కేసీఆర్ ను శాసించేది.. బిఅర్ఎస్ పార్టీని నడిపించేది ప్రజలే….!

 

రేవంత్ రెడ్డి,కిషన్ రెడ్డి లకు శాసించేది ఢిల్లీ బాసులే..!

ఎన్నికలంటే ఐదేండ్ల బతుకుదెరువు..!

కర్ణాటకలో ఉన్న కరెంట్ కు కోత పడ్డది.. ఆ ప్రభుత్వం రాం రాం పలికిండ్లు..

సోమవారం పొద్దుగాల్నే రైతుల సెల్ ఫోన్ల టింగ్ టింగ్.

కరోనా సమయంలో ప్రజలను కడుపులో పెట్టుకొని సాడుకున్నడు కేసీఆర్..!

కేసీఆర్ ప్రభుత్వంలో ఖజానా ఖాళీ ఐనా రైతుబందు ఆపలేదు..

నర్సంపేట,నేటిధాత్రి :

కాంగ్రెస్,భాజపా నాయకులు రేవంత్ రెడ్డి,కిషన్ రెడ్డిలకు శాసించేది ఢిల్లీ బాసులే..! కానీ తెలంగాణలో కేసీఆర్ ను శాసించేది ప్రజలే..బిఅర్ఎస్ పార్టీని నడిపించేది ప్రజలే….! అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు.నర్సంపేట బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో భాగంగా నెక్కొండ మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.కాగా రోడ్ షో కార్యక్రమానికి మండలం నుండి వేలాది మంది ప్రజలకు వచ్చారు.బోనాలు బతుకమ్మలతో హాజరైన మహిళలలు మంత్రి హరీష్ రావు కు స్వాగతం పలికారు.ఈ నేపథ్యంలో నెక్కొండ మండల కేంద్రం ఇసుకపోస్తే రాలకుండా ఉండేలా కిక్కిరిసిపోయింది.ముందుగా మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి,జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న లతో కలిసి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ
మన తెలంగాణలో జరిగే ఎన్నికలలో ఓట్ల కోసం బీహార్,యుపి,అస్సాం,ఢిల్లీ కెళ్ళి ఎవడేవడో దిగుతున్నరు. ఎన్నికలు పూర్తిన తర్వాత ఎవడైనా మనకు కనబడుతడా…అని ఎద్దేవా చేశారు.నిత్యం మన వద్దనే ఉండేది కేసీఆర్ మాత్రమే..మన కోసం పనిచేసే మంచోడు కేసీఆర్ కావాలా … స్కాం లలో మరకపడ్డ రేవంత్ రెడ్డి కావాలా..? ఈ గడ్డ మీద పుట్టిన బిఅర్ఎస్ పార్టీ కావాలా..ఢిల్లీలో పుట్టిన జాతీయ పార్టీలు కావాలా .. ఒక్కసారి ఆలోచన చేయండి.. అని మంత్రి ప్రజలకు నిన్నవించారు. తెలంగాణ కాంగ్రెస్,భాజపాలను రిమోట్ తో నడిపించేది ఢిల్లీ నుండే..
ఢిల్లీలో కట్కా ఒత్తుతే ఇక్కడ డ్యాన్సులు చేస్తరు అని రేవంత్ రెడ్డి,కిషన్ రెడ్డిలపై విమర్శించారు.
నేడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో రెండు పంటలు పండుతున్నాయి ఆనాడు
కాంగ్రెస్ పార్టోడు ఉన్నప్పుడు రెండో పంటకు నీళ్ళు ఇచ్చాడా..? అని ప్రశ్నించారు.తెలంగాణ రైతులకు 3 గంటల కరెంట్ చాలు అని రేవంత్ రెడ్డి అంటే హైదరాబాద్ కు గత కొన్ని రోజుల క్రితం వచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివ కుమార్ మేము ఐదు గంటల కరెంట్ ఇస్తున్నాము అని పేర్కొన్నారని తెలుపుతూ… ఒరే సన్నాసి మాకాడా 24 గంటల ఉచిత కటెంట్ ఇస్తున్నాం.. అని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు.3 గంటల కరెంట్ ఇస్తాం 10 హెచ్ పీ మోటార్స్ పెట్టుకోవాలి అని రేవంత్ రెడ్డి దమాక్ లేని ముచ్చటా అంటున్నాడు.అసలు ఆ మోటార్లు ఎవనయ్య కొనియాలే.ఒక కొంటాం అనుకుంటే పైపులు కూడా మార్చాలి కదా ఐనా కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇప్పటికే ఇయ్యబట్టె అంటూ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదారి ఈగి నట్లే అని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు.ఎనకటా కాంగ్రెస్ పార్టీ ఉన్ననాడు దొంగరాత్రి కరెంట్ పెట్టబోయి పరేశాన్ కాలేదా,పాములు, తెళ్లు ,కరెంట్ షాక్ లు కొట్టలేదా అని గుర్తుకు చేస్తూ ఆ కష్టాలు మళ్ళా పడుడామా అని పేర్కొన్నారు.కాంగ్రెసోళ్ల మాటలు నమ్మి రిస్కున పడద్దూ అని ప్రజలకు సూచిస్తూ రిస్క్ వద్దు కారుకు గుద్దు అని పేర్కొన్నారు.మహిళల కోసం కేసీఆర్ కొత్త పథకాలు తీస్తున్నాడు.కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ 2 లక్షలు,ఆసరా ఫెంక్షన్ ద్వారా నెలకు 5 వేలు,మహిళలకు సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా నెలకు 3 వేలు,400 లకే గ్యాస్ సిలిండర్, రైతుబందు ద్వారా రూ.16 వేల ఎకరాకు,ప్రతీ ఒక్కరికీ 5 లక్షల జీవిత భీమా, లతో అనేక పథకాలు మరోసారి అధికారంలోకి రాగానే అమలు చేయబోతున్నట్లు హరీశ్ రావు తెలిపారు.రైతుబందు ద్వారా ఎకరాకు 16 వేలు అని కేసీఆర్ అంటే కాంగ్రెసోడు రేవంత్ రెడ్డి ప్రతీ రైతుకు 15 వేలు ఇస్తా అంటున్నాడు.మరో నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబందు పథకం దుబారనే అంటున్నాడు వీటిని రైతులు గమనించాలని ఈ సందర్భంగా రైతులకు,ప్రజలకు సూచించారు.ఎన్నికల వేళ రైతులకు రైతులకు రెండవ పంటల పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే రైతుబందు ఆపివేయాలని కాంగ్రెస్,భాజపా నాయకులు పిర్యాదు చేశారు ఐనప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న రైతుల బరోసా పథకాన్ని ఆపద్దని ఎన్నికల కమీషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని,సోమవారం పొద్దున చాయి తాగే వరకు రైతుల ఖాతాల్లో పడి మీ ఫోన్లు టింగు టింగుమంటాయన్నారు. కర్ణాటకలో ఉన్న కరెంట్ కు కోత పడ్డది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలలకే ఖజానా ఖాళీ అయ్యిందని రాం రాం పలికిండ్లు.ఇక్కడికి వచ్చి నీతులు చెప్పుతున్నరు అని కాంగ్రెస్ నాయకులపై విమర్శల వర్షం కురిపించారు.కరోనా సమయంలో ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నా ప్రజలను కడుపులో పెట్టుకొని సాదుకున్నడు మన ముఖ్యమంత్రి కేసీఆర్..! అని గుర్తుకు చేశారు.
కరోనా కాలంలో తెలంగాణ ఖజానా ఖాళీ అయినట్లు తెలిపారు. ఆ సందర్భంలో రైతు బంధు కుదరదని అధికారులు చెప్తే కేసీఆర్ ఒప్పుకో లేదన్నారు.మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టి అయినా రైతులకు రైతుబంధు డబ్బులు వేయాలని పట్టుబట్టిన సంగతిని ఆయన బయటపెట్టారు.నర్సంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే పెద్ది వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశారని తెలిపారు.జిల్లా కేంద్రానికి పరిమితమయ్యే మెడికల్ కళాశాల,జిల్లా ఆసుపత్రి తెచ్చిన ఉద్యమ నాయకుడు పెద్ది అని పేర్కొన్నారు. గతంలో చేసిన పాలకుల అభివృద్ధి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని ఇప్పుడు జరిగే ఎన్నికలంటే ఐదేండ్ల బతుకుదెరువు..! అని మంత్రి పిలుపునిచ్చారు. నెక్కొండ మండల కేంద్రానికి మున్సిపాలిటీ జివో తీసుకువస్తానని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *