ఎన్టీఆర్ నగర్ అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి

నేటిధాత్రి, వరంగల్

గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ అభివృద్ధికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రత్యేక దృష్టి సాధించారని మాజీ జెడ్పిటిసి తూర్పాటి సారయ్య, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ అన్నారు. సోమవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ నగర్ ను సందర్శించిన సారయ్య, ఇంతియాజ్ లు కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈర్ల రాజేందర్ గ్రామంలోని సిసి రోడ్లు, కమిటీ హాల్, స్మశాన వాటిక నిర్మాణం ప్రధానంగా చేపట్టాలని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సారయ్య, ఇంతియాజ్ లు మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్ లోని కమిటీ హాల్ స్మశాన వాటిక, కాలనీలోని సిసి రోడ్ల నిర్మాణం తదితర సమస్యలను ఎమ్మెల్యే నాగరాజు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈర్ల రాజేందర్, ఆర్మూర్ కుమార్, మచ్చర్ల స్టాలిన్, ఉబిది సారంగం, కుంభం శివ, ఎస్.కె శైజాజి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *