అన్న రేవంత్‌కు కొండంత బలం కొండలే!

https://epaper.netidhatri.com/

`మల్కాజిగిరి టికెట్‌ కొండల్‌ కే!

`కొడంగల్‌ను ఎనుములకు కంచుకోట చేసింది కొండలే.

`మహబూబ్‌నగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ స్వీప్‌ వెనుక వ్యూహకర్త కొండలే.

`అన్నకు అడుగడుగునా అండా, దండా అంతా ఆ తమ్ముడే.

`అన్నకు సగం ధైర్యం ఆ తమ్ముడే.

`రాష్ట్ర సమస్యలు డిల్లీలో చక్కబెట్టాలంటే అత్యంత నమ్మకస్తుడు వుండాలే.

`పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధి ఐనవారే వుండాలే.

`తెలంగాణ అభివృద్ధికి అంకిత భావంతో నిధులు తెచ్చే వారు కావాలే!

`మల్కాజిగిరి లాంటి పెద్ద నియోజకవర్గానికి కొండల్‌ లాంటి ప్రజల మనిషి రావాలే!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అవును… అన్న రేవంత్‌రెడ్డికి తమ్ముడు కొండల్‌రెడ్డే కొండంత బలం. అన్న దమ్ముల అనుబంధాలు కొన్ని విచిత్రంగా వుంటాయి. కాని ఆదర్శమౌతుంటాయి. రామలక్ష్మణులుగా కలిసి విజయాలు సాధించిన వారు రాజకీయాలలో చాలా మంది వున్నారు. అన్నకోసం సర్వస్వం త్యాగం చేసిన తమ్ముళ్లు చరిత్రలో అనేక మంది వున్నారు. అన్న రాజును చేసేందుకు ఎలా తమ్ముళ్లు కృషి చేశారో తెలిసిందే. ఇక్కడ కూడా అంతే..అన్న రేవంత్‌రెడ్డి రాజకీయ లక్ష్యంలో అడుగడుగునా అండగా వుంటూ, కుటుంబమంతా నీడలా వుంటూ, మొత్తంగా అన్నదమ్ములంతా రేవంత్‌ రెడ్డి కోసం నిలబడం అన్నది గొప్ప విషయం. అలా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాజకీయ విజయాల వెనక కనిపించే వ్యక్తి కొండల్‌రెడ్డి. రేవంత్‌రెడ్డి మనసు పూర్తిగా తెలిసిన తమ్ముడిగా అన్న ఏ క్షణం ఏం ఆలోచిస్తున్నాడు. ఏ అడుగులు వేయాలనుకుంటున్నాడు తెలుసుకొని రంగం సిద్దం చేయడంలో కొండల్‌రెడ్డి సిద్దహస్తుడు. ఎందుకంటే రాజకీయాలంటే ఒక వైకుంఠపాలి. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో ఆలోచించే లోపే కోలుకోలేని, తేరుకోలేని నష్టాలు జరుగుతుంటాయి. రేవంత్‌ రాజకీయంలో కూడా అలాంటి సంఘటన ఆయన రాజకీయ జీవితాన్ని ఒక దశలో తుడిచేసే దాకా వెళ్లింది. అలా మళ్లీ తన రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పటడుగు పడకుండా వుండాలంటే, గొప్ప ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి కీర్తింబపడాలంటే అన్నకు వెన్నంటే కొండల్‌ రెడ్డి వుండాలి. ప్రతి క్షణం జాగ్రత్తలు తీసుకోవడంలో కొండల్‌రెడ్డి పాత్ర అనన్యసామాన్యమైంది. నమ్మకం వెనక అపనమ్మకం, దాని వెనుక అనుమానం, ద్రోహం, మోసాలు ఎప్పుడూ కాచుకొని కూర్చుంటాయి. అందుకే ప్రతి నాయకుడు వెనుక అత్యంత నమ్మకస్తుడు వుండాలి. అది దగ్గర వ్యక్తై వుండాలి. రక్తసంబంధమై వుండాలి. అప్పుడే ఆ నాయకుడి రాజకీయానికి ఎదురుండదు. తిరుగుండదు. ఎంత విశ్వాసంగా వున్నా, ఇతరులు ఎక్కడో అక్కడ ఏదొ ఒకదానికి లొంగే అవకాశాలుంటాయి. అదే అన్ననో, తమ్ముడో అయితే ఎట్టి పరిస్ధితుల్లో తప్పులు చేయడానికి ఆస్కారం అసలే వుండదు. అప్పుడే కుర్చీలో కూర్చున్న నాయకుడు నిబ్బరంగా వుండగలరు. నిర్భయంగా పనిచేయగలరు. నిస్పక్షపాతంగా వ్యవహరించగలరు. రాష్ట్ర ప్రగతికి మార్గాలు అన్వేషించగలరు. లేకుంటే దినదినగండం నూరేళ్ల ఆయుష్యుగా కాలం గడపాల్సివస్తుంది. ఎవరికీ న్యాయం జరక్కపోవచ్చు. లక్ష్యం నెరవేరకపోవచ్చు. అందుకే రాజకీయాలలో మొహమాటాలకు తావుండొద్దు. ఇతరులైతే ప్రతి విషయాన్ని ఆలోచించుకోవాల్సివస్తుంది. అదే సొంత మనుషులైతే ఏది దాచుకోవాల్సిన అవసరం వుండదు. సొంతమనుకునేవారి మధ్య శషబిషలు వుండవు. ముక్కుసూటి తనంగా ముందుకు సాగాలంటే నాయకులకు సొంత మనుషులే తోడుండాలి. ఐన వారు తప్పకుండా పక్కనే వుండాలి. చరిత్రలో ఎవరిని చూసినా ఇదే ఫార్ములా కనిపిస్తుంది. అందులో కొన్ని చేదు నిజాలు, కఠోవ వాస్తవాలుంటాయి. వాటిని ఈతరం నాయకులు అనుసరిస్తేనే వాళ్లంత గొప్ప పేరు సంపాదించుకుంటారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిప్రధాని నెహ్రూ తర్వాత ఎవరు అనుకునే ఆలోచన ఎవరిలోనూ రాకుండా వుండేలా, ఇందిరాగాంధీని నెహ్రూ తీర్చిదిద్దారు.
నెహ్రూ ఆ రోజుల్లోనే ఇందిరాగాంధీకి రాజకీయాలలో ఆచరణలు, ప్రభుత్వంలో మెలకువలు నేర్పారు. దాంతో నెహ్రూ తర్వాత లాల్‌బహదూర్‌ శాస్త్రీ ప్రధాని అయినా, ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఇందిరాగాంధీనే కోరుకున్నారు. ఆ తర్వాత రాజీవ్‌గాంధీ రాజకీయాల్లోకి రాలేదు. కాని రెండో కుమారుడు సంజయ్‌గాంధీ దేశ రాజకీయాలను ఔపోశాన పట్టాడు. ఆయన తీసుకున్న కొన్ని గొప్ప నిర్ణయాలలో కుటుంబ నియంత్రణ అన్నది దేశానికి ఎంతో మేలు చేసింది. లేకుంటే మన దేశం ఆనాడే ఆకలి రాజ్యమయ్యేది. జనాభా రెండువందల కోట్లు దాటేది. అప్పటి పరిస్ధితులను బట్టి ఆయన తీసుకున్న నిర్ణయం దేశానికి ఎంతో మేలు చేసింది. అయితే ఆయన అనుకోకుండా కాలం చేశారు. తర్వాత ఇందిరాగాంధీని అంగరక్షకులే పొట్టన పెట్టుకున్నారు. తర్వాత రాజీవ్‌గాంధీ ప్రధాని అయ్యారు. మన దేశంలో టెలికాం విప్లవం, కంప్యూటర్‌ విప్లవానికి నాంది పలికాడు. స్ధానిక సంస్ధలను బలోపేతం చేశాడు. ఇలా రాజీవ్‌గాంధీ మన దేశాన్ని ఎంతో ముందు తీసుకెళ్లారు. ఆయన కూడా కొందరు దుండగుల వల్ల బాంబుదాడిలో ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి పార్టీని సోనియాగాంధీ రక్షిస్తూ వస్తున్నారు. పార్టీని రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ కూడా పార్టీలో ఇతరులను ఎవరినీ నమ్మలేదు. తన సంతానంలో రాజకీయాలను మీద పట్టున్న వాళ్లు లేకపోవడం మూలంగా అల్లుళ్లకు పార్టీలో పెద్ద పీఠ వేశారు. ఇతరులను నమ్మలేదు. అలాగే వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన ఆత్మ అని చెప్పుకునే కేవిపి. రామచంద్రరావుకు ఎలాంటి బాద్యతలు ఇవ్వలేదు. కాని తన సొంత తమ్ముళ్లకే పదువులు ఇచ్చారు. దాంతో ఆ కుటుంబ ప్రస్తానం ఇంత కాలం సాగింది. ఇప్పుడు జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వున్నారు. వైఎస్‌. షర్మిల ఏపి. పిపిసి. ప్రెసిడెంటుగా వున్నారు. అంతదాకా ఎందుకు టిఆర్‌ఎస్‌ ఆవిర్భావంలో ఎంతో మంది కీలక భూమిక పోషించారు. కాని వాళ్లెవరు పార్టీలో ఇప్పుడు లేరు. గులాబీ జెండాకు నేను కూడా ఓనర్‌నే అని ఈటెల రాజేందర్‌ పార్టీని దూరం చేసుకున్నారు. ఇలాంటి తలనొప్పులు ఏ నాయకుడు కోరుకోడు. అందుకే కేసిఆర్‌ సిఎంగా వున్నంత కాలం కేటిఆర్‌ హవానే నడిచింది. అదే కరక్టు నిర్ణయం. లేకుంటే పాలకులు నిత్యం ఏదో ఒక తలనొప్పిని ఎదుర్కొవాల్సివస్తుంది. మన మనుషులు వుంటే, ఏ నాయకుడైనా ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు సాగేందుకు వీలౌతుంది. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏపార్టీ చూసినా ఇదే కనిపిస్తుంది. పొరపాటున ఇతరులను నమ్మడం వల్ల జయలలిత జీవితం ఏమైందో కూడా మన కళ్లముందే వుంది. అందుకే నాయకులు ఇతరులను నమ్మడం అన్నది ఎన్నటికైనా నష్టమే..
అందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇలాంటి విషయాల మీద ఎంతో అవగాహన వున్న నాయకుడు.
అంందుకే తన సోదరులే తన బలం చేసుకున్నాడు. తన బలగంగా మార్చుకున్నాడు. రాజకీయ సామ్రాజ్యం నిర్మాణం చేసుకున్నాడు. తన లక్ష్య సాధనలో వెనక్కి తిరిగి చూసుకోకుండా చేసుకున్నాడు. అతి తక్కువ కాలంలో కల గన్న ముఖ్యమంత్రి పదవిని సాధించారు. నిజానికి ఒక ప్రాంతీయ పార్టీలో చేరిన నాయకుడు సిఎం కావాలని కలగనడం తప్పు కాదు. కాని అవకాశాలు రావడం అన్నది అంత సులువు కాదు. అందువల్ల వచ్చిన అవకాశాలను నిచ్చెన మెట్లుగా చేసుకొని ముందుకుసాగితే లక్ష్యం చేరుకోవచ్చని రేవంత్‌రెడ్డి నిరూపించారు. అందులో తమ్ముడు కొండల్‌ రెడ్డి పాత్ర కూడా ఎంతో వుంది. అన్న కోసం ప్రతి నిమిషం లక్ష్మణుడిలాగా వెన్నంటేవున్నాడు. రాజకీయాలను చక్కదిద్దుకుంటూ వచ్చాడు. కొడంగల్‌ను రేవంత్‌రెడ్డి అడ్డాగా కంచుకోటను చేయడంలో కొండల్‌ రెడ్డి పాత్ర ఎంతో కీలకమైంది. అంతేకాకుండా గత ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ స్వీప్‌ చేయడంలో రేవంత్‌ రెడ్డికి తోడుగా కొండల్‌ రెడ్డి నెరవేర్చిన వ్యూహం అనిర్వచనీయమైంది. అన్నకు అడుగడుగునా అండగా వుంటూ, కొండంత బలాన్ని అందించిన వారిలో కొండల్‌ రెడ్డి ముందు వరుసలో వున్నారు. అటు అన్నకు తోడుగా, కుటుంబానికి అవసరమైన వాటిని కూడా సమకూర్చే బాధ్యతలను కూడా నిర్వరిస్తూ,అందరి తలలో నాలుకలా మారిన నాయకుడు కొండల్‌రెడ్డి. అన్నకు అడుగడుగునా అండా దండా ఆ తమ్ముడు కొండల్‌రెడ్డే. అన్నకు సగం ధైర్యం ఆ తమ్ముడే. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా తెలంగాణ కోసం ఎంతో చేయాల్సిన అసవరం వుంది. ఇప్పుడు కొండల్‌రెడ్డి బాధ్యత మరింత పెరిగింది. అందువల్ల ఆయన మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలి. గెలవాలి. డిల్లీ రాజకీయాలను చక్కదిద్దే పనిలో నిమగ్నం కావాలి. మల్కాజిగిరి కి రేవంత్‌ రెడ్డి మొన్నటివరకు ఎంపి. ఆ స్ధానాన్ని కాంగ్రెస్‌ పార్టీ కాపాడుకోవాలి అంటే కొండల్‌రెడ్డి వల్లనే సాధ్యమౌతుంది. ఈ సీటు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఎలాంటి ప్రయోగాలు చేసినా నష్టం వాటిల్లుతుంది. కొండల్‌రెడ్డి అయితేనే ఖచ్చితంగా సీటు కాంగ్రెస్‌ ఖాతాలో పడేందుకు అవకాశం వుంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి, పార్టీకి, జాతీయ రాజకీయాలకు వారధిగా కావాలంటే రేవంత్‌రెడ్డి సొంత మనిషి అయిన కొండల్‌రెడ్డి వుంటేనే రాష్ట్రానికి ఎంతో ప్రయోజనంగా వుంటుంది. తెలంగాణ అభివృద్దికి కేంద్రంతో కొట్లాడి నిధులు తేవాలంటే ముఖ్యమంత్రి సోదరుడుగా కొండల్‌రెడ్డికి కొంత ప్రాధాన్యత ఏర్పడే అవకాశం వుంటుంది. పైగా కొండల్‌రెడ్డి ప్రజల మనిషి. అన్న రాజకీయం కోసం జనం మనిషిగా మారిన ప్రజాసేవకుడు. అందువల్ల కొండల్‌ లాంటి నాయకుడు మల్కాజిగిరికి ప్రాతినిధ్యం వహిస్తే, అభివృద్ది శరవేగంగా జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *