పరకాల నేటిధాత్రి
శుక్రవారం రోజున పరకాల మండల పరిధిలోని పోచారం గ్రామైఖ్య సంఘ భవనంలో పాఠశాల విద్యార్థులకు యూనిఫాం దుస్తులు కుట్టడానికి ఏర్పాటు చేసిన కేంద్రాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు డిపియం, స్వామి,ఏపియం క్రాంతి లతో కలిసి ప్రారంభించారు.సభ్యులకు కేటాయించిన దుస్తులు ఈ నెల 25 వ తేదీ లోపు అప్పగించాలని సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్వర్గం కవిత,విఓ అధ్యక్షురాలు, సీఏలు మహిళా సంఘ ప్రతినిధులు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు
