వినాయక మండపం ఏర్పాటుకు ముందస్తు సమాచారం తప్పనిసరి
★కోహీర్ సబ్-ఇన్స్పెక్టర్ నరేష్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్/కోహీర్ ఆగస్టు 18
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన గణేష్ విగ్రహాలు పెట్టె ప్రతి ఒక నిర్వాహకులకు సోమవారం పోలీస్ స్టేషన్ కార్యాలయంలో కోహీర్ సబ్ -ఇన్స్పెక్టర్ నరేష్ ఒక ప్రకటనలో తెలిపిన ప్రకారం వివిధ గ్రామాలకు చెందిన చిన్ని పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక గణేష్ మండప నిర్వాహకులకు policeportal.tspolice.gov .in లింక్ పై మీ యొక్క గణేష్,మండపం వివరాలు అన్ని దిగువనా తెలిపిన లింక్ లో నమోదు చేసుకొని ఒక సెట్ జిరాక్స్ పోలీస్ స్టేషన్ లో ఇవ్వగలరు మీరు సరైన సమాచారం ఇచ్చినచో ఇట్టి మండపలకు పోలీస్ వారు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సారైనా భద్రత ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సకాలంలో పూర్తి సమాచారం ఇచ్చి సహకరించగలరు అని ఎస్ఐ నరేష్ తెలిపారు.