బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం

-సీనియర్ నాయకుడు ముత్యం ప్రవీణ్ కుమార్…

– మెదక్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రాం రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం…

కొల్చారం, ( మెదక్ )నేటిధాత్రి :-

మండల కేంద్రమైన కొల్చారంలో మెదక్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి గెలుపు కొరకు కొల్చారం గ్రామంలో పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుపై ఓటువేసి గెలిపించాలని గ్రామా ప్రజలను కోరడం జరిగిందని ముత్యం ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కల్లబొల్లి మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. అభివృద్ధి కావాలంటే బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. అధికారం వచ్చే ఐదు నెలల గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు మాట్లాడుతుందని ఆయన విమర్శించారు. వచ్చే 13 తారీకున పార్లమెంటు ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు ఓటేసి బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఉపాధి హామీ కూలీలతో తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యం ప్రవీణ్ కుమార్, రాజా గౌడ్, చెన్నయ్య, చిన్న రాములు, భాస్కర్, పాండ్ర వెంకటేశం, ఎర్రోళ్ల శీను, అంజo, పట్లూరి నర్సింలు, శ్రీధర్ బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .

మాలమహానాడు వ్యవస్థాపకులు పివిరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన నాయకులు.

కారేపల్లి నేటి ధాత్రి

సింగరేణి మండల కేంద్రం లో మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు పోతుల విశ్వేశ్వర రావు 75 వ పుట్టినరోజు సందర్భంగా సింగరేణి మండల మాల మహానాడు మండల అధ్యక్షుడు సోమందుల రాములు నాయకత్వం లో అంబేద్కర్ విగ్రహం వద్ద పివి రావు జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మాల మహానాడు నాయకులు తలారి చంద్రప్రకాష్ మాట్లాడుతూ పివి రావు ఆనాటి ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్ అంటూ ఎస్సీలను విడదీసే ప్రయత్నం చేయడం జరిగింది. ఆరిజర్వేషన్లు వద్దంటూ రిజర్వేషన్ల పేరుతో దళిత కుటుంబాలని విడదియ్యెద్దంటూ దళితులందరూ కలిసి ఉండాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారందరూ కలిసి ఉంటేనే రాజ్యాధికారం వస్తుందని రాజ్యాధికారాన్ని రాకుండా ఆనాటి ప్రభుత్వాలు విభజించి పాలించు అనే విదంగా కుట్రలు చేయడం జరిగింది. కావున ఆ కుట్రని ఆనాడు గవర్నమెంట్ టీచర్ గా ఉన్న కీర్తిశేషులు పివి రావు మాల మహానాడు వ్యవస్థను స్థాపించి తన కుటుంబాన్ని సైతం జాతికి అంకితం చేసిన గొప్ప మహనీయుడు అంటూ వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ఆయన చేసిన పోరాటాన్ని మనం కూడా చేయాలంటూ చంద్రప్రకాష్ అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో మాల మహానాడు గ్రామ శాఖ నాయకులు కొక్కిలి యుగంధర్ చెవుల శ్రీనివాసరావు సోమందుల నాగరాజు తోట మల్ల సాయి చెవుల చందు సోమందుల వెంకటేశ్వర్లు తడికమల్ల నరేష్ నంద నూరి సురేష్ తలారి అనీల్ చెవుల అనీల్ చెవుల చంద్రశేఖర్ సోమందుల రఘుబాబు మైపా అనిల్ సోమందుల రఘుబాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మున్నూరు కాపులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి

గొల్లపల్లి నేటి ధాత్రి:
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రముఖ ఇండియన్ మెజీషియన్,గిన్నె బుక్ రికార్డ్ హోల్డర్ & సెంట్రల్ బోర్డ్ సినిమా సెన్సార్ సభ్యుడు సామల వేణు పాల్గొని మున్నూరు కాపు సభ్యులకు దిశనిర్దేశం చేశారు.ప్రముఖ ఇండియన్ మెజీషియన్ సామల వేణు మాట్లాడుతూ మున్నూరు కాపులు విద్యారంగంలోనూ,రాజకీయంగాను తదితర రంగల్లోనూ అభివృద్ధి సాధించాలని అన్నారు. వ్యవసాయ రంగంలోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి,మున్నూరు కాపు సభ్యులందరూ ఐక్యతతో ఇంకా ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరడం జరిగింది.అనంతరం మున్నూరు కాపు మాజీ వార్డ్ సభ్యులను సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్,మున్నూరుకాపు యూత్‌ఫోర్స్ వ్యవస్థాపకుడు రాళ్లబండి రామకృష్ణ, మున్నూరు కాపు పట్టణ అధ్యక్షులు పడాల జలంధర్,గౌరవ అధ్యక్షులు బోనగిరి మల్లారెడ్డి,గురిజాల బుచ్చిరెడ్డి,పుప్పాల మహిపాల్, పడాల సుదర్శన్,పడాల సత్యం,పడాల తిరుపతి,పడాల రాకేష్,కట్ట సత్తన్న,తదితరులు పాల్గొన్నారు.

రాహుల్ ప్రధాని అయ్యేది లేదు.. రేవంత్ రెడ్డి హామీలు నెరవేర్చేది లేదు.

అభివృద్ధి పనులు జరగాలంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతోనే సాధ్యం

హసన్ పర్తి / నేటి ధాత్రి

గ్రేటర్ వరంగల్ పరిధిలోని వంగపహడ్, హాసన్ పర్తి లలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మీరు ఆశీర్వదిస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు చేయాలని
వరంగల్ పార్లమెంట్ సమస్యలను పరిష్కరించుటకు కృషి చేస్తాను. గత పది సంవత్సరాల మోడీ పాలనలో శాంతి నెలకొంది.
మోడీ ప్రభుత్వంలో నాలాంటి వాళ్ళు ఎంపి గా ఉంటే మీ సమస్యలు అన్నీ తిరుతాయి అని హామీ ఇచ్చారు. ఢిల్లీలో మోడీ వరంగల్ లో నన్ను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. పేద వర్గాల సమస్యలు తెలిసిన వాడిని కేంద్రంలో కూడా పేదరికం నుండి వచ్చిన బిసి బిడ్డ ప్రధాన మంత్రిగా ఉన్నారు. మీ సమస్యలు పరిష్కారం చూపించగలగే సత్తా ఉన్న పార్టీ బిజెపి మాత్రమే
నేను వరంగల్ ప్రజలకు కొత్త ఏమీ కాదు కులంతో, మతం తో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు
ఇక కాంగ్రెస్, బిఆర్ఎస్ అభ్యర్థులు ఇక్కడ ప్రజలకు పెద్దగా తెలియదు
కాంగ్రెస్ నుండి వచ్చే వ్యక్తి కడియం శ్రీహరి బొమ్మ పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తుంది. కడియం శ్రీహరి నే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఆయన కూతురు ని ఎలా నమ్ముతారు?
కడియం కావ్య ను సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా వారి మనిషి అని అంగీకరించడం లేదు ఎందుకంటే మళ్లీ ఎప్పుడు పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్తారో అనే భయం ఉంది
నా వ్యక్తిత్వం దెబ్బతిసే విధంగా మాట్లాడే కడియం శ్రీహరి కి పుట్టగతులు ఉండవు ఈ ఎన్నికల్లో కడియం శ్రీహరి చరిత్ర కంచికె ఇన్ని రోజులు ప్రజలను ప్రలోభాలకు గురి చేసి గద్దె మీద కూర్చునావ్ ఇప్పుడు అదే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం కోసం సిద్దంగా ఉన్నారన్నారు.
రేవంత్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా తయారైంది.
ప్రజలకు మంచి చేయమని కాంగ్రెస్ కి పట్టం కడితే హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తుండు. వర్ధన్నపేట నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి మీ కండ్ల ముందే కనిపిస్తోంది.
నన్ను ఓడించడం కొరకు ఎన్ని కుట్రలు చేశారో మీ అందరికీ తెలుసు.
మీ కష్ట సుఖాల్లో తోడుగా ఉన్న వాడిని నా వ్యక్తిత్వం మీ అందరికీ తెలుసు
మీ అందరికీ సేవ చేయడం కోసం బిజెపి పార్టీ నాకూ ఎంపి అభ్యర్థిగా బిజెపి అవకాశం కల్పించింది.
నన్ను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మీదే.
వర్ధన్నపేటలో 2014,2018 ఎన్నికల్లో నాకూ ఇచ్చిన మెజారిటీ మళ్లీ తిరిగరాయలన్నారు.
ఈ కార్యక్రమంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మరావు, రాష్ర్ట ఎస్సి మోర్చ అధ్యక్షులు కొండేటి శ్రీధర్,హాసన్ పర్తి జెడ్పిటిసి సునీత, కార్పొరేటర్ గురుమూర్తి శివ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ జక్కు రమేష్ గౌడ్, బుద్ధే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

గొల్లపల్లి మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రవేశాలు ప్రారంభం

గొల్లపల్లి నేటి ధాత్రి:
గొల్లపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం లో ప్రవేశాల కోసం ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం అయ్యాయని కళాశాల ప్రిన్సిపాల్ ఈర వేణి రాజ్ కుమార్ తెలిపారు. ఈ సంవత్సరం పదవ తరగతి ఉత్తీర్ణులైన ఆసక్తిగల విద్యార్థిని, విద్యార్థులు ఈనెల 10 నుంచి ఈనెల 31 లోగా www.tsmodalschools.com వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొని దరఖాస్తు ఫారం ను పాఠశాలలో సమర్పించవలెను. ఎంపీసీ, బైపిసి, ఎంఈసి, సిఈసి నాలుగు గ్రూపులలో ఒక్కొక్క గ్రూప్ కి 40 సీట్లు అందుబాటులో కలవు. మోడల్ స్కూల్ లో అత్యున్నత ప్రమాణాలు గల అధ్యాపక బృందం చేత ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగును. అమ్మాయిలకు హాస్టల్ సౌకర్యం కలదు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు యూనిఫామ్ సప్లై చేయబడును. అదునాతన సైన్స్ ల్యాబ్ లు – బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్ లు, విద్యార్థులందరికీ కళాశాలలో ఎంసెట్, నీట్, జేఇఇ కోచింగ్ ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా అత్యున్నత ప్రమాణాలతో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగును. ఈ సదవకాశాన్ని గ్రామీణ ప్రాంత విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలరని కళాశాల ప్రిన్సిపల్ ఇరవేణి రాజకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించండి

గొల్లపల్లి నేటి ధాత్రి:
ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ నీ భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగదామునిపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడ్లూరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశ పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు. ఉపాధి హామీ కూలీని 200 నుండి 400 లకు పెంచుతామని ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కేంద్రంలో 10 సంవత్సరాలుగా బిజెపి అధికారంలో ఉండి నిత్యవసర వస్తువులపై, ఎరువులు పై అధిక ధరలు పెంచి సామాన్య ప్రజల మీద భారం మోపారు. అందుకు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది అని అన్నారు. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి పేద మహిళలకు ఏటా లక్ష రూపాయలు యువతకు 30 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో నే ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు వచ్చాయని అన్నారు. ఆగస్టు 15 లోపల రైతులకు రెండు లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీని అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే మేమిద్దరం కలిసి ధర్మపురి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, రేవెల్ల సత్యనారాయణ గౌడ్, నేరెళ్ల మహేష్, అనిల్, శంకరయ్య, సత్తయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉపాధి హామీ కూలీలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సిపిఎం, సిపిఐ పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపే లక్ష్యంగా మిత్రపక్షాల ఆధ్వర్యంలో భద్రాచల పట్టణ కేంద్రంలో బైక్ ర్యాలీ

భద్రాచలం నేటి ధాత్రి

కాంగ్రెస్ పార్టీ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించిన భద్రాచల శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు

బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎన్.ఎస్.యు.ఐ,ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, ఎలక్ట్రిషన్ యూనియన్ నాయకులు

ఈరోజు భద్రాచల పట్టణ కేంద్రంలో సిపిఎం, సిపిఐ పార్టీలు బలపరుస్తున్న మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుకుంటూ 500 బైక్ లతో పట్టణంలోనీ ప్రతి కాలనీలో ర్యాలీని నిర్వహించడం జరిగింది.

మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి నేత్రంతోల్లో జరుగుతున్నటువంటి ఈ బైక్ ర్యాలీని భద్రాచల శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ జెండాను ఊపి ప్రారంభించడం జరిగింది.

స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీలో ఎన్.ఎస్.యు.ఐ, ఎస్సీ సెల్,ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, ఎలక్ట్రిషన్ యూనియన్ ల ఆధ్వర్యంలో యువత భారీ సంఖ్యలో పాల్గొని, బలరాం నాయక్ గెలుపు, భద్రాచలం అభివృద్ధికి మలుపు, చదువుకున్నావు యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అనే నినాదంతో భద్రాచలం పురవీధులలో నినాదాలు చేస్తూ, పట్టణంలోని ప్రతి ప్రాంతంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ యొక్క బైక్ ర్యాలీలో టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్, పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ నున్నే రామకృష్ణ, తోటకూర రవిశంకర్, భద్రాచలం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్, సిపిఎం నాయకులు వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండశెట్టి కృష్ణమూర్తి,అరికెల తిరుపతిరావు ,రత్నం రమాకాంత్ ,తాళ్లపల్లి రమేష్ గౌడ్, ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్,బంబోతుల రాజీవ్,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాసముల రాము,తాండ్ర నరసింహారావు, నర్రా రాము,నాగేంద్ర, రాగం సుధాకర్,గండేపల్లి హనుమంతరావు,దుద్దుకూరు సాయిబాబా,యూత్ నాయకులు గాడీ విజయ్,ఆకుల వెంకటరమణ,భాను, మహిళా కాంగ్రెస్ నాయకులు రూపా దేవి తదితరులు పాల్గొన్నారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం పంపిన ఎమ్మెల్యే తూడి

వనపర్తి నేటిదాత్రి; వనపర్తి జిల్లా
రాజనగరం 12వ వార్డు చెందిన మద్దెల చిన్ననారాయణ మృతి చెం దా రు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పందించి 5000 రూపాయలు మృతుని కుటుంబ సభ్యులకు పంపారు ఆర్థిక
సహాయాన్ని 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో మాజీ అధ్యక్షుడు బోయ సత్యం నాగన్న పెండెం కురుమూర్తి ఆటో మాజీ అధ్యక్షులు కొత్త గోళ్ళ శ్రీనివాసులు, మాజీ మండల యూత్ అధ్యక్షులు బి రాజు, కరాటి రమేష్ దర్గా బోయ కురుమూర్తి, అంబటి రమేష్ తదితరులు పాల్గొన్నారు

పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలి.

శాంతి యుత వాతవారణంలో ఎన్నికలు నిర్వహణకు పటిష్ట బందోబస్తు.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్ల, మే – 10(నేటి ధాత్రి):
అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ,నెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు కూడా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు నిర్వహించవలసిన విధివిధానాలు , శాంతిభద్రతల పరిరక్షణ అంశాలపై జిల్లా పరిధిలోని సెక్టార్ అధికారులు, రూట్ అధికారులు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..జిల్లాలో స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పోలీస్ అధికారులు, సిబ్బంది రానున్న రెండు రోజులు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాలని,శాంతి యుత వాతవారణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లాలో 1500 మంది జిల్లా, కేంద్ర పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

రూట్ అధికారులు పోలింగ్ కేంద్రాలు , బ్యాలెట్ బాక్స్ లకు రక్షణ కల్పించాలని, ప్రతి రూట్ మొబైల్ అధికారి వద్ద ఏదైనా సంఘటనలు జరిగితే స్పందించే అధికారుల యెక్క మొబైల్ నెంబర్ లిస్ట్ దగ్గర ఉంచుకోవాలని,డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ కేంద్రాల వరకు పోలింగ్ ముగిసిన తరువాత కౌంటింగ్ సెంటర్ వరకు ఈ.వి.ఎం లు తరలించే వరకు రూట్ మొబైల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని అన్నారు.ఆయా రూట్ లలో ఉన్న మొబైల్ పార్టీలు ఒకే చోట ఉండకుండా తమ రూట్ లలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలను అబ్జర్వ్ చేస్తు పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువ మంది గుమికూడకుండ చూసుకోవాలని సూచించారు.

పోలింగ్ డే కు ముందు రోజు 48 గంటలపాటు తమ తమ ఏరియాలలో గల వైన్ షాప్స్, లేట్ నైట్ దాబాలు క్లోజ్ చేయించాలని, ఇంటింటి ప్రచారాలు, క్యాంపెనింగ్ వెహికల్స్ తిరగకుండా చూసుకోవాలని అన్నారు. ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగ్స్, ఫ్లెక్సీలు, బ్యానర్లు, లేకుండా చూసుకోవాలన్నారు. అదేవిధంగా ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు తమ నియోజకవర్గం లో ఉండడానికి వీలు లేదని, అందుకుగాను తమ ఏరియాలో గల రెస్టారెంట్స్, లాడ్జీలను చెక్ చేయాలని సూచించారు.డైనమిక్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టాలన్నరు.

జిల్లా ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికలు నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణం లో ఓటు హక్కును వినియోగించుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన, ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య,డిఎస్పీ లు చంద్రశేఖర్ రెడ్డి, నాగేంద్ర చారి మురళీకృష్ణ, సర్వర్,సి.ఐ లు,ఆర్.ఐ లు, ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

కేసీఆర్…నన్ను ఓడించేందుకు ముస్లింలంతా ఒక్కటి కావాలంటావా?

హిందువుల ఓట్లు నీకు అక్కర్లేదా?

20 శాతం ఓట్లు కోసం 80 శాతం హిందువులను కించపరుస్తావా?

హిందువులారా…. మీ సత్తా ఏందో కేసీఆర్ కు మళ్లీ రుచి చూపించండి

కేసీఆర్… నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా….

వినోద్ ఓడిపోతే… బీఆర్ఎస్ ను మూసేసి రాజకీయ సన్యాసం చేస్తావా?

నా వెనుక 80 శాతం హిందువులున్నారు….

బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కు బుద్ది చెప్పండి

కేటీఆర్ నోటి నుండి జై శ్రీరాం మాటే రాదు

కరీంనగర్ వేదికగా మత చిచ్చు పెట్టేందుకు కేసీఆర్ చేస్తున్న కుట్ర ఇది

ఓట్ల కోసం సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన సైనికులనే అవమానిస్తవా?

కేసీఆర్ లాంటి గలీజు లీడర్ ఇంకొకరు లేరు

కేసీఆర్ లాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ ఈ ప్రపంచంలోనే లేరు

ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో 1400 మంది ప్రాణాలను బలిగొన్న రాక్షసుడివి నువ్వే

ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతిపరుడివి కేసీఆరే

రూ.లక్ష కోట్ల అవినీతి బయటపడుతుందనే భయంతో కాళేశ్వరంపై డీపీఆర్ ఇవ్వకుండా జాతీయహోదా పేరుతో కేంద్రాన్ని బదనాం చేయాలనుకునే మోసగాడు కేసీఆరే

ఎందుకూ పనికిరాకుండా పోయిన కాళేశ్వరం ప్రాజెక్టును చిన్న సమస్యగా చిత్రీకరిస్తున్న దగుల్బాజీ కేసీఆర్

తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులిచ్చిన చరిత్ర మోదీదే

కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా?

చర్చకు సిద్ధమైతే… పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో ఆధారాలు నిరూపిస్తాం

కేసీఆర్ తో కుమ్మక్కైన కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు కాంగ్రెస్ యత్నం

ఇవన్నీ ప్రశ్నిస్తుంటే.. నన్ను ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నన్ను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నయ్

ఓటుకు రూ.5 వేలు ఒకరు. రూ.2 వేల చొప్పున మరొకరు పంచుతున్నయ్

అయినా కరీంనగర్ ప్రజలంతా నావైపే ఉన్నారు..

సిరిసిల్ల నేతన్నల చావులకు కారణం మీరే కదా…

బతుకమ్మ బకాయిలివ్వకుండా అరిగోస పెడుతున్నది మీరే కదా?

విద్యుత్ బిల్లుల్లో, యార్న్ పై సబ్సిడీ ఇవ్వకుండా సాంచాలు మూతపడేలా చేసింది మీరే కదా?

రైతులు పంట నష్టపోతే పరిహారం కూడా ఇవ్వలేని మీరా మాట్లాడేది?

తెలంగాణకు కేంద్రం నుండి నిధులు తెచ్చే బాధ్యత మాది

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివ్రుద్ధి చేసే బాధ్యత నాది

కేటీఆర్ సభలో ప్రశ్నించిన హిందుత్వ వాదుల అరెస్ట్ ను ఖండిస్తున్నా

కేటీఆర్… నీకు సిగ్గుంటే నీ అసలు పేరు పెట్టుకో

నీకు దమ్ముంటే… నీ పేరులోని రాముడి పేరును తీసేసి మాట్లాడు…

కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై మరోసారి హాట్ కామెంట్స్ చేసిన బండి సంజయ్

సిరిసిల్ల, మే – 10(నేటి ధాత్రి):

సిరిసిల్ల పట్టణం లోని స్థానిక లహరి ఫంక్షన్ హాల్లో బిజెపి పోలింగ్ ఏజెంట్లతో బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై బీ అర్.ఏస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వారు మాట్లాడుతూ…. ముస్లింలంతా ఒక్కటై బండి సంజయ్ ను ఓడించాలంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ చేసిన తీవ్రస్థాయిలో స్పందించారు.

20 శాతం ఓట్ల కోసం 80 శాతం హిందువులను అవమానిస్తున్న కేసీఆర్ ను ఓడించి హిందువుల సత్తాను చాటాలని పిలుపునిచ్చారు.

‘‘హిందూ సమాజమంతా తన వెనుకుందనీ,తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని కరీంనగర్ లో వినోద్ కుమార్ ఓడిపోతే బీఆర్ఎస్ ను మూసేసి రాజకీయాల నుండి తప్పుకునేందుకు సిద్ధమా?’’అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు.

దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని అన్నారు. తెలంగాణకు కేంద్రం పైసా ఇవ్వలేదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

‘తెలంగాణకు రూ.10 లక్షల కోట్లదాకా నిధులిచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిది అని అన్నారు. ఈ అంశంపై చర్చకొస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరాలు వెల్లడించేందుకు సిద్ధం’’అని పేర్కొన్నారు.

కేసీఆర్ లాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ ఈ ప్రపంచంలోనే మరొకరు లేరని చెప్పిన సంజయ్… ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో తెలంగాణ ఉద్యమంలో 1400 మంది బలి తీసుకున్న రాక్షసుడు కేసీఆర్ అంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ అరాచకాలతోపాటు 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రశ్నిస్తుంటే.. ఆ రెండు పార్టీలు కలిసి తనను ఓడించేందుకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటుకు రూ.5 వేల చొప్పున, రూ.2 వేల చొప్పున మరొకరు ఓటర్లకు పంచుతున్నారని ఆరోపించారు. హిందువులంతా… కేసీఆర్ వ్యాఖ్యలపై మీ సత్తా ఏందో చూపాలంటూ పిలుపునిచ్చారు.

జవాన్ల త్యాగాలను కూడా కెసిఆర్ విస్మరిస్తున్నాడని ,

కెసిఆర్ ది ఏ దేశమో చెప్పలన్నారు. సిరిసిల్ల కలెక్టర్ చిన్న వాన తుంపర్లకే మునిగి పోతోంది. అవినీతికి అధిపతి కేసిఆర్ అని అన్నారు.

కాళేశ్వరం డిపిఆర్ గురించి విజ్ఞప్తి చేస్తే ఇవ్వకుండా జాతీయ హోదా రాకుండా కేంద్రాన్ని బద్నాం చేసిన వ్యక్తి కేసిఆర్ అని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నవ్వుల పాలు అయ్యేలా చేసిన వ్యక్తి కేసిఆర్ నే అని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ పైసలను కాంగ్రెస్ కరీంనగర్ లో పంచుతుందన్నారు.

కేసిఆర్ మూర్ఖత్వం, అరాచకం వల్ల తెలంగాణలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రసాద్ స్కీమ్ కింద వేములవాడ, కొండగట్టు అభివృధి చేస్తామని కేంద్రం తరఫున లేఖ రాస్తే స్పందించని మూర్ఖుడు కేసిఆర్. కేటీఆర్ ఏమో జై శ్రీరామ్ అనొద్దని అంటారు. తండ్రి ఏమో ముస్లింలు అంతా ఒక్కటి కావాలని అంటుండు. కరీంనగర్ అభివృద్ది పై నేను మాట్లాడుతుంటే.. కేసిఆర్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు ముస్లిం మత పెద్దలతో కేసిఆర్ కుమ్మక్కేనాడు. 80 శాతం ఉన్న హిందువుల గురించి కేసిఆర్ మాట్లాడటం లేదు. కేసీఆర్ కు సవాల్ చేస్తున్నా… కరీంనగర్ లో వినోద్ రావు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. వినోద్ కుమార్ ఓడిపోతే బీఆర్ఎస్ ను మూసేసి రాజకీయాల నుండి తప్పుకునేందుకు సిద్ధమా? కేటీఆర్ కు సిగ్గుంటే… ఆయన అసలు పేరు అజయ్ రావు అని పెట్టుకోవాలి. అద్దె పేరైన కేటీఆర్ లోని రాముడి పేరును తీసేసి మాట్లాడాలి…

హిందువుల గురించి హేళన చేస్తున్న కేసిఆర్ కు బుద్ది చెప్పాలి. హిందూ సమాజం సంఘటితం కావాల్సిన అవశ్యకత ఉందని విజ్ఞప్తి చేస్తున్నా. కేసిఆర్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తే బీజేపీని గెలిపించండి. బీఆర్ స్, కాంగ్రెస్ నేతల్లారా.. మీ పార్టీ నేతల వ్యాఖ్యలను ఒక్కసారి గమనించండి. నేను నా ధర్మం గురించి మాట్లాడితే మతతత్వ వాదిని.అదే వాళ్లు మాట్లాడితే సెక్యులర్ వాదులు. హిందువులు తుమ్మితే మీ పార్టీ గాల్లో కొట్టుకొని పోతోంది. భైంసా లో హనుమాన్ భక్తులు కేటీఆర్ కి వ్యతిరేకంగా నిరసన చేస్తే వాళ్లను జైల్లో వేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులను చనిపోయారని కేసిఆర్ హేళన చేయడం బాధాకరం. హిందువులను హేళన చేయడం కేసిఆర్ కి పరిపాటిగా మారింది. కేసిఆర్ హిందూ సమాజానికి పక్కా క్షమాపణ చెప్పి తీరాలి. ఫామ్ హౌస్ లో పిరికి పందలెక్క పడుకుంటే.. పోలీస్ వలయాన్ని ఛేదించి చార్మినార్ భాగ్యలక్ష్మి సాక్షిగా సవాల్ చేసిన వ్యక్తిని నేను. పార్టీల జెండాలను పక్కన పెట్టండి. హిందువులంతా ఏకం కావాలి. ఓటు బ్యాంకుగా మారాలి. బీజేపీ గొడుగు కిందకు రండి.

తలుపు నూరులో చిన్నారెడ్డి సమక్షంలో 50 మంది కాంగ్రె స్ లో చేరిక

వనపర్తి నేటిదాత్రి ;
రేవల్లి మండలం తలుపు నూ రు గ్రామంలో బీ ఆర్ ఏ స్
పార్టీకి చెందిన వారు 50 మంది కాంగ్రెస్ పార్టీలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి సమీక్షంలో చేరారు .చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు, ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్ గోపాల్పేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సర్పంచ్ గణేష్ గౌడ్ మాజి జెడ్పిటిసి రాజేశ్వర్ రెడ్డి వనపర్తి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ మాజీ ఎంపీపీ జానకి రామ్ రెడ్డి తలు పు నూరు ఎక్కి వెంకటేష్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

యాత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కడియం కావ్య గెలుపు కై ప్రచారం

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణయూత్ కాంగ్రెస్ మచ్చసుమన్ ఆధ్వర్యంలో కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని పరకాల పట్టణం మరియు రూరల్ యూత్ కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం మచ్చ సుమన్ మాట్లాడుతూ ప్రవేశపెట్టిన న్యాయ గ్యారంటీలను మహిళా న్యాయం,రైతు న్యాయం,శ్రామిక్ న్యాయం, సమానత్వ న్యాయం, వివరించడం జరిగింది.2014లో అధికారంలో వచ్చిన బిజెపి పార్టీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసపూరితమైనటువంటి ప్రకటనలతో అదేవిధంగా నోట్ పెద్ద నోట్ల రద్దు ప్రక్రియను కూడా చేపట్టిందని దేశంలోని యువతను మోసం చేసింది అధికారం చేపట్టిన వెంటనే బయటకు తీసి అకౌంట్లో 15 లక్షల రూపాయలను వేస్తామని మోసపూరితమైన ప్రకటనలతో యువతను మోసం చేసిందని అన్నారు.యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్క కిరణ్ మాట్లాడుతూ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ ప్రస్థానం తెలంగాణకు మణిహారమని మహాలక్ష్మి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రెండు చేయూత 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం గృహ జ్యోతి 2 యూనిట్ల ఉచిత కరెంటు నాలుగు ఇందిరమ్మ ఇల్లు ఇంటి నిర్మాణానికి 5 లక్షల సహాయం మహాలక్ష్మి 6,30 వేలపై చీలుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ,గ్రూప్ వన్ మెగా డీఎస్సీ,సింగరేణి ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ వరంగల్ పార్లమెంటరీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ దొమ్మటి కృష్ణ కాంత్,పరకాల పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరి రాంప్రసాద్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లం శ్రీ రామ్ కుమార్,బాసాని సుమన్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఒంటేరు రమేష్,ఒంటేరు చందు, కొడపాక సాయి,ఎండి ఆరిఫ్,బొచ్చు కార్తీక్,బొజ్జం అనిల్,బొచ్చు కుమార్,ఎస్ కే యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.

యువత స్వయం శక్తితో ఎదగాలి..

చించోడు అభిమాన్యు రెడ్డి..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గుండేడ్ చెన్నా రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ యువనేత శ్రీ చించోడ్ అభిమన్యు రెడ్డి శాలువాతో సన్మానించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం బాలానగర్ మండల కేంద్రంలో గుండెడ్ నర్సిములు దివ్య ఆర్ట్ ఫ్లెక్సీ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత స్వయం శక్తితో పైకి ఎదగాలని ఆయన తెలిపారు.

బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జెడ్పిచైర్ పర్సన్ గండ్ర జ్యోతి

మారపల్లి సుధీర్ గెలుపుకై బీఆర్ఎస్ విస్తృత ప్రచారం

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలంలో వరంగల్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మారపల్లి సుధీర్ కుమార్ గెలుపు కొరకు మండలంలో వసంతపూర్, ప్రగతి సింగారం, పత్తిపాక గ్రామాలలోపనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మారపల్లి సుధీర్ కుమార్ కారు గుర్తుపై ఓటువేసి గెలిపించాలని పలు గ్రామాల ప్రజలను కోరడం జరిగిందని గండ్ర జ్యోతి తెలిపింది .ఈకార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్ , మైలారం ఎంపీటీసీ గడిపే విజయ విజయ్ కుమార్ , తహరాపూర్ ఎంపీటీసీ గొట్టిముక్కుల స్వాతి విష్ణువర్ధన్ రెడ్డి, వైస్ ఎంపీపీ రామ్ శెట్టి లతా లక్ష్మారెడ్డి మైలారం మాజీ సర్పంచ్ అరకిల్ల ప్రసాద్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ రాజిరెడ్డి ,ప్రగతి సింగారం మాజీ సర్పంచ్ సుమలత రమణారెడ్డి శాయంపేట మాజీ సర్పంచ్ వల్పదాస్ చంద్రమౌళి మండల నాయకులు మారపల్లి మోహన్ ధైనంపల్లి కరుణ బాబు, పత్తిపాక గ్రామ శాఖ అధ్యక్షుడు పసుల ప్రవీణ్, వసంతపూర్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి శాయంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు రాజేందర్,పలు గ్రామాల నాయకులు కార్యకర్తలుపాల్గొన్నారు

ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం

ఓటరు చైతన్యం పాట సీ డీ ఆవిష్కరణ

రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.

ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధమని టీయూడబ్ల్యూజే (ఐజెయూ) జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి అన్నారు. రామాయంపేట మండలం రాయిలాపూర్ కు చెందిన రాయారావు విశ్వేశ్వరరావు రచించి స్వరకల్పన చేసిన ఓటరు చైతన్యం పాట సీడీ ని మెదక్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం రామాయంపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా శంకర్ దయాళ్ చారి మాట్లాడుతూ…
ప్రజాస్వామ్యం పరిరక్షించాలంటే, మనం అనుకున్న నాయకున్ని ఎన్నుకోవాలంటే ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును అందరు వినియోగించుకోవాలన్నారుభారత ఎన్నికల సంఘం ఇటీవల కాలంలో ఓటు హక్కు కోసం అనేక రకాలు చైతన్య, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని ఓటింగ్ శాతం పెంపొందించడానికి కృషి చేయదానికి ఈ పాట ఎంతో ఉపకరిస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి కళాకారుల బృందాలు,
రెడ్ క్రాస్ సొసైటీ, జర్నలిస్టు అసోషియేష ద్వారా ఓటు హక్కు కోసం సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు.
ఓటరు చైతన్యం పాట
రచించి గానం చేసిన రాయరావు విశ్వేశ్వరరావు మాట్లాడుతూ
పట్టణాలలో ఓటర్లలో చైతన్యం పెంచడం కోసం ఈ పాట రాయడం జరిగిందన్నారు.
ఓటు వల్ల మంచి నాయకున్ని ఎన్నుకోవచ్చని చెప్పారు.
ఓటు వేయకుంటే సమాజంలో భాగస్వామ్యం లేనట్టే అని పేర్కొన్నారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మెన్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… యువకులు రెట్టింపు ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ పెంచాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా కీలకమైందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొని సరైన నాయకున్ని ఎన్నుకోవాలని కోరారు. చైతన్యం కోసం ఇలాంటి పాటలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి టి.సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. మాటకంటే పాట ప్రజలను చైతన్యం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు రాయారావు సత్యదీప్ శర్మ, గాయని శర్వాణి, రెడ్ క్రాస్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు దేమే యాదగిరి, కైలాస్, వి. దామోదర్ రావు, జి.డి. తిరుపతి, శ్రీకాంత్ శర్మ, సీనియర్ జర్నలిస్టులు శ్రీధర్, సత్యనారాయణ, శేఖర్, సత్యం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ రంజిత్ రెడ్డి నీ గెలిపిoచాలని ప్రజలకు సీపీఎం విజ్ఞప్తి

శేరిలింగంపల్లి నేటి ధాత్రి,:-

లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ళ కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ రంజిత్ రెడ్డి నీ గెలిపించాలని శేరిలింగంపల్లి నియోజక వర్గ ప్రజలకు సీపీఎం విజ్ఞప్తి చేస్తుంది.. ఈ సందర్భంగా సీపీఎం శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి C శోభన్, జోన్ కమిటి సభ్యులు V మాణిక్యం,K కృష్ణ,S రవి,K కృష్ణారెడ్డి,B వరుణ్ మాట్లాడారు..
కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ యెుక్క నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలతో ఇండియా కూటమి ఏర్పడింది. దేశ వ్యాప్తంగా బీజేపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం వీరోచితంగా పోరాడారు .. వందలాది మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు..
నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు . అధిక ధరల తో ప్రజలంతా అసంతృప్తి తో ఉన్నారు.. నోట్ల రద్దు సమయంలో, కరోనా సమయంలో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు..మరో పక్క దేశ సంపద, వనరులు మొత్తం అంబాని అదాని లాంటి కార్పొరేటు శక్తులకు దార పోశారని అన్నారు.. రైతులకు రుణ మాఫీ చెయ్యకుండా కార్పొరేట్ వాళ్ళ అప్పులు మాఫీ చేశారని అన్నారు.. ప్రజల ఆగ్రహాన్ని పక్క దారి పట్టించేందుకు మతాల మధ్య చిచ్చు రేపుతున్నారు ..
కానీ దేశ ప్రజలు బీజేపీ కుట్రలను అర్థం చేసుకుని ఈ ఎన్నికలలో తగిన బుద్ధి చెబుతారని సీపీఎం నాయకులు అన్నారు .. ఈ ఎన్నికల్లో కేంద్రం లో బీజేపీ అధికారం కోల్పోయి ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు..

బెల్ట్ షాప్ పై పట్టణ పోలిసుల దాడి, మధ్యం స్వాధీనం

భద్రాచలం నేటి ధాత్రి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని శిల్పి నగర్ ప్రాంతంలో ఎన్నికల నియమావళి కి విరుద్ధంగా అక్రమ మద్యం విక్రయం చేస్తున్న బెల్టు షాపులపై కస్మాత్తుగా దాడులు చేసిన భద్రాచలం పట్టణ ఎస్సై విజయలక్ష్మి అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు అక్రమ మధ్యo వ్యాపారం చేస్తున్న బెల్టు షాపులపై పంజా విసురుతున్న భద్రాచలం పట్టణ పోలీసులు

కొనసాగుతున్న పోలిసుల దాడులు

బెంబేలెత్తిపోతున్న అక్రమ మద్యం దారులు

చేతులెత్తేసిన సంబంధిత ఎక్సైజ్ అధికార యంత్రాంగం అని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చుక్క శేఖర్ ఆధ్వర్యంలో 186వ బూత్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెలి చాలా రాజేందర్ రావు ని చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలని ఓటర్లను అభ్యర్థించారు ఇట్టి ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ సత్యనారాయణరెడ్డి భాస్కర్ రెడ్డి నందగిరి హను మండ్లు N.C.W.C. సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి ఎండి హమీద్ మైనార్టీ నాయకులు సలీం మహిళా నాయకులు సహిదా బిగుల్లా నస్రి న్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

బిజెపికి ఓటు అడిగే హక్కు లేదు

బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్
మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్
బీసీల గురించి ఆలోచించని బిజెపికి వారి ఓట్లు అడిగే హక్కు లేదని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ ప్రధాని హాయాంలోనే బీసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అగ్రవర్ణ నాయకుల చేతిలో కీలుగు బొమ్మగా మారారన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన ఇండియా కూటమి మేనిఫెస్టోలో కులగణన చేస్తామని పేర్కొందని, దీన్ని పూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం కులగణనపై చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటన పట్ల మహేందర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఇండియా కూటమికి పూర్తిగా మద్దతిస్తున్నామని, కాంగ్రెస్ గెలుపు కోసం బీసీ శ్రేణులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ టిడిపి నాయకత్వంతో కలిసి భద్రాచలం పట్టణంలో విస్తృతంగా ఎన్నికల ప్రచార నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

భద్రాచలం నేటి ధాత్రి

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు భద్రాచల పట్టణంలో టిడిపి పార్టీ నాయకత్వంతో కలసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ప్రస్తుతం గా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు హస్తం గుర్తుపై ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

టిడిపి శ్రేణులు కాంగ్రెస్ శ్రేణులు కలిసి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భద్రాచల శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ నున్నే రామకృష్ణ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్ ,టిడిపి నాయకుల కొడాలి శ్రీనివాస్ ఎస్.కె అజీమ్ అబ్బినేని శీను , చిట్టి బాబు , తాళ్లపల్లి రమేష్ గౌడ్ ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్ , రాగం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version