మహాత్మ జ్యోతిరావు పూలే గురుకులాలకి సొంత భవనాలు నిర్మించాలి

ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం

*బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ కి వినతి పత్రం అందజేశారు **

ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్

హన్మకొండ, నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సొంత భవనాలు లేకపోవడం వలన విద్యార్థులు ఇరుకు గదుల్లో ఉంటు విద్యను అభ్యసించే పరిస్థితి నెలకొందని , అదేవిధంగా గురుకుల పాఠశాల ఐదు నెలల నుండి మెస్ బిల్స్ బిల్లులు రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు,
ఉమ్మడి వరంగల్ జిల్లా లోని వివిధ కళాశాలలో చదువుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు గత రెండు మూడు సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వలన విద్యార్థులకు విద్యను అభ్యసించే లేక పోతే, విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో రాకపోవడం వలన విద్యార్థులకు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు టీసీ మెమోలు స్టడీ సర్టిఫికెట్ ఇవ్వలేకపోవడం వలన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు కావున మంత్రిగారు స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *