ప్రతి ఇంటికి తెలంగాణ సంక్షేమ పథకాలు.!!
ధర్మపురి అభివృద్ధి కే మా ఓటు అంటున్న గ్రామ ప్రజలు!!
కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్ల పాలనలో అభివృద్ధి శూన్యం!!!
ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి, ధర్మపురి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో సందర్భంగా వెల్గటూర్ మండల కేంద్రంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ,గ్రామ ముఖ్య నాయకులు, మిత్రపక్షాల నాయకులు, యువకులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ప్రతి గడప గడపకు కాలినడకన తిరుగుతూ,బిఆర్ఎస్ అభ్యర్థి అయిన తనకు గెలిపించాలని, దానికి కారు గుర్తుకు ఓటు వేయాలని, రానున్నది సంక్షేమ కాలమని, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,ఒక్క సారి అవకాశం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఆపడ మొక్కులు మొక్కుతోంది, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పది అవకాశాలు ఇచ్చారు కానీ వారు పదవులను అనుభవించారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు.కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే మళ్ళీ పాత రోజులకు ఓటు వేసినట్లే,తెలంగాణ పక్క ఆనుకొని కర్ణాటక ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఆ రాష్ట్రంలో రైతుబంధు లేదు, కరెంటు లేదు, నీళ్లు వస్తలేవు, రైతుబీమా లేదు, ఆడపిల్లల పెళ్లి చేసుకుంటు కల్యాణలక్ష్మి రాదు, ముసలివారికి ఆసరా పింఛన్లు రావడం లేదని, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వడం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి,
ప్రస్తుతం కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు కాకపోవడం తో రైతులు, ప్రజలు తిరగబడి రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి కర్ణాటక లో కనిపిస్తుంది,
ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటించింది ఆపద మొక్కులు మొక్కుతున్నారు,ఈ డిక్లరేషన్ లో దళిత బంధు పథకం పై ఊసే లేదు.,దీనికి నియోజకవర్గం దళిత కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ నాయకుడు సమాధానం చెప్పాలి,ఇప్పుడు రాష్ట్రంలో ఈ పాపకారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుగుతూ ఒక్క చాన్స్ ఇవ్వండి అని అడుక్కుంటున్నడు. ఆయనకు, మీ అందరికీ గుర్తు చేస్తున్నా. 75 స్వాతంత్య్రం అనంతరం ఒక్కఛాన్స్ కాదు,మన రాష్ట్రంలో పది సార్లు అవకాశం ఇచ్చారు, కానీ వారు పదవులను అనుభవించారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు, మంత్రి ప్రజలకు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అద్యక్షులు రామ్ చందర్ గౌడ్,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తి పాక వెంకటేష్, సీనియర్ నాయకులు,జూపాక కుమార్,కొప్పుల సురేష్,కొప్పుల ప్రసాద్,గుండ జగదీష్,జూపాక కిరణ్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, నేతలు అభిమానులు పాల్గొన్నారు