మంత్రి దయాకర్‌రావును కలిసిన న్యాయపోరాట సంఘీభావ కమిటీ
సుశృత-దేవర్ష్‌ల సమాధిని స్మారక స్మృతివనం విషయంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌తో మాట్లాడుతానని, పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారని న్యాయ పోరాట సంఘీభావ కమిటీ పేర్కొంది. సుశృత-దేవర్ష్ న్యాయపోరాట సంఘీభావ కమిటీ శుక్రవారం రాత్రి హన్మకొండలోని మంత్రి దయాకర్‌రావును కలిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుశృత-దేవర్ష్ భార్యబిడ్డలను దారుణంగా చంపిన హంతకుడు మాచర్ల రమేష్ ఇంటి ఎదుట సుశృత తల్లి కందిక కోమల సమాధి కట్టిన సమాధికి స్మారక స్మృతివనంగా ప్రకటించాలని మంత్రిని కోరామని తెలిపారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్యమంత్రి కేసిఆర్‌తో మాట్లాడి పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. సుశృత తల్లి కందిక కోమల కుటుంబానికి తన సానుభూతి తెలిపారు. బాధితులకు న్యాయంగా, చట్టపరంగా రావాల్సిన పరిహారాలను అందజేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటానని తెలిపారని అన్నారు. స్మారక స్మృతివనం కోసం కోమల చేస్తున్న పోరాటానికి ఆటంకాలు కలిగించే వారి నుండి రక్షణ కల్పించాలని పాలకుర్తి సీఐని ఆదేశించారు. హంతకులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. మాచర్ల రమేష్‌ఖు మద్దతు తెలుపుతున్న టిఆర్‌ఎస్ నాయకుడిని పార్టీ నుంచి తొలగించి, అరెస్టు చేయించానని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో న్యాయ పోరాట సంఘీభావ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు బండారి లక్ష్మయ్య, రాష్ట్ర కన్వీనర్ గడ్డం సదానందం, జనగామ జిల్లా నాయకుడు గట్టు సుదర్శన్, కెఎన్‌పిఎస్ ఉమ్మడి జిల్లాల కన్వీనర్ కొమ్ము సురేందర్, భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కన్వీనర్ గురిమిల్ల రాజు, ట్రైబల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ పోరిక ఉదయ్‌సింగ్, టిపిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రమాదేవి, సుశృత మేనమామ గుండె ప్రమోద్, టివివి ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ జెటబోయిన భరత్, పిడిఎం ఉమ్మడి వరంగల్ జిల్లా కో కన్వీనర్ తాళ్లపెల్లి సాయితేజ తదితరులు పాల్గొన్నారు.