మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం కప్పెట గ్రామ సభలో వైద్య ఆరోగ్య & జిల్లా ఇంచార్జ్ మంత్రి. దామోదర రాజ నరసింహ, జిల్లా కలెక్టర్ తదితర అధికారులతో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే .జి. మధుసూదన్ రెడ్డి (జీఎంర్ ),పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని, పలువురి సమస్యలను అక్కడికక్కడ పరిష్కరిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం మంత్రివర్యులు మాట్లాడుతూ గ్రామ సభల ద్వారా ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవచ్చన్నారు, ప్రజలతో మమేకం కావడానికి, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, వాస్తవ పరిస్థితులను గుర్తించడానికి ఇలాంటి గ్రామసభలు ఉపయోగపడుతాయని తెలిపారు, ప్రభుత్వ పథకాలకు గతంలో దరఖాస్తు చేసుకోని వారికి, దరఖాస్తు చేసుకున్నా పేరు రానివారికి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
అనంతరం ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తి కట్టుకుంటూ…ఒక్కొక్కటిగా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. అందులో భాగంగా అధికారం చేపట్టిన 2 రోజులకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 వందల యూనిట్ల ఉచిత విద్యుత్, 500 లకే గ్యాస్ సిలిండర్, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ తదితర హామీలు నెరవేర్చామని, రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామని, 26 రిపబ్లిక్ డే నాడు ఎకరానికి 6 వేల చొప్పున రైతు భరోసా వేస్తామని తెలియజేశారు.
జనవరి 26 నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 4 పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఎవరు అందోళన చెందవద్దని అన్నారు, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల లబ్ధి జరుగుతుందన్నారు, ఎవరికైనా అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు అందని వారు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల కోసం గ్రామ సభలో అప్లికేషన్ లు పెట్టుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల అధికారంలో ఉండి కప్పేట గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని తెలిపారు..