నిఘా వర్గాలు మేల్కొనాలి….
వరంగల్ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్ డిఐఈవో కార్యాలయంలో పేపర్ వాల్యుయేషన్ క్యాంపులో భారీ అవినీతి జరిగిందని విద్యార్థి సంఘాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి. క్యాంపులో పనిచేయని భాయ్స్ పేర్లను పనిచేసిట్టుగా నమోదు చేసి, వారి వద్ద నుండి అకౌంట్లను సేకరించి దొంగదారిన, అక్రమంగా వారి అకౌంట్లలో వేసి తిరిగి వారి నుండి వసూలు చేసుకొని దొంగ అకౌంట్లు ఇచ్చిన వారికి కమీషన్ ముట్టజెప్పారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ట్రావెలింగ్, స్టేషనరీ, పేపర్ వాల్యుయేషన్ చేసిన లెక్చరర్‌ల బిల్లుల విషయంలో కూడా లెక్కకు మించి తప్పుడు బిల్లులు పెట్టి ప్రభుత్వ సొమ్మును మెక్కాశారని విద్యార్థి సంఘాలు కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సాయిబాబా, లింగయ్యలను సస్పెండ్ చేయాలి
ఇంటర్మీడియట్ క్యాంపు కార్యాలయంలో భారీ అవినీతికి సూపరింటెండెంట్ సాయిబాబానే చక్రం తిప్పాడని ఆయనే క్యాంపుకు సంబంధంలేని వారి పేర్లను సేకరించారని, సేకరించిన పేర్లను, అకౌంట్లను ఓ మహిళా జూనియర్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి సాయిబాబాకు ఇచ్చాడని విద్యార్థి సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ తప్పుడు బిల్లులను తయారుచేయాలని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి అప్పగించగా వారు సాయిబాబా చెప్పినట్టుగానే దొంగ పేర్లతో బిల్లులు తయారు చేయగా, డిఐఈవో లింగయ్య ఈ తతంగానికి సహకరించి సంతకాలు చేశాడని, లింగయ్య అండదండలతోనే ఈ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. భారీ అవినీతికి పాల్పడిన సూపరింటెండెంట్ సాయిబాబాను, డిఐఈవో లింగయ్యను సస్పెండ్ చేయాలని కలెక్టర్‌ను కోరుతున్నారు.
ప్రిన్సిపల్ సెక్రటరి జనార్ధన్‌రెడ్డిని కలవనున్న విధ్యార్థి సంఘాలు
ఇంటర్మీడియట్ క్యాంపు కార్యాలయంలో సూపరింటెండెంట్ సాయిబాబా, డిఐఈవో లింగయ్యలు కలిసి అవినీతికి పాల్పడినారని వీరిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే విచారణ కమిటినీ వేయాలని ఆర్జేడీకి, కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రలు ఇచ్చినా ఎలాంటి స్పందన రాకపోవడంతో నేరుగా ప్రిన్సిపాల్ సెక్రటరి జనార్ధన్‌రెడ్డిని కలిసేందుకు విద్యార్థి సంఘాలు సన్నద్దమవుతున్నాయి. ముందుగా ఇంటర్‌బోర్డు కార్యదర్శిని కలువాలనుకున్నారు, కాని అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని డిఐఈవో లింగయ్య ఎక్కడ మేనేజ్‌చేస్తారేమోనని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యార్థి సంఘాలు తెలిపాయి. ఇంతకాలం నిర్లక్ష్యం జరగడానికి కారణం డిఐఈవో లింగయ్య కమీషనరేట్ నుండి కార్యాలయం వరకు ఆయనకున్న పలుకుబడి కారణంగానే కమిటీ వేయకుండా ఆలస్యం జరిగి ఉండవచ్చన్న అనుమానంతోనే నేరుగా ప్రిన్సిపల్ సెక్రటరీ జనార్ధన్‌రెడ్డిని కలవనున్నామని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.