ఏసీబీ వలలో నవాబుపేట ఎస్ఐ పురుషోత్తం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

తెలంగాణ పోలీసు ప్రతిష్ఠను పెంచేందుకు ఓ వైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే.. మరోవైపు ఆ శాఖలోని కొందరు చీడపురుగుల డిపార్ట్‌మెంట్ పరువును బజారుకీడుస్తున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నారు. తాజాగా.. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పురుషోత్త భూ తగాదా విషయంలో లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసిబి డిఎస్పి మజీద్ అలీఖాన్ తెలిపారు .

వివరాల్లోకి వెళితే.. ఏడాది క్రితం నవాబుపేట ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పురుషోత్తం . ఇక అప్పటి నుంచి తన దందాకు తెరలేపారు. సెటిల్మెంట్‌లు, ఇసుక మాఫియా , భూతగాదాలు, స్టేషన్ బెల్ ను లక్ష్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. 5 నెలల క్రితం భూ తగాదాల విషయంలో గొడవ పడి నవాబుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అట్టి సెటిల్మెంట్ విషయంలో ఎస్సై పురుషోత్తం కన్నుపడింది. నవాబుపేట మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన గజ్జి శేఖర్ వారి కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన వేరే వ్యక్తులపై గొడవపడి నవాబుపేట పోలీస్ స్టేషన్ ను ఆశ్రమించారు.గజ్జి శేఖర్ కుటుంబ సభ్యులపై 9 మంది వ్యక్తులపై కేసు చేశారని నలుగురిని రిమాండ్ కు తరలించగా, ఐదు మంది వ్యక్తులకు గాను 41 ఇస్తానని రూ.5 లక్షలు మామూలు ఇవ్వాలని ఎస్సై డిమాండ్‌ చేశారని తెలిపారు . తాను అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో ఆ మెుత్తాన్ని రూ. 2 లక్షలకు తగ్గించాడు.
నవంబర్ 3వ తేదీన శుక్రవారం రోజు లక్ష రూపాయలు ఇవ్వాలని ఈ డబ్బు కోసం ఎస్ఐ, గజ్జి శేఖర్ ను వేధిస్తుండటంతో అవినీతి శాఖ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి సమర్పించిన వీడియోలు, ఆడియోల ఆధారాలతో ఎస్ఐ పురుషోత్తం పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. దీంతో పాటు శుక్రవారం రోజు ఉదయం నుండి, సాయంత్రం వరుకు పోలీస్ స్టేషన్ లో సోదాలు జరిపినట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *