చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ అసైన్డ్ ల్యాండ్ కమిటీలో ఆర్డీవో సభ్యత్వ అధికారులు ఉన్నప్పటికీ తాను చెప్పిందే వేధంగా కేటీఆర్ పరిపాలన సాగించారని ప్రభుత్వ అధికారులను భయపాంత్రులకు గురిచేసి సబ్బండ వర్గాలను మోసం చేసి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడి వేలాదిఎకరాల అసైన్డ్ భూమిని తన అనుచరులకు కట్టపెట్టాడని ఆర్డీవోకు ఆర్టిఏ యాక్టివ్ ప్రకారం దరఖాస్తు చేస్తే ఆదర్శ వివాహాలుచేసుకున్న వారికి ఇక్కడ కూడా భూమి ఇవ్వలేదని మరి కేటీఆర్ పిఏకు ఆదర్శ వివాహంతో 5 ఎకరాల భూమిని ఎలా కట్టబెట్టారు ఆ సైన్స్ కమిటీ ప్రకారం సంబంధిత గ్రామపంచాయతీ తీర్మానం చేసి ఆర్డీవోకు.పంపిస్తే విచారణ చేసి భూమి కేటాయించాలని అలాంటి నిబంధనలు పాటించకుండా ఐదు మండలాల్లో వందల ఎకరాల భూమిని తన అనుచరులకు కట్టబెట్టారని తమ గుమస్తా పత్రికలో పనిచేసే విలేకరులకు రెండు ఎకరాల చొప్పున అసైన్డ్ భూమిని కట్టబెట్టడం చెప్పాలని మీ పేపర్లో పనిచేసే వాళ్లే నిజమైన విలేకరుల మిగతా పేపర్లో పనిచేసేవారు విలేకరులు కాదా అర్హులైన అందరి విలేకరులకు రెండు ఎకరాల భూమి చొప్పున కేటాయించాలని నువ్వు తప్పు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తే ఊరుకోమని మీ తరఫున ఎవరికైతే భూమిని కేటాయించారోవాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని మిగతా విలేకరులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి ఎంపిటిసి బైరీ నేని రాము తంగళ్ళపల్లి పట్టణ అధ్యక్షులు నర్సింగం బీసీ సెల్ అధ్యక్షులు మల్లేశం సోషల్ మీడియా అధ్యక్షులు గడ్డం మధుకర్ నియోజకవర్గ యువత అధ్యక్షులు చుక్క శేఖర్ ప్రశాంత్ తిరుపతి సత్తు శ్రీనివాస్ రెడ్డి ఆరెపల్లి బాలు మీరాల శ్రీనివాస్ చందు శ్రీనివాస్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!