మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మాదిగ విద్యార్థి యువ గర్జన పోస్టర్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గురువారం వారి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించరు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు . ఫిబ్రవరి 2 వ తేదీన హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ , ఆర్ట్స్ కళాశాల లో జరిగే యువ గర్జన సభ విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ సాయి బాబా, నాయకులు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.