గొల్లపల్లి నేటి ధాత్రి:
ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ నీ భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగదామునిపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడ్లూరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశ పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు. ఉపాధి హామీ కూలీని 200 నుండి 400 లకు పెంచుతామని ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కేంద్రంలో 10 సంవత్సరాలుగా బిజెపి అధికారంలో ఉండి నిత్యవసర వస్తువులపై, ఎరువులు పై అధిక ధరలు పెంచి సామాన్య ప్రజల మీద భారం మోపారు. అందుకు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది అని అన్నారు. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి పేద మహిళలకు ఏటా లక్ష రూపాయలు యువతకు 30 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో నే ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు వచ్చాయని అన్నారు. ఆగస్టు 15 లోపల రైతులకు రెండు లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీని అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే మేమిద్దరం కలిసి ధర్మపురి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, రేవెల్ల సత్యనారాయణ గౌడ్, నేరెళ్ల మహేష్, అనిల్, శంకరయ్య, సత్తయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉపాధి హామీ కూలీలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
