#డిఎంహెచ్ ఓ, డ్రగ్ ఇన్ స్పెక్టర్ వస్తే సమాచారం ఆయనకే వస్తది?
#ప్రైవేట్ ఆసుపత్రులపై గతంలో వార్తలు రాసి వారిని గుప్పిట్లో పెట్టుకున్న ఘనుడు
#ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏ రోగి చనిపోయిన సెటిల్మెట్లకు అతడే ముందు వాలుతాడు
నర్సంపేట నేటిధాత్రి:
ఓ విలేకరి జర్నలిస్ట్ ముసుగులో మెడికల్ మాఫియాను ఏలుతున్నాడు.ఆ పట్టణానికి అందుకు సంబంధించిన ఏ అధికారులు వచ్చిన,వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వచ్చిన సమాచారం ఆయనకు మాత్రమే.పలు ప్రైవేట్ ఆసుపత్రులపై వార్త కథనాలు రాసి వారిని గుప్పిట్లో పెట్టుకుంటాడు.ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏదైనా రోగులు చనిపోతే ఆయనే ముందుగా వాలిపోయి సెటిల్మెంట్ చేస్తాడటా.ఈయన చేసే తతంగంపై ఎక్కడ విన్నా అవే గుసగుసలు.
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఒక విలేఖరి జర్నలిస్టు ముసుగులో మెడికల్ మాఫియాను ఏలుతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.తన అవసరం కోసం జర్నలిజాన్ని వాడుతూ ఆ గౌరవ వృత్తికి మచ్చ తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని చర్చలు గట్టిగానే జరుగుతున్నాయి.గతంలో కొన్ని సందర్భాలలో ఆ ఘనుడు ప్రైవేట్ ఆసుపత్రులపై వార్త కథనాలు రాసి వారిని గుప్పిట్లో పెట్టుకున్నాడని చర్చలు జరుగుతున్నాయి.నర్సంపేట పట్టణానికి సంబంధించిన ఏ డ్రగ్ ఇన్ స్పెక్టర్ అధికారులు వచ్చిన,వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వచ్చిన సమాచారం ఆయనకు మాత్రమే వస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఏదైనా కారణాలతో ప్రైవేటు ఆసుపత్రులో రోగి మరణిస్తే ఆసుపత్రి యాజమాన్యానికి రోగికి మధ్య డబ్బుల సెటిల్మెంట్ చేస్తుంటాడని ప్రకారం జరుగుతున్నది.ఇటీవల నర్సంపేట పట్టణంలోని ఒక ఆసుపత్రిలో జరిగిన సంఘటన పట్ల మధ్యవర్తిగా ఉండి బహాభాటంగా
తతంగం నడిపించినట్లు దీంతో పలువురి జర్నలిస్టులకు ఆ వృత్తిపై భంగం కలిగినట్లు ఆరోపించారు.నేను రిపోర్టర్ ను ఐనప్పటికీ నా అవసరం కోసం సెటిల్మెంట్లు చేస్తా..ఇప్పుడు నేను జర్నలిస్టుగా పనిచేయడం లేదు అని మాట్లాడడం మరో చర్చకు దారితీస్తున్నదని పలువురు అనుకుంటున్నారు.