రామయంపేట (మెదక్) నేటి ధాత్రి.
05-06-2024,బుధవారం రోజున గ్రామం తోనిగండ్ల , మండలం రామాయంపేట ,జిల్లా మెదక్ ,నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడము జరిగినది. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు మరియు కంటి పరీక్షలతో పాటు,చెవి,ముక్కు,గొంతు,వరిబీజము, బీజకుట్టు,గడ్డలు,కనతులు, థైరాయిడ్ గడ్డలు,గర్భ సంచికి సంబంధించిన సమస్యలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు చూసి మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో 110 మందికి షుగర్, బీపీ, పరీక్షలు చేయడం జరిగినది,ఆపరేషన్ అవసరము ఉన్న వాళ్ళ 42 మందిని రిపర్ రాయడం జరిగింది.వీరిని మెడిసిటీ హాస్పిటల్ కు తరలించి ఉచిత ఆపరేషన్లు చేయడం జరుగుతుంది.
ఈ వైద్య శిభిర కార్యక్రమంలో గ్రామసెక్రటరీ మౌనిక , పిల్డ్ అసిస్టెంట్ సిద్దిరాములు , గ్రామ ప్రజలు మరియు డాక్టర్లు రాజేష్ ,శివకుమార్,ప్రశంషా, నీతిష ,మార్కెటింగ్ ఇంచార్జి కుమారస్వామి, రాఖేష్ ,శేఖర్ బాబు , సురేఖ ,లు పాల్గొనడం జరిగింది.