ఆశీర్వదించండి అండగా ఉంటా: *బూర నర్సయ్య గౌడ్*

*ఎక్కడికెళ్లినా భారీ ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు బిజెపి సైనికులు*

*నేటిధాత్రి స్టేట్ బ్యూరో:*
భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీబీనగర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత బిజెపి ఎంపీ అభ్యర్థి *డాక్టర్ బూర నర్సయ్య గౌడ్* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ గురించి ప్రధాని నరేంద్ర మోడీ గారితో కొట్లాడి ఒప్పించి ఎక్కడికో వెళ్లే హాస్పిటల్ ని మన బీబీనగర్ కి తీసుకొచ్చిన ఘనత తనదేనని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు *పాశం భాస్కర్ గారు*, రాష్ట్ర నాయకులు *గూడూరు నారాయణరెడ్డి గారు*,జిల్లా మరియు మండల,గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం పలువురు రాష్ట్ర స్థాయి గౌడ సంఘం నాయకులు మాజీ భువనగిరి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో బిజెపిలో చేరడం జరిగింది.

కేటీఆర్ రోడ్ షో @సీతాఫల్ మండి , అడ్డగుట్ట డివిజన్ లు

నేటిధాత్రి హైదరాబాద్:

బి.ఆర్.ఎస్ పార్టీ సికింద్రాబాద్ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ గారికి మద్దతు గా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అడ్డగుట్ట , సీతాఫల్ మండి డివిజన్ ల లో జరిగిన రోడ్ షో లో పాల్గొని ప్రసంగించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు సామల హేమ , లింగాని లక్ష్మీ ప్రసన్న , కంది శైలజ , రాసురి సునీత , బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు రామేశ్వర్ గౌడ్ , త్రినేత్ర గౌడ్ ,
కిషోర్ గౌడ్ , కిరణ్ గౌడ్…

పెద్ద ఎత్తున కేటీఆర్ , పద్మారావు గౌడ్ లకు ఘన స్వాగతం పలికిన బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు…

ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ కామెంట్స్…

మా అన్న కేసీఆర్ గారు నన్ను పిలిచి ఎం.పి గా నిలబడు అని చెప్పి పంపిండు.అమిత్ షా , యోగి ఆదిత్యనాథ్ లాంటి వారు కార్పొరేటర్ ఎన్నికలప్పుడు వచ్చిన కూడా బి.ఆర్.ఎస్ పార్టీ కె పట్టం కట్టిండ్రు. పార్లమెంట్ లో సికింద్రాబాద్ నుండి అడుగుపెట్టబోతున్నాం.
నాడు గల్లీ లో గెలిసినం , నేడు ఢిల్లీ లో గెలుస్తాం.ప్రతి గడప గడప లోని అక్కచెల్లెలు , అన్నదమ్ములు నాకు బాగా తెలుసు. సికింద్రాబాద్ లో లక్ష మెజారిటి తో గెలిచి చరిత్ర సృష్టించబోతున్నాం.
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి లో 11 శాతం ముందంజలో ఉన్నాం.

 

బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్..
2014 లో బడే భాయ్ మోడీ గారు మస్త్ కథలు చెప్పిండు. రూ. 15 లక్షలు, ప్రతి ఒక్కరికి ఇళ్లు, ప్రతి ఇంటికి నల్లా, రైతుల ఆదాయం డబుల్, బుల్లెట్ ట్రైన్ అని పెద్ద పెద్ద బిల్డప్ లు ఇచ్చిండు. నల్లధనం ఏదయ్యా మోడీ అంటే…తెల్లమొఖం వేసిండు.కిషన్ రెడ్డి ఎంపీ, కేంద్రమంత్రై ఐదేళ్లు అయ్యింది. పైసా పని చేయలేదు.ఆయన చేసిందల్లా కుర్, కురే ప్యాకెట్లు పంచుడే.
హైదరాబాద్ లో వరదలు వస్తే రూపాయి ఇయ్యలే. మెట్రో కు పైసా ఇయ్యలే.
కానీ గుజరాత్ లో వరదలు వస్తే మాత్రం మోడీ ప్రత్యేక విమానం వేసుకొని పోయి వెయ్యికోట్లు ఇచ్చిండు.
గుజరాత్ వాళ్లే ప్రజలా ? హైదరాబాద్ వాళ్లు ప్రజలు కాదా? …అడ్డగుట్టకు, సీతా ఫాల్ మండి డివిజన్ , సికింద్రాబాద్ కు ఏం చేసినవో చెప్పి ఓటు అడిగే దమ్ముందా కిషన్ రెడ్డికి.
సిగ్గు లేకుండా ఐఐటీలు ఇచ్చినమని చెప్పుకుంటున్నారు. ఒక్క స్కూల్ కూడా ఇయ్యలేదు.
ఈ ప్రధాని మోడీ పప్పు, ఉప్పు, చింతపండు అన్ని పిరం చేసిన పిరమైన ప్రధాని. మోడీ వచ్చిన నాడు ముడి చమురు వంద డాలర్లకు బ్యారెల్.
ఇప్పుడు ముడి చమురు బ్యారెల్ కు 84 డాలర్లు.
మరి తగ్గాల్సిన ధరలు ఎందుకు తగ్గలేదు. రూ. 70 పెట్రోల్ రూ. 110 అయ్యింది.పెట్రోల్, డిజీల్ మీద రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా రూ. 30 లక్షల కోట్లు వసూలు చేసిండు.
ఈ పైసలతో జాతీయ రహదారులు కట్టినా అంటాడు. మరి టోల్ ఎందుకు వసూల్ చేస్తున్నావంటే చెప్పడు.
మన ముక్కుపిండి వసూలు చేసిన రూ. 30 లక్షల కోట్లలో రూ. 14 లక్షల కోట్లు అదానీ, అంబానీలకు రుణమాఫీ చేసిండు.
నేను చెప్పింది అబద్దమని కిషన్ రెడ్డి నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.
ఈసారి సిక్రిందాబాద్ శాసన సభ్యుడే సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు కావాలె. హైదరాబాద్ లో మీరు మాకు ఎక్కువ సీట్లు ఇచ్చారు. అందుకు మీకు రుణపడి ఉంటాం.
జిల్లాలో ఉన్న వాళ్లే మోసపోయారని మీరు బాధపడుతున్నారు.
బడేభాయ్ బడా మోసం. రేవంత్ రెడ్డిది కూడా బడా మోసమే.బస్సు ఫ్రీ, మహిళలకు రూ. 2500, వృద్ధులకు 4 వేలు, తులం బంగారం, స్కూటీలు ఇస్తా అన్నాడు.రేవంత్ రెడ్డి చెప్పి వాటిలో ఒక్కటైనా వచ్చిందా?..కాంగ్రెస్ వస్తే మంచిది కాదని ముందే చెప్పినం. వాళ్ల కాళ్లు మంచివి కావు.కాంగ్రెస్ వచ్చింది. రాష్ట్రంలో కరెంట్, నీటి కష్టాలు మొదలైనయ్.
కేసీఆర్ గారు సీఎం కాలేదని మీరు బాధపడుతున్నారు కదా?..10-12 సీట్లు మీరు మాకిస్తే మళ్లీ రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ గారు శాసిస్తారు.ఖైరతాబాద్ లో మన పార్టీ నుంచి గెలిసినోడు కాంగ్రెస్ లో జొర్రిండు.దానం నాగేందర్ అవకాశ వాద రాజకీయ నాయకుడు. ఆయన మళ్లీ బీజేపీలో చేరడని గ్యారంటీ ఏందీ? ..ఇప్పుడొచ్చి ఓటు వేయమని అడుగుతుండు. ఎందుకు ఓటేయాలె. ఉన్న ఫించన్ ఎగకొట్టినందుకా?..
తులం బంగారం కాదు… ఉన్న లక్ష కూడా ఇవ్వనందుకా? కరెంట్ కష్టాలు తెచ్చినందుకా? ఎందుకు వేయాలె.2014, 2019 లో బీజేపీని రాష్ట్రంలో ఓడించింది బీఆర్ఎస్ మాత్రమే.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ తీస్ మార్ ఖాన్లను ఓడించింది కూడా బీఆర్ఎస్ మాత్రమే.
ఒక్కటే ఓటు తో అటు బడాభాయ్, చోట భాయ్ కు బుద్ధి చెప్పాలె.కేసీఆర్ గారికి తమ్ముడి లాంటి నేత పద్మారావు గౌడ్ గారు.
ఎన్ని కష్టాలు వచ్చినా సరే పద్మారావు గౌడ్ గారు కేసీఆర్ గారితోనే ఉన్నారు.
ఒక్క సికింద్రాబాద్ నుంచే పజ్జన్నకు 60 వేల మెజార్టీ ఇవ్వలే…

మల్కాజిగిరి నాదే..గెలిచేది నేనే: బిజేపి అభ్యర్థి ఈటెల రాజేందర్.

https://epaper.netidhatri.com/view/253/netidhathri-e-paper-4th-may-2024%09/2

 

ప్రచార వివరాలు, విషయాలు నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో ఈటెల రాజేందర్ పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే..

ప్రతి చోట, ప్రతి నోట కమలం పాటే.

కార్యకర్తలే బిజేపి బలం.

దేశం కోసం ధర్మం కోసం పని చేసేది బిజేపి మాత్రమే.

మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయం.

బిఆర్ఎస్ కు కాలం చెల్లింది.

కాంగ్రెస్ పని ఖతమైంది.

మళ్ళీ వికసించేది కమలమే.

మల్కాజిగిరి లో బిజేపి గెలిస్తే పుష్కలంగా నిధులు.

దేశం, రాష్ట్రం సుభిక్షంగా వుండాలంటే బిజేపి గెలవాలి.

అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

కాంగ్రెస్ కు ఓటు అడిగే నైతికతే లేదు.

ఈ పార్లమెంటు ఎన్నికలలో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి గెలిచేది నేనే నని, ఎగిరేది బిజేపి జెండానే అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు ఈ రోజు దేశం ఇంత ముందంజలో వుందంటే, అంతర్జాతీయ స్థాయిలో శాసించే స్థానంలో వున్నామంటే అందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కారణమన్నారు. మూడోసారి కేంద్రంలో గతం కన్నా ఎక్కువ మెజారిటీతో400 సీట్లతో బిజేపి రికార్డు గెలుపు ఖాయమన్నారు. బిజేపికి కార్యకర్తలే తనకు పెద్ద బలమన్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా, నిస్వార్థ పూరితంగా పార్టీ కోసం పని చేసే నాయకులు కేవలం ఒక్క బిజేపిలోనే వుంటారని ఈటెల అన్నారు. దేశం కోసం ధర్మం కోసం పని చేసే గొప్ప యంత్రాంగం బిజేపి సొంతమని కొనియాడారు. నాయకులుగా మేము తిరగలేని ప్రతి గడపకు ఒకటికి నాలుగుసార్లు ప్రజల వద్దకు వెళ్ళి ప్రచారం చేస్తున్న కార్యకర్తల సేవలు ఎంతో గొప్పగా వున్నాయన్నారు. వాళ్ల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని అన్నారు. అంతేకాదు బిజేపిలో పని చేస్తున్నందుకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించమని గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నా, వేధిస్తున్నా లెక్క చేయని గుండె ధైర్యం బిజేపి కార్యకర్తల సొంతమని ఈటెల కొనియాడారు. తాను ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఎంతో సాదరంగా ఆహ్వానిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమ కారుడిగా తన‌ పోరాటం ప్రజలక తెలుసు. కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రాణాలకు తెగించి నేను పని చేసిన రోజులు ప్రజలు మర్చిపోలేదు. అందుకే ఎక్కడికి వెళ్లినా నన్ను గెలిపించుకోవడం మా కర్తవ్యం అని ప్రజలు ఇస్తున్న భరోసా ఇస్తున్నారు.‌ అది నాకు కొండంత బలాన్నిస్తుందన్నారు. మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికలలో తనను ఆశీర్వదించి గెలిపించాలని ఈటెల రాజేందర్ ప్రజలను‌ కోరారు. దేశంలో ఎవరి నోట విన్నా కమలం మాట, పాటే వినిపిస్తుందన్నారు. ప్రతి చోట కమలమే వికసిస్తుందని చెప్పారు. మల్కాజిగిరిలో బిజేపి జెండా ఎగురుతుందన్నారు. తన గెలుపు ఎప్పుడో ఖాయమైందని రాజేందర్ చెప్పారు. తెలంగాణలో బిఆర్ఎస్ కు కాలం చెల్లిందని ఈటెల అన్నారు. నమ్మినందుకు ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్ పని కూడా పార్లమెంటు ఎన్నికలలో ఖతమౌతుందన్నారు. మల్కాజిగిరిలో వికసించేది కమలమే అన్నారు. మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థిగా ఈటెల రాజేందర్ పేరు ప్రకటించగానే బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయని ఈటెల గుర్త చేశారు. తెలంగాణ ఉద్యమ కారుడిగా ప్రజల గుండెల్లో వున్న నాయకుడుగా ప్రజల్లో ఎంతో నాకు ఎంతో గుర్తింపు వుంది. కేసిఆర్ గుండెల్లో నిద్రపోయిన నాయకుడు ఈటెల రాజేందర్ అని జనం అంటుంటే స్వయంగా విన్నాను. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి, శ్రామిక, పీడిత, కార్మిక వర్గాలకు అండగా నిలిచిన నాయకుడు ఈటెల రాజేందర్ అని ప్రచారంలో ప్రజలే అంటున్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కోసం నిరంతరం తపిస్తూ, పోరాటం చేసే ఈటెల రాజేందర్ ను గెలిపించుకోవడం మన బాధ్యత అని ప్రజలు చెబుతున్నారు. గత ఎన్నికలలో గెలిచిన రేవంత్ రెడ్డి కనీసం మల్కాజిగిరి ప్రజలకు కనీసం ఐదు పనులు చేయలేదని, జనం ముందుకు ఐదు రోజులు కూడా రాలేదని ఈటెల ఆరోపించారు. ‌ఇప్పుడు ఎక్కడో వుండే సునీత మహేందర్ రెడ్డిని నిలబెట్టి రేవంత్ రెడ్డి మొహం చాటేసుకున్నాడు. అది చాలు బిజేపి గెలుపును తేల్చేయడానికి అని ఈటెల చెప్పారు. బిఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకమైందని ప్రజల్లో ఎప్పుడూ వున్నది, వుండేది ఒక్క బిజేపి మాత్రమే అని ఈటెల అన్నారు. తనను ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను ఈటెల కోరారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించింది. తెలంగాణ ఐటి కారిడార్, ఫార్మా హబ్, సిమెంట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తో పాటు పేద ప్రజలకు ఇండ్ల నిర్మాణం ఒక్క బిజేపితోనే సాద్యం. దేశ ఉజ్వలమైన భవిష్యత్తు బిజేపి పార్టీతోనే సాధ్యమౌతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పాలన వల్లనే దేశంలో వెలుగులు నిండాయన్నారు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా వుండాలంటే కేంద్రంలో మూడోసారి బిజేపి అధికారంలోకి రావాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం ఎంతో ముందుకు వెళ్తోందని, అన్ని రంగాలలో పురోగమిస్తోందన్నారు. దేశమంతా నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అన్నాడు. మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలు తనను మంచి మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.‌ దేశంలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశమే లేదన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి పొరపాటున తెలంగాణలో ఓటేస్తే చేజేతులా మనమే అభివృద్ధిని చెడగొట్టుకున్నట్లౌతుందన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెప్పి, అలవి కాని హమీలు ఇచ్చి కాంగ్రెస్ గెలిచిందని ఈటెల విమర్శించారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు మర్చిపోయాడని, మూడు నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు.‌ రేవంత్ రెడ్డికి కేంద్రం నుంచి నిధులు తెచ్చే పరిస్థితి వుండదని అన్నారు. తెలంగాణలో పార్లమెంటు సీట్లు బిజేపి గెలిస్తే పెద్ద ఎత్తున కేంద్ర నిధులు తేవడానికి, తెలంగాణ ను అభివృద్ధి చేయడానికి అవకాశం వుంటుందన్నారు. మల్కాజిగిరి ప్రజలు తనను గెలిపించాలని, కేంద్రం నుంచి ఇతోధికంగా నిధులు తెచ్చి తెలంగాణలోనే మల్కాజిగిరిని నెంబరు వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని కలిసి ఒప్పించి, తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు నిధులు తెస్తానని అన్నారు. తెలంగాణలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు తెప్పిస్తానన్నారు. యువత ఉపాధి కోసం కృషి చేస్తానని ఈటెల రాజేందర్ చెప్పారు. గత ఎన్నికలలో రేవంత్ రెడ్డి ని ప్రజలు గెలిపిస్తే ఒక్క నాడు నియోజకవర్గానికి వచ్చింది లేదు.‌ కేంద్రం నుంచి నిధులు తెచ్చింది లేరు. రూపాయి పని చేసింది లేదు. కరోనా కాలంలో ప్రజల వద్దకు వచ్చింది లేదు.‌ కాంగ్రెస్ తరుపున సాయం చేసింది లేదు. ఒక్కరికి కూడా రేవంత్ రెడ్డి వైద్య సదుపాయం కల్పించింది లేదు. పేదలను ఆదుకున్నది లేదు. వరదలొచ్చినప్పు కనీసం ప్రజలను పట్టించుకున్నది లేదు. ప్రజలను పరామర్శించింది. కరోనా కాలంలోనైనా, కరువు కాలంలోనైనా, వదరలొచ్చినా ప్రజలకు అండగా నిలిచింది బిజేపి పార్టీయేనని ఈటెల అన్నారు. అందువల్ల నిత్యం ప్రజల్లో వుండే, ప్రజలకు అందుబాటులో వుండే, ప్రజాసేవకే అంకితమైన జీవితం నాదే అని ఈటెల కుండ బద్దలు కట్టినట్లు చెప్పారు. గత రెండు నెలలుగా ప్రజల్లో వున్నది నేనే…ప్రజలను ఒకటికి నాలుగుసార్లు కలిసి, మల్కాజిగిరి సమస్యల మీద అధ్యయనం చేసింది నేనే. అందుకే నాకు సంపూర్ణ విశ్వాసం వుంది. ప్రజల మీద నమ్మకం వుంది. మా బిజేపి నాయకులు, కార్యకర్తలు, బిజేపి అనుబంధ సంస్థల మీద అపారమైన భరోసా వుంది. నేనే గెలుస్తానన్న ఆత్మస్థైర్యం నాలో కలిగింది. అందుకు నాకోసం పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా కోసం బిజేపి శ్రేణులు పడుతున్న శ్రమ వృధా కాదు. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులలో బిఆర్ఎస్, కాంగ్రెస్‌లను నమ్మే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్లంతా అవకాశ వాదులు. దేశం కోసం ధర్మం కోసం పని చేసేది బిజేపి ఒక్కటే.

కావ్యదే వరంగల్‌!

https://epaper.netidhatri.com/

`కావ్య గెలుపు నల్లేరు మీద నడకే.

`అన్ని వర్గాల ఆదరణ కావ్యకే.

`మహిళా లోకం మద్దతు కావ్యకే.

`బిఆర్‌ఎస్‌, బిజేపికి ఇక చుక్కలే.

`వరంగల్‌ లో బలంగా కాంగ్రెస్‌.

`అడ్రస్‌ గల్లంతైన బిఆర్‌ఎస్‌.

`అంతంతమాత్రంగానే బిజేపి.

`ప్రచారంలో దూసుకుపోతున్న కావ్య.

`మహిళల మంగళహారతుల స్వాగతాలు.

`పల్లెల్లో సంబురంగా ప్రచారం.

`మండుటెండల్లోనూ కాంగ్రెస్‌ కార్యకర్తల్లో కనిపిస్తున్న ఉత్సాహం.

`కావ్య గెలుపు కోసం కాంగ్రెస్‌ శ్రేణుల సంకల్పం.

`విభేదాలు అభూత కల్పనలు.

`పార్టీ బలంగా వున్నప్పుడే ఇలాంటి ఆరోపణలు.

`ఎన్నికలను కాంగ్రెస్‌ జారవిడుచుకోదు.

`అధికారంలో వుండి ఏ ఒక్క సీటు వదులుకోదు.

`వరంగల్‌ లో కారుకు లేదు చోటు.

` ఆ పార్టీ ప్రచారానికే దిక్కులేదు.

`కావ్యకు ఎదురులేదు.

`కావ్య గెలుపుకు తిరుగులేదు.

`కడియం రాజకీయ చాణక్యం…విజయాలన్నీ శ్రీహరి సొంతం.

`సొంతంగా ఎదిగిన నేత ‘‘శ్రీహరి’’.

`మచ్చలేని నాయకత్వం ‘‘శ్రీహరి’’ది.

`‘‘శ్రీహరి నిజాయితీ’’..’’కావ్యకు వరం’’.

`వరంగల్‌ లో కాంగ్రెస్‌ గెలుపుకు మార్గం.

`కావ్య గెలుపు వరంగల్‌ కాంగ్రెస్‌ సమిష్టి విజయం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

వరంగల్‌ పార్లమెంటు అభ్యర్ధి కడియం కావ్య గెలుపు నల్లెరు మీద నడకే అనిపిస్తోంది. ఒక బలమైన నాయకుడి వారసురాలిగా, మానవతా విలువలున్న వైద్యురాలిగా, సామాజిక సేవకురాలిగా కావ్యకు ఎంతో గుర్తింపు వుంది. ఆమె చేసిన సామాజిక సేవ కార్యాక్రమాలతో ఆమెకు ఇప్పటికే ప్రజల్లో ఎంతో పేరుంది. మంచి గుర్తింపు వుంది. అందుకే కావ్య కేంద్రంగానే వరంగల్‌ పార్లమెంటు ఎన్నికల చర్చ జోరుగా సాగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే కావ్య పేరు తెరమీదకు వచ్చినప్పటి నుంచే ఆమె గెలుపుపై అనేక అంచానాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌తో ఆమె గెలుపు ఖాయమైంది. ఎందుకంటే కడియం శ్రీహరికి వున్న పేరు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎవరకీ లేదు. ఉమ్మడి వరంగల్‌రాజకీయాలను కొన్ని దశాబ్ధాల పాటు శాసిస్తున్న నాయకుడు కడియంశ్రీహరి. ఆయనకు ప్రజా సమస్యలు తెలుసు. ప్రజలు ఎదుర్కొనే బాధలు తెలుసు. వాటి పరిష్కారం తెలుసు. వరంగల్‌ బాగోగులు ఆయనకు మాత్రమే తెలుసు. అందుకే ఆయన కాలాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలలో గుర్తింపు లభించింది. అన్ని పార్టీలలోనూ పెద్ద పీట వరించింది. ఆయన నిస్వార్ధ పూరితమైన ప్రజా సేవ వరంగల్‌ ప్రజలందరికీ తెలుసు. అందుకే ఆయనకు అంతటి గుర్తింపు. ఆ క్రమంలోనే ఆయన జిల్లా రాజకీయాలనే కాదు, జిల్లా అభివృద్దిలో ఆయన పాత్ర ఎంతో గొప్పది. కడియం ప్రాతినిధ్యం అంత గొప్పగా సాగింది. ఆయన చేసిన ప్రజా సేవ ఆయన కూతురు కావ్య కూడా పునికి పుచ్చుకున్నది. చిన్న వయసులోనే ఆమె అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేసింది. వైద్యురాలిగా పేదల గుండెల్లో గూడు కట్టుకొని వుంది. ప్రభుత్వ వైద్యం అంటే చాలా మందికి చిన్న చూపు వుండేది. కాని కడియం కావ్య లాంటి వైద్యుల మూలంగా ప్రభుత్వ వైద్యానికి కూడా పేరొచ్చింది. ఉపాధ్యాయుడుగా కడియం శ్రీహరి రేపటి తరాన్ని తీర్చిదిద్దారు. నాయకుడిగా వచ్చే తరానికి బాటలు వేశారు. ప్రజా సేవకుడిగా తన కూతురుకు సామాజిక సేవను, బాధ్యతను నేర్పారు. అందుకే ప్రజలు కావ్యను ప్రచారంలో ఎంతో ఆదరిస్తున్నారు. ఓ వైపు బలమైన కాంగ్రెస్‌ పార్టీ తోడుగా, నాయకుల అండగా, కుటుంబ నేపధ్యం ఆసరాగా, తండ్రి శ్రీహరి సేవలు బాసటగా అన్ని రకాలుగా కావ్య గెలుపుకు కారణం కానున్నాయి.
వరంగల్‌ నియోజకవర్గంలో ఎక్కడ విన్నా కావ్య పేరు తప్ప మరొకరి పేరు వినిపించడం లేదు.
ఇతర పార్టీల నేతలకు అంతగా గుర్తింపు లేదు. జిల్లా రాజకీయాల్లో భీష్ముని పాత్రలో వున్న కడియం ఆశీస్సులతోనే చాలా మంది ఎదిగారు. నాయకులయ్యారు. ఆయన ఒక రాజకీయ పాఠశాల. కడియం స్కూలుకు అంత పేరుంది. అంత బలముంది. అదే కావ్యకు వరం కానుంది. అంతే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వుంది. ఆరు గ్యారెంటీలతో ప్రజల మన్ననలు పొంది కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ఎంతో బలంగా వుంది. ప్రజలు కూడా కాంగ్రెస్‌ను ఎంతో ఆదరిస్తున్నారు. ఇప్పటికే అమలౌతున్న ఆరు గ్యారెంటీలు ప్రజల్లో ఎంతో విశ్వాసం నిండి వున్నాయి. తెలంగాణలో ప్రజా పాలన వచ్చిన తర్వత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో జవాబుదారి పాలన మన కళ్ల ముందు ఆవిష్కృతమైంది. అందువల్ల ప్రజలు కాంగ్రెస్‌కు పార్లమెంటు ఎన్నికల్లో బ్రహ్మరధం పడుతున్నారు. కావ్య ప్రచారానికి ప్రజలు స్వచ్చందంగా తరలి వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు పెద్దఎత్తున కావ్యను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఎక్కడికెళ్లినా మంగళహారతులతో స్వాగతం పలికి దీవిస్తున్నారు. గెలిపిస్తామంటూ మాట ఇస్తున్నారు. కడియం కావ్యకు కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ప్రకటించగానే రాజకీయ వాతావరణమంతా ఒక్కసారిగా మారిపోయింది. ఎండాకాలంలో ఉక్కపోత పెరిగినట్లు ఇతర పార్టీలకు ఊపిరి సలపకుండా పోయింది. జిల్లాలోని నాయులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులంతా ఎంతో కష్టపడి కావ్య కోసం పనిచేస్తున్నారు. కావ్య గెలుపు ఇప్పటికే ఖాయమైంది. కాకాపోతే మంచి మెజార్టీ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి.
వరంగల్‌ పార్లమెంటు పరిధిలో కావ్యకు ప్రజల ఆదరణ చూసి ఇతర పార్టీలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.
ఎక్కడ చూసినా కావ్య ప్రచారంలో దూసుపోతున్నారు. ఇతర పార్టీలు ప్రచారంలో బాగా వెనుకడి వుండడమే కాదు, కావ్యను ఢీ కొనడం అంత సులువు కాదని చేతులెత్తేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వరంగల్‌లో ఇప్పటికే బిఆర్‌ఎస్‌ పరిస్ధితి గల్లంతైంది. ఆ పార్టీ మెజార్టీ ఎమ్మెల్యే సీట్లు కోల్పోయింది. ఆయా స్ధానాలలో కాంగ్రెస్‌ బలం వెయ్యి రెట్లు పెరిగింది. పదేళ్లుగా ప్రతిపక్షంలో వున్న కాంగ్రెస్‌ ప్రజల్లో నిండిపోయింది. ఇప్పుడు బలమైన నాయకత్వంతో వుంది. వరంగల్‌పార్లమెంటు పరిధిలో వున్న అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ కాంగ్రెస్‌ చేతిలోనే వున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకుల ఓట్లు చాలు..కావ్య బంపర్‌ మెజార్టీతో గెలుస్తుంది. ప్రజల ఓట్లు తోడైతే రికార్డు మెజార్టీ సొంతం కావడం ఖాయం. అంత గొప్పగా ఆయన విజయం కళ్ల ముందు కనిపిస్తోంది. ఇక బిజేపి పరిస్ధితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరంగల్‌లో బిజేపికి అంత అనుకూలత లేదు. నాయకులు లేరు. కార్యకర్తలు లేరు. జాతీయ పార్టీగా ఎన్నికల్లో తలపడడం తప్ప, గెలుపు కోసం చేసే ప్రయత్నం అన్నది ఆ పార్టీకి కల్ల. వరంగల్‌లో కారు ఎప్పుడో షెడ్డుకు పోయింది. ఇక అది బాగు పడేదిలేదు. కాంగ్రెస్‌ను ఢీ కొట్టే పరిస్దితి లేదు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పాలనలో ఎంతో సంతోషంగా వున్నారు. వివాదాలు లేవు. విమర్శలు లేవు. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా వున్నారు.
జాతీయ స్దాయిలో కూడ ఈసారి కాంగ్రెస్‌ పార్టీకి మంచి ఊపు కనిపిస్తోంది.
బిజేపి పదేళ్ల కాలంలో ప్రజలను పీల్చుకుతిన్నది. ధరల మోతతో సామాన్యును నడ్డి విరిచింది. కాంగ్రెస్‌ పాలనలో రూ.400 వందలున్న సిలిండర్‌ ధర మూడు రెట్లు పెంచారు. బిజేపి అదికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెంచారు. ఇలా చెప్పుకుంటూ పోతే బిజేపి దేశానికి చేసిందేమీ లేదు..దేశంలో నిర్మాణమైన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్‌ హయాంలో నిర్మాణం చేసినవే. దేశానికి అన్నం పెడుతున్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్‌ పాలనతో కట్టినవే. అంతే కాదు ఉత్తర తెలంగాణకు జీవమైన దేవాదుల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది కడియం శ్రీహరే..కావడం విశేషం. దేశంలో సేవా రంగాలలో ప్రజలకు ఎనలేని సేవ చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. అందుకే పదేళ్లుగా బిజేపిని ఆదరించిన ప్రజలు , ఇక బిజేపికి దేశ వ్యాప్తంగా చరమగీతం పాడనున్నారు. మళ్లీ కాంగ్రెస్‌ వస్తేనే దేశం సస్యశ్యామలమౌతుంది. వైద్యరంగంలో సాగు రంగంలో పురోగమిస్తుంది. దేశానికి అన్నం పెడుతుంది. కాని బిజేపి పెత్తందారులు కొమ్ముకాస్తుంది. పారిశ్రామిక వేత్తలకు అండగా వుంటుంది. సామాన్యులను పీడిరచుకుతింటుంది. ఇవన్నీ అంశాలు కాంగ్రెస్‌కు ఈసారి ఎంతో అనుకూలం కానున్నాయి. అందులో వరంగల్‌ లో కావ్య గెలుపు బాటలు వేయనున్నాయి.
తండ్రి శ్రీహరి సామాజికసృహను వారసత్వంగా స్వీకరించి కావ్యకు పేద ప్రజలంటే ఎంతో ఇష్టం.
ఆమెకు పేదలంటే ప్రాణం. ఎంతో మందికి ఉచిత వైద్యం అందించింది. ఎంతో మంది పేదలను ఆదుకున్నది. అందులో భాగంగా మానవత్వాన్ని చాటుకున్న కావ్య ఐనవోలు గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన ఇద్దరు పిల్లలను చేరదీసి, వారి ఆలనా పాలనా గత కొన్నేళ్లుగా చూస్తున్న గొప్ప వ్యక్తిత్వం వున్న నాయకురాలు కావ్య. ఆ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. వారికి జీవితాలకు అండగా వున్నారు. ఇలా కావ్య చేసిన అనేక సామాజిక కార్యక్రమాలు ప్రజలకు తెలుసు. అందువల్ల కావ్య ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు. ఆశీర్వదిస్తున్నారు. గెలిపిస్తామని మాటిస్తున్నారు. గెలుపు కావ్యదే అని భరోసా ఇస్తున్నారు. ప్రజల స్పందనతో ఇతర పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెతున్నాయి. ఇంత దాక వచ్చిన తర్వాత తమ ప్రచారం కూడా వృధా అని చేతులెత్తేస్తున్నారు. వాళ్లు కూడా కావ్యకు ఎంత మెజార్టీ రావొచ్చో అన్న విషయలను చర్చించుకుంటున్నారు. కావ్య విజయం గురించే మాట్లాడుకుంటున్నారు.

చివరి రక్తపు బొట్టు వరకు ……ప్రజాక్షేత్రంలోనే ఉంటా.

#రాష్ట్రంలోనే అత్యధిక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా.

#మండు వేసవిలో కూడా చెరువులను మత్తల్లు పోయించిన ఘనత కేసిఆర్ కే దక్కుతుంది.

#50 శాతం ఇన్పుట్ సబ్సిడీ తీసుకువచ్చి రైతాంగాన్ని ఆదుకున్న.

#బోగస్ హామీలు ఇచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కింది.

#తాజా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి: అమలు కాని హామీలను ఎరచూపి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిందని తాజా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం మండలంలో పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం ఆయా గ్రామాలలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్ తో అండగా నిలబడి ఆదుకున్న ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని అన్నారు గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక బోగస్ హామీలు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకొని మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని అన్నారు గత ప్రభుత్వ హయాంలో మండు వేసవిలో సైతం చెరువులన్నీ నిండుకుండలా ఉండి మత్తల్లు పోయించిన ఘనత కెసిఆర్ కె దక్కుతుంది కానీ ఇప్పుడు రాష్ట్రంలో నీళ్ల కోసం గొంతెండే పరిస్థితి రావడానికి కారణం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం ఒకప్పుడు పంటల కోసం కాలం కాకపోతే రైతులు మేఘాల వైపు చూసే వాళ్ళు కానీ ఇప్పుడు రైతులు కెసిఆర్ వైపు చూస్తున్నారు గత ఏడాది వడగళ్ల వానల వల్ల పంట నష్టపోయిన రైతులకు పదివేల రూపాయలు నష్టపరిహారం అందించి ఆదుకున్నామని ఇప్పుడున్న ప్రభుత్వం మొన్నటికి మొన్న అకాల వర్షాలు వచ్చి రైతులు నష్టపోతే కనీసం పంటలను పరిశీలించిన పాపాన పోలేదు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనటువంటి 50% ఇన్పుట్ సబ్సిడీ తో రైతుల కోసం వ్యవసాయ యాంత్రికరణ పథకాన్ని తీసుకువచ్చి నియోజకవర్గంలో ప్రతి ఒక్క రైతు లబ్ధి పొందే విధంగా కృషి చేశానని అలాగే మండల మిర్చి రైతుల కోసం కన్నారావుపేటలో రాష్ట్రస్థాయి మిర్చి పరిశోధన కేంద్రాన్ని తీసుకువచ్చి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది నేను ప్రజల కోసం ఇంత కష్టపడి చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తే ప్రజలు నన్ను పక్కన పెట్టి ఇంత నష్టపరుస్తారని కలలో కూడా అనుకోలేదు గత ఎనిమిది సంవత్సరాల ఉపాధి హామీ పనులకు ఎన్నడూ రానంత కూలీలు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రైతులను కూలీలుగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు మేలు జరుగుతుందని పదేపదే చెప్పినా కూడా పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మద్దతు ధరపై 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వడం లేదు ఉపాధి హామీ కూలీలకు 15000 , కౌలు రైతులకు 12000 , రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేస్తామన్నారు కానీఇప్పటివరకు అమలు చేయలేదు మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని చిద్రం చేసి తద్వారా రైతులందరినీ కూలీలుగా మార్చింది నమ్మిన రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పాలి నేను ప్రజల మనిషిని ప్రజా క్షేత్రంలో ఓడిన ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసమే పోరాడే వ్యక్తిని కాబట్టి ప్రజలు గతంలో చేసిన తప్పును మళ్లీ చేయకుండా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మాలోత్ కవిత కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్లీ బిఆర్ఎస్ పార్టీ పునర్ వైభవాన్ని తీసుకువచ్చే విధంగా పార్టీ కార్యకర్తలు ప్రజలు కృషి చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, పిఎసిఎస్ చైర్మన్ మురళీధర్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్,నాయకులు గందే శ్రీనివాస్ గుప్తా, సమ్మయ్య నాయక్, శివాజీ, మామిండ్ల మోహన్ రెడ్డి, ప్రతాప్ సింగ్, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పాలకుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం

పాలకుర్తి నేటిధాత్రి

ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు, పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించటానికై ఈ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటామని పాలకుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గూడూరు లెనిన్ అన్నారు. దీనిలో భాగంగా పాలకుర్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకొని రోగులకు పండ్ల పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో గౌరవ అధ్యక్షుడు మాసంపల్లి నాగయ్య, ప్రధాన కార్యదర్శి చేరిపల్లి అశోక్, కమ్మగాని నాగన్న, బండిపల్లి మధు, కొండపల్లి కుమారస్వామి, గాదెపాక కిరణ్, కొత్తకొండ వాసు, వన్నాల ధనుంజయ, అబ్బోజ్ యాకస్వామి, తూటి పర్శరాములు, గజ్జి సంతోష్ కుమార్, కమ్మగాని వెంకన్న, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

హోమ్ ఓటింగ్ ప్రారంభించిన రిటర్నింగ్ ఆఫీసర్

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తుమ్మలగూడెం గ్రామపంచాయతీలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వికలాంగులకు మరియు వృద్ధులకు హోమ్ ఓటింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ ఆఫీసర్ మరియు తహసిల్దార్ గ్రామపంచాయతీ సెక్రటరీ మధు స్పెషల్ ఆఫీసర్స్ పాల్గొన్నారు

కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా పని చేయాలి

కాంగ్రెస్ పార్లమెంటరీ సన్నహాక సమావేశంలో బూత్ కమిటీలకు పిలుపు

-వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి

హసన్ పర్తి / నేటి ధాత్రి

మే 13 న జరిగే లోకసభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలుపే ధ్యేయంగా పనిచేయాలని బూత్ కమిటీలకు, కార్యకర్తలకు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. శుక్రవారం హన్మకొండ ఎర్రగట్టుగుట్ట, కే ఎల్ ఎన్ కన్వెన్షన్ లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన హాసన్ పర్తి మండల బూత్ కమిటీల సమావేశంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తో కలిసి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి డా. కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.కడియం కావ్య మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని, పార్లమెంట్ ఎన్నికల్లో బూత్‌కమిటీ సభ్యులే కీలకం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ కు ఓటు వేయించే బాధ్యతను తీసుకోవాలని, వర్ధన్నపేట అభివృద్ధిని పక్కన బెట్టి భూ కబ్జాల పై దృష్టి పెట్టిన అరూరికి అసెంబ్లీ ఎన్నికలల్లో ప్రజలు బుద్ది చెప్పాలన్నారు.
చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకే బీజీపీలో చేరిన ఆరూరికి మరోసారి బుద్ది చెప్పాలని, కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే మతతత్వం పెరిగిపోతుందని విమర్శించారు.
పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పి, కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలో తీసుకురావాలని,
మీ ఇంటి బిడ్డగా నిండు మనసుతో ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఎన్నికలు పూర్తి అవ్వగానే … శ్రీరాం సాగర్, దేవాదుల కల్వల ద్వారా రెండు పంటలకు సాగు నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటా.. మడికొండ డంపింగ్ యార్డు తరలింపు విషయంలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.అంత అవగాహన లేకుండా నేను మాట్లాడను. జన వాసాలకు దూరంగా డంపింగ్ యర్డ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా. రాజ్యాంగాన్ని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాలి అంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలి. బిజెపి గత పదేళ్ల లో తెలంగాణకు చేసింది ఏమి లేదు. తెలంగాణ లో బీజేపీ ఎం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందని, విభజన చట్టంలోలోని ఏ ఒక్క హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చ లేదు. బీజేపీకి ఓటు వేసి బ్రతుకులను ఆగం చేసుకోవద్దు. బీజేపీ అభ్యర్థి గత పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నాడని ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్ లొనే వందల ఎకరాల భూములు, పదుల సంఖ్యలో ఇల్లులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆస్తులు అన్ని ఎక్కడి నుండి వచ్చాయి. అవినీతి, అక్రమాలు, భూకబ్జాల ద్వారానే వచ్చాయి కదా అని ప్రశ్నించారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య చెతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, డీసిసిబి చైర్మన్ మార్నెని రవీందర్ రావు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దొమ్మటి సాంబయ్య, పెరుమాండ్ల రామకృష్ణ, స్థానిక కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, బూత్ కమిటీ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఫోటోగ్రాఫర్ కుటుంబానికి లక్ష రూపాయల చెక్కు అదంజేత

– అంతిమ యాత్రలో పాల్గొన్న ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గం
మంగపేట నేటిధాత్రి

గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మండలానికి చెందిన బందెల సాంబయ్య కుటుంబానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్ల
సంక్షేమ సంఘం, మండల ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం నుండి లక్ష రూపాయల చెక్కును సంఘం జిల్లా అద్యక్షుడు గాదె లింగమూర్తి, సీనియర్ నాయకులు
గడదాసు సునిల్ కుమార్, వడ్లకొండ శ్రీనివాస్ లు అందజేశారు. శుక్రవారం సాంబయ్య అంత్య క్రియల్లో పాల్గొన్న సంఘం జిల్లా, మండల కార్యవర్గ సభ్యులు
ముందుగా సాంబయ్య మృతదేహానికి పూల మాలలతో నివాళులర్పించి సాంబయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును అడిగి
తెలుసుకున్నారు. సాంబయ్య ఉమ్మడి వరంగల్ జిల్లా సంఘంలో శాశ్వత సభ్యత్వం ఉన్నందున సంఘం నుండి 60 వేలు, రోడ్డు ప్రమాదంలో అకాల మరణం
చెందినందున మరో 10 వేలు, మంగపేట మండల సంఘం నుండి 30 వేలు ఆర్ధిక సమాయం అందజేసినట్లు తెలిపారు. లక్ష రూపాయలను సాంబయ్య ఇద్దరు
పిల్లల పేరున చెరో 50 వేలను బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి వారికి అందజేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా మండల ఫోటో గ్రాఫర్ల సంఘం నుండి దాతల
సహాయంతో సేకరించిన నిధులను సైతం సాంబయ్య దశదినకర్మ రోజుల అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గడదాసు
సునీల్ కుమార్, కోశాధికారి వెన్నం సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కందికొండ శ్యామ్, రెడిన్ డిజీ ప్రెస్ రాము, సీనియర్ ఉపాద్యక్షుడు వడ్లకొండ శ్రీనివాస్,
మండల సంఘం అద్యక్షుడు అక్క పెళ్లి నరేష్, మండల ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి కార్తీక్, కోశాదికారి వడ్లకొండ ప్రవీణ్ కుమార్, సభ్యులు కోడం రాజు, పల్లాపు
రమేష్, శివ మహేష్, ఇప్పాల నరేష్, ఉగ్గమల్ల గణేష్, మంగపేట, ఏటునాగారం మండలాల ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు

రాజ్యాంగ మార్పును సహించబోము

జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెంటయ్య

కొల్చారం,( మెదక్) నేటిధాత్రి :-

భారతదేశంలో కొనసాగుతున్న అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు రక్షణ కవచంలా ఉన్న భారత రాజ్యాంగాన్ని మార్చితే సహించబోమని జాతీయ మాల మహానాడు ప్రచార కార్యదర్శి ఆకుల పెంటయ్య, జిల్లా అధ్యక్షుడు సంజీవ అన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో మాట్లాడుతూ జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆకుల పెంటయ్య జిల్లా అధ్యక్షుడు సంజీవల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి నాయకులు 400 ఎంపీ సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం అంటున్నారని, అలా మారిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్యాయం జరుగుతుంది కావున రాజ్యాంగం మార్పును సహించబోమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆకుల పెంటయ్య, జిల్లా అధ్యక్షులు సంజీవ, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు దాడి నరేష్, ఉపాధ్యక్షుడు తాళ్ల ఆనంద్, నర్సాపూర్ అధ్యక్షుడు గోవు యాదగిరి, కేశవులు, లక్ష్మణ్, రవి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా డాక్టర్ అప్సర్ బాయ్ జన్మదిన వేడుకలు…

అప్సర్ బాయ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాగ్యరాజ్….

కొల్చారం, ( మెదక్) నేటి ధాత్రి:-

తూప్రాన్ మున్సిపల్ పరిధిలో లింగారెడ్డి ఫంక్షన్ హాల్ లో బర్త్డే వేడుకలు అర్.ఎం.పి, పి.ఎం.పి డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అఫ్సర్ భాయ్ 43వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం ఉదయం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన అప్సర్ ఆర్.ఎం.పి డాక్టర్ గా ఎంతోమందికి సహాయ సహకారాలు తక్కువ ఫీజుతో ట్రీట్మెంట్ చేస్తూ తూప్రాన్ మండలంలో ఎంతోమందికి డాక్టర్గా సేవలందించిన డాక్టర్అప్సర్ బాయ్ అనంతరం తూప్రాన్ పట్టణ ప్రముఖులు హాజరై లింగా రెడ్డి గార్డెన్స్ లో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అఫ్సర్ భాయ్ ను అభినందించిన వారిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డ భాగ్యరాజు, మాజీ సర్పంచ్ పోచయ్య,సీనియర్ జర్నలిస్ట్ జానకిరామ్ సిఆర్, కాంగ్రెస్ నాయకులు జగ్గన్నగారి దామోదర్ రెడ్డి,గుజ సత్యనారాయణ యాదవ్, గంగుమల్ల అచ్యుత్ రెడ్డి,కుమ్మరి రమేష్, బలరాం రెడ్డి,కిష్టారెడ్డి,గుజ మహేష్ యాదవ్, ఆకుల కుమార్, మంజు బేకరి నాగరాజుగౌడ్,గజం నాగరాజు,దొంతి యాదగిరి, ఐలయ్య యాదవ్,సిగ్గీ,రఘుపతి. బొల్లెబోయిన మహేష్ యాదవ్,గౌస్ భాయ్,ఖాదర్,సి.హెచ్.సతీష్, తదితరులు.

అనుమానాస్పదంగా ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఎస్సై మృతి

ఎక్సైజ్ శాఖలో విషాదం

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, మే- 3(నేటి ధాత్రి):

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎక్సైజ్ ఎస్సై ఖాళీ ప్రసాద్ అనుమానాస్పదంగా గురువారం రాత్రి మృతి చెందాడు. ఖమ్మం జిల్లాకు చెందిన కాళీ ప్రసాద్ మూడు నెలల క్రితం ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఎస్సైగా బదిలీపై వచ్చారు. అతని భార్య సావిత్రి 18 రోజుల క్రితం చనిపోగా అప్పటినుండి తీవ్ర మనస్థాపనతో మద్యం సేవించేవాడని స్థానికులు తెలిపారు. ఇదే క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఆయన అద్దెకు ఉంటున్న రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో ఇంటి యజమాని తలుపులు తీసి పిలిచిన పలకక పోవడంతో అనుమానంతో ఇంటిలోకి వెళ్లిన ఇంటి యజమాని అప్పటికే మృతి చెందిన ఎక్సైజ్ ఎస్సై కాళీ ప్రసాద్ ను చూసి ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ సీఐ సంఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన కాళీ ప్రసాద్ ను పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకొని మృతదేహాన్ని పరిశీలించిన ఎస్సై రమాకాంత్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు కాళీ ప్రసాద్ కు కుమారుడు సాయి రేవంత్, కూతురు ఉన్నారు. ఎక్సైజ్ ఎస్సై కాళీ ప్రసాద్ అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఎక్సైజ్ శాఖలో, మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

10 వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

భూపాలపల్లి నేటిధాత్రి

ప్రతి విద్యార్థికి పదవ తరగతి తొలి పరిక్ష, తొలి ప్రతిభ పట్టా, తొలి మధుర జ్ఞాపక మని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు.
శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో
పదవ తరగతి పరీక్షలలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించి 10 గ్రేడ్ సాధించిన కస్తూర్భా గాంధీ విద్యాలయం చిట్యాలకు చెందిన కొత్తూరు అంజన, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెద్దాపూర్ కు చెందిన ఊరుగొండ సాహిత్య, గాంధీ నగర్ లోని మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలకు చెందిన గడ్డం అక్షయ, ముత్యాల అభినయ విద్యార్థులు పదవ తరగతి పరీక్షలలో జీ.పీ.ఏ 10 సాధించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విద్యార్థులను శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి పదవ తరగతి తొలి పరిక్ష అని తన ప్రతిభకు తొలి పట్టా అని, విద్యార్థి జీవితంలో తొలి మధుర జ్ఞాపకమని ఏ విద్యా ఫలితంలో నైనా ముగ్గురి కఠోర శ్రమ దాగి ఉంటుందనీ గురువు, విద్యార్థి, తల్లిదండ్రుల సమిష్టి కృషి ప్రోత్సాహం వల్లే ఉత్తమ ఫలితాలు సాధించడం జరుగుతుందని అన్నారు.
6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పరిధిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం మరియు మహాత్మా జ్యోతిరావు పూలే వసతి గృహల్లో ఉంటూ కష్టపడి చదివి మొదటి స్థానం సాధించడం చాలా గొప్ప విషయమని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇష్టంతో మంచి ఉన్నత చదువులు చదివి సమాజంలోని పేద, బడుగు బలహీనవర్గాల ప్రజలకు సేవలు అందించే స్థాయికి చేరాలని అన్నారు. విద్యా సముపార్జన ద్వారా మాత్రమే మనిషి ఉన్నత స్థాయికి చేరుకోగలడని, తల్లిదండ్రుల కలలు సాకారం చేసే దిశగా అడుగులు వేసి సమాజం కీర్తించ దగిన గొప్ప పౌరులుగా ఎదిగి తల్లితండ్రులకు అలాగే మన జిల్లాకు, రాష్ట్రానికి తద్వారా దేశానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తేవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. రామ్ కుమార్, చిట్యాల మండల విద్యాశాఖ అధికారి కొడెం రఘుపతి, ఎఎంఓ కాగితపు లక్ష్మణ్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు టి. శాంత, ఆశీర్వాదం, పరీక్షల విభాగం సహాయకులు కుసుమ కృష్ణమోహన్, ప్రత్యేక అధికారి సుమలత, అకౌంటెంట్ మీనా, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న ఏపీవో టెక్నికల్ అసిస్టెంట్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీలు చెరువు పూడిక తీత పనులు చేస్తుండగా ఏపీవో రాజు టెక్నికల్ అసిస్టెంట్ శ్రవణ్ కుమార్ ఉపాధి కూలీలకు ఎండలు దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు పాటించాలని ఉపాధి పని ప్రాంతంలో ట్రాక్టర్లలో మట్టి నింపేటప్పుడు జాగ్రత్త ఉండాలని ప్రమాదం జరగకుండా చూసుకోవాలని ఎవరి పేరు మీద వారే రావాలని వేరే వారు రాకూడదని ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించారు

వేసవి కాలంలో తాటి ముంజలు ఎంతో మేలు

నారగాని మోహన్ గౌడ్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో గౌడ సంఘం నుండి నారగాని మోహన్ గౌడ్ నేటి ధాత్రి తో మాట్లాడుతూ ప్రధానంగా వేసవికాలంలో దొరికే తాటి ముంజలు ప్రత్యేకమైనవి తాటికల్లుకు ఎంత ప్రాముఖ్యత కలదో అలాంటి ప్రాముఖ్యత తాటి ముంజలకు కలదు ఏప్రిల్, మే నెలలో దొరికే తాటి ముంజలను చిన్న పిల్లల, పెద్దలు ఇష్టపడి తింటారు.
తాటి ముంజలు చల్లదనాన్ని అందిస్తుంది వేసవికాలంలో ప్రకృతి వన ప్రసాదం. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. శరీర శక్తిని జీర్ణ సమస్యలు దూరం చేస్తుంది. వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది మలబద్ధకం తగ్గిస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది శరీరం నుండి మలినాలను దూరం చేస్తుంది. కాలేయ సమస్యలను తగ్గిస్తుంది బరువు నియంత్రణలో ఉంచి మండుటెండల నుంచి మానవాళిని కాపాడటంలో తాటి ముంజలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. పల్లెల్లోనే కాదు పట్టణాల్లో కూడా ఈ తాటి ముంజలు విరివిగా దొరుకుతున్నాయి కాబట్టి తాటి ముంజల వలన మానవ ఆరోగ్యం ఎంతో బాగుపడుతుందని నారగాని మోహన్ గౌడ్ తాటి ముంజల గురించి వివరించి చెప్పినాడు

గొల్లపల్లిలో చలివేంద్రం ఏర్పాటు

గొల్లపల్లి నేటి ధాత్రి :


గొల్లపల్లి మండల కేంద్రంలోని నల్లగుట్ట ప్రాంతంలో శుక్రవారం రోజున రవీందర్ స్వచ్ఛంద సేవ సంస్థ అధినేత నర్సాపురం రవీందర్ చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగొద్దని సూచించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతి సంవత్సరం చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న నర్సాపురం రవీందర్ ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తాడూరి సత్యనారాయణ, అంబేద్కర్ సంఘ నాయకులు మద్దెల గోవర్ధన్, చెవులమాద్ది మల్లేశం, గంగాధర మధుసూదన్,గడుగు విజయ్, ఆటో యూనియన్ సభ్యులు రాజయ్య, గంగన్న, కిరణ్, అశోక్, పుర ప్రముఖులు అంకం భూమన్న, శాతల్ల లక్ష్మణ్, జెరిపోతుల అనిల్, కలకోట సత్యం,శ్రీధర్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

అత్యధిక మెజార్టీ గెలిపించాలి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిజెపి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న తమిళనాడు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నాగ రాజన్ కర్ణాటక బీజేవైఎం స్టేట్ జనరల్ సెక్రెటరీ కె మారుతి గారు మండల పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయకులకు కార్యకర్తలకు దిశ నిరుద్దేశం చేసి పార్టీ బలపరిచిన కరీంనగర్ బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ నీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వాటికి సంబంధించిన బాధ్యతలు మీపై ఉన్నాయని తెలియజేస్తూ కొన్ని సూచనలు అందించారు తర్వాత గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొని పార్టీ సీనియర్ నాయకులు అయినా సంతోష్ ఇంటికి వెళ్లి కలిశారు తర్వాత పార్టీ కార్యకర్త ప్రశాంత్ గారి కోరిక మేరకు వారి ఇంట్లో టిఫిన్ చేసి తర్వాత కార్యక్రమంలో పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఆసాని రామలింగారెడ్డి పార్టీ మండల అధ్యక్షులు పార్టీ వివిధ మోర్చా అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు బిజెపి పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు

మండపల్లి గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ గెలవాలని ఇంటింటా ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ ను గెలిపించాలని పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు తెలియజేస్తూ కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే మన పార్టీ బలపరిచిన కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలిపించి అభివృద్ధిలో ముందు ఉంచాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మండల జిల్లా బి ఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

హైదర్ నగర్ డివిజన్లో ఇంటింటికి పాదయాత్రలో ఓటర్ లను కలిసి ఎంపీ రంజిత్ రెడ్డిని గెలిపించా లంటున్న కూన సత్యంగౌడ్

కూకట్పల్లి, మే 3 నేటి ధాత్రి ఇన్చార్జి

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధి లోని నిజాంపేట్ చౌరస్తాకు ఇరువైపు లు ఉన్న పలు అపార్ట్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ సీనియ ర్ నాయకులు కూన సత్యంగౌడ్,టిడిపి నాయకులు కొడాలి రవి,కావూరి ప్రసా ద్,సాంబశివరావు,వెంకట్,సాధ కృష్ణ శుక్రవారం ఉదయం 9:30 గంటలకు ఆ ఏయా ఓటర్లను కలుస్తూ తమ అభ్యర్థి చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డికు ఓటేసి గెలిపించాలని వారం వెళ్లిన ప్రతి ఓటర్ వద్ద అభ్యర్థించా రు.ఈ విషయమై తానేకంగా ఉన్నటువంటి పలు అపార్ట్మెం ట్లలో నివాసముండే ఓటరు లుఅంగీక రిస్తూ ఆనందంగా తప్పనిసరిగా ఈసారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ,ఎంపి గడ్డం రంజిత్రెడ్డినీ భారీ మెజారిటీతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకుని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగుర వేసుకుంటామ న్నారు.కాగా ఓటర్లను కలిసిన నాయ కులు ఈసారి రంజిత్ రెడ్డి విషయంలో ఎక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్క ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.ఈ సందర్భంగా సత్యం గౌడ్ కావూరి ప్రసాద్ లు మాట్లాడుతూ… ఇక్కడ తిరిగిన అపార్ట్మెంట్లు అన్నీయు ఓటర్లతో నిండి ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అమలుపరిచిన 6 గ్యారంటీలో ముఖ్య మైన వాటిని ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు,సబ్సిడీపై గ్యాస్,200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ మరెన్నో అమలు చేయబో యే సంక్షేమ పథకాలు ఇంకా ఎన్నిక ల్లోల య్యాక విడుదలచేద్దామని రాష్ట్ర సీఎం స్వయంగా తారానగర్ లో నిర్వ హించిన కార్నర్ మీటింగ్లో వారు స్పష్టం చేశారన్నా రు.ప్రస్తుతం ఎన్నికల నిబంధనలు అమ ల్లో ఉన్న కారణంగా కొన్ని వాటిని ఆపివే యడం జరిగిందని తెలిపారు.ఎన్నికల తర్వాత మళ్లీ యధావిధిగా అన్ని సంక్షేమ పథ కాలుకొనసాగుతాయని సీనియర్ నా యకులు కూన సత్యంగౌడ్,కావూరి ప్రసాద్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు

మోదీని గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దాం..

అబద్దాలతో మీ ముందుకు వస్తున్న బీజేపీ మాటలను నమ్మొద్దు

శాయంపేట నేటి ధాత్రి:

పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని గద్దె దించి రాహుల్‌ గాంధీ ప్రధానిని చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని శాయంపేట మండలం పెద్దకోడెపాక, మైలారం, శాయంపేట మండల కేంద్రంలో జరిగిన మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ దూదిపాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలోముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీఎస్సార్ పాల్గొన్నారు. అనంతరం అక్కడ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ అబద్ధాల ఫ్యాక్టరీ అని, ఓటమి భయంతో ఆ పార్టీ చెప్పే అబద్ధాలకు మోసపోవద్దని కోరారు. మోదీ ప్రభుత్వంలో పెట్రోల్, డీజిల్, వంట నూనె, సిలిండర్లు, ఎరువులు, పప్పులు, కూరగాయల ధరలు పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని అన్నారు. మోదీ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాచేలా పాలన చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే దేశంలో ఉన్న అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. వరంగల్ పార్లమెంట్ లో డాక్టర్ కడియం కావ్య ను అత్యధిక మెజారిటీ తో గెలిపించుకోవా లని కోదారు.

పెద్దకోడెపాక గ్రామ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లోకి చేరికలు

పెద్దకోడెపాక గ్రామ బీఆర్ఎస్ నాయకులు పలువురు ఈరోజు కాంగ్రెస్ లోకి చేరారు. కాగా, వారికి ఎమ్మెల్యే జీఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో రేణుకుంట్ల పృథ్విరాజ్, మంద నరేష్, కుక్కల రాజు, కుక్కల సంతోష్ ఉన్నారు.

error: Content is protected !!
Exit mobile version