‘‘మల్క’’ మామూలోడు కాదు!

https://epaper.netidhatri.com/

`జనాన్ని ముంచి, భూములు కొల్లగొట్టి!!

`కొమురయ్య వేలాది ఎకరాల భూమాయ!

`ఉద్యోగాలిస్తామని అమాయకులను నమ్మించి,

`వందలాది ఎకరాలు దోచుకొని,

`రియలెస్టేట్‌ మొదలుపెట్టి,

`కార్మిక చట్టాలు తుంగలో తొక్కి…

`అమాయకుల భూములు లాక్కొని,

`నోటీసులు లేకుండానే లాకౌట్లు ప్రకటించి,

`అర్థాంతరంగా ఉద్యోగులను రోడ్డుపాలు చేసి,

`హైదరాబాద్‌లో విద్యాసంస్థలు,

`జిల్లాలలో, రాష్ట్రాల్లో పవర్‌ ప్లాంటు.

`ఇక మిగిలింది జనమే…మల్కాజిగిరి ప్రజల నెత్తిమీద చెయ్యిపెట్టడమే..

హైదరబాద్‌,నేటిధాత్రి:

అవును..నిజంగానే మల్క కొమురయ్య మామూలోడు కాదు. జనాన్ని ముంచి, భూములు కొల్లగొట్టినట్లు అనేక ఆరోపణలున్నాయి. కొమురయ్య మోసం చేసిన బాధితులు ధర్నాలు, నిరసనలు, నిరవదిక దీక్షలు చేస్తున్నారు. అమాయక జనం అవసరాలను తెలుసుకున్న కొమురయ్య ముందుగా పవర్‌ ప్లాంటు ఏర్పాటు చేసే వ్యాపారంలోకి దిగాడు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పెద్దఎత్తున భూములు సేకరించాడు. సరిగ్గా ఇరవైఏళ్ల క్రితం తెలంగాణలో సరైన నీటి వసతులు లేక, భూములు సాగయ్యేవి కాదు. దాంతో భూములను నమ్ముకోలేక, సాగు చేసుకోలేక మధనపడుతున్న రైతులను కొమురయ్య టార్గెట్‌ చేశాడు. వారి బలహీనతలను సొమ్ము చేసుకునే ఎత్తుగడ వేశాడు. వందలాది ఎకరాలు సేకరించే పనిలో పడ్డాడు. ఆయా ప్రాంతాలలో పవర్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తానంటూ రైతులను నమ్మించాడు. అలా వందలాది ఎకరాలు సేకరించుకున్నాడు. ఆ భూములు ఇస్తే తానే ఏర్పాటు చేయబోయే పవర్‌ ప్లాంటులో ఉద్యోగాలిస్తానని, జీవితాంతం వారికి ఉపాధి కల్పిస్తానని నమ్మబలికాడు. అసలే సాగు లేక, కూలీ లేక ఇబ్బందులు పడుతున్న జనం కొమురయ్య మాటలను నమ్మారు.
నమ్మితేనే మోసం చేయొచ్చన్న సూత్రాన్ని వాడుకొని కొమురయ్య రైతులను నిండా ముంచేశాడు. కొంత కాలం రైతుల నుంచి సేకరించిన భూముల్లో ప్లాంటు ఏర్పాటుచేశాడు. ఆ ప్లాంటును చూపించి ఉత్తర తెలంగాణలోని అనేక ప్రాంతాలలో భూములు సేకరించాడు. కాని అక్కడ ఎక్కడా ప్లాంట్లు ఏర్పాటు చేయలేదు. కాని భూములు మాత్రం తీసుకున్నాడు. రైతులకు పంగనామాలు పెట్టేశాడు. పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన మదర్‌ ప్లాంటునను చూపించి, దేశంలోని అనేక రాష్ట్రాలలో కూడా కొమురయ్య పవర్‌ ప్లాంటు ఏర్పాటు చేశాడు. అక్కడ కూడా ఇదే పనిచేశాడు. ప్లాంట్లు మూసేశాడు. రైతులను రోడ్డుపాలు చేశాడు. అలా ఇరవైఏళ్ల పాటు రైతులను వెట్టి చాకిరి చేయించుకున్న కొమురయ్య పవర్‌ ప్లాంటు మూసేశాడు. మూడేళ్లగా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు. సమారు వంద మంది కార్మికుల జీవితాలను రోడ్డున పడేశాడు. వారికి న్యాయంగా అందాల్సిన వాటిని కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు. బాధితులు తిరగని చోటు లేదు. మెరపెట్టుకోని కార్యాలయం లేదు. అందరూ చూద్దాం..చేద్దామనే వాళ్లే కాని, కొమురయ్యకు చట్ట ప్రకారం ఆదేశాలు జారీ చేసిన వాళ్లు లేరు. దాంతో కార్మికుల గోడు అరణ్య రోధనే అవుతోంది. అధికారులను కొనేస్తున్న కొమురయ్య కార్మికులను కనీసం పరిగణలోకి తీసుకోవడం లేదు. మీ దిక్కున్న చోట చెప్పుకోండంటూ హెచ్చరిస్తున్నాడని కార్మికులు అంటున్నారు.
గతంలో ఎనర్జీ ప్లాంట్‌ వద్ద ఆమరణదీక్ష చేసిన కార్మికుల పక్షాన అప్పటి జిల్లా పోలీసు ఉన్నతాధికారి కొమురయ్యను మందలించడం జరిగింది. కార్మికుల పక్షాన నిలబడం జరిగింది. ఆ సమయంలో కార్మికులకు న్యాయం చేస్తానని ఒప్పుకొని, మళ్లీ మాట మార్చేశాడు. వారికి అన్యాయం చేశాడు. ఇటీవల బాదిత కార్మికులు రోడ్డెక్కారు. నిరవదిక దీక్షలు చేస్తున్నారు. తమకు న్యాయంగా రావాల్సిన సొమ్మును ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇలా కొమురయ్య బాధితులు ఒక్క పెద్ద పల్లి జిల్లాలోనే కాదు 12 రాష్ట్రాలలో వున్నట్లు సమాచారం వుంది. అందుకు సంబంధించిన వివారాలున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే నేటి ఆసిఫా బాద్‌ జిల్లాలో కూడా అమయకులైన గిరిజనలు భూములు కూడా కొమురయ్య కొల్లగొట్టాడు. కాని అక్కడ ఎలాంటి ప్లాంట్లు ఏర్పాటు చేయలేదు. ఇలా కొమురయ్య భూమాయ అంతా ఇంతా కాదు..వేల ఎకరాలు...
ఒక్క తెలంగాణలోనే కాదు, దేశంలోని వివిధ రాష్ట్రాలలోనూ దందా సాగించాడు. ఉద్యోగాలిస్తామని అమాయక జనాన్ని నమ్మించి, వందలాది ఎకరాలకు ఎసరుపెట్టి, అగ్గువకు భూములు తీసుకొని, ఉపాధి ఉద్యోగ కల్పన పేరు చెప్పి, కార్మిక చట్టాలు తుంగలో తొక్కి, అక్రమ లాకౌట్లు ప్రకటించి, అర్ధాంతరంగా ఉద్యోగులను రోడ్డు పాలు చేసి, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో స్కూళ్లు, తెలంగాణ జిల్లాల్లో పవర్‌ ప్లాంట్లు అని పేరు చెప్పి ఒకటే ఏర్పాటు చేశాడు. దాన్ని కూడా మూసేశాడు. ఇలా మోసపూరితమైన దందాలన్నీ చేసి, కోట్లు కూడబెట్టుకున్నాడు. వాటిని కాపాడుకునే ప్రయత్నంలో కొత్త ఎత్తుగడ వేస్తున్నాడు. ప్రజా సేవ ముసుగేసుకొని కొమురయ్య మల్కాజిగిరి ప్రజలకు పంగనాలమాలు పెట్టేందుకు వస్తున్నాడు. అదే జరిగితే ఇక కొమురయ్య ముంచడానికి మిగిలింది జనమే..మల్కాజిగిరి ప్రజల నెత్తి మీద చెయ్యిపెట్టడమే…అంటున్నారు.
ఇక తాజాగా బిజేపి పార్టీ నుంచి మల్కాజిగిరి టిక్కెట్‌ తెచ్చుకొని, ఎంపి అయిపోదామని కలలు కంటున్నాడు. తాను పుట్టిపెరిగిన ప్రాంతంలో ప్రజలను మోసం చేసి, వారి భూములను అడ్డికిపావుసేరుకు తీసుకొని, ఉపాది చూపిస్తానని చెప్పి, అర్ధాంతరంగా వారి జీవితాలను ఆగం చేసిన కొమురయ్య, పేదలకు సాయం చేస్తా…మల్కాజిగిరిని ఉద్దరిస్తా..అభివృద్ది చేస్తా..అంటూ కొత్త ఆట మొదలుపెట్టాడు. లాక్కున్న భూములను, ఆక్రమించుకున్న స్ధలాలను, మోసపోయిన ప్రజల నుంచి ఒత్తిళ్లను, ప్రభుత్వ కేసులను ఎదుర్కొనేందుకు రాజకీయ ముసుగేసుకొని వస్తున్నాడు. అవ్వకు బువ్వ పెట్టని వాడు..చిన్నమ్మకు చీర కొనిస్తానన్నట్లుంది కొమురయ్య వ్యవహారం. తనను నమ్ముకొన్న వందలాది కుటుంబాలకు ఆకలి కేకలు మిగిల్చిన కొమురయ్య, మల్కాజిగిరి ప్రజల ఓట్ల కోసం అనేక జిత్తులు చేస్తున్నాడు. ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలపేరుతో నాటకాలు మొదలుపెట్టాడు. తన వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి జీవితాలను ఆగం చేసిన కొమురయ్య, పార్లమెంటు ఎన్నికల్లో నిలబడి గెలిచిన ప్రజలను ఉద్దరిస్తానంటున్నాడు.
తన సొంత జిల్లా ప్రజలను మోసం చేసి, పొరుగు జిల్లాల రైతులను ఆగం చేసి, ఇతర రాష్ట్రాలలో రైతు భూములు తీసుకొని ఆస్ధులు కూడ గట్టుకున్న కొమురయ్య రాజకీయ అవతారం ఎత్తుతున్నారు. ప్రజలను మోసం చేసిన వారిని రాజకీయ పార్టీలు ఆదరించొద్దు. హైదరాబాద్‌లో పలు విద్యా సంస్దలు నిర్వహిస్తున్నాడు. ఈ స్కూళ్ల కోసం కూడా స్దలాలలో కూడా గోల్‌ మాల్‌ వ్యాపారం చేశాడన్న ఆరోపణలు కూడా వున్నాయి. ఎక్కడైతే పవర్‌ ప్లాంటు ఏర్పాటు చేసి, కార్మికుల జీవితాలను గాలికి వదిలేసిన వ్యక్తి రాజకీయాలు చేసి ప్రజలకు మేలు చేస్తాడనుకోవడం పొరపాటు. తన కోసం, తన ఎదుగుదల కోసం, తాను ఏర్పాటు చేసిన పవర్‌ ప్లాంటులో దుమ్ములో దూళిలో, జీవితాలను ఫణంగా పెట్టి పనిచేసిన కార్మికుల జీవితాలు రోడ్డుపాలు చేయడం దర్మార్గం. ఎందుకంటే అందులో పని చేసినంత కాలం జీవితం దినదిన గండంగానే పనిచేశారు. ఎందుకంటే ఆ పవర్‌ ప్లాంటు వేస్ట్‌ మేనేజ్‌ మెంటు ద్వారా కరంటు ఉత్పత్తి చేసే సంస్ధ. అందులో పనిచేసే కార్మికులు ఎంతో మంది ఆరోగ్యాలు చెడిపోయి పనులు మానుకున్నారు. వారి ఆరోగ్యాలకు కూడా భద్రత ఇంత కాలం లేదు. ఇప్పుడు ఉద్యోగ భద్రత కూడ లేదని రోడ్డు పాలు చేశాడు. తోటి మనుషుల మీద కనీస జాలి లేని, నిర్ధయతో వారి జీవితాలను ఆగం చేసిన కొమురయ్య కొత్త వేషం వేసుకొని వస్తున్నాడు. రాజకీయ నాయకుడి అవతారం ఎత్తుతున్నాడు. తమకు అన్యాయం చేసిన కొమురయ్యకు ఏ పార్టీ అండగా నిలువొద్దని కార్మికులు కోరుతున్నారు. తమ జీవితాలు ఆగం చేసినట్లే కొమురయ్య ప్రజలను కూడా మోసం చేస్తారని వారు వాపోతున్నారు. ఏది ఏమైనా నమ్మిన వారిని మోసం చేసిన వాళ్లు ఎవరినైనా మోసం చేస్తారు. కొమురయ్య లాంటి వారు సమాజంలో స్వార్ధం తప్ప, నిస్వార్ధం ఎప్పుడూ ఎరగరు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *