వరి ధాన్యం సేకరణలో రూ.1.86 కోట్ల భారీ మోసం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-12T123741.088.wav?_=1

 

వరి ధాన్యం సేకరణలో రూ.1.86 కోట్ల భారీ మోసం

రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్ ఫోర్స్ (టి జి ఎస్ సి ఎస్ సి ఎల్ ) చర్యలు

21 మందిపై శాయంపేట పిఎస్ లో కేసు నమోదు

శాయంపేట నేటిధాత్రి:

 

2024 – 25 రబీ సీజన్ కు సంబంధించి శాయంపేట మండల కేంద్రంతో పాటు శాయంపేట మండలం కాట్రపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ధాన్యాలు కొనుగోలు కేంద్రాల్లో భారీ అవినీతి జరిగినట్లు గుర్తిం చారు సీజన్ ఐకెపి ఆధ్వర్యం లో నిర్వహించిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పెద్ద మోసం బయటపడింది. కొందరు అధికారులు మరియు ప్రైవేట్ వ్యక్తులు నకిలీ రైతు లను సృష్టించి ప్రభుత్వానికి నిజమైన రైతుల కోసం కేటా యించిన నిధులను మోసపూ రితంగా దోచుకున్నారు. నమ్మదగిన సమాచారంపై ఆధారంగా ఎన్‌ఫోర్స్‌ మెంట్ టాస్క్ ఫోర్స్(ఈ ఎఫ్ టి)చీఫ్ సీవీ & ఇ.ఓ. పర్యవే క్షణలో కమిషనర్ (సివిల్ సప్లైస్) ఆదేశాల మేరకు ఈ ఎఫ్ టి టీమ్-IV సమగ్ర విచారణ చేపట్టింది.ఈ విచారణలో శాయంపేట మరియు కాట్రపల్లి గ్రామాల ఐకెపి ధ్యాన్యం కొనుగోలు కేంద్రాలలో (పీపీసీఎస్) పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు తేలింది.ఈ మోసానికి బెజ్జంకి శ్రీనివాస్ సాంబశివ మినీ మోడ్రన్ రైస్ మిల్ కమలాపూర్ (వి & ఎం) యజమాని ప్రధాన సూత్రధారి అని తేలింది. ఇతను తన కుటుంబ సభ్యు లు, మధ్యవర్తులు, వ్యవసా య శాఖ సిబ్బందితో కలిసి ఆన్‌లైన్ ప్యాడీ ప్రోక్యూర్‌ మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఒపీఎంఎస్) ద్వారా 12 నకిలీ రైతుల పేర్లను సృష్టించాడు.

ఈ నకిలీ రైతులు 278 ఎకరాల్లో పంట పండించారని, 8,049.6 క్వింటాళ్ల ధాన్యం సరఫరా చేశా రని రికార్డుల్లో చూపించారు. కానీ వాస్తవానికి ఒక్క క్వింటా ధాన్యం కూడా కొనుగోలు చెయ్యలేదు.ఈ మోసపూరిత లావాదేవీల ద్వారా రూ.1,86,63,088/- (ఒక కోటి ఎనభై ఆరు లక్షల అరవై మూడు వేల ఎనభై ఎనిమిది రూపాయలు) ప్రభుత్వ ఖాతాల నుంచి నకిలీ రైతుల పేర్లతో మోసపూరితంగా బదిలీ చేయబడ్డాయి.వీరిలో బండ లలిత మధ్యవర్తిగా పనిచేసి ఒపీఎంఎస్ లో నకిలీ ఎంట్రీలు చేయడంలో సహకరించింది. వంకుదోత్ చరణ్ – ప్రైవేట్ ట్యాబ్ ఆపరేటర్, వ్యవసాయ అధికారుల లాగిన్ వివరాలు దొంగిలించి ఒపీఎంఎస్ లో అక్రమంగా లాగిన్ అయ్యాడు. హైమావతి ఐకెపి శాయంపేట పిపిసి ఇన్‌చార్జ్,తన అధికారిక ట్యాబ్‌ను అనధికారికంగా ఇత రులకు వినియోగానికి ఇచ్చిం ది..అనిత –ఐకెపి కాట్రపల్లి పి పి సి ఇన్‌చార్జ్, ఇదే విధంగా తన ట్యాబ్‌ను ఉపయోగించేం దుకు ఇచ్చింది.వ్యవసాయ అధికారులు (ఎ ఓ & ఎ ఈ ఓ లు)కె. గంగా జమున (ఎ ఓ), అర్చన మరియు ఎం. సుప్రి యా (ఎఈఓ లు) లాగిన్ వివరాలు పంచుకోవడం మరియు ధృవీకరణ నియమాలను లెక్కచేయకపో వడం ద్వారా మోసానికి పాల్పడ్డారు.రవాణా కాంట్రాక్టర్ సుధాటి రాజేశ్వర్ రావు 27 ట్రక్ షీట్లకు రవాణా చార్జీలు క్లెయిమ్ చేసుకున్నాడు, కానీ వాస్తవంగా ఒక్క ట్రక్ కూడా రవాణా చేయలేదు. నకిలీ ట్రక్ షిట్లు, టోకెన్ బుక్స్ తయారు చేసి బియ్యం రవాణా జరిగిన ట్టు రికార్డుల్లో చూపించా రు.ఇలా కాగితాలపై మాత్రమే రవాణా చూపి కార్పొరేషన్ నుంచి భారీ మొత్తాలను అక్రమంగా పొందారు. నకిలీ రైతుల సంఖ్య 12, తప్పుడు భూ సమాచారం 278 ఎకరా లు, తప్పుడు ధాన్యం పరిమా ణం 8,049.6 క్వింటాళ్లు
అక్రమంగా క్లెయిమ్ చేసిన మొత్తం ₹1,86,63,088/-,
బోనస్ క్లెయిమ్ చేయడానికి ప్రయత్నం ₹500 ప్రతి క్వింటా కు. భారతీయ న్యాయ సంహిత (బి ఎన్ ఎస్), సంబం ధిత చట్టాల ప్రకారం అందరి మీద న్యాయపరమైన చర్యలు సిఫార్సు చేయబడ్డాయి. అక్ర మంగా పొందిన రూ.1.86 కోట్లు మరియు రవాణా చార్జీలు వెంటనే వసూలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.12 నకిలీ రైతు లకు బోనస్ చెల్లింపులు నిలిపి వేయబడ్డాయి.నకిలీ భూసమా చారాన్ని ఓపిఏం ఎస్ పోర్టల్ నుండి తొలగించాలని ఆదేశిం చారు.ఈ కేసు ధాన్యం కొను గోలు వ్యవస్థలో ఉన్న మిల్లర్లు, మధ్యవర్తులు, వ్యవసాయ అధికారులు, పీపీసీ ఇన్‌చా ర్జీలు కలసి చేసిన అవినీతిని బహిర్గతం చేసింది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్రజా నిధులను కాపాడేందుకు, పారదర్శకతను కాపాడేందుకు కఠిన చర్యలు చేపట్టింది.ఇలాం టి వ్యక్తుల ఉనికి కొనుగోలు వ్యవస్థను దెబ్బతీస్తుంది. నిజమైన రైతుల ప్రయోజనా లను దెబ్బతీస్తుంది. అందు వల్ల, కేవలం అధికారిక సిబ్బంది, నమోదు చేసిన రైతులు, పీపీసి సిబ్బంది, ప్రభుత్వ అధికారులు మాత్రమే పి పి సి ఆపరేషనల్ ప్రాంతా లకు ప్రవేశం కలిగి ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలి. తదుపరి విచారణ మరియు క్రిమినల్ కేసు దర్యాప్తు హనుమకొండ జిల్లా సివిల్ సప్లైస్ శాఖ పర్యవేక్షణలో శాయంపేట పీఎస్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version