భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం సందర్భంగా మొదటి రోజు ముఖ్యఅతిథిగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఎన్ని విధాలుగా ప్రయోజనం పొందవచ్చు వివరించాలని బడుల పట్ల తల్లిదండ్రులకు ఆకర్షితుల అయ్యేలా ప్రైవేటు పాఠశాలలపై మోజును తగ్గించేందుకు విస్తృత ప్రచారం చేయాలని గతానికి భిన్నంగా పోస్టర్లు ముద్రించి ప్రచారం చేయాలని వారు సూచించారు. ప్రైవేటు పాఠశాలల్లో చేరితే 50,000 నుంచి లక్షన్నర వరకు ఖర్చవుతుంది ఇప్పుడు అది ఆదా చేసే డబ్బును మీ పిల్లల ఉన్నత చదువులకు పొదుపు చేయండని మీ డబ్బులు మీ దగ్గరే మీ పిల్లల భవిష్యత్తు మా దగ్గర అంటూ ప్రచారం చేయాలన్నారు. ఉచిత పుస్తకాలు ఏకరూప దుస్తులు ఆరోగ్య పరీక్షలు ఉదయం రాగి జావా మధ్యాహ్నం భోజనం రీడింగ్ కారణాల సౌకర్యం డిజిటల్ తరగతి గదులు తదితర వాటిని అందుబాటులో ఉంచాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల పునర్ వైభవానికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఈవో రాంకుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్లూరు మధు కత్తి సంపత్ గౌడ్ బుర్ర కొమురయ్య దాట్ల శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు