బిఆర్ఎస్ మండలస్థాయి సమావేశం విజయవంతం చేయాలి
మండల అధ్యక్షులు,వైస్.ఎంపీపి చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి
పరకాల నేటిధాత్రి
18 జులై శుక్రవారంరోజున పరకాల పట్టణంలో స్థానిక పద్మశాలి భవన్ లో బిఆర్ఎస్ మండల మరియు గ్రామస్థాయి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుందని,ఈ సమావేశానికి మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ముఖ్య అతిధులుగా హాజరువ్వానున్నారని మాజీ వైస్ ఎంపీపి బిఆర్ఎస్ మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి తెలిపారు.ఈ సమావేశానికి పట్టణ మరియు మండల,గ్రామ పార్టీ,మరియు అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు,మాజీ జెడ్పిటీసి,ఎంపిటిసి,సర్పంచ్ లు,కోఅప్షన్ సభ్యులు,సోసైటీ ఛైర్మెన్లు,కమిటీ సభ్యులు,యూత్ విభాగం,పార్టీ శ్రేణులు,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజవంతం చేయాలని కోరారు.