మెట్ పల్లి జనవరి 22 నేటి ధాత్రి
మెట్ పల్లి పట్టణ మున్సిపాలిటీ పరిధి లో 9 వార్డులలో రేషన్ కార్డు మరియు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం జరిగింది
కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగారావు లబ్ధిదారుల సభలో పాల్గొన్నారు
అనంతరం జువ్వాడి నర్సింగారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మకంగా నూతన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమం ప్రతి ఒక్కరికి అర్హులకు లబ్ధి చెందాలని ఉద్దేశంతో ప్రజల వద్ద సభ నిర్వహించడం జరుగుతుంది.
కావున పట్టణ ప్రజలు కొత్త రేషన్ కార్డు మరియు ఇందిరమ్మ ఇల్లు కొరకు దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు కావున
సదవకాశాన్ని వినియోగించుకోగలరని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ వార్డుల కౌన్సిలర్స్ మరియు కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్ గాజ రాజారెడ్డి సంతోష్ రెడ్డి రవి సాయి రెడ్డి మహేందర్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు .
మెట్పల్లిలో 9వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల దరఖాస్తు స్వీకరణ
