కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎస్సార్.

* కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎస్సార్.**

*మొగుళ్లపల్లి నేటి ధాత్రి

భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని రైతువేదికలో మండలానికి చెందిన లబ్ధిదారులకు 61 మందికి 61,07,076/- రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు* పంపిణీ చేశారు.అనంతరం మండలంలోని ములకలపల్లి, మోట్లపల్లి, మెట్టుపల్లి,మొగుళ్లపల్లి, ఇసిపేట,రంగపురం గ్రామాలలో పి.ఎ.సి.ఎస్ మరియు ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన సన్న ధాన్యానికి మద్దతు ధర 2389/- రూపాయలతో పాటుగా బోనస్ 500 రూపాయలు ఇస్తుందని తెలిపారు, వ్యవసాయ శాఖ అధికారులు కోత మిషన్ల యొక్క ఆర్పిఎం 18 నుండి 20 వరకు మరియు బ్లోయర్ ఆన్ లో ఉంచే విధంగా కోత మిషన్ యజమానులకు తెలియజేయాలని ఇలా చేయడం వల్ల ధాన్యంలో తాలు ఉండదని తెలిపారు రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు. మధ్యవర్తి జోక్యం లేకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరుగుతుందని రైతులకు సమయానికి డబ్బులు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అలాగే కొనుగోలు కేంద్రాల్లో తేమ ప్రమాణాలు, కొలతలు సక్రమంగా పాటించాలని అధికారులను ఆదేశించారు.రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్న వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, డిసిఓ , చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి గారు వైస్ చైర్మన్ ఎండి రఫీ మాజీ సొసైటీ చైర్మన్ సంపెల్లి నరసింగరావు స్థానిక సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ జిల్లా నాయకులు తక్కలపల్లి రాజు మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version