బందెల నరసయ్య పార్దివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

సిపిఐ రాష్ట్రా నాయకులు రుద్రంపూర్ వాస్తవ్యులు బందెల నర్సయ్య అనారోగ్యం తో మృతి చెందడం జరిగినది. కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి విషయం తెలుసుకొని రుద్రంపూర్ లోని వారి గృహానికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించడం జరిగినది. అదేవిదంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చడం జరిగినది వారి వెంట వున్న కాంగ్రెస్ , ఐ ఎన్ టీ యు సి నాయకులు వున్నారు. కోనేరు చిన్ని, శంకర్ నాయక్,ఐ ఎన్ టీ యు సి కేజీఎం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండీ. రజాక్,కాల్వ నాగభూషణం, మాజీ ఎం పి పి సలిగంటి శ్రీనివాస్, జి.వీరాస్వామి, రాజేశ్వరరావు , గోపి కుమార్ ,సకినాల సమ్మయ్య, మోహన్ రెడ్డి, కుమార్, సంజీవ్, అనుకు రాజ్ ,రమేష్, సిపి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు .

కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ చేరికలు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం కస్పే కట్కూరు గ్రామం నుండి బీఎస్పీ నాయకులు కార్యకర్తలు సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలపై ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అలాగే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు ప్రజల అవసరాలను గుర్తించి అనేక సదుపాయాలు కల్పిస్తున్నామని పార్టీకి సంబంధించిన అనేక సదుపాయాలు కల్పిస్తున్నామని ఇది ప్రజల పార్టీ అని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాజేందర్రావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి అభ్యర్థించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఎస్పీ నాయకులు బెల్లి కనకరాజు ఐ ఎఫ్ టి సి బందెల మధు రాజు అన్వేష్ సుధాకర్ స్వరూప ఝాన్సీ గణేష్ మధు రాజు అఖిలేష్ ఇట్టి చేరికల కార్యక్రమంలో పొన్నం లక్ష్మణ్ గౌడ్, జూపల్లి రాజేశ్వరరావు బొమ్మ వరం దేవేందర్ రావు సాయి తదితరులు పాల్గొన్నారు

నవాబుపేట మండల కేంద్రంలోమహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల కేంద్రంలోని సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో 891 వ మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫోరం అధ్యక్షులు చిగుళ్లపల్లి నర్సింలు అధ్యక్షత వహించి ఆయన మాట్లాడుతూ, మహాత్మా బసవేశ్వరుడు సమాజంలో కుల వ్యవస్థను వర్ణ వర్ణ భేదాలను లింగ వ్య వక్షతను సమూలంగా వ్యతిరేకిచ్చిన అభ్యుదయ వది అని అన్నారు.ఆయన సిద్ధాంతాలను మహాత్మా గాంధీ ఆచరించారని, ఆయన ప్రవచనాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బి. విజయ్ కుమార్,సి. వెంకటేశ్వర అప్ప,కే. శివ స్వామి,జి. పండరినాథ్,సి. వెంకటయ్య,రాజలింగం అయ్య, తదితరులు పాల్గొన్నారు.

కేంద్రంలో పాంచ్ న్యాయ్ పథకాలతో కాంగ్రెస్ పార్టీ…

# ఎన్నికల పోరాటంలో పంచ పాండవులుగా కాంగ్రెస్ పార్టీ..

# చరిత్రకు విడ్డూరంగా మోడీ అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ట..

# కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 30 లక్షల ఉద్యోగాలు..

# ఏఐసీసీ జాతీయ కో ఆర్డినేటర్. టి పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి
ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గౌడ్.

నర్సంపేట,నేటిధాత్రి :

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువ న్యాయం, నారి న్యాయం, రైతు న్యాయం,శ్రామిక న్యాయం, సామాజిక న్యాయం అనే పాంచ్ న్యాయ్ పథకాలతో మేనిఫెస్టో విడుదల చేసి దేశ వ్యాప్తంగా ఎన్నికల బరిలో దిగిందని ఏఐసీసీ జాతీయ కో ఆర్డినేటర్. టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి,మహబూబాబాద్,వరంగల్,భువనగిరి పార్లమెంట్ పరిది ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఇంఛార్జి
ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గౌడ్ అన్నారు.శుక్రవారం నర్సంపేట పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.అమరుల త్యాగాలతో రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు వెన్నుపోటుగా బీఅర్ఎస్ పార్టీ ఇతర రాష్ట్రాలతో కలిసిందని దీంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో
అందుకే ఓడిపోయిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి ఇక్కడి ప్రజలకు న్యాయం చేసిందన్నారు.ఆనాటి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు వారి పదవుల త్యాగం తెలంగాణ ప్రకటనకు మార్గం అయ్యిందని తెలిపారు.దేశంలో అనేక కాంగ్రెసేతర ప్రధానిలు ఇప్పటి వరకు మతాల పేరుతో మాట్లాడలేదని,హిందూ ముత్తైదువుల తాళిబొట్టు, హిందూ సమాజాన్ని పిరికి సమాజంగా తయారు చేసింది ప్రధాని మోడీ కాదా అని ప్రశ్నించారు.
భర్త లేడని రాష్ట్రపతి ద్రౌపతి మూర్మాను అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్టకు పిలువని దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన బార్య ఉండి కూడా సనాతన ధర్మానికి,చరిత్రకు విరుద్ధంగా రామ మందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ట ఎలా చేసావు అని ప్రధానిపై మండిపడ్డారు.అనాడు యజ్ఞం చేయడానికి రాముడు కూడా బంగారు సీత విగ్రహాన్ని పెట్టుకొని యాగం చేశాడని మరోసారి గుర్తుకు చేశారు.మూడు నల్లచట్టాలను తెచ్చి వందలాది రైతులకు పొట్టన పెట్టుకున్న ది మోడీ ప్రభుత్వం ఇప్పుడు మతాల పేరుతో విధ్వంసం సృష్టిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చామని నేడు కేంద్రంలోని ఐదు గ్యారంటీల పథకాలతో అధికారంలోకి రాబోతున్నాయని ఇప్పటికే ఆయా రాష్ట్రంలో జరిగిన మొదటి పేజ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ,రెండో ఫేజ్ లో జరిగిన ఎన్నికల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నామని అలాగే మూడో దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీలో ఉన్నామని తెలుపుతూ ఇప్పుడు జరుగబోయే ఎన్నికల్లో కలిపి ఇండియా కూటమి ఐదు గ్యారంటీలతో 300 సీట్లతో హస్తినను హస్తగతం చేసి ఎర్రకోటపై జెండా ఎగురవేస్తామని వెంకటస్వామి గౌడ్ ధీమా వ్యక్తంచేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంవత్సరానికి 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక దళిత బిడ్డ మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో నడుస్తున్నదని దీంతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగటం తప్పదని ఫ్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గౌడ్ పేర్కొన్నారు.నేను గత 35 ఏండ్ల క్రితం అర్ఎస్ఎస్ లో పనిచేశానని హిందూ సనాతన ధర్మాల గురించి మాకు తెలువదా అని ప్రధాని మోడీ,కేంద్ర మంత్రి అమిత్ షా లను ఆయన ప్రశ్నించారు.మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మాలోతు కవితకు ఓటు వేస్తే వృదానే అని గతంలో ఇక్కడి నుండి గెలిచి కేంద్ర మంత్రిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ అని తెలుపుతూ మరోసారి ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాలని ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గౌడ్ కోరారు.ఈ సమావేశంలో పీసీసీ కో ఆర్డినేటర్ కొర్ర రాజన్న,వెంకన్న,లింగారెడ్డి,తిరుమల్,రవి తదితరులు పాల్గొన్నారు.

కోడి అంతయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం

తంగళ్ళపల్లి నేటి దాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఆయన ఎంపీగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని కరీంనగర్ నియోజకవర్గం రైలు సౌకర్యం గాని స్మార్ట్ కరీంనగర్ సిటీ గాని నియోజకవర్గం లో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని అటువంటి విద్యావంతుడు మేధావంతుడు అయినా వినోద్ కుమార్ కి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లు అభ్యర్థించి కోరారు ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి మేకల సుమన్ గారిని గెలిపించండి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో లోక్ సభ ఎన్నికల్లో రాజ్యాంగ వ్యతిరేక శక్తులైన అగ్రకుల బిజెపి, బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఓడించి రాజ్యాంగ రక్షణ పార్టీ అయినధర్మ సమాజ్ పార్టీ వరంగల్ లోక్ సభ పార్లమెంట్ అభ్యర్థి మేకల సుమన్ గారికి చెప్పుల గుర్తు సీరియల్ నం 14 కి ఓటేసి గెలిపించాలని గణపురం మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మాట్లాడారు. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలందరికీ బతుకునిచ్చిన భారత రాజ్యాంగాన్ని మరియు రిజర్వేషన్లని నాశనం చేసే కుట్రలో బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ అనే మూడు పార్టీలు ఒకటేనని ఈ మూడు పార్టీలను నమ్మవద్దని ఈ 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో బ్రాహ్మణ, బాణీయ, క్షత్రియ అగ్రకుల వంశస్థులే ఈ దేశాన్ని పరిపాలించారని కానీ బీసీ, ఎస్సీ ,ఎస్టీ మతమైనారిటీల బతుకులు ఏమాత్రం మారలేదని రామరాజ్యం పేరుతో బిజెపి పార్టీ 10 సంవత్సరాల కాలంలో అణగారిన వర్గాల ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని అదే బాటలో బిఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ పేరుతో ఇక్కడ సబ్బండ వర్గాల ప్రజల బతుకులను ఆగం చేసిందని అదేవిధంగా ఈ దేశాన్ని అతి ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం పేరుతో అదే మోసం చేసిందని మళ్లీ ఈ మూడు పార్టీలు వేషాలు మార్చుకొని ఇంకా కొత్త లోకం తీసుకొస్తామని ప్రగల్బాలు పలుకుతూ విద్యా, వైద్యం, భూమి, ఉపాధి, ఇల్లు కనీస మౌలిక సౌకర్యాల కల్పనలో ఈ మూడు పార్టీలు విఫలమైనవి పార్లమెంట్లో ఏ చట్టం చేసిన అగ్రకులాల మేలుకొరకు చేసుకొని మరొకసారి సబ్బండ వర్ణాల వారికి మోసం చేయాలని చూస్తోందని వీరిని నమ్మవద్దని చెప్పడం జరిగింది. ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి మేకల సుమన్ గారి చెప్పుల గుర్తుకు ఓటేసి భారి మెజారిటీతో గారికి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కుర్రీ స్వామినాథన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కండే రవి జిల్లా ఉపాధ్యక్షులు కొగిల జితేందర్, జిల్లా కార్యదర్శి పొనగంటి సతీష్, మండల ప్రచార కమిటీ సభ్యులు ఇంజపెల్లి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు

బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..
తంగళ్ళపల్లిమండల కేంద్రంలో బీడీ ప్యాకింగ్ కార్మికులు కలవడంతోపాటు వారిని ఓటు అభ్యర్థించారు ఈ సందర్భంగా వెంగళ శ్రీనివాస్ బీడీ కార్మికుల స్థితిగతులు తెలుసుకొని వారి సంక్షేమానికి పెద్దపీట వేసి నెలకు 2016 రూపాయల జీవన భృతి కల్పించడం జరిగిందని కానీ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బీడీ పరిశ్రమలపై 18 శాతం జీఎస్టీతో విధించడంతో పరిశ్రమపై పుర్రె ఎముకల గొంతు డేంజర్ మార్కు గుర్తులను ముద్రించాలని అనేక ఆకాంక్షలు విధించడం వల్ల ఆరు రోజుల నుండి 10 రోజుల వరకు మాత్రమే పని నడుస్తుందని మిగిలిన రోజులు కార్మికులు పస్తులు ఉండేపరిస్థితి దాపురించిందని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్డర్లు వస్త్ర పరిశ్రమకు రాక నేతన్నలకు ఉపాధి కరువైందని తెలంగాణ ప్రాంతంలో దాదాపు 8 లక్షల మంది కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు లేకుండా పిఎఫ్ కలిగిన కార్మికులకు జీవన భృతి ఇవ్వాలని ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కార్మికులకు ఉపాధి దెబ్బతీసిన బిజెపి కాంగ్రెస్ పార్టీలకు ఈ పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కార్మిక సంక్షేమ కోసం ఎంతో కృషి చేసిన బి.ఆర్.ఎస్ పార్టీకి అండగా నిలిచి కారు గుర్తుకు ఓటు వేసి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా వినోద్ కుమార్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వారిని కోరారు ఇట్టి కార్యక్రమంలో కొప్పుల ప్రసాద్ జిందం మల్లేశం రమేష్ నాంపల్లి రామస్వామి బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీలో చేరిన బి ఆర్ఎస్ ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో పార్లమెంటరీ ఎన్నికల ముందు బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతుందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరు గారెంటీలో ఐదు పథకాలు అమలు అవుతున్నాయి అభివృద్ధిని చూసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని నాయకులు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని
కాంగ్రెస్ లో గాంధీనగర్ గ్రామాల నుండి పలువురు బిఆర్ఎస్ పార్టీ గణపురం ఎంపిటిసి మోట పోతుల శివశంకర్ గౌడ్ గాంధీనగర్ గ్రామ మాజీ సర్పంచ్ వీరితోపాటు దాదాపు 500 మంది భూపాలపల్లి శాసనసభ్యులు సత్యనారాయణ రావు గారి అధ్యక్షతన , వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య గార్లఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి.

నల్లబెల్లి , నేటి ధాత్రి :

ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రంగాపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు.గ్రామస్తులు. పోలీసుల కథనం ప్రకారం. గ్రామానికి చెందిన గుర్రం సునీల్ కుమార్ (32)తన ఇంట్లో శుక్రవారం ఉదయం విద్యుత్ సరఫరా కాకపోవడంతో సంబంధించిన విద్యుత్తు తీగను సరి చేస్తుండగా ఒక తీగ విద్యుత్ పోల్ పై మరో తీగ సునీల్ కుమార్ ఛాతికి తగలడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు సంఘటన గమనించిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు హుటాహుటిన ప్రైవేటు వాహనంలో ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి సునీల్ కుమార్ మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య అనూష ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై రామారావు పేర్కొన్నారు.

# గ్రామంలో అలముకున్న విషాదఛాయలు.

గ్రామానికి చెందిన గుర్రం సునీల్ ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు దీంతో గ్రామంలోని విషాద ఛాయలు అలముకున్నాయి. నిరుపేద కుటుంబానికి చెందిన సునీల్ కుమార్ మృతి చెందడంతో ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయారని ప్రభుత్వం మృతుడు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు..

ఓబులాపూర్ లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టోనీ ఆధ్వర్యంలో ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెలిచాలా రాజేందర్ రావు ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామంలోని ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి ఓటు అభ్యర్థించారు అలాగే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారులకు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం శ్రామిక న్యాయం ఉపాధి హామీ కూలీలకు 250 రోజుల పనితో పాటు వారికి కనీస వేతనం 400 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ పార్టీ బలపరిచిన అభ్యర్థిని తమ ఓటు చేతి గుర్తుపై వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చుక్క రాజశేఖర్ తంగళ్ళపల్లి మాజీ ఉపసర్పంచ్ పెద్దూరి తిరుపతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త రవీందర్ గౌడ్ ఓబులాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు పోచంపల్లి రమేష్ గోగు తిరుపతి వెంకటేశం అంజిరెడ్డి మల్లేశం తదితరులు పాల్గొన్నారు

మల్కాజ్గిరి అభివృద్ధి నా బాధ్యత, పట్నం సునీత మహేందర్ రెడ్డి ని గెలిపించండి: మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ మైనంపల్లి హనుమంతరావు

మల్కాజిగిరి, నేటిధాత్రి:

ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మల్కాజిగిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని జేఎల్ఎస్ఎన్ నగర్ లో మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సిపిఐ నాయకులతో కలిసి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ మైనంపల్లి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.కార్యక్రమంలో బాల మల్లేష్, రొయ్యాల కృష్ణమూర్తి,లక్ష్మణ్, తో పాటు కాంగ్రెస్ నాయకులు బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్,డివిజన్ అధ్యక్షుడు వైనాల ప్రవీణ్,జీవన్ రెడ్డి,రాంచందర్,ఫరీద్,సంతోష్ రాందాస్,కన్నే మల్ల నాగరాజు,సురేష్ సింగ్,వినోద్ యాదవ్,సత్యనారాయణ,పంజా శ్రీనివాస్ యాదవ్,బాల్ రాజ్ యాదవ్,సురేష్ సింగ్, సుమలత యాదవ్,పుష్పలత,కనక లక్ష్మీ,సుజాత,తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణకు… మాదిగ మాదిగ ఉపకులాల సంపూర్ణ మద్దతు తెలిపిన

తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుకుట్ల సమ్మయ్య మాదిగ

ముత్తారం :- నేటి ధాత్రి

ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు తెలంగాణ మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు జన్ను కనకరాజు మాదిగ, జాతీయ రాష్ట్ర అధ్యక్షుల పిలుపుమేరకు పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం ముత్తారం మండలం మరియు ఓడేడు గ్రామంలో మాదిగ వాడలో సమావేశం ఏర్పరచుకొని ముక్తకంఠంతో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగినది. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సమ్మయ్య మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, శ్రీధర్ బాబు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ముఖ్యంగా దళితుల కోసం అనేక సంక్షేమ ఫలాలు తీసుకురావడం జరిగినది ముఖ్యంగా ఆరు గ్యారెంట్లు ప్రజల అభివృద్ధికి ఎంతగానో దోహదం పడుతయి కాంగ్రెస్ ప్రభుత్వము దళితుల కోసం అనేకమైన ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగినది దళితులారా తస్మాత్ జాగ్రత్త బిజెపి ప్రభుత్వం మళ్ళీ వస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను తొలగిస్తరు టిఆర్ఎస్ పార్టీ మూడెకరాల భూమి ఇయ్యలే, డబల్ బెడ్ రూమ్ ఇయ్యలే దళితులకు అన్ని మోసాలే, ఎస్సి ఎస్టీ బిసి లు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి వంశీ కృష్ణ ను గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ టిఎంహెచ్డీ మంతిని నియోజకవర్గం నాయకులు మాట్ల రవి మాదిగ, పాల సిద్ధార్థ, శ్రీకాంత్ రాకేష్ మంథని కుమార్, ఎనుముల రమేష్. అధిక సంఖ్యలో మహిళలు మాదిగలు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం

-సీనియర్ నాయకుడు ముత్యం ప్రవీణ్ కుమార్…

– మెదక్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రాం రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం…

కొల్చారం, ( మెదక్ )నేటిధాత్రి :-

మండల కేంద్రమైన కొల్చారంలో మెదక్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి గెలుపు కొరకు కొల్చారం గ్రామంలో పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుపై ఓటువేసి గెలిపించాలని గ్రామా ప్రజలను కోరడం జరిగిందని ముత్యం ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కల్లబొల్లి మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. అభివృద్ధి కావాలంటే బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. అధికారం వచ్చే ఐదు నెలల గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు మాట్లాడుతుందని ఆయన విమర్శించారు. వచ్చే 13 తారీకున పార్లమెంటు ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు ఓటేసి బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఉపాధి హామీ కూలీలతో తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యం ప్రవీణ్ కుమార్, రాజా గౌడ్, చెన్నయ్య, చిన్న రాములు, భాస్కర్, పాండ్ర వెంకటేశం, ఎర్రోళ్ల శీను, అంజo, పట్లూరి నర్సింలు, శ్రీధర్ బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .

మాలమహానాడు వ్యవస్థాపకులు పివిరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన నాయకులు.

కారేపల్లి నేటి ధాత్రి

సింగరేణి మండల కేంద్రం లో మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు పోతుల విశ్వేశ్వర రావు 75 వ పుట్టినరోజు సందర్భంగా సింగరేణి మండల మాల మహానాడు మండల అధ్యక్షుడు సోమందుల రాములు నాయకత్వం లో అంబేద్కర్ విగ్రహం వద్ద పివి రావు జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మాల మహానాడు నాయకులు తలారి చంద్రప్రకాష్ మాట్లాడుతూ పివి రావు ఆనాటి ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్ అంటూ ఎస్సీలను విడదీసే ప్రయత్నం చేయడం జరిగింది. ఆరిజర్వేషన్లు వద్దంటూ రిజర్వేషన్ల పేరుతో దళిత కుటుంబాలని విడదియ్యెద్దంటూ దళితులందరూ కలిసి ఉండాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారందరూ కలిసి ఉంటేనే రాజ్యాధికారం వస్తుందని రాజ్యాధికారాన్ని రాకుండా ఆనాటి ప్రభుత్వాలు విభజించి పాలించు అనే విదంగా కుట్రలు చేయడం జరిగింది. కావున ఆ కుట్రని ఆనాడు గవర్నమెంట్ టీచర్ గా ఉన్న కీర్తిశేషులు పివి రావు మాల మహానాడు వ్యవస్థను స్థాపించి తన కుటుంబాన్ని సైతం జాతికి అంకితం చేసిన గొప్ప మహనీయుడు అంటూ వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ఆయన చేసిన పోరాటాన్ని మనం కూడా చేయాలంటూ చంద్రప్రకాష్ అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో మాల మహానాడు గ్రామ శాఖ నాయకులు కొక్కిలి యుగంధర్ చెవుల శ్రీనివాసరావు సోమందుల నాగరాజు తోట మల్ల సాయి చెవుల చందు సోమందుల వెంకటేశ్వర్లు తడికమల్ల నరేష్ నంద నూరి సురేష్ తలారి అనీల్ చెవుల అనీల్ చెవుల చంద్రశేఖర్ సోమందుల రఘుబాబు మైపా అనిల్ సోమందుల రఘుబాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మున్నూరు కాపులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి

గొల్లపల్లి నేటి ధాత్రి:
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రముఖ ఇండియన్ మెజీషియన్,గిన్నె బుక్ రికార్డ్ హోల్డర్ & సెంట్రల్ బోర్డ్ సినిమా సెన్సార్ సభ్యుడు సామల వేణు పాల్గొని మున్నూరు కాపు సభ్యులకు దిశనిర్దేశం చేశారు.ప్రముఖ ఇండియన్ మెజీషియన్ సామల వేణు మాట్లాడుతూ మున్నూరు కాపులు విద్యారంగంలోనూ,రాజకీయంగాను తదితర రంగల్లోనూ అభివృద్ధి సాధించాలని అన్నారు. వ్యవసాయ రంగంలోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి,మున్నూరు కాపు సభ్యులందరూ ఐక్యతతో ఇంకా ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరడం జరిగింది.అనంతరం మున్నూరు కాపు మాజీ వార్డ్ సభ్యులను సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్,మున్నూరుకాపు యూత్‌ఫోర్స్ వ్యవస్థాపకుడు రాళ్లబండి రామకృష్ణ, మున్నూరు కాపు పట్టణ అధ్యక్షులు పడాల జలంధర్,గౌరవ అధ్యక్షులు బోనగిరి మల్లారెడ్డి,గురిజాల బుచ్చిరెడ్డి,పుప్పాల మహిపాల్, పడాల సుదర్శన్,పడాల సత్యం,పడాల తిరుపతి,పడాల రాకేష్,కట్ట సత్తన్న,తదితరులు పాల్గొన్నారు.

రాహుల్ ప్రధాని అయ్యేది లేదు.. రేవంత్ రెడ్డి హామీలు నెరవేర్చేది లేదు.

అభివృద్ధి పనులు జరగాలంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతోనే సాధ్యం

హసన్ పర్తి / నేటి ధాత్రి

గ్రేటర్ వరంగల్ పరిధిలోని వంగపహడ్, హాసన్ పర్తి లలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మీరు ఆశీర్వదిస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు చేయాలని
వరంగల్ పార్లమెంట్ సమస్యలను పరిష్కరించుటకు కృషి చేస్తాను. గత పది సంవత్సరాల మోడీ పాలనలో శాంతి నెలకొంది.
మోడీ ప్రభుత్వంలో నాలాంటి వాళ్ళు ఎంపి గా ఉంటే మీ సమస్యలు అన్నీ తిరుతాయి అని హామీ ఇచ్చారు. ఢిల్లీలో మోడీ వరంగల్ లో నన్ను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. పేద వర్గాల సమస్యలు తెలిసిన వాడిని కేంద్రంలో కూడా పేదరికం నుండి వచ్చిన బిసి బిడ్డ ప్రధాన మంత్రిగా ఉన్నారు. మీ సమస్యలు పరిష్కారం చూపించగలగే సత్తా ఉన్న పార్టీ బిజెపి మాత్రమే
నేను వరంగల్ ప్రజలకు కొత్త ఏమీ కాదు కులంతో, మతం తో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు
ఇక కాంగ్రెస్, బిఆర్ఎస్ అభ్యర్థులు ఇక్కడ ప్రజలకు పెద్దగా తెలియదు
కాంగ్రెస్ నుండి వచ్చే వ్యక్తి కడియం శ్రీహరి బొమ్మ పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తుంది. కడియం శ్రీహరి నే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఆయన కూతురు ని ఎలా నమ్ముతారు?
కడియం కావ్య ను సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా వారి మనిషి అని అంగీకరించడం లేదు ఎందుకంటే మళ్లీ ఎప్పుడు పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్తారో అనే భయం ఉంది
నా వ్యక్తిత్వం దెబ్బతిసే విధంగా మాట్లాడే కడియం శ్రీహరి కి పుట్టగతులు ఉండవు ఈ ఎన్నికల్లో కడియం శ్రీహరి చరిత్ర కంచికె ఇన్ని రోజులు ప్రజలను ప్రలోభాలకు గురి చేసి గద్దె మీద కూర్చునావ్ ఇప్పుడు అదే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం కోసం సిద్దంగా ఉన్నారన్నారు.
రేవంత్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా తయారైంది.
ప్రజలకు మంచి చేయమని కాంగ్రెస్ కి పట్టం కడితే హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తుండు. వర్ధన్నపేట నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి మీ కండ్ల ముందే కనిపిస్తోంది.
నన్ను ఓడించడం కొరకు ఎన్ని కుట్రలు చేశారో మీ అందరికీ తెలుసు.
మీ కష్ట సుఖాల్లో తోడుగా ఉన్న వాడిని నా వ్యక్తిత్వం మీ అందరికీ తెలుసు
మీ అందరికీ సేవ చేయడం కోసం బిజెపి పార్టీ నాకూ ఎంపి అభ్యర్థిగా బిజెపి అవకాశం కల్పించింది.
నన్ను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మీదే.
వర్ధన్నపేటలో 2014,2018 ఎన్నికల్లో నాకూ ఇచ్చిన మెజారిటీ మళ్లీ తిరిగరాయలన్నారు.
ఈ కార్యక్రమంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మరావు, రాష్ర్ట ఎస్సి మోర్చ అధ్యక్షులు కొండేటి శ్రీధర్,హాసన్ పర్తి జెడ్పిటిసి సునీత, కార్పొరేటర్ గురుమూర్తి శివ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ జక్కు రమేష్ గౌడ్, బుద్ధే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

గొల్లపల్లి మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రవేశాలు ప్రారంభం

గొల్లపల్లి నేటి ధాత్రి:
గొల్లపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం లో ప్రవేశాల కోసం ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం అయ్యాయని కళాశాల ప్రిన్సిపాల్ ఈర వేణి రాజ్ కుమార్ తెలిపారు. ఈ సంవత్సరం పదవ తరగతి ఉత్తీర్ణులైన ఆసక్తిగల విద్యార్థిని, విద్యార్థులు ఈనెల 10 నుంచి ఈనెల 31 లోగా www.tsmodalschools.com వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొని దరఖాస్తు ఫారం ను పాఠశాలలో సమర్పించవలెను. ఎంపీసీ, బైపిసి, ఎంఈసి, సిఈసి నాలుగు గ్రూపులలో ఒక్కొక్క గ్రూప్ కి 40 సీట్లు అందుబాటులో కలవు. మోడల్ స్కూల్ లో అత్యున్నత ప్రమాణాలు గల అధ్యాపక బృందం చేత ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగును. అమ్మాయిలకు హాస్టల్ సౌకర్యం కలదు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు యూనిఫామ్ సప్లై చేయబడును. అదునాతన సైన్స్ ల్యాబ్ లు – బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్ లు, విద్యార్థులందరికీ కళాశాలలో ఎంసెట్, నీట్, జేఇఇ కోచింగ్ ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా అత్యున్నత ప్రమాణాలతో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగును. ఈ సదవకాశాన్ని గ్రామీణ ప్రాంత విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలరని కళాశాల ప్రిన్సిపల్ ఇరవేణి రాజకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించండి

గొల్లపల్లి నేటి ధాత్రి:
ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ నీ భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగదామునిపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడ్లూరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశ పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు. ఉపాధి హామీ కూలీని 200 నుండి 400 లకు పెంచుతామని ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కేంద్రంలో 10 సంవత్సరాలుగా బిజెపి అధికారంలో ఉండి నిత్యవసర వస్తువులపై, ఎరువులు పై అధిక ధరలు పెంచి సామాన్య ప్రజల మీద భారం మోపారు. అందుకు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది అని అన్నారు. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి పేద మహిళలకు ఏటా లక్ష రూపాయలు యువతకు 30 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో నే ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు వచ్చాయని అన్నారు. ఆగస్టు 15 లోపల రైతులకు రెండు లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీని అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే మేమిద్దరం కలిసి ధర్మపురి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, రేవెల్ల సత్యనారాయణ గౌడ్, నేరెళ్ల మహేష్, అనిల్, శంకరయ్య, సత్తయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉపాధి హామీ కూలీలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సిపిఎం, సిపిఐ పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపే లక్ష్యంగా మిత్రపక్షాల ఆధ్వర్యంలో భద్రాచల పట్టణ కేంద్రంలో బైక్ ర్యాలీ

భద్రాచలం నేటి ధాత్రి

కాంగ్రెస్ పార్టీ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించిన భద్రాచల శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు

బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎన్.ఎస్.యు.ఐ,ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, ఎలక్ట్రిషన్ యూనియన్ నాయకులు

ఈరోజు భద్రాచల పట్టణ కేంద్రంలో సిపిఎం, సిపిఐ పార్టీలు బలపరుస్తున్న మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుకుంటూ 500 బైక్ లతో పట్టణంలోనీ ప్రతి కాలనీలో ర్యాలీని నిర్వహించడం జరిగింది.

మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి నేత్రంతోల్లో జరుగుతున్నటువంటి ఈ బైక్ ర్యాలీని భద్రాచల శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ జెండాను ఊపి ప్రారంభించడం జరిగింది.

స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీలో ఎన్.ఎస్.యు.ఐ, ఎస్సీ సెల్,ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, ఎలక్ట్రిషన్ యూనియన్ ల ఆధ్వర్యంలో యువత భారీ సంఖ్యలో పాల్గొని, బలరాం నాయక్ గెలుపు, భద్రాచలం అభివృద్ధికి మలుపు, చదువుకున్నావు యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అనే నినాదంతో భద్రాచలం పురవీధులలో నినాదాలు చేస్తూ, పట్టణంలోని ప్రతి ప్రాంతంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ యొక్క బైక్ ర్యాలీలో టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్, పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ నున్నే రామకృష్ణ, తోటకూర రవిశంకర్, భద్రాచలం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్, సిపిఎం నాయకులు వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండశెట్టి కృష్ణమూర్తి,అరికెల తిరుపతిరావు ,రత్నం రమాకాంత్ ,తాళ్లపల్లి రమేష్ గౌడ్, ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్,బంబోతుల రాజీవ్,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాసముల రాము,తాండ్ర నరసింహారావు, నర్రా రాము,నాగేంద్ర, రాగం సుధాకర్,గండేపల్లి హనుమంతరావు,దుద్దుకూరు సాయిబాబా,యూత్ నాయకులు గాడీ విజయ్,ఆకుల వెంకటరమణ,భాను, మహిళా కాంగ్రెస్ నాయకులు రూపా దేవి తదితరులు పాల్గొన్నారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం పంపిన ఎమ్మెల్యే తూడి

వనపర్తి నేటిదాత్రి; వనపర్తి జిల్లా
రాజనగరం 12వ వార్డు చెందిన మద్దెల చిన్ననారాయణ మృతి చెం దా రు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పందించి 5000 రూపాయలు మృతుని కుటుంబ సభ్యులకు పంపారు ఆర్థిక
సహాయాన్ని 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో మాజీ అధ్యక్షుడు బోయ సత్యం నాగన్న పెండెం కురుమూర్తి ఆటో మాజీ అధ్యక్షులు కొత్త గోళ్ళ శ్రీనివాసులు, మాజీ మండల యూత్ అధ్యక్షులు బి రాజు, కరాటి రమేష్ దర్గా బోయ కురుమూర్తి, అంబటి రమేష్ తదితరులు పాల్గొన్నారు

error: Content is protected !!
Exit mobile version