ప్రజాసేవకు పవన్‌ పనికిరాడు!?

-ఇది విజయవాడ జనం మాట.

-వరదల్లో సాయానికి తోడు రాలేదు.

-పవన్‌ వస్తే సహాయక కార్యక్రమాలకు ఆటంకమా!

-ప్రచార ఆర్భాటానికి మాత్రమే పరిమితమా!

-ఆకలితో వున్న వారు సెల్ఫీల కోసం ఎగబడతారా?

-అలాంటప్పుడు పిఠాపురం ఇంట్లో ఎలా వుండగలవు?

-హైదరాబాదులో మకాం పెట్టి ప్రజలకు సేవ చేయడం సాధ్యమా!

-పవన్‌ ఆరాటమంతా పదవుల కోసమేనా!

-ఉప ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా!

-ప్రజలకే తన ఇమేజ్‌ ఇబ్బంది సృష్టిస్తే పవన్‌కు పదవెందుకు?

-అధికారుల సూచన మేరకే రాలేదన్న లాజిక్‌ జనం నమ్ముతారా?

-పదవి కావాలి. అధికారం కావాలి.

-సినిమాలు చేస్తూ కాలక్షేపం చేయాలి.

-దివి సీమ ఉప్పెన సమయంలో ఎన్టీఆర్‌ జోలె పట్టలేదా?

-ఎన్టీఆర్‌ నిత్యం ప్రజల్లో వుండలేదా!

-ఇమేజే అడ్డమైనప్పుడు రాజకీయాలెందుకు?

-పదవే ఇబ్బందిగా మారినప్పుడు కుర్చీలో కూర్చోవడమెందుకు?

-ఎన్టీఆర్‌ కంటే పెద్ద ఇమేజ్‌ వున్న హీరోనా పవన్‌!

-పవన్‌కు అధికారం అలంకారమేనా?

-ప్రజాసేవ అంతా ఉత్తుత్తి నటనేనా!

-ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నా పెద్ద నాయకుడినని చెప్పకనే చెప్పినట్లా?

-ఉప ముఖ్యమంత్రిగా 6 కోట్ల విరాళం ఇవ్వడం గొప్పనా!

-విపత్తు నిర్వహణ చేపట్టడం ముఖ్యం.

-ప్రజలకు అందుబాటులో వుండి సేవ చేయడం అవసరం.

-పవన్‌ తీరు ఎన్నటికైనా తెలుగు దేశం పార్టీకి ఇబ్బంది కరం.

-ఆపదోచ్చినప్పుడు జనం ముందుకు పవన్‌ రాకపోవడం దౌర్భాగ్యం.

-మళ్ళీ ఎన్నికలప్పుడు వెతుక్కుంటూ వస్తానంటే బరతం పడతారు జనం.

-ఎల్ల కాలం మాటల గారడీ చెల్లదు.

-ప్రజలకు నేరుగా సేవ చేయకపోతే మళ్ళీ గెలిపించరు.

-గాలిలో గెలిచే నాయకులు ఇలాగే వుంటారు.

-గెలిచాక పదవి చూసుకొని కాలయాపన చేస్తారు.

-గెలిచేదాకా ఎండనక, వాననక తిరుగుతారు.

-గెలిచాక పవన్‌ లాంటి నాయకులు ముఖం చాటేస్తారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

పనికి రాని పెనిమిటి పక్కనున్నా ఒక్కటే..పక్కమీదున్నా ఒక్కటే అని సామెత. విజయవాడలో జలవిలయంతో ప్రజలు అల్లాడుతుంటే ఉప ముఖ్యమంత్రి పవర్‌ కళ్యాణ్‌ సహాయక చర్యల్లో లేకపోవడాన్ని కూడా ఇలాగే అంటున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వుండి తాను ప్రజల్లోకి వస్తే సహాయ సహాకారాలకు ఆటంకం కల్గుతుందని చెప్పిన వారు బహుషా ఈ ప్రపంచంలో ఒక్క పవన్‌ కళ్యాణే కావొచ్చు. ప్రజలకు ఆపద వచ్చిందటే నేనున్నాని ముందుకొచ్చేవారిని చూశాం కాని, తాన రాకతో ప్రజలకు ఇబ్బంది కలుగ కూడదన్న మాట చెప్పడానికి అక్కడ తిరునాళ్లు జరగడం లేదు. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. బిక్కు బిక్కుమంటూ పగలు రాత్రి గడుపుతున్నారు. ఏ ఉపద్రవం వచ్చిన జీవితాలు తలకిందులౌతాయో? అని క్షణక్షణం భయం గుప్పిట్లో బతుకుతున్నారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక, కంటి మీద కునుకులేక, వరదల్లో నిండా మునుగుతూ కాలం గడుపుతున్నారు. అలాంటి పరిస్ధితులను చూసి, ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన చేయాల్సిన నాయకుడు అధికారులు వద్దాన్నరన్న సాకుతో మూడు రోజుల పాటు ప్రజలు ఎలా వున్నారు? ప్రజలకు సేవలు అందుతున్నాయా? వారి యోగక్షేమాలు తెలుసున్నది లేదు. మూడు రోజుల తర్వాత వచ్చి రివ్యూలు చేసి, ఓ ఆరు కోట్లు విరాళంగా ప్రకటించి చేతులు దులుపుకున్నాడు. వరద ప్రాంతాల్లో పర్యటిస్తానని చెప్పి జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం అందించాడు. ఇదా నాయకుడికి వుండాల్సిన లక్షణం అని ప్రజలు చీ కొడుతున్నారు. నమ్మి గెలిపించినందుకు తమకు తగిన శాస్తి చేశాడంటూ తూర్పార పడుతున్నాడు. తనను తాను సెమీగాడ్‌గా ఊహించుకునే నటులను నాయకుడిని చేస్తే ఇలాగే వుంటుందని తిట్టుకుంటున్నారు. ఇవన్నీ పవన్‌ కళ్యాణ్‌కు వినపకడపోవచ్చు. కాని చెప్పేవారు ఖచ్చితంగా వుంటారు. అందుకే పవన్‌ కళ్యాణ్‌ ప్రజా సేవకు పనికి రాడని ఎప్పటిననుంచో మేధావులు చెబుతూనే వున్నారు. రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తూనే వున్నారు. కాని పవన్‌ కళ్యాణ్‌కు తాను రాజకీయాలు చేయలన్న కోరికే కనిపించింది తప్ప, ప్రజలకు చేయాలన్న ఆలోచన ఎప్పుడూ కనిపించలేదు. ఎందుకంటే కరోనా సమయంలో పవన్‌ కళ్యాణ్‌ ప్రజల్లోకి వచ్చింది లేదు. ఆనాడు కూడా ప్రజలకు సేవ చేసింది లేదు. ఆ సమయంలో తెలుగుదేశం నాయకులైనా, వైసిసి నాయకులైనా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేశారు. కొన్ని కోట్ల రూపాయల విలువైన నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు పంపిణీ చేశారు. నిత్యం లారీకొద్ది బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయాలతో కూడిన బస్తాలు కాలనీలకు పంపించి ప్రజలను ఆదుకున్నారు. కాని ఎక్కడా పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా తాను లారీ బియ్యం పంపిణ వార్తలు లేవు. ఆయన అనుచరులైన జనసైనికులు చేసిన సేవ ఏదీ లేదు. కాని కాలం కలిసివచ్చింది. తెలుగుదేశంతో జత కట్టడంతో పార్టీ నిలబడిరది. అనుకోని పదవి వరించింది. కాని ఆయన మాత్రం ప్రజలకు దగ్గరైంది లేదు. సేవచేస్తున్నది లేదు. కనీసం ఒక ఉపద్రవం వచ్చిన సమయంలనైనా పవన్‌ ప్రజల్లోకి రావడం అన్నది మనిషిగా బాధ్యత. మంత్రిగా కర్తవ్యం. ఆ రెండూ వదిలేసి అధికారులను సాకుగా చూపించి, తప్పించుకుంటే సరిపోదు. ప్రజలకు సమాదానం చెప్పుకోవాల్సిన సమయం రాకమానదు.

ప్రజానాయకుడంటే ప్రజల్లో వుండాలి. ప్రజల్లోనే నిత్యం వుండాలి.

పదవిలో వున్నప్పుడు మరింత ఎక్కువగా వుండాలి. ప్రజాక్షేత్రమే జీవితంగా మార్చుకోవాలి. నిత్యం ప్రజల సంక్షేమమే ద్యేయంగా రాజకీయాలు చేయాలి. ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ వుండాలి. తనుకు ప్రజలంటే ఇష్టమన్న మాటలు చెప్పి, మధ్యపెడతే ఎల్ల కాలం రాజకీయం సాగదు. నాయకుడు ప్రజలకు ఏ కష్టం రాకుండా కాపాడుకోవాలి. ఆపదలో వున్నవారిని ఆదుకోవాలి. ఇబ్బందుల్లో వున్నవారిని గట్టెక్కించాలి. ఎల్లవేళాలా ప్రజలకు అందుబాటులో వుండాలి. అండగా వుండాలి. అర్ధరాత్రైనా, అపరాత్రైనా సరే నేనున్నాన్న ధైర్యం ప్రజలకు కల్పించాలి. చీమ చిటుక్కుమన్నా ప్రజల ముందు వాలిపోవాలి. పేదల ఆకలి తీర్చాలి. పేదల జీవితాల్లో మార్పులు తేవాలి. వారి జీవితాల్లో వెలుగులు నింపాలి. ప్రజలకు అందుబాటు లేనప్పుడు పదవిలో వున్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే. ప్రజలు పవన్‌ కళ్యాణ్‌ను ఎన్నుకున్నదెందుకు? తనను గెలిపిస్తే సేవ చేస్తానని ఎన్నికల ముందు చెప్పడమెందుకు? ఏళ్ల తరబడి ప్రజల ముందు సాగిలపడడం ఎందుకు? తాను జేబుల్లోనుంచి డబ్బులు ఖర్చుపెడుతున్నానని గొప్పలు చెప్పడమెందుకు? అన్ని వేళలా డబ్బులే అవసరం పడవు. నాయకులు ఇచ్చే కొండంత ధైర్యంతో కూడా ప్రజల్లో భరోసా నింపొచ్చు. బుడమేరు గేట్లు ఎత్తితే వచ్చిన వరద విజయవాడను ముంచెత్తింది. మరో వైపు కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. నీళ్లలో ప్రజలు కొట్టుకుపోయారు. అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఇలాంటి సమయంలో నాయకుడు ప్రజల్లో లేకపోతే ఎలా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడు మూడు రోజుల పాటు కంటి మీద కునుకులేకుండా ప్రజల్లో వున్నారు. బురదలోకి దిగారు. మోకాలు లోతు నీళ్లలో నడుకుంటూ వెళ్లి ప్రజలను పరామర్శించారు. వారి బాగోగులు తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. నేనున్నానని ఆదుకుంటానని ఆశ కల్పించారు. 75 ఏళ్ల వయసులో తన ఆరోగ్యం గురించి ఆలోచించలేదు. తన కన్నా తన ప్రజలు ముఖ్యమనుకున్నారు. ముఖ్యమంత్రిగా వుంటూ కూడ సామాన్యుడిలా ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. మంత్రి లోకేష్‌తోపాటు, ఇతర మంత్రులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు అంతా వరదల్లోనే ప్రజలకు అందుబాటులో వున్నారు. కాని జనసేన అధినేత పవన్‌ కళ్యాన్‌ లేడు. ఆయన అనుచరులు రాలేదు. ఆ పార్టీ నేతలు కనిపించలేదు. పవన్‌కుటుంబ సభ్యులు కూడా రాలేదు. కాని తెలుగుదేశం నాయకులు, మంత్రులు చేసే సేవలో పవన్‌ తనకు కూడా క్రెడిట్‌ దక్కుతుందని ఆశించినట్లున్నారు. విజయవాడలో వరదలు మొదలైనప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో వాడ వాడలో తిరుగుతూ వచ్చారు. ఆ సమయంలో పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడా అని అన్ని వర్గాల ప్రజలు ప్రశ్నించారు. కనీసం నేను వస్తున్నానని ఒక్క ప్రకటన కూడా పవన్‌ చేయకపోవడం గమనార్హం. ప్రజా సేవ అంటే వేల పుస్తకాలు చదవడం కాదు. పోటోలకు ఫోజుల కోసం పుస్తకాలు చదవితే మేలు జరగదు.

ప్రజలకు కావాల్సింది సినిమా డైలాగులు కాదు.

నాయకుడి డెడికేషన్‌. నాయకుడి డైనమిజమ్‌. ప్రజాసేవ అంటే తెరమీద చెప్పే డైలాగులు కాదు. ప్రజా సేవ చేయాలన్న గుణమున్నట్లు నటించడం కాదు. దానికి కూడా పట్టుదల కావాలి. ప్రజలంటే ప్రేమ వుందని చెప్పడం కాదు. ఇలాంటి సమయాలే నాయకుడి చిత్తశుద్దిని చూపిస్తాయి. వారి అంకిత భావం ఎంతదో తెలుపుతాయి. ఇలాంటి పరిస్దితుల్లో సర్వం కోల్పోయిన ప్రజలకు అండగా నిలవాలి. ప్రజల కోసం అహర్నిషలు కృషి చేయాలన్న ఆరాటం వుండాలి. ప్రజల మేలు కోసం తపన పడాలి. 1977లో దివి సీమకు ఉప్పెన వచ్చిన సమయంలో ఎన్టీఆర్‌ లాంటి వారు జోలెపట్టుకొని విరాళాలు సేకరించారు. దివిసీమలో సహాయకార్యక్రమాలలో స్వయంగా పాలుపంచుకున్నారు. ప్రజలకు నేరుగా వారి సేవలను అందించారు. అంతకంటే గొప్ప నటుడా పవన్‌కళ్యాణ్‌ అని తెలుగు సమాజం ప్రశ్నిస్తోంది. ఎన్టీఆర్‌ కోసం నిత్యం తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని వేల మంది మాద్రాసు వెళ్లేవారు. ఆయనను చూసి తరించాలనుకునేవారు. అలాంటి ఇమేజ్‌ వున్న నాయకుడు తన ప్రజలకు సేవ చేయాలని ప్రజల్లోకి వచ్చాడు. ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సయమంలో ఏటా వర్షా కాలంలో ఏదో ఒకరకమైన సమస్యలు వస్తూనే వుండేవి. అప్పుడు ఆయనే స్వయంగా ప్రజల వద్దకు వెళ్లేవారు. అంతే కాని నా వల్ల సహాయకార్యక్రమాలకు ఆటంకం కల్గుతుందని కుంటి సాకులు చెప్పలేదు. ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టిన ప్రజలు ఆపదలో వున్నప్పుడే రాలేని నాయకుడు మామూలు సమయాల్లో రాజకీయాలకోసం వస్తానంటే స్వాగతించరు. ఇప్పటికైనా మారకపోతే వచ్చే ఎన్నికల్లో మాజీని చేస్తారు!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *