మంత్రి హరీశ్ రావు కామెంట్స్ :
బీజేపీ, కాంగ్రెస్ లది కుర్చీల కోసం కొట్లాట, ఖాళీ కుర్చీల తండ్లాట. మన మీటింగులకేమో ఇసుకేస్తే రాలనంత జనం వస్తుండ్రు.
రాని సీఎం పదవి కోసం కాంగ్రెస్ లో కొట్లాట చూస్తున్నం
కరోనా కాలంలో మన దగ్గర పైసలు లేక రైతు బంధు కుదరదని అధికారులు చెప్పిండ్రు.
కానీ కేసీఆర్ ఒప్పుకోలే. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టి అయినా సరే రైతులకు రైతుబంధు పెట్టాలని కరాఖండీగా చెప్పిండు
మన ఇంటోడు కేసీఆర్ కావాలా? లేక మరక పడ్డోడు రేవంత్ రెడ్డి కావాలా?
ఈ గడ్డ మీద పుట్టిన బీఆర్ఎస్ కావాలా? ఢిల్లీలో పుట్టిన జాతీయ పార్టీలు కావాల్నా?
కేసీఆర్ ని శాసించేది మీరు. బీఆర్ఎస్ పార్టీని నడిపేది మీరు
రేవంత్, కిషన్ రెడ్డిలను ఢిల్లీలో ఉండే బాసులు నడిపిస్తరు.
మీ కమాండ్ తో నడిచే కేసీఆర్ కావాలా? ఢిల్లీ రిమోట్ తో నడిచే కాంగ్రెస్, బీజేపీలు కావాలా?
తెలంగాణ వచ్చిన తర్వాత రెండు పంటలు పండిందా లేదా?
కర్ణాటక గెలిచినంక కాంగ్రెసోళ్లు ఒడ్డున పడ్డరు. ఇప్పుడు సమస్య వచ్చి ఎవరిని అడగాలో తెలియక అక్కడోళ్లు పరేషాన్ అయితుర్రు.
మొన్నటివరకు కర్ణాటక మోడల్ అని చెప్పి ఇప్పుడు మాట మార్చిండ్రు కాంగ్రెస్ లీడర్లు
రేవంత్ రెడ్డి 3 గంటల కరెంటు, 10 హెచ్ పీ మోటార్ అంటడు. ఆయనకు దమాక్ ఉందా అసలు?
కాంగ్రెస్ ని నమ్మి రిస్క్ లో పడొద్దు. తర్వాత మమ్మల్ని అడగొద్దు. రిస్క్ వద్దు కారుకు గుద్దు.
కాంగ్రెస్ ప్రతీ రైతుకు ఏడాదికి 15 వేలు ఇస్తా అంటుంది. కానీ కేసీఆర్ ఎకరాకు 16 వేలు ఇస్త అన్నడు.
ఎన్నికల కమిషన్ రైతు బంధు నిధుల విడుదలకు అనుమతినిచ్చింది. సోమవారం పొద్దున చాయి తాగే వరకు మీ ఫోన్లు టింగు టింగుమంటాయి.
దేవుడు మన తరపున ఉన్నడు. రైతులకు డబ్బులు ఇవ్వడం న్యాయమేనని దీవించిండు.
ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లు, తండాలు గ్రామపంచాయితీలు, నల్లాల ద్వారా నీళ్లు, రోడ్లు వేయించినం.
రైతుబంధుకు ఇచ్చినట్టు రుణమాఫీకి కూడా అనుమతి ఇస్తే అది కూడా చేసేస్తాం. ఒకవేళ అనుమతి రాకపోతే మళ్లా వచ్చేది కేసీఆరే కాబట్టి వడ్డీతో కలిపి మాఫీ చేస్తాం.
రైతు బంధు కింద ఇప్పటివరకు 80వేల కోట్లు ఇచ్చాం. అలాంటిది మిగిలిన రుణమాఫీ డబ్బులు 4 వేల కోట్లు ఇవ్వలేమా?
ఇళ్ల జాగాలు లేని వారికి జాగా ఇచ్చి ఇళ్లు కూడా కట్టిస్తామని హామీ ఇస్తున్నాం.
కరోనా వల్ల కొంత ఇబ్బంది ఏర్పడింది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మొన్న వచ్చి క్లారిటీ ఇచ్చింది. బోరు బావుల కాడ మీటర్లు పెట్టలేదని 28వేల కోట్లు ఆపేసినమని స్పష్టంగా చెప్పింది.
కేసీఆర్ 28 వేల కోట్లు వదులుకున్నడు కానీ మోటార్లకు మీటర్లు పెట్టలేదు.
గొంతులో ప్రాణం ఉండగా రైతులకు మీటర్లు పెట్టనివ్వనని తెగేసి చెప్పిన కేసీఆర్ ని మనం కాపాడుకోవాలి.
కాంగ్రెసోళ్లు మార్పు కావాలంటున్నరు. ఏం మార్పు కావాలి. 2 వేల పింఛను 200 చేస్తరా? 24 గంటల కరెంటు తీసి 3 గంటల కరెంట్ ఇస్తారా? ఈ మార్పు మనకు కావాలా?
నాడు బొంబాయికి వలసలు ఉండేవి. నేడు బొంబాయి, చత్తీస్ గఢ్ నుంచి మగోళ్లు వచ్చి నాట్లు వేస్తున్నరు. ఇది అసలు సిసలు కేసీఆర్ తెచ్చిన మార్పు.
గిరిజనులు అడిగినవన్నీ చేసినం. ఇక ఒక్కటే బాకీ ఉన్నం. ఈ సారి బీఆర్ఎస్ గెలిస్తే గిరిజన బంధు ఇచ్చి కాపాడుకుంటాం.
తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పేకాట క్లబ్బులు బంద్ చేసిండు. గతంలో పేకాట వల్ల ఎన్నో సంసారాలు ఖరాబైనయి.
కాంగ్రెస్ మళ్లీ వస్తే గల్లీకో పేకాట క్లబ్ తెచ్చి మహిళల పుస్తెల తాడు తెంపుతుంది.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వారి సొంత రాష్ట్రంలో గెలిచింది కేవంల రెండు సీట్లే. వారు వచ్చి మనల్ని మోసం చేయాలని చూస్తే మనం మోసపోదామా?
సొంత రాష్ట్రంలో ప్రజలు బండకేసి కొట్టిండ్రు. మీరు పనికి రారని అక్కడి ప్రజలు తరిమేసిండ్రు
ప్రజలే హైకమాండ్ అనుకొని కేసీఆర్ పని చేస్తుండు. ఒక్కసారి అని కాంగ్రెస్ ని నమ్మితే గోస పడుతం.
మొత్తం తెలంగాణలో జిల్లా కేంద్రంలో కాకుండా మెడికల్ కాలేజీ ఉన్నది కేవలం నర్సంపేటలోనే.
నర్సంపేటలో బీఆర్ఎస్ గెలవంగనే నెక్కొండను మున్సిపాలిటీగా జీవో జారీ చేసుకుందాం.