మట్టి నమూనాల వలన ఎరువుల నియంత్రణ
మండల వ్యవసాయ శాఖ అధికారి దయాకర్
వ్యవసాయ భూములల్లో మట్టి పరీక్షలు చేయించుకోవడం వలన ఎరువుల నియంత్రణను అరికట్టవచ్చని మండల వ్యవసాయ శాఖ అధికారి దయాకర్ అన్నారు. శుక్రవారం దుగ్గొండి మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జాతీయ సుస్థిర వ్యవసాయ పథకం కింద నూతనంగా ఏర్పాటైన చంద్రయ్యపల్లి గ్రామ పంచాయతీని ఈ పథకంలో భాగంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా 224మట్టి నమూనాలను సేకరించారు. వ్యవసాయశాఖ అధికారి దయాకర్ మాట్లాడుతూ మట్టి పరీక్షలు చేయించడం వలన భూమిలో ఎరువులు ఎంత మేరకు వేసుకోవచ్చు అని నిర్ధారణ వస్తుందన్నారు. ఎరువులు మోతాదులో వేయడం వలన అధిక దిగుబడులు వస్తాయని, భూసారం దెబ్బతినకుండా ఉంటుందని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ విస్తీర్ణ అధికారులు రాజేష్, విశ్వశాంతి గ్రామ రైతులు కేశవరెడ్డి, సుధాకర్ రెడ్డి, కొమ్మాలు, కక్కెర్ల శ్రీనివాస్, లక్క రాజు, మదునయ్య, రమేష్, మల్లారెడ్డి, నూనె రాములులతోపాటు పలువురు రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.