బోయినిపల్లి, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ నూర్ భాషా సంఘం ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కలిసి నూర్ భాషా సంఘ భవనము కొరకు నిధులు కావాలని కోరారు. ఎమ్మెల్యే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేకి నూర్ భాషా సంఘం ధన్యవాదాలు తెలిపారు. ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, మహమ్మద్ హుస్సేన్, హైమద్ హుస్సేన్, ఎండి గపూర్, రఫీ, ఇస్మాయిల్, రహీం, హకిం, అజిత్, లతీఫ్, గౌషత్, ఆఫ్రిద్, మొయినుద్దీన్ ఉన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన నూర్ భాషా సంఘం సభ్యులు
