manasika balopetha vidya vidanam ravali : r.laxman sudhakar, మానసిక బలోపేత విద్యా విధానం రావాలి: ఆర్‌.లక్ష్మణ్‌ సుధాకర్‌

మానసిక బలోపేత విద్యా విధానం రావాలి: ఆర్‌.లక్ష్మణ్‌ సుధాకర్‌

విద్యార్థులను మానసికంగా బలోపేతం చేసే భారతీయ విద్యా విధానం రావాలని, దాని వల్లనే వ్యక్తిత్వం వికసించి బుద్ధి, వివేకం పెరిగి జయాపజయాలను ఒకే విధంగా స్వీకరిస్తారని, తద్వారా అ నుత్తీర్ణులు అయినప్పుడు ఆత్మహత్యల జోలికి పోరని ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగ్‌ ప్రచార ప్రముఖ్‌ ఆర్‌.లక్ష్మణ్‌ సుధాకర్‌ అన్నారు. శ్రీరామకష్ణ మఠం హైదరాబాద్‌ మార్గదర్శనంలో శ్రీ రామకష్ణ సేవా సమితి హనుమకొండ శాఖ నక్కలగుట్టలోని వివేకానంద హైస్కూల్‌లో నిర్వహిస్తున్న వేసవి వ్యక్తిత్వ వికాస శిక్షణా శిబిరం బాలసంస్కార్‌లో శుక్రవారం ఆయన పాల్గొని ఆదర్శ విద్యార్థి లక్షణాలు అనే అంశంపై మాట్లాడారు. ఒత్తిడితో కూడిన విద్యావిధానం ఫలితంగానే విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. స్వామి వివేకానంద ప్రవచించిన భారతీయ విద్యా విధానమే నేటి తరానికి ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు. శీల సంపదను వద్ధి చేసి, మనోబలాన్ని పెంపొందించి, బుద్ధిని వికసింప చేసి, స్వశక్తిలో విశ్వాసాన్ని పెంచే విద్యను స్వామీజీ ఆశించాడన్నారు. నేటి తల్లిదండ్రుల కోరిక మేరకు డాలర్లు సంపాదించడానికి కావలసిన విద్య కోసం విద్యార్థులు రేయింబవళ్లు నిద్రాహారాలు మాని కార్పోరేటు బడుల్లో, కళాశాలల్లో కుస్తీలు పడుతున్నారు. ఈ విధానం మారి విద్యార్థి కోరికకు అనుకూలమైనటువంటి స్వేచ్చాయుత, నైతిక విలువలతో కూడిన, మానవీయ విలువలు నిండిన విద్యా విధానం వచ్చినప్పుడే విద్యార్థులు స్వేచ్చగా విద్యార్జనపైన దష్టి కేంద్రీకరిస్తారన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు చదివింది గుర్తుంచుకునేలా కొన్ని అధునాతన టెక్నిక్లను పరిచయం చేశారు. వారంరోజులు నిర్వహించే ఈ శిబిరంలో ఆదర్శ విద్యార్థి, ఏకాగ్రత రహస్యం, గురు శిష్యుల సంబంధము, మాతపిత భక్తి, భారతీయ వారసత్వ వైభవం, మన ఆచారాలు ఆదర్శాలు, దేశభక్తి అనే అంశాలపై వక్తలు విద్యార్థులకు శిక్షణ ఇస్తుంటారు. అంతేకాకుండా యోగాసనాలు, ధ్యానము, వేదిక్‌ మాథ్స్‌, ఆకర్షణీయమైన చేతిరాత, నత్యం, ఆటలు, పాటలు, మట్టితో బొమ్మలు చేయుట తదితర అంశాలలో నిష్ణాతులతో శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో శిబిర నిర్వాహాకులు, శ్రీరామకష్ణ సేవా సమితి హనుమకొండ శాఖ ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, రాధిక, స్వరూప, అశ్వి వివేక్‌, లక్ష్మణ్‌, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!