మొగుళ్ళపల్లి సర్పంచ్ మోటే ధర్మన్న
మొగుళ్ళపల్లి నేటి దాత్రి న్యూస్ అక్టోబర్ 25
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన బండారి కొమురయ్య సోమవారం అనారోగ్యంతో చనిపోయాడు. తన సహచరుల ద్వారా సమాచారం తెలుసుకున్న మొగుళ్ళపల్లి గ్రామ సర్పంచ్ మోటే ధర్మన్న బుధవారం ఉదయం వారి ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా కల్పించారు. మృతుడు కొమురయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవున్ని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు మంగళపల్లి శ్రీనివాస్, దేవునూరి కుమారస్వామి, గుడిమల్ల రమేష్, చెక్క శ్రీధర్, వార్డు మెంబర్స్, శనిగరపు సారమ్మ-లింగయ్య, శనిగరపు శ్రీనివాస్, బండారి కొమురయ్య, బండారి సమ్మయ్య, బండారి రాజయ్య, వంతడుపుల చందర్ తదితరులు పాల్గొన్నారు.