జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
భూపాలపల్లి నేటిధాత్రి
శుక్రవారం స్వీప్ నోడల్ అధికారి జడ్పి సిఈఓ విజయలక్ష్మీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ క్రీడా మైదానం నుండి జయశంకర్ విగ్రహం వరకు ఓట్ ఫర్ షూర్ నినాదంతో నిర్వహించిన 5కే రన్ ను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరేలు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ
ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు పార్లమెంటు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కొరకు నిర్వహిస్తున్న
స్వీప్ కార్యక్రమములో భాగంగా ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన కల్పించి జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో పోలింగ్ శాతం పెంపొందించడానికి
5కే నిర్వహించడం జరిగిందన్నారు.
మే 13వ తేదీన జరిగే
పోలింగ్ ప్రక్రియలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ
బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ శాతం అధికంగా నమోదయ్యే విధంగా సహకరించాలని అన్నారు. వేసవి దృష్ట్యా ఉదయమే ఓటు హక్కు వినియోగానికి పోలింగ్ కేంద్రాలకు రావాలని సూచించారు. వృద్ధులు, దివ్యాన్గుల కోసం పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో నీడ కొరకు షామియానాలు, కుర్చీలు, మంచినీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ఓటు హక్కు వినియోగం ద్వారానే మంచి పరిపాలకులను ఎంచుకునే వజ్రాయుధం ఓటు హక్కు అని తెలిపారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తప్పని సరిగా ఎన్నికల్లో ఓటు వేయడమే కాకుండా తమ చుట్టుపక్కల వారికి, బంధు మిత్రులను కూడా ఓటు హక్కు వినియగించుకునేలా చైతన్య పరచాలని సూచించారు. ప్రజాస్వామ్యానికి మూలాధారమైన ఓటును ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిష్పక్షపాతంగా, స్వేచ్చగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ కోరారు.
ఎస్పి కిరణ్ ఖరే మాట్లాడుతూ ఎన్నికలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, స్వీప్ నోడల్ అధికారి విజయలక్ష్మీ, సిపిఓ శామ్యూల్, ఉద్యాన అధికారి సంజీవరావు, బిసి, ఎస్సి సంక్షేమ అదికారులు శైలజ, సునీత, జిల్లా ఆర్డీవో మంగీలాల్, పట్టణ ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు.