Headlines

సిరుల సింగారం..అభివృద్ధి బంగారం.

https://epaper.netidhatri.com/

`సిద్దిపేట ప్రగతి ఒక అధ్బుతం.

`హరీష్‌ నాయకత్వం ఒక వరం.

`ప్రతి ఇంటికీ అందిన సంక్షేమం.

`అవార్డులలో దేశంలోనే సిద్దిపేట మేటి.

`అభివృద్ధి లో సిద్దిపేట కు లేదు సాటి.

`ప్రగతికి సిద్దిపేట ప్రయోగశాల.

`సమాజాభివృద్దికి ఒక పాఠశాల.

`నాడు సిద్దిపేట అభివృద్ధి కలలు.

`ఆ కలలు నేడు నిజాలు.

`కళ్ల ముందు ఆవిష్కరణలు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ALSO READ: https://netidhatri.com/sirisilla-sirulu-ktrs-hard-work-is-a-blessinggiven-employment-to-handloom-workers/

ఊరును పాల వెల్లి చేశాడు. సిద్దిపేటను సిరుల పేట చేశాడు. చెరువును కల్పవల్లి చేశాడు. మిషన్‌ కాకతీయతో తెలంగాణ బంగారు పంటల మయం చేశాడు. తెలంగాణ తల రాత మార్చడు. ఆరోగ్య మంత్రిగా అందిరికీ వైద్యం అందేందుకు వైద్య యజ్ఞం సాగిస్తున్నాడు. సిద్దిపేటకు వైద్య కళాశాల తెచ్చాడు. ఆర్ధిక మంత్రిగా రాష్ట్ర ప్రగతిని నిర్ధేశిస్తున్నాడు. సిద్దిపేట ప్రజల జీవితాలలో నింపిన నాయకుడు మంత్రి హరీష్‌రావు. సిద్దిపేటను అభివృద్ది పథంలో నిలిపాడు. ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడు సిద్దిపేట ఎలా వుండేది. ఇప్పుడు ఎలా వుంది. నిజానికి ముఖ్యమంత్రి కేసిఆర్‌ సిద్దిపేట ఎమ్మెల్యే అయినప్పటినుంచే సిద్ధిపేట అభివృద్దికి బాటలు వేస్తూ వచ్చారు. అయినా ఉమ్మడి పాలకులు పూర్తిగా సహకరించలేదు. తర్వాత తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మంత్రి హరీష్‌రావు ఎమ్మెల్యేగా వున్నారు. నాటి పాలకులు అభివృద్దికి సహకరించకపోయినా శ్రమదానంతో సిద్దిపేటను అభివృద్ది చేసిన స్పూర్తి దాత హరీష్‌రావు. ప్రజలంటే అటు ముఖ్యమంత్రి కేసిఆర్‌కు, ఇటు మంత్రి హరీష్‌రావుకు ఎనలేని ప్రేమ. సిద్దిపేట అంటే ఎనలేని మమకారం. వారి కృషివల్లనే నేడు ఒకప్పటి సిద్దిపేట పట్టణం, నగరంగా మారిపోయింది. ఒకప్పుడు సిద్దిపేటకు గాని, పరిసర ప్రాంతాలకు గాని ఇతర జిల్లానుంచి ఆడపిల్లను ఇవ్వాలంటే భయపడేవారు. అంతటి భయంకరమైన కరువు పరిస్ధితులు వుండేవి. కనీసం తాగేందుకు కూడా మంచినీళ్లు సరిపడేలా వుండేవి కాదు. ఇక పల్లెలో ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని మైళ్ల దూరం వెళ్లి, బావుల దగ్గర నీళ్లు తెచ్చుకునేవారు. దాంతో ఆడబిడ్డల కష్టం చూడలేక చలించిన కేసిఆర్‌ అప్పటి ప్రభుత్వంతో కొట్లాడి సిద్దిపేటకు మంచినీళ్లు తెచ్చాడు. అయినా పల్లెలకు నీటి గోస తప్పలేదు. సాగు నీరు లేక రైతులు విలవిలాడుతుంటే కన్నీళ్లు పెట్టుకున్న కేసిఆర్‌ తెలంగాణ వస్తేగాని బతుకులు బాగుపడవని తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారు. ఆ అడుగులో అడుగు వేసుకుంటూ కేసిఆర్‌తో మొదట నడిచింది హరీష్‌రావు.
అభివృద్ది మా జన్మ హక్కు…తెలంగాణ మా ప్రాంత హక్కు.అంటూ హరీష్‌రావు తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించారు.
ఉమ్మడి రాష్ట్ర పాలకులు సహకరించకపోయినా శ్రమదానంతో ఆనాడే ఎన్నో చెరువులు బాగు చేయించారు. అనేక చెరువుల్లో పూడికలు తీసి, రైతులకు అండగా నిలిచారు. ఎండా కాలంలో పశుగ్రాసం లేక మూగ జీవాలు మలమల మాడిపోతుంటే రైతుల కన్నీళ్లు పెట్టుకునేవారు. మూగ జీవాలకు సరైన గడ్డి లేక, తాగేందుకు నీరుకూడా లేకపోయేది. ఆసమయంలో ఆంధ్రా నుంచి పశుగ్రాసం తెప్పించి, ఉచితంగా రైతులకు అందజేసిన మానవతా మూర్తి హరీష్‌రావు. ఇలా తన మానవత్వాన్ని పదర్శిస్తూ, ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న నాయకుడు హరీష్‌రావు. తెలంగాణ సాధించుకున్నాక సిద్దిపేటకు సోయగాలు అద్దారు. అంతకు ముందే వీలైనంత మేర సిద్దిపేటను సుందరంగా మలిచినా, తెలంగాణ వచ్చాక సిద్దిపేటకు అనేక అందాలు అద్ది అందమైన సిద్దిపేటను చేశారు. సిద్దిపేట నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశాడు. ఒకనాడు ఎడారిగా మిగిలిపోయిన సిద్దిపేటను సిరుల మాగాణ చేశాడు. పేద గుండెలకు దగ్గరగా చేరి , వారి గుండె తడిగా మారారు. నియోజవర్గంలోని ప్రతి కుటుంబానికి దగ్గరయ్యాడు. వారి ఇంటిలో పెద్ద కొడుకయ్యాడు. ఆపదలో వున్నవారికి అండగా నిలిస్తూ వచ్చాడు. ప్రతి వ్యక్తికి తోడుగా గుండె ధైర్యమయ్యాడు. అందిరికీ భరోసానిచ్చే ఆప్తుడయ్యాడు. ఆపన్నులకు సేవ చేసే మానవతా మూర్తి అయ్యాడు. ఒక్క సిద్దిపేటలోనే కాదు, తెలంగాణలోని రైతన్న మోములో చిరునవ్వుగా గెలుతున్న నాయకుడు హరీష్‌రావు. పచ్చని పొలాలో సిరివెలుగు హరీష్‌రావు. పల్లెల్లో వెండి వెలుగు హరీష్‌రావు. ప్రతి గుండెలో ఆరని తడి హరీష్‌రావు.

వైద్యవికాసం..సిద్దిపేటకే తలమానికం.

నేను రాను బిడ్డో సర్కారు దవఖానకు అన్న పాట తెలంగాణ సమాజం కొన్ని దశాబ్దాల పాటు విన్నది. తెలంగాణ వచ్చిన తర్వాతా ఆ పాట కనుమరుగైంది. నేను వస్త బిడ్డో మన సర్కారు దవఖానకే అని పాడుకోవాల్సివస్తుంది. మంత్రి హరీష్‌రావు చేయి పడితే చాలు ఏ శాఖనైనా గొప్ప ఫలితాలు ఇవ్వాల్సిందే. తెలంగాణ వచ్చిన తర్వాత సాగు నీటి మంత్రిగా చేసి తెలంగాణకు కరువు కష్టం తీర్చాడు. తెలంగాణలో ప్రాజెక్టులు దగ్గరుండి కట్టించాడు. చెరువులు దగ్గరుండి బాగు చేయించాడు. తెలంగాణను నీటి గంగాళం చేశాడు. అపర భగీరథ ప్రయత్నం చేసి, గంగమ్మను తెలంగాణ గడ్డమీదకు తెచ్చాడు. కరువును తెలంగాణ పొలిమేర నుంచి తరిమేశారు. దటీజ్‌ హరీష్‌రావు. ఇప్పుడు తెలంగాణకు వైద్యం చేస్తున్నాడు. సిద్ధిపేట ఆసుపత్రిని ఎవరూ ఊహించనంత గొప్పగా అభివృద్ది చేశాడు. పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందిస్తున్నాడు. సిద్ధిపేట జిల్లా కల నెరవేర్చాడు. సిద్దిపేటకు ప్రభుత్వ వైద్య కళాశాల తెచ్చాడు. ఎక్కడా లేని విధంగా 1500 పడకలతో సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం చేయించాడు. వైద్య కళాశాలతోపాటు, నిర్సింగ్‌ కళాశాల కూడాతెచ్చాడు. దానికి తోడు సిద్ధిపేటకు బిఫార్మసీ కాలేజీ కూడా బహుమానంగా ఇచ్చాడు. తన ప్రజల ఆరోగ్యానికి అంత ప్రాధాన్యతనిస్తున్నాడు. భవిష్యత్తులో వైద్యం కోసం సిద్దిపేట నుంచి ఎవరూ హైదరాబాద్‌ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నాడు. తెలంగాణలో వైద్య విప్లవం సృష్టిస్తున్నాడు.
వరంగల్‌లో 2500 పడకల ప్రభుత్వాసుపత్రిని శరవేగంగా నిర్మాణం చేయిస్తున్నాడు.
నిమ్స్‌లో కొత్తగా మరో ఆసుపత్రి నిర్మాణం చేయిస్తున్నాడు. హైదరాబాద్‌కు చుట్టుపక్కల నాలుగు అతి పెద్ద ప్రభుత్వాసు పత్రులు నిర్మాణం పూర్తి కావొస్తున్నాయి. మంత్రి హరీష్‌ సారద్యంలో తెలంగాణలో 33 జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేయించాడు. వైద్యరంగంలోనే తెలంగాణను తలమానికం చేశాడు. వైద్య రంగానికే కొత్త భాష్యం చెప్పాడు. ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూశాడు. తల్లిబిడ్డల క్షేమం ప్రభుత్వమే బాధ్యత తీసుకునేలా చర్యలు చేపట్టారు. ఒకప్పుడు ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు జరిగేవి కాదు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు వున్నా, వాళ్లు తమ ప్రైవేటు ఆసుపత్రులలో డెలివరీ చేసేవారు. ప్రైవేటు ఆసుపత్రులు దోచుకునేవి. కాని తెలంగాణలో ఆ పరిస్ధితులు పోయాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవాలు జరడం లేదు. అందరూ ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవాలు చేయించుకుంటున్నారు. కేసిఆర్‌ కిట్‌ అందుకుంటున్నారు. ప్రసవానికి ప్రభుత్వమే ఆసుపత్రికి చేర్చి, తల్లీ బిడ్డలను క్షేమంగా ఇంటికి పంపించే బాధ్యత కూడా తీసుకున్నారు. ఇంతటి గొప్ప వైద్యం దేశంలో ఒక్క తెలంగాణలోనే జరుగుతోంది. అది మంత్రి హరీష్‌రావు వచ్చిన తర్వాతే అమలౌతోంది. దేశ చిరిత్రలోనే ఇంతటి మహోన్నతమైన వైద్య సేవలు ఒక్క తెలంగాణలోనే అందుతున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిని హరీష్‌రావు నిజం చేశాడు. తెలంగాణ వైద్యుడుగా కీర్తింపబడుతున్నాడు. అటు సిద్దిపేటను సిరుల పేటగా మార్చడు. తెలంగాణను నీటి గంగాలం చేసి సస్యశ్యామలం చేశాడు. ఎడారి లాంటి తెలంగాణను అన్న పూర్ణగా మార్చాడు. ఆర్ధిక మంత్రిగా తెలంగాణను సరిపడ ఆదాయం సమకూర్చుతున్నాడు. వైద్య మంత్రిగా ఆరోగ్యవంతమైన తెలంగాణను ఆవిష్కరిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *