mallannaku rudrabhishekam, మల్లన్నకు రుద్రాభిషేకం

మల్లన్నకు రుద్రాభిషేకం

ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి దేవస్థానంలో శుక్రవారం మాసశివరాత్రి సందర్భంగా శ్రీమల్లిఖార్జునస్వామి వారికి మహన్యాస రుద్రాభిషేకం, స్వామి వారి కళ్యాణం, రుద్రహోమం నిర్వహించారు. ఒగ్గు పూజరులతో పెద్దపట్నం వేయించారు. ఈ కార్యక్రమాలు దేవాలయ ఉప ప్రధాన అర్చకుడు నందనం శివరాజయ్య, ముఖ్య అర్చకుడు పాతర్లపాటి శ్రీనివాస్‌, పురోహిత్‌ ఐనవోలు మధుకర్‌శర్మ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *