ఎన్నికలు అంటేనే కాంగ్రెస్ పార్టీకి వణుకు పుడుతోందని, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్టీ ప్రజల గుండెల్లో నిలిచిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్‌లతో కలిసి మంగళవారం నామినేషన్ ధాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్టీ ప్రజల గుండెల్లో నిలిచిందని..ఎన్నికలు ఏవైనా విజయం టిఆర్‌ఎస్ పార్టీదేనని అన్నారు. ఓటమి భయంతో రాష్ట్రంలో ప్రతి ఎన్నికలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తుందని విమర్శించారు.
రాష్ట్రాన్ని అభివద్ధి పథంలో నిలపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కషి చేస్తుంటే..కాంగ్రెస్ పార్టీ రాజకీయాల కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ..అభివద్ధి నిరోధకులుగా మిగిలిపోతున్నారని ఆరోపించారు. ఎంపిటిసిలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు, టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి, బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనకు సహాకరించాలని సూచించారు. అంతకు ముందు భద్రకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పోచంపల్లి, అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీలు బండా ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్‌లు, పలు కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులతో కలిసి తెలంగాణ ఉద్యమ రూపకర్త ప్రొఫెసర్ జయశంకర్, ప్రజాకవి కాళోజి, తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.