కూకట్పల్లి, జూన్ 06 నేటి ధాత్రి ఇన్చార్జి
కూకట్పల్లిలోని రాందేవ్ రావ్ ఆసుపత్రికి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎసిబి) తరపున అవార్డును అందజేశారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో బుధవారం పలు సంస్థలకు నగరంలోని పర్యావరణ భవన్లో అవార్డు ప్రధానోత్సవం నిర్వహించారు ఇందులో భాగంగా రాందేవ్ రావు ఆసుపత్రి తరఫున విమ్దేవరావు, డాక్టర్ యోబు అవార్డును అందుకున్నారు గ్రీన్ చాంపియన్ అవార్డు ఇన్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ కేటగిరిలో భాగంగా అవార్డు దక్కడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా ఆసుపత్రి పరిసరాల్లో పచ్చదనం పెంపొందించడంతోపాటు వ్యర్థాలను వైద్యశాఖ నిబంధనల ప్రకారం సిగ్గేషన్ చేయడం పరిసరాలను శుభ్రముంచడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని అవార్డును అందజేసినట్లు ఆసుపత్రి నిర్వహకులు తెలిపారు. విమ్రం దేవరావ్ మీరా రావు ప్రశాంత్ రెడ్డి, అపర్ణ రావు ఆసుపత్రిలోని ఆయాలు వార్డ్ బాయ్స్ అవార్డును అంకితం చేస్తున్నామని తెలిపారు.