జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షులు వల్లూరు వీరేష్ పిలుపు.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
ఈ నెల18వ తేదీన జడ్చర్లలో ఎమ్మెల్యే డా,సి.లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే సీఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాద భహిరంగ సభను విజయవంతం చేయాలని జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షులు వల్లూరు వీరేష్ తెలిపారు.
గత మూడు రోజులుగా వివిధ గ్రామ యువకులను కలవడం జరిగిందని ఈరోజు గొల్లపల్లి,అల్వాన్ పల్లి,కుర్వగడ్డపల్లి,తంగెళ్ల పల్లి,గుట్టకాడి పల్లి, గ్రామాలలో యూత్ వింగ్ నాయకులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ సభను మండలంలోని యువకులు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల యువత ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, ప్రచార కార్యదర్శి సతీష్ నాయక్,కార్యవర్గ సభ్యులు శంకర్ మల్లేష్, సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి,గ్రామాల ఉప సర్పంచ్ లు సత్యం, శేఖర్,మాజీ ఎంపీటీసీ అంజమ్మ,యువత అధ్యక్షులు చెన్నకేశవులు, జంగయ్య, యువకులు తదితరులు పాల్గొన్నారు.