2వ తేదీలలో వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా కిక్ బాక్సింగ్ ఆధ్వర్యంలో తెలంగాణా కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ 2024 పోటీలు జరిగాయి. ఈ పోటీలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కిక్ బాక్సింగ్ క్రీడాకారులు పాల్గొని పలు విభాగాలలో పతకాలు సాధించినట్లు సీనియర్ మాస్టర్, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జయశంకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటే శ్రీనివాస్ ( మాదాసి ) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భముగా మాస్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ క్రియేటివ్ ఫామ్ వెపన్ విభాగంలో బోగ శ్రీవేణి బంగారు పతకం, తాడబోయిన హరిణి వెండి పతకం, ఐలవేణి నిత్య బంగారు పతకం, ఐలవేణి కుశాంత్ బంగారు పతకం, కంటె భాను మైత్రేయ బంగారు పతకం, పాయింట్ ఫైటింగ్, లైట్ కాంటాక్ట్ విభాగాలలో శ్రీ వైష్ణవి రెండు బంగారు పతకాలు, సంజన శ్రీ రెండు బంగారు పతకాలు, హరిణి రజిత , శ్రీవేణి రజిత పతకం, నిత్య శ్రీ వెండి పతకం, మాదాసి విధిష దేవి రజిత పతకం, కుశాంత్ బంగారు పతకం, భాను మైత్రేయ బంగారు పతకం సాధించినట్లు తెలిపారు. పతకాలు సాధించిన విద్యార్థులను, సీనియర్ ఇన్స్ట్రక్టర్, కోచ్ గోసిక అశోక్ లను కిక్ బాక్సింగ్ అసోసియేషన్ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి మహిపాల్, మాస్టర్ లు ఆవుల రాజనర్సు, శేఖర్, రాజు, తిరుపతిలు ప్రతేకంగా అభినందించినట్లు మాస్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు.

వేసవి కాలంలో ఆయిల్ ఫామ్ తోటలలో రైతులు జాగ్రత్తలు పాటించాలి

జిల్లా ఉద్యాన, పట్టు శాఖల అధికారి సంజీవరావు

భూపాలపల్లి నేటిదాత్రి

ఆయిల్ ఫామ్ తోటల్లో
అబ్లేషన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఉద్యాన, పట్టు శాఖల అధికారి సంజీవరావు తెలిపారు. టేకుమట్ల రేగొండ మొగుళ్ళపల్లి మండలంలోని రంగాపురం గ్రామంలోని పాల్మాసి రాజేశ్వర్ రావు ఆయిల్ ఫామ్ తోటలో
ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పూత తీసివేసే పద్ధతి (అబ్లేషన్) పై రైతులకు అవగాహన కారక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉద్యాన శాఖ అధికారి సంజీవ రావు మాట్లాడుతూ
ఆయిల్ పామ్ మొక్క నాటిన 14 నుండి 18 నెలల వరకు మగ, ఆడ పూత వస్తుందని, సరియైన పద్ధతిలో పరిమాణంలో
నీటి తడులు, ఎరువులను అందించని ఎడల ఎక్కువగా మగపూలు, తక్కువగా ఆడ పూలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వచ్చిన పూతను మూడున్నర సంవతరాల వరకు అబ్లేషన్ పరికరాల ద్వారా తీసి మొక్క మొదట్లో మల్చింగ్ కోసం వేయాలన్నారు. మొక్క నాటిన 4వ సంవత్సరం నుండి దిగుబడి వస్తుందని, పూత తీయడానికి ఉపయోగించే శూలం లాంటి అబ్లేషన్ ఇనుప పరికరాలను సువెన్ అయిల్ నర్సరీ రేగొండ మండలం నుండి గాని ఈజి ఫామ్ టూల్స్ కంపెనీ, జాజుల కుంట, ద్వారకా తిరుమల మండలం, ఏలూరు, ఆంధ్ర ప్రదేశ్ 966676665 ద్వారా ఖరీదుపై పొందవచ్చుని తెలిపారు. వేసవిలో ఆయిల్ ఫామ్ మొక్కల పాదుల్లో జనుము, జీలుగ విత్తనాలను విత్తుకోవాలని, సరిపోయే నారు అనగా పెద్దచెట్లకు 300 నుండి 350 లీటర్ల నీరు ప్రతీ చెట్టుకు అందించాలని, అబ్లేషన్ ప్రతి ఒక్కరు చేయాలని, డ్రిప్ ద్వారా సిఫార్సు చేసిన ఎరువులను అందించాలని తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ భాస్కర్, ఉద్యాన అధికారులు అధికారులు సునీల్ కుమార్, ఆయిల్ ఫామ్ కంపెనీ అధికారి అరవింద్, రైతులు రాజేశ్వర రావు, భూమా రావు, శేషగిరిరావు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలి:సిపిఎం పరకాల పట్టణ నాయకుడు మడికొండ ప్రశాంత్

పరకాలనేటిధాత్రి :

వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని సిపిఎం పరకాల పట్టణ నాయకుడు మడికొండ ప్రశాంత్ పిలుపునిచ్చారు.


మోసపూరిత విధానాలతో కేంద్రంలో బిజెపి మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని,బిజెపి విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని,ప్రజల మధ్య కులం మతం పేరుతో చీలికలను సృష్టిస్తూ,ప్రజా సమస్యలను చర్చ లేకుండా చేసిందని,గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోలు,డీజిల్ గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిసిందని,జీఎస్టీ పేరుతో ప్రజలపై అదనపు భారపు మోపిందని,పెద్ద నోట్లు రద్దుచేసి ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని,విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి భారతీయుడు ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని మోసం చేసిందని,సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు రంగం సిద్ధం చేసిందని,మరోసారి బిజెపి అధికారంలోకి వస్తే దేశాన్ని కార్పొరేటు సంస్థలకు అప్పజెప్పేందుకు సిద్ధమైందని ప్రజలపై భారాలు మోపేందుకు బిజెపి ప్రధానమని పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని ఓడించి బుద్ధి చెప్పాలని ప్రశాంత్ పిలుపునిచ్చారు.

బలరాం నాయక్ అఖండ విజయం తధ్యం

ఉఫాధి హమి ఫధకం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఉఫాధి హమి కూలీలకు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో న్యాయ్

భద్రాచలం నేటి ధాత్రి

బలరాం నాయక్ ని ఎంపిగా గెలిపించే భాధ్యత మనం తీసుకుంటే,కేంద్ర మంత్రి గా తిరిగి పంపించే భాధ్యత సోనియమ్మ తీసుకుంటుంది

ఏజెన్సి గ్రామాలను అభివ్రృధ్ధి చేసిన ఘనత బలరాం నాయక్ ది

మాజీ గ్రంథాలయ చైర్మన్ బోగాల శ్రీనివాస్ రెడ్డి

మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుకుంటూ మాజీ గ్రంథాల చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి భద్రాచల నియోజకవర్గ కేంద్రమైన భద్రాచలం పట్టణంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన పట్టణ ప్రజలతో మాట్లాడుతూ.

బలరాం నాయక్ కేంద్ర మంత్రిగా ఉన్న టైం లోనే వెంకటాపురం, భద్రాచలం నూతన బ్రిడ్జిను తీసుకురావడం జరిగిందని.

భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డును నేషనల్ హైవేగా పునరుద్ధరణ చేసి భద్రాచలం అభివృద్ధి చేసే బాధ్యత వలన తీసుకుంటారని,భద్రాచలం ప్రాంతం పై అమితమైన ప్రేమ,అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పం ఉన్న బలరాం నాయక్ గారిని మరొకసారి గెలిపించుకుని ఈ ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు దోహదపడాలని ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించారు.

ఈ ఎన్నికల ప్రచారంలో
ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాసమల రాము, కాంగ్రెస్ నాయకులు దుద్దుకూరు సాయిబాబా, ఇందుల రమేష్, మహిళ కాంగ్రెస్ నాయకులు తుమ్మల రాణి, కట్టా కళ్యాణి, పద్మప్రియ, రూపా దేవి కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో మాలోత్ కవిత గెలుపుకు కృషి చేయాలి

మాలోత్ కవిత గెలుపు ద్వారానే అభివృద్ధి కొనసాగుతుంది
హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

భద్రాచలం నేటి ధాత్రి

భద్రాచలం మండలం బూత్ కమిటీ ఇన్చార్జిల సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు

భద్రాచలం
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భద్రాచలం మండల బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు బూత్ కమిటీ ఇన్చార్జిల సమావేశం జరిగింది..

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కవిత గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉందని తెలంగాణ హక్కులు తెలంగాణ అస్తిత్వం కాపాడాలంటే పార్లమెంట్లో బిఆర్ఎస్ ఎంపీలు ఉండాలని కోరారు..
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారం కొచ్చి చేతులు ఎత్తేసారని ఆరోపించారు..
మహబూబాద్ పార్లమెంటు అభివృద్ధి జరగాలంటే మాలోత్ కవిత ను గెలిపించాలని పిలుపునిచ్చారు..
ఈ సమావేశంలో నియోజకవర్గ నాయకులు మానే రామకృష్ణ. మండల సమన్వయ కమిటీ సభ్యులు ఆకోజు సునీల్ కుమార్. పడిసిరి శ్రీనివాస్. ఉడతా రమేష్. రేపాక పూర్ణచంద్రరావు కోలా రాజు కాపుల సూరిబాబు నియోజవర్గ మహిళా నాయకులు వీరబోయిన వెంకట నరసమ్మ సీతా మహాలక్ష్మి మరియు మండల పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  బహిరంగ సభ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సభను జయప్రదం చేయండి! .ఐ ఎన్ టి యు సి నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి రాత్రి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకాశం స్టేడియం నందు నాలుగో తేదీన. ఉదయం “10:00” గం: లకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ బహిరంగ సభలో పాల్గొనున్నారు, ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి  .మల్లు బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవిన్యూ మరియు గృహ నిర్మాణ, సమాచార మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరియు ఉమ్మడి జిల్లాల శాసన సభ్యులు, స్థానిక శాసన సభ్యులు కూనంనేని సాంబశి వరావు పాల్గొనున్నారు, కావున ఈ యొక్క బహిరంగ సభను జయప్రదం చేయడానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఐఎన్టియుసి నాయకులు కార్యకర్తలు, ఉద్యోగులు, మిత్రులు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొన వలసిందిగా అందర్నీ కోరడమైనది, ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ త్యాగరాజు,కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్  పితాంబర రావు,  సీనియర్ నాయకులు ఆల్బర్ట్, కాలం నాగభూషణం, గుత్తుల సత్యనారాయణ, అభిషేక్, కార్పోరేట్ బ్రాంచ్ సెక్రటరీ మహేష్ కుమార్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపతి రావు ఫిట్ కార్యదర్శులు గోపు కుమార్ స్వామి, చిలక రాజయ్య, ఎండి సత్తార్ పాష ఈ మోహన్ రెడ్డి, సిహెచ్ సాగర్, పోశం శ్రీనివాస్,ఎస్.లక్ష్మణరావు,విప్లవ రెడ్డి, జల్లి కిరణ్, పి.ఆర్.సి.రెడ్డి,దుర్గ ప్రసాద్, శ్రీనివాస్, సురేంద్ర బాబు, శ్రీనివాస్, సుధాకర్, పరశురాం, నరేష్, రమేష్, రాజశేఖర్, ఐఎన్టియుసి నాయకులు, కార్యకర్తలు,మిత్రులు,శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొనడం జరిగినది

పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు చరిత్రను తిరగరాయనున్నారు.

నామా నాగేశ్వరరావు. ఖమ్మం నియోజవర్గంలోనే అత్యధిక మెజార్టీ రానుంది

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే ప్రజా ఆదరణ ఇప్పటికే సర్వే ఫలితాలు తేల్చాయి

నామా నాగేశ్వరరావు విజయం కోసం ప్రతి బూత్ లెవల్ కమిటీ సభ్యుడు గడపగడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించాలి

అసెంబ్లీ ఎన్నికలు అయిన అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత

ఖమ్మం జిల్లా ప్రయోజనాల కోసం తనదైన స్థాయిలో పార్లమెంట్ వేదికగా కృషిచేసిన మహోన్నతమైన వ్యక్తి. నామా నాగేశ్వరరావు

ఎంపీ రవిచంద్ర వద్దిరాజు ఖమ్మం తెలంగాణ భవన్లో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

ఖమ్మం కార్పొరేషన్ వన్ టౌన్. 3 టౌన్ బిఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ కమిటీ సభ్యులతో ఖమ్మం జిల్లా.బి ఆర్ ఎస్. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నందు నగర పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు. అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ.ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్, మాట్లాడుతూ. బూత్ కమిటీ సభ్యులకు డివిజన్ నాయకులకు, కార్యకర్తలకు బిఆర్ఎస్ పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ విషయాలను దిశా నిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఖమ్మం నగర మేయర్ నీరజ, సీనియర్ నాయకులు.ఆర్ జె సి కృష్ణ, వన్ టౌన్.3 టౌన్ కార్పొరేటర్లు మరియు డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు, బూతులు కమిటీ సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసులతో సమావేశమైన మానుకోట కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్

మహబూబాబాద్ పార్లమెంట్
పినపాక నియోజకవర్గం

భద్రాచలం నేటి ధాత్రి

బూర్గంపాడు మండల కృష్ణ సాగరంలో కాంగ్రెస్ నాయకులు బాదం రమేష్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఆదివాసుల సమావేశానికి ముఖ్య అతిధులుగా మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మరియు చత్తీస్గడ్ మాజీ మంత్రి జగదల్పూర్ పార్లమెంట్ అభ్యర్థి కోవాసి లక్మ పాల్గొని ప్రసంగించారు.

ఈ సమావేశంలో సుమారు 5000 మంది ఆదివాసులు ఉన్నారు

ఈ సమావేశంలో వలస దివసుల సమైక్య అధ్యక్షులు కరటం కోస, కార్యదర్శి వెట్టి బీమా, మడకం దేవా, కుంజ బద్రు, కుంజనందు, పదం రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎస్కే హనీఫ్, బాదం నాగిరెడ్డి, బోగల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

BRSపార్టీ మహాభూబాబాద్ లోక్ సభా అభ్యర్థి శ్రీమతి మాలోతు కవిత విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార రథాన్ని ప్రారంభించిన పార్టీ మండల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు

దుమ్ముగూడెం శుక్రవారం ఈరోజు మండలకేంద్రమైన లక్ష్మీనగరం BRSపార్టీ మండల కార్యాలయం ఆవరణంలో జరిగిన ప్రచారరధమును పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణమూర్తి MPP రేసు లక్ష్మీ పార్టీజండాను ఊపి ప్రారంభించారు

భద్రాచలం నేటి దాత్రి

ఈసందర్భంగా BRS పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ BRSపార్టీ మాహాభూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోతు కవిత ఎన్నికల గుర్తు కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని పార్లమెంట్ లో మన తెలంగాణా హక్కుల కొరకు మన గళం వినిపించే నాయకురాలు శ్రీమతి మాలోతు కవిత అని ఆమెను మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో మన నియోజకవర్గ నుండి అత్యంత మెజారిటీ ఓట్లు వేసి గెలిపించాలని గత 10 ఏండ్లలో KCR చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని KCR తెలంగాణా కు మొదటి ముఖ్యమంత్రిగా ఐ గ్రామాల లో మౌలిక వసతుల కల్పనకొఱకుప్రతి 500కుటుంబాలకు ఒక గ్రామపంచాయితిని చేసి పాలనను ప్రజలవొద్దకు వొచ్చేవిధంగా గ్రామాల అభివృద్ధి కి శ్రీకారం చేశారని అభివృద్ధి చేసే BRSపార్టీ అభ్యర్థి మలోత్ కవిత గెలుపే లక్ష్యం గా ప్రతి ఒక కార్యకర్త ఒకసైనికుడిలా పనిచేయాలని అన్నారు ఈకార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కణితి రాముడు.పార్టీ అధికారప్రతినిది MDజానీపాషా.పార్టీ ఉపధ్యక్షులు తునికి కామేష్.ప్రగళ్లపల్లి MPTCమడకం రామారావు. పార్టీ సోషల్ మీడియాఅధ్యక్షులు దామెర్ల శ్రీనివాసరావు.పార్టీ యూత్కమిటి కార్యదర్శి జీలకర్ర గంగరాజు.పార్టీ సీనియర్ నాయకులు కొండపల్లి నరేంద్ర.తంత్రంపల్లి వెంకటేశ్వరావు.నోముల రామిరెడ్డి.అనిల్. వాగే కిట్టు. శెట్టి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు

అధికారం కోసంమే కాంగ్రెస్ పార్టీ బోగస్ హామీలు.

బిఆర్ఎస్ తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగింది.

జెడ్పిటిసి గొర్రె సాగర్.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట‌్యాల మండలంలోని చింతకుంట‌రామయ్యపల్లి, చిట‌్యాల, ఏలేటిరామయ్యపల్లి, గ్రామాలలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రజలను కలిసి బిఆర్ఎస్ పార్టీ ఎంపి అభ్యర్థి డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలో గతంలో బిఆర్ఎస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు భీమా లాంటి అద్బుతమైన పథకాలు ఇవ్వడం జరిగిందని వివరించారు, కళ్యాణ లక్ష్మితో ఆడబిడ్డల తల్లిదండ్రులకు అండగా నిలబడ్డారని వృద్ధులకు వికలంగులకు ఒంట‌రి మహిళలకు ఆసరా ఫించన్లతో అండగా నిలబడ్డారని గుర్తు చేసారు, గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోగస్ హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని ఎన్నికల హామీలు అమలు చేయడంలేదని ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎంపి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఆరెపల్లి మల్లయ్య, మండల ప్రధాన కార్యదర్శి మడికోండ రవీందర్ రావు, పాండ్రాల వీరాస్వామి,టౌన్ అధ్యక్షులు బుర్ర శ్రీధర్, రమణాచారి, దామేర రాజు, పులి రవి, కందుల రమేష్, కట‌్కూరి రాజేందర్, బుట‌్టి ఉపేందర్ , లింగరెడ్డి, పోశాల రాజు,ఏకు ప్రవీణ్, దూడపాక సుమన్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version