కరీంనగర్‌ నాదే…గెలిచేది నేనే.

https://epaper.netidhatri.com/view/241/netidhathri-e-paper-20th-april-2024%09/3

కరీంనగర్‌లో కమలం కలలు కల్లలే!

నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో కరీంనగర్‌ బిఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌ ప్రచార వివరాలు, తన గెలుపు

అవకాశాలు ఆయన మాటల్లోనే

`బండి సంజయ్‌ ఆశలు ఆవిరే.

`ఎంతో ఆత్మ విశ్వాసంతో చెబుతున్న!

`ప్రజలకు ఎల్లవేళలా వెన్నంటి వుంటా!

`సమస్యలలో ప్రజలకు తోడుగా వుంటా!

`కష్టాలలో వున్న వారికి అండగా వుంటా.

`ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తా.

`కేంద్రంలో ఎవరున్నా కొట్లాడి నిధులు తెస్తా!

`గెలిపిస్తే ఐదేళ్లలో ఎవరూ ఊహించంత అభివృద్ధి చేస్తా!

`కేంద్రంలో అధికారం వున్నా బండి సంజయ్‌ చేసింది సున్నా.

`కరీంనగర్‌ ప్రజలకు నేనున్నా…

`ఇకపై వారి సంక్షేమం నేను చూసుకుంటా.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్ర్ర రాజకీయాల్లో పార్లమెంటు ఎన్నికల్లో సంచనాలు నమోదు కాబోతున్నాయి. అందులో భాగంగా కరీంనగర్‌ పార్లమెంటు ఎన్నికల్లో కారు గెలుపు ఖాయమన్న మాటలే సర్వత్రా వినిపిస్తున్నాయి. నాలుగు నెలల్లో ప్రజలకు ఎదురౌతున్న కష్టాలు, కాంగ్రెస్‌ పార్టీ చేసిన మోసాలు ప్రజలు తొందరగానే తెలుసుకున్నారు. గెలిచిన మరు నాడు నుంచే కాంగ్రెస్‌ పార్టీ అనుసరిస్తున్న విధానాలు ప్రజలను అమోమయానికి గురిచేస్తున్నాయి. ఆరు గ్యారెంటీలు అమలు చేయడం కాంగ్రెస్‌ ప్రభుత్వం వల్ల కాదు. అవి అమలు చేయాలంటే చిత్తశుద్ది కావాలి. అందుకు అవసరమైన కార్యాచరణ వుండాలి. అంతే తప్ప మాటలకు పరమితమైతే, ప్రతి నిత్యం రాజకీయాలే చేస్తామంటే ప్రజలు హర్షించరు. సంక్షేమ ఫథకాలు అమలు కావు. పథకాల అమలుకు ప్రాణం పెట్టాలి. ప్రజలకు సంక్షేమ పలాలు అందాలన్న అంకిత భావం పాలకులు వుండాలి. అంది ఒక్క బిఆర్‌ఎస్‌కే వుంది. కేసిఆర్‌ నాయకత్వంలోనే తెలంగాణ సుబిక్షమైంది. దానిని కాంగ్రెస్‌ పాలకులు ఆగం చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలను విస్మరిస్తున్నారు. ఐదేళ్ల అధికారం కోసం చెప్పిన మాయ మాటలే తప్ప, ప్రజలకు మేలు చేయాలన్న సోయి కాంగ్రెస్‌లో కనిపించడం లేదు. అందుకే ప్రజలు మళ్లీ బిఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారు. కేసిఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కేంద్రం నుంచి నిధులు తేవాలన్నా, తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలన్నా అది బిఆర్‌ఎస్‌ నాయకుల వల్లనే సాధ్యమౌతుందని ప్రజలకు తెలుసు. అందుకే ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. ఏ ఊరికెళ్లినా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. తాను ప్రజల్లోకి వెళ్తుంటే ప్రచారానికి వెళ్తున్నట్లు లేదు. ఆత్మీయుల మధ్యకు వెళ్తున్నట్లు, బంధువులను కలుస్తున్నట్లు వుంది. అంతగా నన్ను ప్రజలు ఆదరిస్తున్నారు. అక్కున చేర్చుకుంటున్నారు. ఈసారి ఎలాగైనా గెలిపించుకుంటామని చెబుతున్నారు. ఏమర పాటును కలలోకి కూడా రానివ్వమని అంటున్నారు. కరీంనగర్‌ పార్లమెంటు పరిధి ప్రజల ఆప్యాయత, ఆదరణ చూస్తుంటే వాళ్లకు జీవితాంతం సేవ చేసినా సరిపోదు. నా జీవితం కరీంనగర్‌ ప్రజలకే అంకితమంటున్న బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి బోయిన పల్లి వినోద్‌ కుమార్‌ తో నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో పంచుకున్న ప్రచార విశేషాలు ఆయన మాటల్లోనే…
కాంగ్రెస్‌ పార్టీ పరిస్దితి అలా వుంటే బిజేపి పరిస్దితి అంతకన్నా మెరుగేమీలేదు.
గత ఎన్నికల్లో కేవలం సానుభూతి మీద గెలిచిన బండి సంజయ్‌ చెప్పేవి మాటలే తప్ప, అభివృద్ది లేదని ప్రజలు తెలుసుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో జరిగిన పరాభవమే పార్లమెంటు ఎన్నికల్లో కూడా బండి సంజయ్‌కు తప్పదు. 2018 శాసన సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజల్లోకి వెళ్లి కన్నీళ్ల పర్యంతమై బండి ప్రజల్లో సానుభూతి పెంచుకున్నాడు. దాంతో ప్రజలు నమ్మారు. కాని ఆయన ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించలేదు. మతం గురించి, ప్రజలను మాయ చేయడం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. గతంలో ఆయన బిజేపి అధ్యక్షుడుగా వున్నప్పుడు చేసిన అనవసర హంగామా! ప్రజలు గమనించారు. పార్లమెంటు సభ్యుడిగా కరీంనగర్‌కు ఆయన అన్యాయం చేశారు. తన స్దాయిని మించి ఊహించుకున్నాడు. అందుకే శాసన సభ ఎన్నికల్లో మళ్లీ ప్రజలు పక్కన పెట్టారు. ఇప్పుడు పల్లెల్లోకి వెళ్లాలి. బిజేపి పల్లెలకు చేసిందేమీ లేదు. పల్లెను బాగు చేసింది బిఆర్‌ఎస్‌. పల్లెకు వెలుగు తెచ్చింది బిఆర్‌ఎస్‌. పల్లెకు ఆయువైంది బిఆర్‌ఎస్‌. పల్లెకు పండుగ తెచ్చింది బిఆర్‌ఎస్‌. పల్లెను పచ్చగా మార్చింది బిఆర్‌ఎస్‌. దశాబ్దాలుగా గోస పడిన కరీంనగర్‌ పల్లెలకు కొత్త శోభ తెచ్చింది కేసిఆర్‌. ఎండిన గుండె లాంటి కరీంనగర్‌ తడిని అద్దిన ఘనత కేసిఆర్‌ది. అలాంటి కరీంనగర్‌ పల్లెను బండి సంజయ్‌ చూసింది లేదు. బిజేపి పట్టించుకున్నది లేదు. తెలంగాణ పల్లె జనం గుండెల్లో ఎప్పుడూ నిండి వున్నది బిఆర్‌ఎస్సే.. ప్రజల కలవరింత కేసిఆర్‌ కోసమే. అందుకే ఈసారి నా గెలుపు ఖాయం. ఇది ఎంత ఆత్మ విశ్వాసంతో చెబుతున్న మాట. ప్రజలు నాకిస్తున్న భరోసాతో పెరుగుతున్న విశ్వాసానికి ప్రతీక. ఎందుకంటే కరీంనగర్‌ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో వుండేది నేను. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజల్లోనే వున్నాను. కరీంనగర్‌ ప్రగతికి పాటుపడ్డాను. పార్లమెంటు సభ్యుడిగా కరీంనగర్‌కు అనేక నిధులు తెచ్చాను. అభివృద్ధిలో బాగస్వామినయ్యాను. బండి సంజయ్‌ గత ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో కరీంనగర్‌ గురించి మాట్లాడిరది లేదు. కరీంనగర్‌కు నిధులు తెచ్చింది లేదు. అందుకే ప్రజలకు ఎవరు కావాలో తెలిసు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎప్పుడూ అండగా వుంటా. వారికి తోడుగానే వుంటున్నా..ఉద్యమ కాలం నుంచి తెలంగాణ కోసం, తెలంగాణ వచ్చిన తర్వాత కరీంనగర్‌ ప్రజల కోసమే జీవితం అంకితం చేశాను. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఇప్పటికీ నా ఇంటి తలుపునే తడతారు. వారి సమస్యలను తెలుసుకునేందుకు, పరిష్కారానికి కృషిచేస్తాను. అందుకే ప్రజలకు నేనంటే అంత ఇష్టం. నాకు ప్రజలంటే అంత ప్రాణం. రాజకీయాలల్లో నాకు దక్కిన గౌరవం.
ఈసారి ప్రజలు పార్లమెంటుకు పంపిస్తే కరీంనగర్‌ కోసం ఎంతటి పోరాటాన్నైనా చేస్తా. జాతీయ పార్టీల నాయకులు గెలిచి, కేంద్రం ముందు చేష్టలుడిగి చూస్తుంటారు.
వారి నాయకులను ఒప్పించలేరు. వారిపై ఒత్తిడి తేలేరు. అక్కడికి వెళ్లి సలాం కొట్టడం తప్ప మరేం చేయలేరు. బండి సంజయ్‌ విషయంలో అదే జరిగింది. నిజానికి పదేళ్ల పాటు బిజేపి కేంద్రంలో అధికారంలో వుంది. 2014 నుంచి 2019 వరకు నేను తెచ్చిన నిధులే తప్ప, బండి సంజయ్‌ తెచ్చిందేమీ లేదు. నేను తెచ్చిన పనులను కూడా తాను ప్రారంభించి, గొప్పలు చెప్పుకున్నాడు. అవన్నీ ప్రజలు గమనించారు. కరీంనగర్‌ ప్రజల కోసం నేనున్నా. వారి సంక్షేమం నేను చూసుకుంటా అన్న నమ్మకం వారికి బలంగా వుంది. అందుకే నా గెలుపుపై నాకు ఎంతో విశ్వాసం వుంది. ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమే ముందుంటాను. నేను ఏనాడు రాజకీయాలను ప్రజాభివృద్దికి ముడిపెట్టను. అది తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. కరీంనగర్‌ ప్రజలకు మరింతగా తెలుసు. తెలంగాణను మూడు నెలల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎడారిగా మార్చింది. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ఫ్రభుత్వం దిగిపోయిన వెంటనే ఇంతగా తెలంగాణకు నష్టం వాటిల్లడానికి కాంగ్రెస్‌ పాలకుల నిర్లక్ష్యం…అలక్ష్యమే కారణం. ఆ పార్టీ అభ్యర్ది ఎవరో కూడా ప్రకటించలేని దీన స్దితిలో కాంగ్రెస్‌ వుంది. బిఆర్‌ఎస్‌ నుంచి నాయకులు తీసుకొని వారిని పోటీలో నిలిపింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లో లేదు. ఆ పార్టీకి నాయకులు కూడ లేరు. అందుకే బిఆర్‌ఎస్‌ కర్మాగారంలో తయారైన నాయకులను లాక్కొని రాజకీయాలు చేయాలనుకుంటుంది. పుట్టింటి గురించి మేన మామకు చెప్పినట్లు, కాంగ్రెస్‌ పార్టీ బిఆర్‌ఎస్‌ నాయకులను తీసుకొని కొత్త కథలు అల్లుతోంది. కాంగ్రెస్‌కు ప్రజాసేవ పట్ల చిత్తశుద్ది లేదు. సంక్షేమం అమలులో కృతజ్ఞత అంతకన్నా లేదు. ఎల్ల కాలం ఎలా కాలం గడుపుకోవాలని చూడడం తప్ప వారు చేసేదేమీ లేదు. అందుకే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరవై ఏళ్లు ప్రజలు అరిగోస పెట్టిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇవ్వడంలోనూ ఇబ్బందులే పెట్టింటి. కాకపోతే గత ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన పార్టీ అంటూ పదే పదే ప్రజలను ప్రాదేయపడితే సరే..అనుకున్నారు. అందుకే ప్రజలు అత్తెసరు మెజార్టీ మాత్రమే ఇచ్చారు. ప్రజలకు కాంగ్రెస్‌ సంగతి పూర్తిగా తెలుసు. బిఆర్‌ఎస్‌ను బలమైన ప్రతిపక్షంగా ముందుంచారు. కాంగ్రెస్‌పార్టీ ఏ మాత్రం తోక జాడిరచినా కత్తిరించేందుకు సిద్దంగా వుండేందుకే ప్రజలు బలమైన ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బిఆర్‌ఎస్‌ను ఊహించనంత గొప్పగా ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్దంగా వున్నారు. తెలంగాణలో మెజార్టీ స్ధానాలు బిఆర్‌ఎస్‌కే కట్టబెట్టనున్నారు. బిఆర్‌ఎస్‌ వేవ్‌ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి పల్లె బిఆర్‌ఎస్‌ గురించి మాట్లాడుకుంటోంది. నాలుగు నెలల క్రితం ఎలా వుండేది..ఇప్పుడెలా వుందన్న నిత్యం చర్చిస్తోంది. ఎట్టిపరిస్ధితుల్లో ఈసారి బిఆర్‌ఎస్‌ను చేజార్చుకోవద్దని తెలంగాణ పల్లె నిర్ణయం తీసుకున్నది. ఎన్నికల నాటికి ఈ ఊపు మరింత పెరిగితే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ సృష్టించేంది సునామే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *