`40రోజుల కోడీలో నాణ్యతఎంత? దానితో ఆరోగ్యమెంత?
`ఆరు నెలలకు ఎదగాల్సిన కోడి 40 రోజులకే కోతకొస్తోంది.
`జనాలకు రోగాలను మోసుకోస్తోంది.
`భయంకరమైన వ్యాధుల బారిన పడేలా చేస్తోంది.
`ఒకప్పుడు బయిలర్ కోడి దశ 180 రోజులు.
`తర్వాత కొంత కాలానికి 120 రోజులు.
`మరింత కాలం గడిచాక 80 రోజులు.
`ఇప్పుడు కేవలం 40 రోజులు.
`అదెలా సాధ్యం? ప్రాణాలతో చెలగాటం?
`గుడ్డు నుంచి కోడి వచ్చే కాలం పోయింది.
`గుడ్డే లేని పిల్ల తయారౌతోంది.
`భయంకరమైన మందుల వాడకంతో నెలకే కోతకు రెడీ అవుతోంది.
`ఆ మందుల ప్రభావం మన మీద పడుతోంది.
`ముఖ్యంగా ఆడ పిల్లల జీవితాలపై అధిక ప్రభావం చూపుతోంది.
`హార్మోన్ల సమతూకాన్ని అస్తవ్యస్తం చేస్తోంది.
`క్లినికల్‌గా నిరూపణ అయ్యింది.
`అయినా మనమెందుకు ఊరుకుంటాం!
`కోడి కూర కొనుక్కొని తెచ్చుంటూనే వుంటాం.
`బిపి, షుగర్ల బారిన చిన్న వయసులోనే పడుతున్నాం.
`ఫ్యాట్ లెస్ వైట్ మీట్ అనుకుంటున్నాం!
`క్యాన్సర్ బారిన పడిపోతున్నాం!
`పేర్లు కూడా తెలియని రోగాలను తెచ్చుకుంటున్నాం.
`మటన్ ధరకు భయపడి చికెన్ అలవాటు చేసుకున్నారు.
`తక్కువ ధరకు వస్తోందని చికెన్ కోసం ఎగబడిపోతున్నాం.
`పౌల్ట్రీ లో చిరు రైతులు ఎప్పుడో చితికిపోయారు.
`కార్పోరేట్ పౌల్ట్రీకి భయపడి కోళ్ల పెంపకమే మానేశారు.
`ఏవి వైరస్ సోకిన కోళ్లో, ఏవి మంచి కోళ్లో కూడా చూసుకోకుండా కొంటున్నాం?
`షాపు వాడు ఇచ్చిందే చికెన్ అని రోజూ లొట్టలేసుకొని తింటున్నాం
హైదరాబాద్,నేటిధాత్రి:
నాకు ముక్కలేనిదే ముద్ద దిగదు..ఈ మాట చాలా అనడం వింటుంటాం. అది ఎంతో గొప్పగాచెప్పుకుంటారు. సంపాదన దండిగా వున్నవారే కాదు,జిహ్వ చాపల్యం వున్న ప్రతి ఒక్కరూ ఇలాంటి మాటలను చెబుతూవుంటారు. ఈ ముక్క చాలప్యంలో రకరకాలుంటాయి. మాంసాలలో రకరకాలు వున్నాయి. కాని వచ్చిన చిక్కల్లా కోడి మాంసంతోనే వస్తోంది. తంట అంతా ఆ ఫౌల్ట్రీ చికెన్‌తో వుంటోంది. చికెన్ మంచిది కాదనుకునేవారు ఎక్కువగా ఆది వారాలలో మటన్ తెచ్చుకుంటారు. కాని ఎక్కువ మంది చికెన్ ప్రియులుంటారు. ధర మటన్‌తో పోలిస్తే తక్కువ. ఒక్కసారి మటన్ తెచ్చుకునే ఖర్చుతో వారంలో మూడు రోజులు చికెన్ తినొచ్చనే ఆలోచన వున్నవారు కూడా చాలా మంది వుంటారు. ఆ మూడు రోజులతోపాటు మిగతా నాలుగు రోజులు కూడా ముక్కను భోజనంలోకి చేర్చుకుంటున్నారు. ఒకప్పుడు బంధువులొస్తేనో..లేక పంగడలొస్తేనో..గ్రామ దేవతలకు మొక్కుల కోసమో కోడి కూర తినేవారు. కాకపోతే అది నాటు కోడి. కాని ఇప్పుడు ఆ నాటు కోళ్ల జాడలేదు. పల్లెలు పెరిగి, పట్నాలు విస్తరించిన తర్వాత ఇంట్లో కోళ్లను పెంచుకునే పరిస్దితి లేదు. ప్రజలు వుండడానికే చోటు లేక అంతస్దుల మీద అంతస్తులతో నిర్మాణాలు చేసే అప్పార్టుమెంట్లలో జీవిస్తున్నారు. ఇలాంటి వారికి కోళ్లను పెంచుకోవడమేమో కాని, చూడడం కూడా కుదరదు. అలాంటి వాళ్లు ఖచ్చితంగా పౌల్ట్రీ చికెన్ మీద ఆదారపడతప్పదు. అదే తినక అసలే తప్పదు. నగరాల్లో నాటు కోళ్లు అమ్మకాలు ఎంత సాగినా, వాటి ధర కూడా మేక మాంసంతో సమానంగా వుంటుంది. అందువల్ల చికెన్ ప్రియులంతా పౌల్ట్రీ చికెన్ తినకతప్పదు. మరి మనం తింటున్న చికెన్ ఎంత మేలైంది. ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడేది. రుచి కోసం తింటున్నామా? లేక తినాలని తింటున్నామా? అన్నదికూడా తెలియకుండానే రోజూ ముక్క మీద ముక్క లాగిస్తున్నాం. కాని ఆ చికెన్ మూలంగా ఎన్ని అనర్ధాలు ఎదురౌతున్నాయో తెలిసిన వాళ్లే ఎక్కువా తింటున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకప్పుడు పౌల్రీ కోడి కూడా షెడ్డులలో ఆరు నెలలకు కోతకు వచ్చేది. ఆరు నెలల కాలం పాటు అది అన్ని రకాల జాగ్త్రత్తలో పెంచేవారు. కాని ఆ రైతులకు అది గిట్టుబాటు పెద్దగా లేకుండాపోయింది. పైగా డిమాండ్ అండ్ సప్లయ్‌లో వెనుకబడి పోయింది. దాంతో ఎప్పటికప్పుడు జరిగే పరిశోధనల్లో నాలుగు నెలల కోడి తయారైంది. దాంతో పౌల్ట్రీ షెడ్లను వ్యాపారులు పెంచుకున్నారు. పెట్టుబడికి తగిన లాభం వస్తుండడంతో చాలా మంది పౌల్ట్రీ వ్యాపారంలోకి దిగారు. తర్వాత కొంత కాలానికి మూడు నెలల కోడి పుట్టుకొచ్చింది. ఇంకేముంది రోగాలను కొంచెంకొంచెం మోసుకొచ్చే కోడి మన ఇంటికొచ్చింది. మన ఒంట్లోకి చేరడం మొదలైంది. ఒక దశలో మార్కెట్లో పప్పుదరల కన్నా చికెన్‌ధర తగ్గింది. ఆఖరురు ఉల్లి పాయల ధరకనా, కొన్ని సార్లు టమాట దరలకన్నా చికెన్ తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చింది. బ్లాక్ మార్కెట్ దారులు ఉల్లిపాయలు, టమాటలను బ్లాక్ చేయడమేమో కాని, ప్రజలకు చికెన్ తినడం మరింత అలవాటుగా మారింది. మూడు నెలల కోడి కాస్త రెండు నెలలకు వచ్చేసింది. రెండు నెలల్లో పెరిగి తినడానికి వీలుగా ఎదిగింది. ఇంకేముంది చికెన్ మార్కెట్ల్లో కార్పోరేట్ శక్తులు దూరిపోయాయి. కోడి పదిరోజుల్లో పెరిగే అవకాశం వున్నా పెంచే దుర్మార్గపు ప్రయత్నాలు చేసేందుకు గిజగారుతున్నారు. ఒకప్పుడు కోడి గుడ్డు నుంచి వచ్చే కోడి, ఇప్పుడు కృత్రిమంగానే పుడుతోంది. పెరిగిపెరక్క ముందే మార్కెట్లో మాయమైపోతోంది. వ్యాపారుల పంట పండిస్తోంది. జనం ప్రాణాల మీదకు తెస్తోంది. కోడి పిల్ల వ్యాపారుల చేతికి రాకముందు నుంచే మందులతో దాని జీవనం, పెంపకం మొదలౌతోంది. హోలిస్టిన్ అనే ఆంటి బయాటిక్ విపరీతంగా వినియోగించడం వల్ల మూడు నాలుగు నెలల్లో పెరగి, కోతకు రావాల్సిన కోడి నెలకే చేతికొస్తుంది. నలభై రోజుల్లో అమ్మకం జరిగిపోతుంది. ఇలాంటి చికెన్లకు బర్డ్ ఫ్లూ అనే భయంకరమైన జబ్బులు వస్తుంటాయి. కాని వాటిని వ్యాపారులు కప్పివుంచుతారు. బైట ప్రపంచానికి తెలియకుండా చేస్తారు. వాటిని తక్కువ ధరలకు మార్కెట్లోకి పంపిస్తారు. రిటైల్ వ్యాపారులు మనకు అంటగడుతూనే వుంటారు. మనం మటన్ షాపుల్లో మనకు ఎలాంటి మటన్ ఇస్తున్నారో మన కళ్లముందే కనిపిస్తుంది. దాని వాలకం చూసి కొనుక్కొవాలో వద్దో కూడా తేల్చుకునే అవకాశం వుంటుంది. ఎదురుగా వేళాడదీసిన మటన్‌కు చెందిన అవయవాలను మనం చూసి, అవసరమైతే క్షుణ్ణంగా పరిశీలించి కొనుగోలు చేసుకుంటాం. కాని చికెన్‌లో ఆ అవకాశం వుండదు. ఆ చికెన్ ఎలా వుందనేది ఇంటికెళ్లి చూసుకుంటే కాని కనిపించదు. అందులోనూ లోపాలు మనకు అసలు తెలియవు. ఇలా ఆంటిబయాటిక్స్ విచ్చలవిడిగా కోళ్లకు ఇప్పించి పెంచే చికెన్ తినడం వల్ల మనలో అనేక అనారోగ్య సమస్యలు తయారౌతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అనేక అనర్దాలు జరుగుతున్నాయి. క్లినికల్‌గా రుజువు కూడా చేశారు. ఆడపిల్లల్లో హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్ ఎక్కువగా జరుగుతుందని తేలింది. అయినా మా పిల్లలకు చికెనే తింటారు. మటన్ తెస్తే తినరు అంటూ కొత్త కథలు కూడా చెబుతుంటారు. తాజాగా మన తెలుగు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ విపరీతంగా పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏపిలో ఉభయగోదావరి జిల్లాలో లక్షల కోళ్లను చంపేసి పూడ్చిపెడుతున్నారు. కొంత మంది వ్యాపారులు పంట కాలువల్లో వదిలేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వ్యాపారులు తీరని నష్టం ఏర్పడిరదని అంటున్నారే గాని, తమ వక్ర బుద్ది మూలంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నామని మాత్రం అనుకోడం లేదు. లాబాపేక్ష తప్ప, ప్రజల ప్రాణాలు పౌల్ట్రీ వ్యాపారులకు పట్టడం లేదు. కార్పోరేట్ పౌల్ట్రీ రంగం విస్తరించడంలో చిన్న చిన్న పౌల్ట్రీ రైతులు కనుమరుగయ్యారు. ఆ వ్యాపారం మీద బతికిన వాళ్లంతా దివాలా తీశారు. ఇతర వ్యాపారాలను ఎంచుకొని బతుకులీడుస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో గత పది రోజులుగా కోళ్లకు కొక్కెర వ్యాధి సోకినట్లు తెలుస్తోంది. కొన్ని లక్షల కోళ్లు మృత్యు వాతపడ్డాయంటున్నారు. చికెన్ ప్రియులు జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుంది. ఎందుకంటే పాలకులు ఏదైనా శృతి మించేదాకా మేలుకొనరు. అనర్ధాలు జరిగేదాకా జాగ్రత్తపడరు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారు. జనం ప్రాణాల మీదకు వచ్చినప్పుడే స్పందిస్తారు. వ్యాపారుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు మన ముందు చికెన్ తింటూ వారికి మేలు చేసే ప్రయత్నాలు చేస్తారు. గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం చూస్తూనే వున్నాయి. రాష్ట్రంలో కొక్కెర వ్యాధి తీవ్రంగా ప్రబలినట్లు తెలుస్తోంది. కొన్ని గంటల వ్యవధిలోనే కొన్ని లక్షల కోళ్లు చనిపోతున్నాయి. అయితే సహజంగా కోళ్లను రాత్రిళ్లు మాత్రమే రవాణా చేస్తుంటారు. చికెన్‌సెంటర్లుకు చేర్చుతుంటారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఏపిలోని ఉభయగోదావరి జిల్లాలతో సంబందం వుంటుంది. దాంతో అక్కడి నుంచి ఖమ్మం జిల్లాకు కొక్కెర వ్యాధి సోకిందంటున్నారు. కొన్ని కిలోమీటర్ల దూరంలో వున్న పామ్‌లకు కూడా ఈ వైరస్ సోకుతుంది. ఆ చికెన్ తినడం ఎంత మాత్రం మంచిది కాదు. మీడియా కూడా ఫౌల్ట్రీకి నష్టం జరుగుతుందనే చెబుతుందేతప్ప, ప్రజలను చైతన్యం చేయాలని చూసే రోజులు పోయాయి. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా వుండడం ఎంతో మంచిది. కొంత కాలం చికెన్ తినపోతే జరిగే నష్టమేమీ లేదు. ఇప్పటికే చికెన్ మూలంగా సర్వ దరిద్రాలు మన ఒంట్లోకి వచ్చి చేరుతున్నాయి. గతంలో ఎవరికైనా బిపిలు, షుగర్‌లువుండేవి కాదు. మన వైద్యులు కూడా వైట్ ఆహార పదార్దాలు తినకూడదంటారు. అసలు బియ్యం, గోదుమలే తినకూడదంటారు. కాని రకరాల మందులతో తయారైన చికెన్ తినడం వల్ల కొలెస్ట్రాల్ రాదంటారు. కాని ఆ చికెన్ వల్లనే చిన్న వయసుల్లోనే బిపిలు, షుగర్లు వస్తున్నాయన్న సంగతిని దాచి పెడతారు. ఇలాంటి వారికి ఫార్మ కంపనీలు తోడౌతాయి. ఆ మందుల అమ్మకాలను పెంచుకుంటాయి. శరీరాలను గుళ్ల చేసే చికెన్ లాంటి ఆహారం తినమని నిపుణులే చెబుతుంటారు. రోగాలువచ్చాక ఫలానా మందులు తీసుకోవాలని సూచిస్తుంటారు. ప్రజల జీవితాలతో అందరూ కలిసి ఆడుకుంటారు. ఇదే మన ఖర్మ.