ఓటరు చైతన్యం పాట సీ డీ ఆవిష్కరణ
రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.
ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధమని టీయూడబ్ల్యూజే (ఐజెయూ) జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి అన్నారు. రామాయంపేట మండలం రాయిలాపూర్ కు చెందిన రాయారావు విశ్వేశ్వరరావు రచించి స్వరకల్పన చేసిన ఓటరు చైతన్యం పాట సీడీ ని మెదక్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం రామాయంపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా శంకర్ దయాళ్ చారి మాట్లాడుతూ…
ప్రజాస్వామ్యం పరిరక్షించాలంటే, మనం అనుకున్న నాయకున్ని ఎన్నుకోవాలంటే ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును అందరు వినియోగించుకోవాలన్నారుభారత ఎన్నికల సంఘం ఇటీవల కాలంలో ఓటు హక్కు కోసం అనేక రకాలు చైతన్య, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని ఓటింగ్ శాతం పెంపొందించడానికి కృషి చేయదానికి ఈ పాట ఎంతో ఉపకరిస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి కళాకారుల బృందాలు,
రెడ్ క్రాస్ సొసైటీ, జర్నలిస్టు అసోషియేష ద్వారా ఓటు హక్కు కోసం సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు.
ఓటరు చైతన్యం పాట
రచించి గానం చేసిన రాయరావు విశ్వేశ్వరరావు మాట్లాడుతూ
పట్టణాలలో ఓటర్లలో చైతన్యం పెంచడం కోసం ఈ పాట రాయడం జరిగిందన్నారు.
ఓటు వల్ల మంచి నాయకున్ని ఎన్నుకోవచ్చని చెప్పారు.
ఓటు వేయకుంటే సమాజంలో భాగస్వామ్యం లేనట్టే అని పేర్కొన్నారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మెన్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… యువకులు రెట్టింపు ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ పెంచాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా కీలకమైందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొని సరైన నాయకున్ని ఎన్నుకోవాలని కోరారు. చైతన్యం కోసం ఇలాంటి పాటలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి టి.సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. మాటకంటే పాట ప్రజలను చైతన్యం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు రాయారావు సత్యదీప్ శర్మ, గాయని శర్వాణి, రెడ్ క్రాస్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు దేమే యాదగిరి, కైలాస్, వి. దామోదర్ రావు, జి.డి. తిరుపతి, శ్రీకాంత్ శర్మ, సీనియర్ జర్నలిస్టులు శ్రీధర్, సత్యనారాయణ, శేఖర్, సత్యం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.