నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా నేటికీ అమెరికాలోని తెలుగు సంఘం అట సభలకు వెళ్ళలేదు.
కాని తొలిసారిగా అమెరికా తెలుగు సంఘం నిర్వహించే అట సభలకు ముఖ్య అతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ఆహ్వానం అందింది.ఈ సందర్భంగా గురువారం నర్సంపేట ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులతో కలిసి అట సభలకు బయలుదేరి వెళ్లారు.మాస్ మహా రాజ్ గా గుర్తింపు ఉన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్ నేషనల్ విమానాశ్రయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి క్లాస్ గా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు
హ్యాపీ జర్నీ ఎమ్మెల్యే దొంతి సార్ అని శుభాకాంక్షలు తెలుపుతున్నారు.