దివంగత 28 న మాజీ ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి జయంతి వేడుకలలో
కవులు సాహితీవేత్తలు జర్నలిస్టులు పాల్గొనాలి
.మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి నేటీదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో ఈనెల 28న దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో వనపర్తి మొదటి ఎమ్మెల్యే గోల్కొండ దిన పత్రిక సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి 130 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ,జిల్లాలోని సాహితీవేత్తలు,కవులు,రచయిత లు కళాకారులు విలేకరులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, ఉదయం 10 గంటల నుండి రెండు గంటల వరకు వేడుకలు ఉంటాయని మాజి మంత్రి నిరంజన్ రెడ్డి ఆయన నివాసంలో ఏర్పాటు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అనంతరం పుస్తకాల ఆవిష్కరణ ఉంటుందని అన్నారు .సురవరం ప్రతాపరెడ్డి సేవలు తెలంగాణ రాష్ట్రం సమాజం ఆమోదించదగినవని సాహిత్య న్యాయవాద రంగంలోఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. దళితులను బలహీనవర్గాలను సమాజానికి ఎదురొడ్డి నిలిచేలా తెలంగాణకు ఆదర్శప్రాయంగా నిలిచారని అన్నారు. విలేకరి వృత్తిలో ఉన్నవారు సురవరం ప్రతాపరెడ్డిని మార్గదర్శిగా తీసుకోవాలని హితవుపలికారు. వనపర్తి లో సురవరం ప్రతాపరెడ్డి పేరున బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో నూతన గ్రంథాలయం నిర్మాణం, కాంస్యవిగ్రహం ఏర్పాటు చేశామని చెప్పారు. రెండవ అంతస్తు నిర్మాణంలో డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. ప్రతాపరెడ్డి జయంతి వేడుకల సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్వీయ రచన మన కల నిజం పుస్తకావిష్కరణ ఉంటుందని అనంతరం సురవరం సాహిత్య,రాజకీయ, జీవిత విశేషాలపై పలువురు వక్తలు ప్రసంగిస్తారని సాహితీ వేదిక సభ్యులు ఎన్.బలరాం తెలిపారు. ఈ సమావేశంలో సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ డాక్టర్ వీరయ్య సభ్యులు బైరోజు చంద్రశేఖర్ మీడియా సెల్ ఇంచార్జి నందిమల్ల అశోక్ బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ స్టార్ రహీం తోట శ్రీను జోహెబ్ తదితరులు పాల్గొన్నారు విలేకరులకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తోట మామిడి పండ్లు పంపిణీ చేశారు
