Ambedkar Jayanti Celebrated in Nagar Kurnool
నాగర్ కర్నూల్ పట్టణంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ గారు
నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ సంతోష్ గారు అదనపు ఎస్పి వెంకటేశ్వర్ గారు పూలమాలలు వేసి జయంతి వేడుకలు ప్రారంభించారు
అనంతరం ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు మాట్లాడుతూ అంబేద్కర్ మహానీయుడని వంద సంవత్సరాల క్రితమే భారతదేశం ఎలా ఉండాలని బడుగు బలహీనుల వర్గాల అభ్యున్నతికి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బాటలు వేశారని కొనియాడారు ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదువుకోవాలని బడుగు బలహీన వర్గాల పేద పిల్లలు బాగా చదువుకోవాలని సమాజంలో ఉన్నత శిఖరాలను అందుకోవడమే అంబేద్కర్ ఆశయ సాధన అని గుర్తు చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ సంతోష్ గారు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ చేసిన సేవలు అమూల్యమైనవని రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికి ఆదర్శం అని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సునీంద్ర వైస్ చైర్మన్ రమేష్ కౌన్సిలర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు
