ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలి

CPM మండల కార్యదర్శి కారం పుల్లయ్య

భద్రాచలం నేటి దాత్రి

ఈరోజు దుమ్ముగూడెం మండలం భీమవరం గ్రామంలో జరిగిన మారాయిగూడెం 7వ శాఖా మహాసభ, భీమవరం 8వ శాఖ మహాసభ కామ్రేడ్ మాజీ మండల కమిటీ సభ్యులు అమరజీవి సోయం వీరస్వామి నగర్ మాజీ సర్పంచ్ సోయం భద్రయ్య ప్రాంగణంలో కామ్రేడ్ అపక సత్యం, అపక రంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ రెండు మహాసభలలో సిపిఎం పార్టీ దుమ్ముగూడెం మండల కార్యదర్శి కారం పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు మర్మం చంద్రయ్య లు మాట్లాడుతూ ప్రతి సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు, దుమ్ముగూడెం మండలంలో సిపిఎం పార్టీని పూర్వ వైభవం తీసుకొని రావాలని అమరవీరుల స్ఫూర్తితో ఆందోళన పోరాటాలు చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు, కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం జమిలీ ఎన్నికలు అనే పేరుతో మరో మోసానికి తెరలేపుతుందని వారు ఈ సందర్భంగా విమర్శించారు, రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని దుమ్ముగూడెం మండలంలోని కాదు ఈ రాష్ట్రం దేశం నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు బిజెపి పార్టీ కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తుందని సందర్భంగా వారు గుర్తు చేశారు, తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అధికారాల్లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు మా తీసేస్తామని మాయమాటలు చెప్పి మోసం చేశారని అన్నారు రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు, మారాయి గూడెం గ్రామపంచాయతీ పరిధిలో ఆదివాసీ రైతులు తరతరాలుగా సాగు చేస్తున్న ప్రభుత్వ భూములకు ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదని, గత 2002 సంవత్సరంలో ఇచ్చిన పట్టాలు చల్లని ఇప్పుడు రెవిన్యూ అధికారులు అదేవిధంగా గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త పట్టాలు ఇవ్వలేదని వెంటనే ప్రభుత్వ అసైన్మెంట్ భూములలో సాగు చేస్తున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని అన్నారు , అదేవిధంగా త్రీఫేస్ కరెంట్ సౌకర్యం కల్పించాలని గత నాలుగు సంవత్సరాల క్రితం కట్టిన వాళ్లకు ఇంతవరకు త్రీఫేస్ కరెంట్ లైన్లు ఇవ్వలేదని ప్రభుత్వానికి అధికారులకు గుర్తు చేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సిపిఎం మండల కమిటీ సభ్యులు సోయం నాగమణి మాజీ సర్పంచ్ తోడం తిరుపతిరావు, నూతనంగా మళ్ళీ తిరిగి శాఖ కార్యదర్శిగా ఎన్నికైన కోడి వీరస్వామి, మారాయిగూడెం నూతన కార్యదర్శిగా ఎన్నికైన సున్నం వెంకటేశ్వర్లు, సోడే రాముడు, సోంది అర్జున్, సోయం ముత్తయ్య, సోంది శివశంకర్, సున్నం సురేష్, వెంకటరమణ, మచ్చా పుల్లయ్య, సుబ్బయ్య, రాజు, భూపతి, సోడే వెంకటేశ్వర్లు, సోయం కామయ్య, గణేష్, రవి, ఇంకా తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!