ఆర్టీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్
మార్చి నెలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే ఆర్టీఐ అవగాహన సదస్సును విజయవంతం చేయాలని ఆర్టిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, జిల్లా అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, డీఈవోలు, ఎంపీడీవోలు, ఆర్ఐలు, తహసీల్దారులు, ఎంఈఓలు ఇంకా తదితర డిపార్ట్మెంట్ అధికారులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా చంటి ముదిరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు 2005 సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్ళినా పనిచేయించుకోవటం, తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టటం కష్టతరమైన నేపథ్యంలో భారత ప్రభుత్వం 12 అక్టోబర్ 2005 తేదీన ఈ సమాచార హక్కు చట్టం భారతదేశమంతటా అమలులోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకొని, ప్రభుత్వ పనులపై సమచారాన్ని పొందవచ్చు. ఇంతకుముందు పార్లమెంటు, లేక విధాన సభ లేక విధాన పరిషత్ సభ్యులకు గల ఈ సౌకర్యాన్ని, ఈ చట్టం ద్వారా ప్రజలందరికి కలిగింది. ప్రభుత్వ అధికారులు అడగకపోయినా వారంతట వారే విధి విధానాలు, ఉద్యోగుల బాధ్యతలు మొదలైన 17 అంశాల గురించి సమాచారం ఇవ్వాలి. దీని ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయ పౌర సమాచార అధికారి, పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లను, ప్రజలకు కనిపించే విధంగా బోర్డుమీద స్పష్టంగా రాసి ఉంచాలి. సమాచార హక్కు చట్టంలో మెుత్తం 6 అధ్యాయాలు, 31సెక్షన్లు ఉన్నాయి అని అన్నారు. అలాగే ప్రతి ఒక పౌరుడు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి బయటకు తీస్తూ సమాచార హక్కు చట్టం గురించి పౌరులకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.